cmo Secretary
-
ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాశ్
సాక్షి, విజయవాడ: ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌ను.. బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న భావనా సక్సేనాను రిలీవ్ చేస్తూ కేంద్రం నుంచి తాజాగా దేశాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. -
సీఎంఓ కార్యదర్శిగా వి.శేషాద్రి
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శిగా 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి.శేషాద్రిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2013 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు కేంద్రంలో డిప్యుటేషన్‌పై డైరెక్టర్‌గా, జాయింట్ సెక్రటరీగా పనిచేసి రాష్ట్రానికి తిరిగివచ్చారు. అంతకుముందు విశాఖపట్నం, రంగారెడ్డి, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌గా, టీటీడీ జేఈఓగా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేకాధికారిగా, రంగారెడ్డి జేసీగా తదితర పోస్టుల్లో పనిచేశారు. భూవ్యవహారాలు, రెవెన్యూ చట్టాలపై మంచి పట్టు ఉండటంతో ఆయనకు సీఎంఓలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. -
స్పందనపై నమ్మకాన్ని పెంచండి
‘‘ స్పందన కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి. అర్జీదారులకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించడం అధికారుల బాధ్యత. అర్జీదారులకు సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యం కావాలి. స్పందన కార్యక్రమానికి ప్రజలు ఎన్నో ఆశలతో వస్తారు. వారి సమస్యలకు అధికారులు పరిష్కారం చూపగలిగితే ఎంతో సంతో షిస్తారు’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో స్పందనపై చిత్తూరు, వెఎస్సార్ కడప జిల్లాల పరిధిలోని ఉన్నతాధికారులకు ప్రాంతీయ స్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర మున్సిపల్ అడ్మిని్రస్టేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్ సూచనలు ఇచ్చారు. మధ్యాహ్నం బృంద చర్చ నిర్వహించారు. అధికారులు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీ క్యాంపస్ : స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ అధికారులకు సూచించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి అర్జీలు సమరి్పంచేందుకు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని, వారి అర్జీలను స్వీకరించడంతో పాటు రసీదులను అందజేయాలని తెలిపారు. అర్జీలపై విచారణ జరిపి వాటిని వెబ్సైట్లో పెట్టాలని సూచించారు. తాము ఇప్పటికే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ప్రాంతీయ సదస్సులు నిర్వహించి అధికారులకు నాణ్యమైన స్పందన జరిపేలా శిక్షణ ఇచ్చామన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తిరుపతిలో స్పందనపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో ప్రాంతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే వారం నుంచి స్పందన మెరుగ్గా ఉండేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. హాజరైన అధికారులు, (ఇన్సెట్లో) మాట్లాడుతున్న సీఎం స్పెషలాఫీసరు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్లు మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నారు. అర్జీలను తిరస్కరించే సమయంలో ఆలోచించి చేయాలన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి 45,665 ఫిర్యాదులు వస్తే అందులో 8,239 ఫిర్యాదులు తిరస్కరింపబడ్డాయన్నారు. వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 49,131 సమస్యలు వస్తే 5,476 సమస్యలు తిరస్కరించారని చెప్పారు. సీఎం ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వస్తున్న అర్జీలు చాలావరకు చిన్నచిన్న సమస్యలేనని, వీటిని సకాలంలో పరిష్కరించగలిగితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పా రు. అయితే చాలా మంది అధికారులు స్పందనలో వచ్చే అర్జీలను పరిశీలించడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పలు సలహాలు, సూచనలు వస్తుంటాయని వాటిని స్వీకరించాలని చెప్పా రు. అధికారులు వివిధ రకాల పనుల్లో ఉన్నప్పటికీ, స్పందనకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ స్పందనపై నాణ్యమైన పరిష్కారం ఉండాలన్నారు. స్పందనలో ఎక్కువగా భూ సమస్యలు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్లు మంజూరు చేయాలని వినతులు వస్తున్నాయని తెలిపారు. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల అధికారులకు స్పందన నిర్వహణపై గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ వెట్రిసెలి్వ, డీఐజీ రాజశేఖర్ బాబు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, జేసీ– 2.చంద్ర మౌళి, ట్రైనీ కలెక్టర్ çపృధ్వీతేజ్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష, మదనపల్లె సబ్–కలెక్టర్ కీర్తి చేకూరి, తిరుపతి,చిత్తూరు ఆర్డీవోలు కనక నరసారెడ్డి, సి.రేణుక, డీఆర్వో విజయ చందర్, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. గ్రూప్ డిస్కషన్ విజయవంతం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం స్పందన కార్యక్రమంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో అధికారులకు నిర్వహించిన గ్రూప్ డిస్కషన్ విజయవంతమైందని సీఎం స్పెషలాఫీసర్ హరికృష్ణ చెప్పారు. అధికారులు పలు అంశాలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్ అన్ని స్థాయిల్లో జరగాలని తెలిపారు. చెవిరెడ్డికి సీఎంవో అధికారుల కితాబు తిరుపతి రూరల్ : రాష్ట్రంలోనే వినూత్నంగా, ఆదర్శవంతంగా స్పందన కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కితాబు ఇచ్చారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీలో స్పందన కార్యక్రమంపై అధికారులకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి వర్క్‌షాపులో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్, స్పందన కార్యక్రమం రాష్ట్ర కో–ఆర్డినేటర్, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులను కేవలం బాధితులుగా, ఫిర్యాదుదారులుగా కాకుండా, అతిథులుగా చూస్తూ వారికి టీ, స్నాక్స్‌తో పాటు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారని సీఎంవో అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకోసం ఎమ్మెల్యే రూ.7 లక్షల సొంత నిధులను సైతం అందించటం అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. స్పందన కార్యక్రమం నిర్వాహణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా చెవిరెడ్డి ముందుకు సాగుతున్నారని, ఇదే స్ఫూర్తితో అన్ని నియోజకవర్గాల్లో చేపడితే బాగుంటుందని సూచించారు. -
సీఎంవో అధికారులకు శాఖల పునఃపంపిణీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ముఖ్య సలహాదారు అజేయకల్లం శనివారం సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)లో పనిచేస్తున్న అధికారులకు శాఖలను పునఃపంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధానపరమైన అంశాలు.. కేడర్‌కు సంబంధించిన అంశాలు, ముఖ్యమైన ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన ఫైళ్లను ముఖ్య సలహాదారు అజేయకల్లం ద్వారానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎంవోలో పనిచేస్తున్న అధికారులకు కేటాయించిన శాఖలు ఇవీ.. అజేయకల్లం, సీఎం ముఖ్య సలహాదారు: హోం శాఖ, ఆర్థిక, ప్రణాళిక శాఖ, రెవెన్యూ శాఖ ,న్యాయ, శాసనసభ వ్యవహారాలు, సీఎం కార్యాలయ వ్యవహారాలు, ఎవరికీ కేటాయించని శాఖలు డాక్టర్ పీవీ రమేష్ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యా శాఖ (పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రా ప్రవీణ్ ప్రకాష్, సీఎం ముఖ్య కార్యదర్శి: సాధారణ పరిపాలన, విద్యుత్ శాఖ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు (పునరి్వభజన చట్టానికి సంబంధించిన అంశాలు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రధానమైన అధికారులతో సీఎం సంప్రదింపులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యదర్శి అంతకంటే దిగువ స్థాయి అధికారులతో రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ, సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయనతో పాటు వెళ్లడం), డ్యాష్ బోర్డ్స్, సీఎంవో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, సీఎం కార్యదర్శి: రవాణా, రహదారులు భవనాలు, ఏపీఎస్ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార పౌరసరఫరా>లు, వినియోగదారుల వ్యవహారాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, యువజన వ్యవహారాలు, క్రీడలు, గనులు, భూగర్భవనరులు, కారి్మక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, అన్ని సంక్షేమ శాఖలు జె.మురళి, సీఎం ప్రత్యేక కార్యదర్శి: పశుసంవర్థక శాఖ, డెయిరీ, మత్స్య శాఖ, సహకార, మార్కెటింగ్ శాఖ, సాంస్కృతిక శాఖ, ఎంపీలు, ఎమ్మెల్యేల గ్రీవెన్సులు, ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) దువ్వూరి కృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి: ఆరి్థక శాఖ, విద్యుత్ శాఖ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, జనరల్ గ్రీవెన్సెస్ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ: సీఎం అపాయింట్మెంట్స్, సందర్శకులు, సీఎం రోజువారీ కార్యకలాపాలు. -
యాదాద్రి పనులు పరిశీలించిన సీఎమ్‌వో కార్యదర్శి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులను శనివారం సీఎమ్‌వో కార్యదర్శి భూపాల్‌రెడ్డి పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్ ఆనంద్‌సాయి, జేసీ రవినాయక్, ఆలయ ఈవో గీతారెడ్డి ఉన్నారు. -
యాదాద్రి పనులను పరిశీలించిన సీఎంవో కార్యదర్శి
యాదాద్రి: యాదగిరిగుట్టపై జరుగుతున్న యాదాద్రి ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి భూపాల్‌రెడ్డి పరిశీలించారు. శనివారం గుట్టపైకి చేరుకున్న ఆయన ముందుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని అనంతరం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులను పరిశీలించారు. జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
టీటీడీ ఈవోగా సాంబశివరావు
ఎంజీ గోపాల్ తెలంగాణకు బదిలీ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యనిర్వహణ అధికారి ఎంజీ.గోపాల్‌ను ప్రభుత్వం తెలంగాణకు బదిలీ చేసింది. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావును టీటీడీ ఈవోగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఎంజీ.గోపాల్ టీటీడీ ఈవోగా జూలై 6, 2013న నియమితులయ్యారు. ఏడాదిన్నరపాటు ఈవోగా పనిచేసిన ఆయన టీటీడీలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. శ్రీవారి దర్శనంలో సమూలమైన మార్పు లుతెచ్చారు. దర్శనంలో మూడు వరుసల విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో విక్రయించే విధానానికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో కీలకభూమిక పోషించారు. ఐఏ ఎస్‌ల విభజనలో ప్రత్యూష కమిటీ ఎంజీ.గోపాల్‌ను తెలంగాణకు కేటాయిం చింది. ఆయన్ను తెలంగాణ కేడర్‌కు కేటాయించడంతో ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిధర్‌ను తెలంగాణకు కేటాయించినప్పటి నుంచి టీటీడీ ఈవో పదవిని దక్కించుకోవడానికి పలువురు ఐఏఎస్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. సీఎంవో కార్యదర్శిగా పనిచేస్తోన్న 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ.గిరిధర్‌ను టీటీడీ ఈవోగా నియమిస్తారని అప్పట్లో అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ.. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. 1986 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన డి.సాంబశివరావుకు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే సాంబ శివరావుకు గాడితప్పిన టీటీడీని గాడిలో పెట్టే సత్తా ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.