సీఎంఓ కార్యదర్శిగా వి.శేషాద్రి | V Sheshadri Appointed As Telangana CMO Secretary | Sakshi
Sakshi News home page

సీఎంఓ కార్యదర్శిగా వి.శేషాద్రి

Published Thu, Oct 1 2020 1:57 AM | Last Updated on Thu, Oct 1 2020 1:57 AM

V Sheshadri Appointed As Telangana CMO Secretary - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శిగా 1999 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వి.శేషాద్రిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2013 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు కేంద్రంలో డిప్యుటేషన్‌పై డైరెక్టర్‌గా, జాయింట్‌ సెక్రటరీగా పనిచేసి రాష్ట్రానికి తిరిగివచ్చారు. అంతకుముందు విశాఖపట్నం, రంగారెడ్డి, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌గా, టీటీడీ జేఈఓగా, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ ప్రత్యేకాధికారిగా, రంగారెడ్డి జేసీగా తదితర పోస్టుల్లో పనిచేశారు. భూవ్యవహారాలు, రెవెన్యూ చట్టాలపై మంచి పట్టు ఉండటంతో ఆయనకు సీఎంఓలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement