sheshadri
-
సీఎంఓ కార్యదర్శిగా వి.శేషాద్రి
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శిగా 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి.శేషాద్రిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2013 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు కేంద్రంలో డిప్యుటేషన్‌పై డైరెక్టర్‌గా, జాయింట్ సెక్రటరీగా పనిచేసి రాష్ట్రానికి తిరిగివచ్చారు. అంతకుముందు విశాఖపట్నం, రంగారెడ్డి, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌గా, టీటీడీ జేఈఓగా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేకాధికారిగా, రంగారెడ్డి జేసీగా తదితర పోస్టుల్లో పనిచేశారు. భూవ్యవహారాలు, రెవెన్యూ చట్టాలపై మంచి పట్టు ఉండటంతో ఆయనకు సీఎంఓలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. -
కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కులాంతర వివాహలు చేసుకున్న ఎసీ,ఎస్టీ జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని అదనపు సంయుక్త కలెక్టర్ శేషాద్రి అన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 11 జంటలకు, గిరిజన సంక్షేమానికి చెందిన 4 జంటలకు రూ. 50 వే లు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకుని, ఇళ్లులేని వారికి ప్రభుత్వం నుంచి పక్కా గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మే 11 2013 కంటే ముందు కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రభుత్వం రూ. 10 వేల పారితోషికం ఇస్తుందని, అనంతరం వివాహం చేసుకున్న ఎస్సీ,ఎస్టీ దంపతులకు రూ. 50 వేలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారు సుఖ సంతోషాలతో జీవించాలని ఏజేసీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారులు ఖలేబ్, రాములు, పాండురంగ వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.