కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కులాంతర వివాహలు చేసుకున్న ఎసీ,ఎస్టీ జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని అదనపు సంయుక్త కలెక్టర్ శేషాద్రి అన్నారు. శుక్రవారం తన ఛాంబర్‌లో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 11 జంటలకు, గిరిజన సంక్షేమానికి చెందిన 4 జంటలకు రూ. 50 వే లు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకుని, ఇళ్లులేని వారికి ప్రభుత్వం నుంచి పక్కా గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మే 11 2013 కంటే ముందు కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రభుత్వం రూ. 10 వేల పారితోషికం ఇస్తుందని, అనంతరం వివాహం చేసుకున్న ఎస్సీ,ఎస్టీ దంపతులకు రూ. 50 వేలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారు సుఖ సంతోషాలతో జీవించాలని ఏజేసీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారులు ఖలేబ్, రాములు, పాండురంగ వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.