Resident Commissioner
-
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ..
సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్‌ప్రకాష్ నియమితులయ్యారు. పౌరసరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా వీరపాండ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. అదే విధంగా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు చేపట్టారు. సీఎస్‌గా కె విజయానంద్‌కు తాత్కాలిక అదనపు బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ ఆస్పత్రిలో ఉన్నందున కె విజయానంద్ తాత్కాలిక అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. చదవండి: అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం -
ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాశ్
సాక్షి, విజయవాడ: ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌ను.. బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న భావనా సక్సేనాను రిలీవ్ చేస్తూ కేంద్రం నుంచి తాజాగా దేశాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. -
క్వారంటైన్ పూర్తైనవారిని తరలించండి
ఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కొంతమంది తెలుగువారిని ఢిల్లీలోని క్వారంటైన్లో ఉంచిన విషయం తెలిసిందే. క్వారంటైన్ పూర్తైన వారికి నెగటివ్ రిపోర్టు రావటంతో స్వంత రాష్ట్రానికి తరలించడానికి ఏపీ భవన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ, డీజీకి ఏపీ రెసిడెంట్ కమిషనర్ భవన సక్సేనా విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా రెండు విమానాలు ఏర్పాటు చేయాలని దక్షిణాది రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ వారి విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపింది. -
ఇండియన్ ఎంబసీ సహాయ చర్యలు చేపడుతోంది
-
‘యాత్రికుల పరిస్థితి సమీక్షిస్తున్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: యాత్రికుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. నిన్నటి నుంచి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, ఢిల్లీలోని కేంద్ర అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మూడు క్యాంపుల్లో కలిపి సుమారు 1500మంది చిక్కుకున్నట్లు సమాచారమని వెల్లడించారు. సిమికోట్‌లో 550, హిల్సాలో 500 మంది, టిబెట్ వైపున 500 మంది చిక్కుకున్నారని, వారిలో మన తెలుగు వాళ్ళు సుమారు 100మంది ఉన్నారన్నారని తెలిపారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. యాత్రికులను సురక్షత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. బేస్ క్యాంపుల్లో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉందన్నారు. దీంతో హెలికాప్టర్ల ద్వారా మాత్రమే సహాయం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. హెలీకాప్టర్ల సహాయంతో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. అదేవిధంగా సహాక చర్యలకోసం భారత ఆర్మీని కూడా పంపించాలని విదేశాంగశాఖను కోరామని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే తెలుగు వాళ్ళందరూ సురక్షితంగా స్వస్థలాలకు చేరుకొనేలా చూస్తామన్నారు. స్పందించిన తెలంగాణ అధికారులు కాగా, మానస్ సరోవర్ యాత్రలో చిక్కుకున్న తెలంగాణ యాత్రికులతో ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు ఫోన్లో మాట్లాడారు. తామంతా సురక్షితంగా ఉన్నట్టు అధికారులకు యాత్రికులు తెలిపారు. యాత్రికులకు కావాల్సిన వైద్యం తక్షణమే అందించాలని సంబంధిత అధికారులను కోరినట్లు తెలంగాణ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి తెలిపారు. -
తెలంగాణ భవన్ లో ఉద్యోగుల కొరత
ఖాళీలు భర్తీ చేయండని సర్కారుకు రెసిడెంట్ కమిషనర్ లేఖ సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉద్యోగుల కొరత నెలకొంది. విభజన తరువాత భవన్లో సిబ్బందికి తీవ్ర కొరత ఏర్పడిందని రెసిడెంట్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతమున్న ఖాళీలను వెంటనే భర్తీ చేస్తూనే పది కొత్త పోస్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. స్పం దించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువమంది ఉద్యోగులు ఏపీ భవన్‌కు వెళ్లడంతో ఈ ఇబ్బంది తలెత్తింది. మొత్తం 49 కేడర్లలోని 67 పోస్టులకు కేవలం 35 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 32 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో పది పోస్టులను వీలైనంత తొందరగా భర్తీ చేయాలంటూ రెసిడెంట్ కమిషనర్ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ భవన్ అవసరాలకు, రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరే వీఐపీలు, వీవీఐపీలకు ప్రొటోకాల్ ఏర్పాట్ల పర్యవేక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించటం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని రెసిడెంట్ కమిషనర్ ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సాధారణ పరి పాలన విభాగం ప్రతిపాదనలో ఉన్న ఈ ఫైలు సీఎస్ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక శాఖ కు చేరుతుంది. తదుపరి మంత్రిమండలిలో తీసుకునే నిర్ణయం మేరకు పోస్టుల భర్తీ, కొత్త పోస్టుల మంజూరు ప్రక్రియ ఆధారపడి ఉం టుంది. ఈ పోస్టులకు రాష్ట్రం నుంచి రెగ్యులర్ ఉద్యోగులను పంపించాలా.. లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరపాలా..? అనేది నిర్ణయించాల్సి ఉంది.