క్వారంటైన్‌ పూర్తైనవారిని తరలించండి | Bhavana Saxena Is Seeking The Evacuation Of Quarantine Completed People Of AP | Sakshi
Sakshi News home page

క్వారంటైన్‌ పూర్తైనవారిని తరలించండి

Published Tue, Apr 7 2020 1:37 PM | Last Updated on Tue, Apr 7 2020 1:43 PM

Bhavana Saxena Is Seeking The Evacuation Of Quarantine Completed People Of AP - Sakshi

ఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కొంతమంది తెలుగువారిని ఢిల్లీలోని క్వారంటైన్‌లో ఉంచిన విషయం తెలిసిందే. క్వారంటైన్ పూర్తైన వారికి నెగటివ్‌ రిపోర్టు రావటంతో స్వంత రాష్ట్రానికి తరలించడానికి ఏపీ భవన్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ, డీజీకి ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ భవన సక్సేనా విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా రెండు విమానాలు ఏర్పాటు చేయాలని దక్షిణాది రాష్ట్రాల రెసిడెంట్‌ కమిషనర్లు కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ వారి విజ్ఞప్తిని పరిశీలిస్తామని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement