న్యూఢిల్లీ: సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్పా, మాధవ్, గురుమూర్తి, మాధవి, సంజీవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీధర్, ఆర్. కృష్ణయ్య, ఏపీ భవన్ ఉద్యోగులు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగాా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజకీయల్లో వైఎస్ జగన్‌ది ప్రత్యేక స్థానమని కొనియాడారు. ప్రతిపక్షాలు వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టాయని, అయినా వాటిని సీఎం జగన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్దతతో పని చేస్తున్నారని చెప్పారు.
'2009లో వైఎస్ జగన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన వ్యక్తిత్వంతో పార్టీ నిలబడింది. వైఎస్ కుటుంబంతో నాది మూడు తరాల అనుబంధం. సీఎం జగన్ వందేళ్లు చల్లగా జీవించాలి. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేయాలి' అని విజయసాయిరెడ్డి అన్నారు.
చదవండి: CM Jagan Birthday: ఊరూవాడా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment