
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ భవన్‌లో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆదివారం కరోన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఢిల్లీ ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏపీ భవన్‌ను అధికారులు శానిటైజ్ చేశారు. అనంతరం ఆంధ్రా, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలకు సీల్ వేశారు. మూడు రోజుల తర్వాతే వీటిల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. ఐఏఎస్ అధికారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నామన్నారు. కాంటాక్ట్స్ అందరూ హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ఏపీ భవన్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. వయసుపైబడిన, ఇతరత్రా వ్యాధులు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.