
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదివారం వైరస్ బారినపడ్డారు. ఆరోగ్య శాఖలో ఓఎస్డీ, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సీఈఓగా ఈ అధికారి పనిచేస్తున్నారు. ఈ అధికారి కొన్ని కీలక సమావేశాల్లో పాల్గొనడంతో ఆయా భేటీల్లో పాల్గొన్న వారికోసం అధికారులు ఆరా తీస్తున్నారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను వేగవంతం చేసి అనుమానితులను క్వారంటైన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9971 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,628కి పెరిగింది. కేసుల సంఖ్య 2.4 లక్షలు దాటడంతో అత్యధిక వైరస్ కేసులు నమోదైన 5వ దేశంగా భారత్ స్పెయిన్‌ను అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment