అనుపమ నంబర్‌ మారింది | Anupama Parameswaran Changed Her Phone Number | Sakshi
Sakshi News home page

అనుపమ నంబర్‌ మారింది

Published Fri, Jan 11 2019 1:21 PM | Last Updated on Fri, Jan 11 2019 1:21 PM

Anupama Parameswaran Changed Her Phone Number - Sakshi

సినిమా: హీరోయిన్ల వెతలు అంతా ఇంతా కాదు. రిజర్వుగా ఉంటే టెక్కు ఎక్కువ అంటారు. కాస్త ఫ్రీగా ఉంటే అలుసుగా తీసుకుని ఏకాంతాన్ని భంగం కలిగిస్తుంటారు. వీళ్లతో ఎలాగబ్బా ఏగేది అని తల పట్టుకుంటున్నారు కొందరు హీరోయిన్లు. ఎవరి సంగతి ఏమోగానీ, నటి అనుపమ పరమేశ్వన్‌ పరిస్థితి మాత్రం ఇదే. ఈ మలయాళీ బ్యూటీ దక్షిణ భారతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా కొడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. అయితే అందాలారబోత విషయంలో కొన్ని పరిమితులను విధించుకున్న ఈ అమ్మడికి అవకాశాలు నత్తనడకగానే వస్తున్నాయి.

ముఖ్యంగా కోలీవుడ్‌ అనుపమను అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో తెలుగు, తమిళం భాషల్లోనే దృష్టి సారిస్తోంది. ఇకపోతే ఈ కేరళా కుట్టి చిత్ర వర్గాలతో చాలా చనువుగా ఉంటుందట.ఈమె ఫోన్‌ నంబరు కూడా చాలా మందికి తెలుసట. అనుపమ చనువు ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పిగా మారిందట. నటినటులతో పాటు సాంకేతిక వర్గం కూడా తరచూ ఆమెకు ఫోన్‌ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తుండడంతో అనుపమ ప్రైవసీని కోల్పోతోందట. వారిపై విసుగు, కోపం కలుగుతున్నా, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి కావడంతో ఇక చేసేదేమీలేక తన సెల్‌ఫోన్‌ నంబరునే మార్చేసిందట. ఇది చాలా మందిని నిరుత్సాహపరుస్తున్నా, అనుపమకు మాత్రం అభిమాన గోల తప్పిందని సంతోషపడుతోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement