నా పదేళ్ల కెరీర్‌లో సుబ్బు నా ఫేవరెట్‌ : అనుపమా పరమేశ్వరన్ | Anupama Parameswaran Talk About Paradha Movie At Teaser launch Event | Sakshi
Sakshi News home page

నా పదేళ్ల కెరీర్‌లో సుబ్బు నా ఫేవరెట్‌ : అనుపమా పరమేశ్వరన్

Jan 23 2025 8:31 AM | Updated on Jan 23 2025 10:28 AM

Anupama Parameswaran Talk About Paradha Movie At Teaser launch Event

అనుపమా పరమేశ్వరన్, సంగీత, దర్శనా రాజేంద్రన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘పరదా’. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను డిజిటల్‌గా రిలీజ్‌ చేశారు దుల్కర్‌ సల్మాన్‌.  

హైదరాబాద్‌లో జరిగిన ‘పరదా’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అనుపమా పరమేశ్వరన్‌ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో నా మోస్ట్‌ ఫేవరెట్‌ మూవీ ‘పరదా’, ఫేవరెట్‌ క్యారెక్టర్‌ సుబ్బు. ఈ సినిమా  అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్’అన్నారు. 

హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అనుపమ, సంగీత గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమాలో మ్యాజిక్ కు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అన్నారు . ‘‘ఇలాంటి గొప్ప కథ రాసిన డైరెక్టర్‌కు థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు సంగీత. 

‘‘ఉమెన్‌ ఒరియంటెడ్‌ సినిమాలకు బిగ్‌ ఓపెనింగ్స్‌ వచ్చేలా ఈ మూవీ ఉంటుంది’’ అని పేర్కొన్నారు ప్రవీణ్‌. ‘‘ఈ సినిమా మలయాళం రైట్స్‌ను దుల్కర్‌ సల్మాన్‌ తీసుకున్నారు’’ అన్నారు విజయ్‌ డొంకాడ. ‘‘ఉత్తరాంధ్ర నుంచి ఓ నిర్మాత వచ్చి ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళా సాధికారత ఉన్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌. ‘‘ఈ సినిమా తీయడం మాకు ‘బాహుబలి’లాంటి ప్రయత్నం’’ అని స్పష్టం చేశారు శ్రీధర్‌.  

Advertisement
 
Advertisement
Advertisement