నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్
అనుపమా పరమేశ్వరన్, సంగీత, దర్శనా రాజేంద్రన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను డిజిటల్‌గా రిలీజ్ చేశారు దుల్కర్ సల్మాన్. హైదరాబాద్‌లో జరిగిన ‘పరదా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో నా మోస్ట్ ఫేవరెట్ మూవీ ‘పరదా’, ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్’అన్నారు. హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అనుపమ, సంగీత గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమాలో మ్యాజిక్ కు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అన్నారు . ‘‘ఇలాంటి గొప్ప కథ రాసిన డైరెక్టర్‌కు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు సంగీత. ‘‘ఉమెన్ ఒరియంటెడ్ సినిమాలకు బిగ్ ఓపెనింగ్స్ వచ్చేలా ఈ మూవీ ఉంటుంది’’ అని పేర్కొన్నారు ప్రవీణ్. ‘‘ఈ సినిమా మలయాళం రైట్స్‌ను దుల్కర్ సల్మాన్ తీసుకున్నారు’’ అన్నారు విజయ్ డొంకాడ. ‘‘ఉత్తరాంధ్ర నుంచి ఓ నిర్మాత వచ్చి ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళా సాధికారత ఉన్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ‘‘ఈ సినిమా తీయడం మాకు ‘బాహుబలి’లాంటి ప్రయత్నం’’ అని స్పష్టం చేశారు శ్రీధర్.