కర్ణాటక, బనశంకరి : బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అఇన మీ మొబైల్ నెంబరు మార్చాలని ఆలోచిస్తున్నారా అలాగైతే హుషార్ కావాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే మీ అకౌంట్‌లో ఉన్న నగదు దోచేయడం ఖాయం. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన సిమ్‌కార్డుకు బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కాబడిన మొబైల్ నెంబరు తీసుకున్న మరో వ్యక్తి పేటీఎం వ్యాలెట్ వినియోగించి అతడి అకౌంట్ నుంచి నగదు దోచేసిన ఘటన వెలుగుచూసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ మొబైల్ బ్యాంకింగ్ ఇతర బ్యాంకింగ్ సేవలకు మొబైల్ నెంబరు కచ్చితంగా ఉండాలి. సైబర్ క్రైం నేరాలను అడ్డుకట్టవేయడం, భద్రత కోసం భారతీయ రిజర్వుబ్యాంక్ కూడా ఇప్పటికే లింక్ ఆదేశాలు జారీ చేస్తూ ఆర్దినెన్స్ విడుదల చేసింది. ఈ సేవలను పొందినప్పుడు మొబైల్ కు వచ్చే ఓటీపీ చాలా ముఖ్యం.
దీనిపై నిఘా వహించకపోతే బ్యాంక్ అకౌంట్‌లో నగదు మాయం కావడం తథ్యం. కొడగు జిల్లా కుశాలనగరకు చెందిన వ్యక్తి అష్రఫ్ దుబాయిలో ఉంటున్నాడు. ఇతను తన బ్యాంక్ అకౌంట్‌కు, పేటీఎం, వ్యాలెట్‌కు లింక్ చేసి మొబైల్ నెంబర్‌ను ఇటీవల తొలగించాడు. కానీ కొత్త మొబైల్ నెంబరును బ్యాంక్‌లో లింక్ చేయలేదు. దుబాయి నుంచి అష్రఫ్ కుశాలనగర బ్యాంక్ అకౌంట్‌కు నగదు జమచేసి తల్లిదండ్రులకు పంపించేవాడు. కానీ అష్రఫ్ తొలగించిన మొబైల్ నెంబరు సిమ్‌కార్డు కంపెనీ దావణగెరె భరత్ అనే వ్యక్తికి విక్రయించింది. భరత్ కొనుగోలు చేసిన కొత్త సిమ్‌కార్డుకు అష్రఫ్ బ్యాంకింగ్ మెసేజ్‌లు మొబైల్‌కు వస్తున్నాయి. మొదట పట్టించుకోని భరత్ అనంతరం మొబైల్‌కు పేటీఎం, వ్యాలెట్ యాక్టివేట్ చేసుకున్నాడు. తక్షణం అష్రఫ్ బ్యాంక్ అకౌంట్‌తో సహ సింక్ కాబడింది. అనంతరం భరత్ పేటీఎం వ్యాలెట్‌తో తన బ్యాంక్ అకౌంట్‌కు నాలుగురోజుల్లో రూ.79,994 వేలు నగదు జమ అయింది. దీంతో కంగారుపడిన అష్రఫ్ కొడగు జిల్లా సీఐఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు మొబైల్ నెంబర్ ఆధారంగా భరత్‌ను బుదవారం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment