
బెంగళూరు: తన భార్య బ్యాంకు అకౌంట్లో రూ. 30 కోట్లు పడటంతో చన్నపట్నానికి చెందిన సయ్యద్ మాలిక్ బుర్హాన్ అనే పూల విక్రేత షాక్‌కు గురయ్యాడు. డిసెంబర్ 2న బ్యాంకు అధికారులు అతని ఇంటికి వచ్చి ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించడంతో ఈ విషయం బయటికొచ్చింది. గతంలో తాను ఓ సారి ఓ ఆన్‌లైన్ పోర్టల్ నుంచి చీర కొన్నానని, అప్పుడు తాను కారును గెలుచుకున్నానని చెప్పి తన బ్యాంకు ఖాతా వివరాలను ఎవరో ఫోన్ చేసి అడిగారని గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి తమ ఖాతాల్లోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియక తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment