
ప్రతీకాత్మక చిత్రం
రాయచూరు: పింఛన్‌తో జీవితం సాగించే వృద్ధురాలి ఖాతాలోకి ఏకంగా రూ.10 కోట్ల నగదు జమ అయిన ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయచూరు తాలూకా గుంజళ్లిలో నివాసం ఉంటున్న తాయమ్మ(65)కు నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుంది. గత ఏడాది డిసెంబర్ 20న ఈ అవ్వ ఖాతాలోకి రూ.10 కోట్ల 38 లక్షల 62 వేల నగదు జమైంది.
చదవండి: కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే : గడ్కరీ
అదే నెల 31న తాయమ్మ గుంజళ్లిలోని బ్యాంక్‌కు వెళ్లి పింఛన్ డ్రా చేసుకుని ఇంటికి వచ్చింది. ఆమె వెంట వెళ్లిన వ్యక్తి తాయమ్మ ఖాతాలో రూ.కోట్లలో నగదు ఉండటాన్ని గుర్తించాడు. రూ.8 లక్షలు డ్రా చేయాలని చెప్పి జనవరి 1న బ్యాంకుకు తీసుకొని వెళ్లాడు. బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి ఖాతాను పరిశీలించగా కోట్లలో నగదు ఉండటంతో విస్తుపోయారు.
దీనిపై విచారణ చేస్తామని, అప్పటివరకు డబ్బు డ్రా చేయవద్దని చెప్పి వారిని వెనక్కి పంపారు. బ్యాంకు అధికారులనుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో వృద్ధురాలి భర్త రామన్న గురువారం రాయచూరు జిల్లా ఎస్పీ నిఖిల్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment