త్రీ మంకీస్ - 26 | three monkeys dialy comedy serial | Sakshi
Sakshi News home page

త్రీ మంకీస్ - 26

Published Thu, Nov 13 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

త్రీ మంకీస్ - 26

త్రీ మంకీస్ - 26

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 26
- మల్లాది వెంకటకృష్ణమూర్తి

మగాళ్ళల్లా బాయ్ కట్ క్రాఫ్ హెయిర్ స్టైల్. జీన్స్ పేంట్. టి షర్ట్. పాలరాయిలా తెల్లటి చర్మం. చూపరులని ఇట్టే ఆకట్టుకునే అందం ఆమెది. బట్టల సబ్బు కోసం ఆ విభాగంలోకి వచ్చిన కపీష్ ఆమెని, ఆమె రెండు చేతులతో లాఘవంగా తోసే రెండు ట్రాలీలని చూశాడు. వాటి నిండుగా బ్రష్‌లు, చీపుళ్ళు, క్లీనింగ్ లోషన్లు, హేండ్ శానిటైజర్స్, డెటాల్ బాటిల్స్...
‘‘మే ఐ హెల్ప్ యు?’’ అడిగాడు.
‘‘ఓ! థాంక్స్’’ ఆమె కృతజ్ఞతగా చెప్పింది.
ఓ ట్రాలీని తోస్తూ ఆమె పక్కనే నడుస్తూ అడిగాడు.
‘‘మీరు హాస్టల్‌లో ఉంటారా?’’
‘‘ఊహూ. దేనికలా అనుకున్నారు?’’
‘‘ఈ సామాను చూసి’’
‘‘సిల్లీ. ఇవన్నీ మా ఇంటికే.’’
ఆమెది చాలా పెద్ద ఇల్ల్లై ఉంటుందని, అంటే ధనవంతురాలు అయి ఉంటుందని కూడా కపీష్ భావించాడు.
‘‘మీరు నార్త్ ఇండియనా?’’ అడిగాడు.
‘‘కాదు. తెలంగాణియన్‌ని. ఏం?’’
‘‘మీ చర్మం రంగు ఏపిలో కాని, తెలంగాణాలో కాని అరుదు. తమన్నాలా నార్త్ వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు.’’
‘‘మా నాన్న యుపి. మా అమ్మ ఏపి. నేను తెలంగాణియన్‌ని.’’
ఆ వస్తువులకి ఆమె చెకౌట్ కౌంటర్‌లో బిల్‌ని చెల్లించాక పార్కింగ్ లాట్ దాకా వెళ్ళి టాటా సఫారీలో వాటిని ఎక్కించాడు.
‘‘మీ ఫోన్ నంబర్?’’ నసిగాడు.
‘‘మీది చెప్పండి.’’
ఆమె తన సెల్ తీసి అతను చెప్పే నంబర్ని నొక్కి కాల్ చేసింది. అతని సెల్‌ఫోన్ మోగాక చెప్పింది.
‘‘ఫీడ్ చేసుకోండి. నా పేరు స్వచ్ఛ.’’
‘‘స్వేచ్ఛా?’’
‘‘కాదు. స్వచ్ఛ.’’
‘‘మీ నాన్న గారి పేరు భారత్ కదా?’’
‘‘కాదు. భరత్.’’
‘‘నా పేరు కపీష్. సూపర్ బజార్ అని ఏడ్ చేసుకుంటే నేను గుర్తుండచ్చు’’ సూచించాడు.
‘‘ఆ అవసరం లేదు. ఏ హంసవర్ధనో, మృగాంకో అయితే గుర్తుండకపోవచ్చు. కపీష్ లాంటి పేరు ఎవరికీ ఉండదని పందెం. బై’’
ఆమె వాహనం వెళ్ళిన రెండు నిమిషాలకి స్వచ్ఛకి కాల్ చేశాడు.
‘‘యస్ మిస్టర్ కపీష్. ఏదైనా కింద పడిందా? అప్పటికీ కింద చూసే ఎక్కానే?’’ స్వచ్ఛ మాటలు వినిపించాయి.
‘‘నాకు ఎందుకో దిగులుగా ఉంది’’ అతను చెప్పాడు.
‘‘దేనికి దిగులు?’’
‘‘దేనికి కాదు. ఎవరి మీద అని అడగండి... మీ మీద... మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని! సాయంత్రం మీరు ఫ్రీనేనా?’’
‘‘ఏ టైంకి?’’
‘‘ేన  బిట్విన్ సిక్స్ అండ్ సెవెన్.’’
‘‘ఐ యామ్ నాట్ ష్యూర్... యస్ ఫ్రీ’’ మొహమాటపడి చెప్పింది.
‘‘గుడ్. జివికె మాల్‌లోని ఫుడ్ కోర్టులో కలుద్దామా?’’
‘‘వైనాట్?’’
‘‘థాంక్స్. డన్.’’
   
‘‘మీకు ఏం ఇష్టం?’’ అడిగాడు.
‘‘మీకు?’’ స్వచ్ఛ అడిగింది.
‘‘మోమోస్ ఓకే?’’
‘‘ఫైన్. నాన్ ఫేనింగ్, టేస్టీ’’
 
కపీష్ లేచి వెళ్ళి ఓరియెంటల్ వెజ్ మోమోలు రెండు ప్లేట్‌లని కొన్నాడు. ఇటీవల మోమోలు ఫుడ్ కోర్టుల్లో ప్రాచుర్యం పొంది యువతని ఆకర్షిస్తున్నాయి. మైదా పిండిని చపాతీలా వత్తి అందులో కేరట్, కేబేజ్, కేప్సికం, ఉల్లిపాయ, బ్రకోలి తరుగుని, అల్లం వెల్లుల్లి, సోయాసాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని ఉంచి అర్ధచంద్రాకారంలో మడిచి పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించి, సోయా, చిలీ సాస్‌లతో సర్వ్ చేసే ఈ సింగపూర్, సౌత్ కొరియా స్నాక్ ఇప్పుడు ఇండియాలో ఇంకా స్ట్ట్రీట్ ఫుడ్‌గా (రోడ్ల మీద బళ్ళ మీదకి) రాలేదు. వెజిటబుల్స్ బదులు చికెన్, ప్రాన్స్, ఫిష్ మొదలైనవి కూడా పెట్టి మోమోలు తయారు చేస్తారు.

వాటిని చూసి ఆమె హేండ్ బేగ్‌లోంచి హేండ్ శానిటైజర్ తీసి అతని చేతులని చాపమని అతని అరచేతుల మీద, తన అరచేతుల మీద పోసి చెప్పింది.
 ‘‘క్లీన్‌లీనెస్ ఈజ్ నెక్ట్ ్సటు గాడ్లీనెస్’’
 ‘‘అఫ్‌కోర్స్. అఫ్‌కోర్స్.’’
 ఆమెతో అరగంట పైనే కబుర్లు చెప్పాడు. ఆమె తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పెలైట్. తల్లి ఫిజియోథెరపిస్ట్.
 ‘‘నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ భాషలోని పదాల మీద డాక్టరేట్ చేస్తున్నాను.’’
 ‘‘ఓ! పదాల పుట్టుక మీద రీసెర్చా?’’
 ‘‘కాదు. నేను ప్రత్యామ్నాయ పదాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఆ క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పదాల కన్నా ఇంకాస్త స్పష్టమైన పదాలని సృష్టించే ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాను.’’
 ‘‘అంటే?’’
‘‘అమెరికా ఇందులో అందె వేసిన చెయ్యి. ఇలా అక్కడ సృష్టించబడ్డ కొత్త పదాలు ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. ‘సెకండ్ హేండ్ కారు’ అనగానే అదేదో నాసిరకంది అన్న భావన కలుగుతుంది. కాబట్టి ఆ పరిశ్రమ వారు ‘యూజ్డ్ కార్స్’ అనే కొత్త పేరుని సృష్టించారు. ఇప్పుడు అదీ నాసిరకం అనిపించి ‘ప్రీ-ఓన్డ్ కార్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఇలాగే నీగ్రోలని బ్లాక్స్ అనే వాళ్ళు. చర్మం రంగు వివక్షత సరి కాదని ఇప్పుడు ‘ఆఫ్రో-అమెరికన్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఈ తరహాలో నేను సృష్టించిన కొన్ని పదాలని మా ప్రొఫెసర్ పేనల్ అప్రూవ్ చేసింది. పేరుని బట్టి ఆ వస్తువేదో స్ఫురించాలి.’’
‘‘గ్రేట్! కంగ్రాట్స్. మీరు సృష్టించిన పదాలు ఏమిటి?’’ కపీష్ ఆసక్తిగా అడిగాడు.

(ఫింగర్ పాంట్స్ అంటే?)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement