త్రిమంకీస్ | Three Monkeys | Sakshi
Sakshi News home page

త్రిమంకీస్

Published Tue, Nov 4 2014 4:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM

త్రిమంకీస్

త్రిమంకీస్

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 16
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి

 
 ‘‘దీన్నిబట్టి నాకోటి అర్థమైంది’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఏమిటి?’’ కపీష్ అడిగాడు.
 ‘‘ఎవరైనా తమ బెస్ట్‌ఫ్రెండ్స్‌ని కలుసుకోవాలనుకుంటే జైలుకి వెళ్ళాలి.’’
 ‘‘నాలుగో గాడిద ఏమైంది?’’ మర్కట్ కపీష్‌ని ప్రశ్నించాడు.
 ‘‘అవును. నాలుగో గాడిద ఏమైంది?’’ వానర్ కూడా ప్రశ్నించాడు.
 వాళ్ళా ప్రశ్నలు అడిగింది వారి నాలుగో మిత్రుడి గురించి అనుకుంటే పొరపాటే. అసలు ఈ ముగ్గురూ కూడా గాడిదలు అనుకుంటే పొరపాటే. వాళ్ళని వాళ్ళు గాడిదలుగా భావించడం లేదు. ఆ నాలుగో గాడిద గురించి తెలుసుకోవాలనుకుంటే, ఓ ఏడాది వెనక్కి వెళ్ళాలి. ఏడాది క్రితం ఎక్కడికి? ముందుగా వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని మేక్‌డొనాల్డ్స్ రెస్టరెంట్‌లోకి! తర్వాత కాలేజీ లోకి!
 5
 ‘‘మన దగ్గర తైలం ఉందా?’’ మెక్‌డొనాల్డ్స్ రెస్టరెంట్ బయట నిలబడ్డ కపీష్ మిగిలిన ఇద్దరు మిత్రుల్నీ అడిగాడు.
 ‘‘ఎంత?’’
 ‘‘ఓ ఒన్ ఫిఫ్టీ. మూడు కోక్స్‌కి.’’
 ‘‘లేదు’’ ఇద్దరూ చెప్పారు.
 ‘‘ప్లాన్ ఏ ఫెయిలైంది. సరే. పదండి. తాగుదాం.’’
 ‘‘నీ దగ్గర డబ్బుందా?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘లేదు. ప్లాన్ బి ఉంది. పదండి.’’
 ముగ్గురిలోకి తెలివైన కపీష్ దారిలోని రెండు టేబిల్స్ మీద ఉన్న ట్రేల్లోని రెండు ఖాళీ కోక్ గ్లాస్‌లని తీసుకుని, మిత్రులకి ఇచ్చి చెప్పాడు.
 ‘‘వెళ్ళి ఫౌంటెన్‌లో నింపుకుని రండి.’’
 తర్వాత ట్రాష్ బిన్‌లో చేతిని ఉంచి లాఘవంగా ఇంకో డిస్పోజబుల్ కోక్ గ్లాస్‌ని తీసుకుని అందులోని ఐస్‌ని ఆ బిన్‌లో కుమ్మరించాడు. వాళ్ళ వెనక నిలబడి తన వంతు రాగానే కోక్‌ని నింపుకున్నాడు.
 ‘‘భలే ట్రిక్’’ వానర్ కోక్‌ని రుచి చూసి చెప్పాడు.
 ‘‘ఇది ఇక్కడే సాధ్యం. మనం కోక్ అడిగితే వాళ్ళు డబ్బు తీసుకుని ఖాళీ గ్లాస్‌ని ఇస్తారు. ఫౌంటెన్‌లోంచి నింపుకోవాలి. తర్వాత ఆ ఖాళీ గ్లాస్‌ని వెనక్కి తీసేసుకోరు. వాటిని మళ్ళీ ఎన్నిసార్లు నింపుకున్నా ఎవరూ ఏమీ అనరు. ఈ సిస్టమ్‌లోని లోపాన్ని పట్టేసాను. ఇదే ప్లాన్ బి’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ముగ్గురం మూడు ఏభై రూపాయలు ఆదా చేశాం’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు.
 ముగ్గురూ కూర్చున్నాక ఎమ్మెస్ అలర్ట్ రాగానే మర్కట్ మెసేజ్ ఎక్కడ నించో చూశాడు కాని దాన్ని చదవకపోవడంతో వానర్ అడిగాడు.
 ‘‘ఏం మెసేజ్?’’
 ‘‘నా బేంక్ నించి బేలన్స్ తెలియచేస్తూ ఎస్సెమ్మెస్ వచ్చింది. దాన్ని చూడను. నా అకౌంట్‌లో ఎంత లేదో తెలుస్తుందని భయం’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘ఇవాళే మన కాలేజీ ఆఖరి రోజు’’ వానర్ విచారంగా చెప్పాడు.
 ‘‘అవును. అందుకేగా ఇవాళ ప్రిన్సిపాల్ కాలేజీ ఆడిటోరియంలో మనందరికీ స్పీచ్ ఇస్తున్నాడు.’’
 ‘‘కాలేజీ నించి బయటకి వెళ్ళాక మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?’’ కపీష్ తన ఇద్దరు మిత్రులని అడిగాడు.
 ‘‘ముందుగా నీది చెప్పు’’ వానర్ కోరాడు.
 ‘‘ఎస్సై ఉద్యోగం సంపాదించడం’’ కపీష్ జవాబు చెప్పాడు.
 ‘‘ఇంజనీరింగ్ చదివి ఎస్సై ఉద్యోగమా?’’ మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘ఇప్పటికే చాలామంది ఇంజనీర్లు ఎస్సైలయ్యారని తెలీదా? నీ ప్లాన్ ఏమిటి?’’ కపీష్ వానర్ని అడిగాడు.
 ‘‘పిడబ్ల్యుడిలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ట్‌లో చేరాలని! జీతం కోసం కాదు... పై సంపాదన కోసం. నువ్వు చెప్పు భాయ్’’ వానర్ మర్కట్‌ని అడిగాడు.
 ‘‘కోటీశ్వరుడు అవ్వాలని. నా ముప్ఫై ఐదో ఏడు వచ్చేలోగా ఓ ఐదు కోట్లు సంపాదించాలని. కుదిరితే డాలర్లు. లేదా కనీసం రూపాయలు.’’
 ‘‘బావుంది.’’ వానర్ మెచ్చుకున్నాడు.
 ‘‘మనం కోటీశ్వరుడు కావడానికి జస్ట్ ఒక్క స్టెప్ దూరంలో ఉన్నాం’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఏమిటా స్టెప్?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘మనం ఓ కోటిని సంపాదించాలి.’’
 ‘‘కాని అందుకు ఒకటే సమస్య’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘ఏమిటది?’’ వానర్ అడిగాడు.
 ‘‘కోట్లు సంపాదించడం తేలికే కాని పోలీసులతో సమస్య వస్తుంది.’’
 ‘‘ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం ఉంటుందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నాడు. కాబట్టి ఆ పరిష్కారం కనుక్కుంటే అది సాధ్యమే అంటాను’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఈ ఆఖరి రోజు మనం అందరికీ గుర్తుండి పోయేలా గోల చేయాలి’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ప్రిన్స్‌పాల్ స్పీచ్  ఇస్తూండగా మన పేర్లు రాసిన కాగితం విమానాలు ఆయన మీదకి వేేన్త సరి. విసిరింది మనమని తెలిసినా కాలేజీ నించి ఇక డిస్మిస్ చెయ్యలేడుగా?’’
 ‘‘అది ప్రైమరీ స్కూల్ వాళ్ళు చేేన  అల్లరి. మనం గ్రాడ్యుయేట్ విద్యార్ధి స్థాయిలో అల్లరి చేయాలి’’ కపీష్ చెప్పాడు.
 ‘‘అంటే?’’
 (పే-ఫర్-లాఫ్ కాన్సెప్ట్ అంటే?)
 
- మళ్లీ  రేపు
 ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్,  
 సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3ఝౌజుజ్ఛీట.ట్చజుటజిజీఃజఝ్చజీ.ఛిౌఝ
 
 లెటర్స్
 The names of the three monkeys are very different and their robberies are quite unexpected and humourous which make a reader curious. Thanks to Malladi sir.
 - Sowjanya Reddy (sowjanyareddy155@gmail.com)

 త్రీ మంకీస్ సీరియల్ స్టోరీ బావుంది. ముగ్గురు మిత్రులు కలిశాక
 ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఉంది.
    - దేవేందర్ నాయక్, (devendar.nayak75@gmail.com)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement