Devatha Serial Today Episode: కమల పడుతున్న బాధను భాగ్యమ్మ పసిగట్టిందా? - Sakshi
Sakshi News home page

కమల పడుతున్న బాధను భాగ్యమ్మ పసిగట్టిందా?

Published Thu, May 6 2021 2:54 PM | Last Updated on Thu, May 6 2021 4:45 PM

Devatha Serial : Adihya Advises Rukhmini To Take Care Of Satya - Sakshi

రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్న దేవత సీరియల్‌ నేడు (మే6)న 226వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయిపోయింది. సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్లాడు? సత్య గురించి రుక్మిణితో ఆదిత్య ఏం చెప్పాడు? కమల పడుతున్న బాధను భాగ్యమ్మ పసిగట్టిందా లాంటి వివరాలు ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. 

ఒక అద్భుతం చూపిస్తా బయటకు వెళ్దామని నందా సత్యని అడగ్గా మొదట నో చెప్తుంది. అయితే తనలో దాచుకున్న అగ్ని పర్వతం లాంటి నిజాన్ని భాగ్యమ్మకు చెబుతానంటూ నందా బ్లాక్‌మెయిల్‌ చేయడంతో సరే నంటుంది సత్య. ఇక దేవుడమ్మకు ఎలాగైనా బుద్ది చెప్పాలని పథకాలు పన్నే రంగా మరో ఐడియాను తెరమీదకు తీసుకొచ్చాడు. తన భార్య సొంతూరుకు బంతిని తీసుకెళ్తే అటు దేవుడమ్మ పరువుతో పాటు తన భార్య పరువు కూడా పోతుందని, ఇలా ఇద్దరికి ఒకేసారి బుద్ది చెప్పినట్లువుతుందని బంతితో తన పథకం గురించి వివరిస్తాడు. ఈ ప్లాన్‌తో తనకు కూడా కలిసి వస్తుందనుకున్న బంతి రంగాను పొగడ్తలతో ముంచెత్తుతుంది. 

ఇక సీన్‌ కట్‌ చేస్తే సత్యని పంతులు దగ్గరికి తీసుకెళ్లిన నందా తమ పెళ్లికి సంబంధించి మంచి ముహూర్తం పెట్టమని కోరాడు. మరో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పగా, ఆ తర్వాత జరగాల్సిన తంతుకు కూడా ముహూర్తాలు పెట్టమని అడిగిన నందాకు పంతులు చివాట్లు పెడతాడు. ఇక నందా తీరుతో సత్య బాధపడిపోతుంటుంది. మరోవైపు నందా సత్యని ఎక్కడకి తీసుకెళ్లాడో తెలియక ఆదిత్య కంగారు పడిపోతుంటాడు. ఇది గమనించిన రుక్మిణి ఏమైందని అడగ్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. 

సీన్‌ కట్‌ చేస్తే సత్య జీవితం గురించి తలుచుకుంటూ కమల కుంగిపోతుంటుంది. రుక్మిణి జీవితం బాగుండటం కోసం సత్య ఇంకెన్ని త్యాగాలు చేస్తుందో అని తలుచుకొని తనలో తానే బాధపడిపోతుంటుంది. ఇది గమనించిన భాగ్యమ్మ కొన్ని రోజులుగా కమల ఎందుకు అలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే అకస్మాత్తుగా నందా సత్య జీవితంలోకి రావడం వల్ల అసలు అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని, సత్య జీవితం ఎలా ఉంటుందో అన్న బాధ ఉందని సమాధానం ఇస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement