
సరికొత్త కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీలో బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది ఆహా. డ్యాన్స్, సింగింగ్ షోలతో పాటు సీరియల్స్‌ను కూడా పరిచయం చేశారు. ఇప్పటికే ఆహాలో మిస్టర్ పెళ్ళాం సీరియల్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా 'మందాకిని'అనే సీరియల్ స్ట్రీమింగ్ అవుతోంది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సీరియల్‌లోని మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఈ నెల 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుందట. థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఈ డైలీ సీరియల్‌ను సిద్ధం చేశారు మేకర్స్.అంతేకాకుండా లి ఎనిమిది ఎపిసోడ్స్ ను ఉచితంగా చూసే అవకాశాన్ని ఆహా సంస్థ కల్పిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తి రేపుతున్న మందాకిని సీరియల్‌ని మీరూ చూసేయండి మరి.
Comments
Please login to add a commentAdd a comment