బుల్లితెర ప్రియులకు సరికొత్త సీరియల్.. ఎప్పుటినుంచంటే? | Star Maa Announces Another Latest Serial For Audiences | Sakshi
Sakshi News home page

Star Maa: ఆమని లీడ్‌ రోల్‌లో సరికొత్త సీరియల్‌.. పేరేంటో తెలుసా?

Nov 11 2024 9:20 PM | Updated on Nov 11 2024 9:20 PM

Star Maa Announces Another Latest Serial For Audiences

తెలుగులో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఆదరిస్తున్న  ఛానల్ "స్టార్ మా". సీరియల్ కథల ఎంపికలో ఎప్పుడూ ఒక విలక్షణమైన పంథా అనుసరిస్తూ వస్తోంది. ఈసారి విభిన్నమైన అనుబంధాల వెలుగునీడలతో వినూత్నమైన కథని అందిస్తోంది. తాజాగా  "ఇల్లు ఇల్లాలు పిల్లలు" అనే సరికొత్త సీరియల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథే ఇల్లు ఇల్లాలు పిల్లలు.

ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ ఉంది. అంతే కాదు - మనసుని మెలిపెట్టే  ద్వేషం కూడా ఉంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే... ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథేంటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటోసరికొత్త సీరియల్ "ఇల్లు ఇల్లాలు పిల్లలు" చూడాల్సిందే.

ఈ సీరియల్ ఈ నెల 12 నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం చేయనున్నారు. నిస్సహాయంగా నిలిచిపోయిన  అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ. తెలుగు టెలివిజన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ నటుడు నిర్మాత,  ప్రభాకర్ ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని.. ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన ప్రోమోలు ఈ సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చూపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement