Malladi venkatakrsnamurti
-
త్రీ మంకీస్
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 22 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మొదటి సారా జైలుకి రావడం?’’ ‘‘అవును.’’ ‘‘జైల్లో స్పూన్లు ఇవ్వరు. దాన్ని అరగదీసి కత్తిలా ఉపయోగించి తోటి ఖైదీలని చంపుతారని’’ వడ్డించేవాడు చెప్పాడు. ముగ్గురూ ఖాళీగా ఉన్న ఓ బల్ల ముందు కూర్చున్నారు. వాళ్ళు ప్లేట్లోది తాగబోతూంటే ఇందాక బాత్రూంలోని శాల్తీ గద్దించాడు. ‘‘లెండి. ఇది బాస్ బల్లని తెలీదా?’’ వాళ్ళు లేచి ఇంకో బల్ల ముందు కూర్చుని ఉడికీ ఉడకని ఇడ్లీని తాగసాగారు. ‘‘ఛ! ఆకల్లేకపోతే ఇలాంటి ఇడ్లీలని పెట్టినందుకు హంగర్ స్ట్రయిక్ చేసేవాడిని.’’ మర్కట్ చెప్పాడు. ‘‘తరచు జైల్లోంచి ఖైదీలు ఎందుకు పారిపోతూంటారో ఇప్పుడు నాకు అర్థమైంది. జైలుని అత్తవారింటితో పోల్చడం అనుభవం లేని వాళ్ళు చేసేది.’’ వానర్ కసిగా చెప్పాడు. ‘‘వాడి ప్లేట్లో చూడండి’’ కపీష్ గొంతు తగ్గించి చెప్పాడు. చూస్తే పక్క టేబిల్లో దుర్యోధన్ ఒక్కడే కూర్చుని ఉన్నాడు. అతని ప్లేట్లో యంఎల్‌ఏ పెసరట్, ఓ గారె, వెన్న రాసి నవనవలాడే రెండు ఇడ్లీలు కనిపించాయి. ‘‘అది హోటల్ నించి తెచ్చిందిలా ఉంది’’ మర్కట్ చెప్పాడు. ‘‘అదిగో. కవర్ మీద మినర్వా కాఫీ షాప్ అని ఉంది. వాళ్ళ బ్రాంచ్ ఇక్కడ ఉందని మనకి ఎవరూ చెప్పలేదే?’’ వానర్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘అదేం కాదు. బలం రిజర్వేషన్ కేసు. జైల్లో ఏదైనా జరగచ్చు’’ కపీష్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. ‘‘అన్నట్లు మన కాలేజీలో రమ్య రాముతో నీ ప్రేమ వ్యవహారం ఎంతదాకా వచ్చింది?’’ వానర్ మర్కట్‌ని అడిగాడు. ‘‘అవును. మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుందామని అనుకున్నారు కదా?’’ కపీష్ అడిగాడు. ‘‘అది ఫెయిలైంది’’ మర్కట్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు. ‘‘అరెరె! నువ్వు ఆ అమ్మాయిని పీజా హట్‌కి. కెఎఫ్సికి, కాఫీ డేకి బాగానే తీసుకెళ్ళే వాడివిగా?’’ ‘‘అవును. రమ్య రాము ఓ రోజు అసలు విషయం కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పింది’’ మర్కట్ బాధగా చెప్పాడు. ‘‘ఏమని?’’ వానర్ ఆసక్తిగా అడిగాడు. వాళ్ళిద్దరూ ఇనార్బిట్ మాల్లోని ఫుడ్ కోర్ట్‌లో చైనీస్ నూడుల్స్ తింటున్నారు. ‘‘నీకు ఇవాళ ఆకలి ఎక్కువగా ఉన్నట్లుంది?’’ మర్కట్ రమ్య రాముని అడిగాడు. ‘‘అవును. ఎందుకంటే ఇది నువ్వు నాకు చెల్లించే ఆఖరి బిల్లు కదా? ఓ ప్లేట్ ఇడ్లీ కూడా తీసుకురా.’’ ‘‘ఆఖరి బిల్లేమిటి?’’ ‘‘చెప్తే ఇడ్లీ తీసుకురావు. ముందు అది తే.’’ మర్కట్ లేచి వెళ్ళి ఓ సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో ఓ ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాక అడిగాడు. ‘‘ఊ. ఇప్పుడు చెప్పు.’’ ‘‘ఇక మీదట మనం కలవం కదా.’’ ‘‘కలవమా? మనం ప్రేమికులం కదా. ఎందుకు కలవం?’’ ‘‘మనది కాలేజీ ప్రేమ మాత్రమే. నీకోటి తెలుసా? నూడుల్స్‌కి సాంబార్ మంచి కాంబినేషన్. కాలేజీ గోడలు దాటి బయటకి వచ్చాక మన ప్రేమ బంద్.’’ ‘‘ఎందుకని?’’ ‘‘ఇక లైఫ్‌లో సీరియస్‌గా ప్రేమించదలచుకున్నాను.’’ ‘‘ప్రేమలో ఈజీ, సీరియస్ ప్రేమలు ఉంటాయా?’’ ‘‘అవును.’’ ‘‘ఈజీ ప్రేమంటే?’’ ‘‘శిక్షణా తరగతి లాంటిది. ఎలా ప్రేమించాలి అన్నది నేర్చుకోడానికి ఉపయోగించేది. నేను లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకునేది పిడబ్ల్యుడిలో ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ, ఎండలో నిలబడి రోడ్లు వేయించి, తారు అంటిన దుస్తుల్లో ఇంటికి వచ్చే భర్త కాదు. స్వంత కారు డ్రైవ్ చేసుకుంటూ శాన్ఫ్రాన్సిస్కోలోనో, న్యూజెర్సీలోనో స్వంత వ్యాపారం చేసేవాడిని.’’ ‘‘నీ కడుపులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని నేను ఎన్నడూ అనుకోలేదు.’’ ‘‘ఇప్పుడు ప్రతి అమ్మాయి కడుపులో ఉన్నది ఇదే. గుండెలు బాదుకోకు. ఎవర్ని ప్రేమిస్తే, అష్టకష్టాలైనా పడి, వాడినే పెళ్ళి చేసుకోవాలనుకునే బ్లాక్ అండ్ వైట్, తర్టీ ఫైవ్ ఎంఎం రోజులు కావివి. వైడ్ స్క్రీన్, కలర్, స్ట్టీరియోఫోనిక్, డిజిటల్ రోజులు. ఒకవేళ నచ్చి ప్రేమించినా వాడ్ని కాక ఎవరు కన్వీనియంటో వాడినే చేసుకునే రోజులివి. నా లైఫ్మేట్ దొరికాడు.’’ ‘‘ముందే చెప్తే ఇడ్లీని కొనేవాడ్ని కాదు’’ మర్కట్ పళ్ళు పటపట కొరికాడు. ‘‘నాకది తెలుసు కనుకే ముందే కొనిపించాను. నీక్కావాలంటే ఇడ్లీ తిను. ఈ రోజుల్లో యూత్ ఎవరూ బర్గర్లు తప్ప ఇడ్లీలు తినరు. సాంబార్ కోసం కొనిపించానంతే.’’ ‘‘ఎవరతను?’’ ‘‘ఇప్పటికే ఫేస్బుక్లో పరిచయం అయి, చాట్‌లో అభిప్రాయాలు కలిసి స్కైప్‌లో పెళ్ళిచూపులు అయిపోయాయి.’’ ‘‘ఇదన్యాయం రమ్యరాము.’’ ‘‘నా ఫ్రెండ్స్‌ని ఎవర్నైనా ఇదే ప్రశ్న అడుగు. అన్యాయం కాదని చెప్పకపోతే చెప్పు తీసుక్కొట్టు. అక్కడ మసాలా టీ బావుంటుంది. ఇద్దరికీ పట్రా. ఇంద.’’ హేండ్ బేగ్ తెరిచి డబ్బు ఇవ్వబోయింది. (ఫేస్బుక్ తెరవడం ఎందుకంత కష్టం?) ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com -
త్రీ మంకీస్ - 19
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 19 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మన ముఖ్య అతిథి వచ్చేశారు... ఇది ఆఖరి జోక్... పాకిస్థాన్ ప్రెసిడెంట్ నుంచి భారత రాష్ట్రపతికి కానుకగా ఓ పార్సెల్ అందింది. సెక్యూరిటీ వారు దాన్ని తనిఖీ చేసి బాంబులేం లేవని నిర్ధారించాక ఆయన దాన్ని తెరిచి చూస్తే అందులో మలం ఉంది. ‘మీకు, మీ భారతీయులకి’ అని రాసి ఉంది. రాజకీయ చాణక్యుడైన మన రాష్ట్రపతికి ఇదో లెక్కా? పాకిస్థాన్ ప్రెసిడెంట్‌కి భారత రాష్ట్రపతి నించి బదులుగా అలాంటి ఓ పార్సెల్ వెళ్ళింది. దాన్ని వాళ్ళు విప్పి చూస్తే అందులో వాళ్ళు భయపడ్డట్లుగా బాంబ్ కాక, ఏ మొబైల్ ఫోన్తోనైనా ఆపరేట్ చేేన 1800 జిబి మెమొరీ గల అతి చిన్న కంప్యూటర్, త్రిడి హాలోగ్రాం మానిటర్ కనిపించాయి. అది భారతీయ ఐటి నిపుణులు రూపొందించిన అత్యాధునిక లేప్టాప్. దాంతోపాటు వచ్చిన కాగితంలో ఇలా రాసి ఉంది. ‘ఓ నాయకుడు తమ ప్రజలు తయారు చేసేదే ఇంకో దేశాధినేతకి బహుమతిగా పంపగలడు.’’ ప్రేక్షకులంతా గట్టిగా ఈలలు వేసూ చప్పట్లు కొట్టారు. ‘‘పాకిస్థాన్‌లోని రావల్పిండిలో దిగిన ఓ విమానం లోంచి ఓ ఆఫ్ఘనిస్తానీ దిగి ఇమిగ్రేషన్ కౌంటర్‌కి వెళ్ళాడు. ‘మీరేం చేస్తూంటారు?’ అని పాకిస్థానీ ఇమిగ్రేషన్ అధికారి ప్రశ్నిస్తే ‘నేను అఫ్ఘనిస్తాన్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ మినిస్టర్‌ని’ అని జవాబు చెప్పాడు. ‘అబద్ధం. అఫ్ఘనిస్తాన్కి సముద్రమే లేనప్పుడు నీ అండ్ పోర్ట్స్ మినిస్టర్ ఎలా ఉంటాడు?’ అని ఇమిగ్రేషన్ అధికారి గద్దిస్తే ‘మీ పాకిస్థాన్‌లో లా లేకపోయినా లా మినిష్టర్ ఉన్నట్లుగానే’ అని అతను జవాబు చెప్పాడు.’’ మళ్ళీ గట్టిగా ఈలలు, చప్పట్లు వినిపించాయి. ‘‘ఇంకొక్క జోక్‌కి టైం ఉన్నట్లుంది... అనగనగా ఓ ఊళ్ళో గ్రామ పంచాయితీకి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ముగ్గురు అభ్యర్థులు పోటీకి దిగారు. ఎలాగైనా గెలవాలనుకున్న ఓ అభ్యర్థి ఓటుకి వెయ్యి రూపాయల చొప్పున తళతళలాడే కొత్త కరెన్సీ నోట్లని పంచిపెట్టి ఓట్లు దండుకోవాలని చూశాడు. ఈ సంగతి తెలుసుకున్న రెండో అభ్యర్థి ఓటర్ల వద్దకి వెళ్ళి ఆ అభ్యర్థి పంచిన నోట్లన్నీ దొంగ నోట్లని ప్రచారం చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశాడు. మూడో అభ్యర్థి పాత ఐదు వందల రూపాయల నోట్లతో ఓటర్లని కలుసుకుని కొత్త వెయ్యి నోటుకి పాత ఐదు వందల నోటు మార్పిడి చేసి ‘చూశారా? మీ దొంగ నోటుకి అసలు నోటిచ్చాను. మీ ఓట్లన్నీ నాకే’ అని చెప్పాడు. ఓట్లతో పాటు ఓటరుకి అయిదు వందల రూపాయల చొప్పున అతగాడు లాభం పొందాడు... థాంక్స్ ఫర్ ఎంజాయింగ్ ది జోక్స్. బికాస్ ఐ యామ్ నాట్ గ్రేట్. బికాస్ దే ఆర్ వర్త్ ఎంజాయింగ్.’’ జోక్స్ మధ్యలో కపీష్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలోకి వచ్చాడు. అతను వానర్‌కి కనుసైగ చేశాడు. బదులుగా వానర్ కూడా కనుసైగ చేశాడు. లోపలకి వచ్చిన మర్కట్ కపీష్ చెవిలో ఏదో గుసగుసలాడాడు. ‘‘వెరీ గుడ్’’ కపీష్ చెప్పాడు. ఆ ముగ్గురూ చదివే ఇంజనీరింగ్ కాలేజీకి ముఖ్య అతిథిగా వచ్చింది, దాన్లో బినామీ భాగస్వామ్యం గల ఓ ఎం.పి. ఆయన స్టేజి మీదకి రాగానే విద్యార్థులంతా కావాలని గట్టిగా చప్పుడు చేస్తూ ఆవులిస్తూంటే ప్రిన్స్‌పాల్ గట్టిగా అరిచాడు. ‘‘సెలైన్స్, సెలైన్స్’’. ముందు సీట్లోని కపీష్‌ని, అతను ధరించిన టీషర్ట్ మీది అక్షరాలని చూసి ముఖం చిట్లించాడు. ఆ ఎర్ర టీ షర్ట్ మీద నల్ల అక్షరాల్లో ఇలా ముద్రించి ఉంది. ‘ఐ యాం సెలైంట్లీ కరెక్టింగ్ యువర్ గ్రామర్’ ప్రిన్స్‌పాల్ కోపంగా అందరి వంకా చూసి చెప్పాడు. ‘‘పూర్వం తల మీది టోపీని తీసి గౌరవాన్ని తెలిపేవారు. మీరు మీ చెవులకి ఉన్న హెడ్ ఫోన్స్‌ని తీసి వీరికి మీ గౌరవాన్ని తెలపండి.’’ అయిష్టంగానే అంతా హెడ్‌ఫోన్స్‌ని ఓ వైపు చెవుల నించి మరోవైపు స్మార్ట్ఫోన్ల నించి తీసేశారు. విద్యార్థుల చేష్టలని పట్టించుకోకుండా ముఖ్య అతిథి స్పీచ్‌ని చెప్పాడు. తన సెక్రటరీ రాసిచ్చిన స్పీచ్ కాదది. ఆశువుగా చెప్పాడు. ‘‘ముందుగా నాకు చాలా మంచి బట్టలు ఉన్నాయి. ప్రతిపక్షాలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాసిన బట్టలతో వచ్చాను. మీరు కాలేజీ నించి బయటకి వెళ్ళాక మీ జీవితంలోని చివరి దశ దాకా ప్రభుత్వం మీ జీవితాలని ఎన్నోవిధాల టచ్ చేస్తూనే ఉంటుంది. అసలు ప్రభుత్వం ఎలా పని చేస్తుంది? ప్రభుత్వంలో నేనో చిన్న భాగాన్ని కాబట్టి నాకు తెలిసింది చెప్తా వినండి. మీ అందరికీ ఇటుక అంటే ఏమిటో తెలుసు. తెలీని వాళ్ళు చేతులు ఎత్తండి.’’ దాదాపు అంతా చేతులు ఎత్తారు. ‘‘గుడ్. ప్రభుత్వం చేతికి ఇటుకని ఇస్తే ఇది వాటిని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తుందో చూడండి. దీన్నిబట్టి ప్రభుత్వం అంటే ఏమిటో మీకు తెలిసిపోతుంది.’’ వెంటనే ఆవులింత శబ్దాలు ఆగిపోయాయి. (కాలేజీలో నాలుగు గాడిదలు ఏవో తెలుసా?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ * కపీస్, మర్కట్. వానర్ పేర్లు త్రీమంకీస్కు ఎంతగానో ఇమిడాయి. కలలో ఫేస్బుక్లో స్టేటస్ మార్చడం చివరి కోరికగా వానర్ చెప్పటం సహజసిద్ధ హాస్యాన్ని పండించింది. నవ్విస్తూ చదివిస్తున్న మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి అభినందనలు. - కటుకోఝ్వుల రమేష్, ఇల్లందు, ఖమ్మం జిల్లా. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గురించిన కామెడీ వివరణ నాకు బాగా నచ్చింది.సీరియల్ ఫన్నీగా ఉంది. - సాయి కీర్తి ముత్యాల (mutyalasaikeerthi@gmail.com) -
త్రీ మంకీస్ - 18
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 18 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ఓ ధనవంతుడు ప్రధానమంత్రి అవచ్చని నెహ్రూ ఋజువు చేశాడు. ఓ బీదవాడు ప్రధానమంత్రి అవచ్చని లాల్‌బహదూర్ శాస్త్రి ఋజువు చేశాడు. ఓ మహిళ ప్రధానమంత్రి అవచ్చని ఇందిరాగాంధీ ఋజువు చేసింది. ఓ వృద్ధుడు ప్రధానమంత్రి అవచ్చని మొరార్జీ దేశాయ్ ఋజువు చేశాడు. ఓ చదువు రాని వాడు ప్రధానమంత్రి అవచ్చని చరణ్ సింగ్ ఋజువు చేశాడు. ఓ అసమర్థ పైలట్ ప్రధానమంత్రి అవచ్చని రాజీవ్ గాంధీ ఋజువు చేశాడు. ఓ రాజవంశీకుడు ప్రధానమంత్రి అవచ్చని వి పి సింగ్ ఋజువు చేశాడు. ఓ పండితుడు ప్రధానమంత్రి అవచ్చని పివి నరసింహారావు ఋజువు చేశాడు. ఓ కవి ప్రధానమంత్రి అవచ్చని వాజ్‌పేయ్ ఋజువు చేశాడు. ఎవరైనా ప్రధానమంత్రి అవచ్చని దేవెగౌడ ఋజువు చేశాడు. ఓ టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అవచ్చని మోడీ ఋజువు చేశాడు. భారతదేశానికి అసలు ప్రధానమంత్రి అవసరమే లేదని మన్మోహన్ సింగ్ ఋజువు చేశాడు.’’ గట్టిగా నవ్వులు, ఈలలు, చప్పట్లు. ‘‘మై డియర్ ఫ్రెండ్స్, నేనా మధ్య కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ముంబై వెళ్తూంటే ఎయిర్‌హోస్టెస్ సెల్‌ఫోన్స్‌ని ‘మన్మోహన్ సింగ్ మోడ్‌లో ఉంచమని’ ప్రకటించింది. అంటే ఏమిటో మీకు తెలుసు... మన్మోహన్ సింగ్ ఇప్పుడు తన ఆత్మకథని రాస్తున్నాడని తెలుసా? దాని పేరు? ఫోర్ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ : టు జి, త్రి జి, సోనియాజి, రాహుల్జి... సోనియా గాంధీ మన్మోహన్ సింగ్‌కి ఎస్సెమ్మెస్ పంపింది, విసుగ్గా ఉందని, ఏదైనా మంచి జోక్‌ని పంపమని! ‘ఇప్పుడు కుదరదు మేడం. నేను మంత్రిమండలి మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నాను’ అని జవాబు ఎస్సెమ్మెస్ పంపారు మన్మోహన్. వెంటనే సోనియాజీ నించి ఆయనకి ఇంకో ఎస్సెమ్మెస్ వచ్చింది - ‘చాలా మంచి జోక్. ఇంకోటి పంపండి’ అని! ‘‘మీరీ జోక్స్ ఎంజాయ్ చేస్తున్నారా?’’ సిద్ధాంత్ అడిగాడు. ‘‘యస్’’ చాలామంది అరిచారు. ‘‘గుడ్. రజనీకాంత్ జోకులు మీ అందరికీ తెలుసు. విలన్ పేల్చిన బుల్లెట్‌ని చేత్తో పట్టుకుని దాన్ని విలన్ మీదకే విసిరి చంపేది ప్రపంచంలో ఒక్క రజనీకాంతే. ఆయన్నించి జేమ్స్ బాండ్ చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అలాంటి రజనీకాంత్‌కి ప్రధానమంత్రి అవాలనే కోరిక గల ప్రణబ్ ముఖర్జీ ఓ సవాల్ విసిరాడు. ‘నేను చెప్పిన మూడిటిని లేపితే నువ్వు నేషనల్ హీరోవి అవుతావు. లేదా నేషనల్ జోక్వి అవుతావు.’ రజనీకాంత్ ఆ సవాలుని అంగీకరించాక ఎవరెస్ట్ దగ్గరకి తీసుకెళ్ళి దాని శిఖరాన్ని ఓసారి లేపి కింద పెట్టమని ప్రణబ్ ముఖర్జీ కోరాడు. మన రజనీకాంత్‌కి అదో లెక్కా? నిమిషంలో ఎడం చేత్తో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి బాబాలోని తన పెద్ద డైలాగ్‌ని చెప్పి దాన్ని యథాస్థానంలో ఉంచాడు. తర్వాత ఆల్ఫ్స్ పర్వతం దగ్గరకి తీసుకెళ్ళి దాన్ని ఓసారి ఎత్తమని ప్రణబ్ సవాల్ విసిరాడు. రజనీకాంత్ మళ్ళీ దాన్ని ఎత్తి అరుణాచలం సినిమాలోని పెద్ద డైలాగ్‌ని చెప్పి కింద ఉంచాడు. ‘ఈ రెండూ తేలికే. మూడోది చాలా కష్టం. దాంట్లో గెలిస్తే నువ్వు నేషనల్ హీరోవి అవుతావు’ అని మన్మోహన్ సింగ్ కూర్చున్న ప్రైమ్ మినిస్టర్ కుర్చీ దగ్గరకి తీసుకువెళ్ళి సింగ్ గారిని కుర్చీలోంచి లేపమని, ఆయన లేవగానే తను కూర్చోడానికి తయారుగా నిలబడ్డారు. ఎవరు? ప్రణబ్ గారు. ‘లే’ అంటూ ఎడం చేత్తో రజనీకాంత్ మన్మోహన్ చెయ్యి పట్టుకుని లాగాడు. ఊహు. లేపలేకపోయాడు. ఈసారి రెండు చేతులతో ఆయన చేతిని పట్టుకుని ఎత్తినా మన్మోహన్ సింగ్ లేవలేదు. ‘ఎత్తు నాయినా. ఎత్తు’ అని ఆయన గారు నవ్వారు. రజనీకాంత్ రెండు చేతులని సింగ్ గారి చంకల కిందకి పోనించి లేపే ప్రయత్నం చేశారు. రజనీకాంత్‌కి చమటలు కమ్మాయి తప్ప మన్మోహన్ సింగ్ మిల్లీమీటర్ కూడా కదల్లేదు. ‘ఏనుగులని మింగావా? పర్వతాలని ఫలహారం చేశావా?’ అని అరిచి ఎంత ప్రయత్నించినా రజనీకాంత్ ప్రైమ్ మినిస్టర్ సీట్లోంచి మన్మోహన్ సింగ్‌ని లేపలేకపోయాడు’’ మన్మోహన్ సింగ్ మీద మరికొన్ని పొలిటికల్ జోక్స్ చెప్పాక సిద్ధార్థ చెప్పాడు. ‘‘ఇరవయ్యవ శతాబ్దంలో రెండు దేశాలకి ఒకేరోజు స్వతంత్రం వచ్చింది. వాటిలోని ఓ దేశం మార్స్‌కి రాకెట్‌ని పంపింది. రెండో దేశం ఇంకా పక్క దేశంలోకి చొరబడాలనే ప్రయత్నిస్తూ విఫలం అవుతోంది... ముఖ్య అతిథి దారిలో ఉన్నారని తెలిసింది... ఈలోగా కొన్ని పొలిటికల్ సామెతలు చెప్తాను... పార్టీ పోరు, పార్టీ పోరు ఓటరు తీర్చాడు... గంజికి లేనమ్మకి గేస్స్టవ్ ఇచ్చినట్లు... అపోజిషన్ పార్టీ లీడర్ని ఎందుకు కలిశావంటే మన పార్టీ పరిస్థితి తెలుసుకోడానికన్నాట్ట... రాజకీయాల్లో తల దూర్చి రౌడీలకి భయపడితే ఎలా?... జగమెరిగిన జయప్రదకి రాజమండ్రి అయినా ఒకటే, రాంపూర్ అయినా ఒకటే... సీటు రాక సిట్టింగ్ ఎంఎల్ఏ ఏడుస్తూంటే రెబెల్ వచ్చి రాళ్ళేద్దాం రమ్మన్నాట్ట... సర్వేలు చేసి సన్న్యాసికి టికెట్ ఇచ్చినట్టు... పరుగెత్తి పక్క పార్టీలో చేరే కంటే, నిలబడి ఉన్న పార్టీలో ఉండటం మేలు... టికెట్ చిక్కిన వేళ, పదవి దక్కిన వేళ... దేశానికి అధినేత అయినా ఓటరుకు అభ్యర్థే. నక్సలైట్లతో నారాయణ! కుబేర్లతో గోవిందా! ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి...’’ ఒకతను స్టేజి మీదకి వచ్చి సిద్ధార్ధ చెవిలో ఏదో చెప్పి వెళ్ళాడు. (పూర్వం తల మీద టోపీని తీసి గౌరవాన్ని తెలిపేవారు. ఇప్పుడో?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ 1. ముగ్గురు టెక్ దొంగల పేర్లు టైటిల్‌కి జస్టిఫై అయ్యాయి. జైలర్ అటెన్డెన్స్ తీసుకునే సన్నివేశం కామెడీగా ఉంది. ట్రూలీ దిసీజ్ కామెడీ అండ్ థ్రిల్లర్. - క్రిష్ టి. (kittu.onair85@gmail.com) 2. కథనం చాలా ఆసక్తిగా ఉండి, నేటి యువతరం చదువు తర్వాత వారి ఆలోచనా సరళిని తెలియజేస్తోంది. ఈ సీరియల్ పుణ్యమా అని నేను పాతికేళ్ళు వెనక్కి వెళ్లాను... రచనల స్వర్ణయుగంలోకి! - టి. భాస్కర బాబు (babubhaskar04@gmail.com) -
త్రీ మంకీస్ - 17
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ - 17 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘చూస్తూండండి. వానర్! వెళ్ళి అందరికీ మళ్ళీ గ్లాసులు నింపుకురా’’ కపీష్ నర్మగర్భంగా చెప్పాడు. ‘‘నాకు ఐస్ ఒద్దు’’ మటర్కట్ చెప్పాడు. అతను ట్రేలో ఆ మూడు గ్లాసులని తీసుకెళ్ళి కోక్ని నింపుకుని రాగానే మేక్‌డొనాల్డ్స్ మేనేజర్ వీళ్ళ టేబిల్ దగ్గరకి వచ్చాడు. ‘‘చచ్చాం! నేను నింపుకోవడం చూశాడు. పోలీసులకి ఫోన్ చేస్తాడేమో?’’ వానర్ భయంగా చెప్పాడు. ‘‘వాడి వైపు చూడకండి’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఎక్స్క్యూజ్ మీ’’ ఆయన పలకరించాడు. అంతా మేకపోతు గాంభీర్యంతో అతని వంక చూశారు. ‘‘ఎలా ఉంది కోక్?’’ ‘‘కోక్ ఎప్పటి కోక్లానే తియ్యగా ఉంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఐస్?’’ ‘‘ఐస్ ఐస్‌లా చల్లగా ఉంది’’ మర్కట్ చెప్పాడు. ‘‘మీరు ఐస్ తక్కువ వేసుకున్నట్లున్నారు?’’ ‘‘లేదు. కరిగింది. ఐనా తాగాల్సింది చల్లటి కోక్ని కాని, చల్లటి నీళ్ళని కాదు కదా?’’ మర్కట్ చెప్పాడు. ‘‘మీకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కాని, ఫిర్యాదు కానీ లేదు కదా?’’ మేనేజర్ మర్యాదగా అడిగాడు. ‘‘లేదు.’’ ‘‘థాంక్స్. ప్లీజ్ కీప్ కమింగ్.’’ అతను వెనక్కి తిరిగి వెళ్ళాక ముగ్గురూ ఊపిరి పీల్చుకున్నారు. ‘‘పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సి రావచ్చని భయపడి చచ్చాను’’ వానర్ చెప్పాడు. కపీష్ జేబులోంచి చేతి రుమాలు తీసిముక్కుకి అడ్డం పెట్టుకుని కిందకి చూశాడు. వానర్ చుట్టూ నేల మీద చిన్న మడుగు. పేంట్ తడిసి ఉంది. ‘‘ఏమిటీ పని?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘‘భయపడితే నాకిలా అవుతుందని ఇప్పుడే తెలిసింది గురూ.’’ ‘‘పనైందిగా. ఇంక లేవండి’’ కపీష్ లేస్తూ చెప్పాడు. ఆరోజు హైద్రాబాద్‌లో పటాన్‌చెరువులోని ఆ ఇంజనీరింగ్ కాలేజిలోని వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంది. సీనియర్ విద్యార్ధులకి జూనియర్లు సెండాఫ్ చెప్పే వేడుక కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతోంది. ముఖ్యఅతిథి రావడానికి ఇంకా టైం ఉండటంతో ఫ్యాన్సీ డ్రన్ వేడుక తర్వాత సెకండియర్ విద్యార్ధి సిద్ధాంత్ జోక్స్ చెప్తాడనే ప్రకటన వినపడగానే చాలామంది ఆనందంగా చప్పట్లు కొట్టారు. కొందరు విజిల్స్ కూడా వేశారు. అంతా చెవులకి ఉన్న హెడ్ ఫోన్స్‌ని ఉత్సాహంగా తీసేశారు. అతను వచ్చి మైక్‌లో చెప్పాడు. ‘‘హలో జూనియర్స్, సీనియర్స్, ఫెలో స్టూడెంట్స్, లేడీస్ అండ్ లేడీస్ అండ్ ఎవ్విరిబడీ! దిసీజ్ యువర్ సిద్ధూ టెలింగ్ యు ది జోక్స్... ఆరతి! నీకొక్కదానికే కాదు డార్లింగ్... అందరికీ చెప్తున్నాను... మరేం లేదు. మన కాలేజీలో నన్ను సిద్ధూ అని పిలిచేది ఒక్క ఆరతే... చీకట్లో. ముందుగా కొన్ని పొలిటికల్ జోక్స్ చెప్తాను. దానికి ముందుగా ఇది మీరు తప్పనిసరిగా వినాలి. యూరప్‌లో స్పెయిన్ దేశం ఉంది. జిందగీ న మిలేగీ దుబారా చూశారుగా...’’ కొన్ని ఈలలు వినపడ్డాయి. ‘‘ఆ స్పెయిన్‌లో బార్సిలోనా ఉంది. ఆ నగరంలో టీట్రెన్యూ అనే కామెడీ క్లబ్ ఉంది. అక్కడి ప్రభుత్వం నాటకాల మీద వినోదపు పన్నుని ఎనిమిది నించి ఇరవై ఒక్క శాతానికి పెంచడంతో... బహుశ మన ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీనే సలహా ఇచ్చి ఉంటారు... ఏమిటీ? చిదంబరమా?... వీటిలో ఆయన ఎక్కువ సమర్థుడు కాబట్టి చిదంబరం సలహా మీద ఏడాదిలో టిక్కెట్ల అమ్మకాలు ముప్ఫై శాతం తగ్గాయి. దాంతో టీట్రెన్యూ కామెడీ క్లబ్ ‘పే-పర్-లాఫ్’ అనే కొత్త కాన్సెప్ట్‌ని కనుక్కొంది. నాటకశాలలో ప్రతీ సీన్ ముందు ప్రేక్షకుడి మొహంలోని చిరునవ్వుని గుర్తించే ఓ ఎలక్ట్రానిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంని అమర్చారు. అది మనిషి నవ్వినప్పుడల్లా లెక్క కడుతుంది. ప్రవేశం ఉచితం. వారి ప్రదర్శన ప్రేక్షకుడిలో నవ్వులని సృష్టించకపోతే ఏం చెల్లించకుండా బయటకి వెళ్ళచ్చు. ఎన్నిసార్లు నవ్వితే అన్ని ముప్ఫై యూరో సెంట్లు చెల్లించాలన్న నిబంధనతో తమ నాటకాలని ప్రదర్శించసాగారు. అలా సగటున ప్రతీ ప్రేక్షకుడు ఓ నాటకానికి ఆరు యూరోలని చెల్లిస్తున్నాడు. మీడియా కవరేజ్ వల్ల ముప్ఫై ఐదు శాతం ప్రేక్షకులు పెరిగారు. ఒకో నాటకానికి ఇరవై ఎనిమిది వేల యూరోలు వసూలవుతున్నాయట! అదృష్టవశాత్తు మీరు బార్సిలోనాలో లేరు. నేను చెప్పే జోక్‌లకి మొహమాటపడకుండా నవ్వండి. మీ నవ్వులని కొలిచే ఎలక్ట్రానిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ఈ ఆడిటోరియంలో అమర్చలేదు. నవ్వినందుకు మీ ఆస్తిని ఎవరికీ రాసివ్వక్కర్లేదు. కాబట్టి మజా చేయండి. గట్టిగా పోటీపడి నవ్వండి.’’ ఆ ఓపెనింగ్ తమకి నచ్చినట్లుగా కొందరు ఈలలు వేశారు. ‘‘సరే. పొలిటికల్ జోక్స్‌తో మొదలెడతాను. పొలిటికల్ జోక్ అనగానే మనకి గుర్తొచ్చేది ఖచ్చితంగా మన మాజీ ప్రధానమంత్రి. మన మాజీ ప్రధానమంత్రుల్లో అధికంగా జోక్స్‌కి అర్హుడు ఎవరో మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. (పొలిటికల్ జోక్స్ అనగానే గుర్తొచ్చే ప్రధానమంత్రి ఎవరో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!) మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com లెటర్స్ మల్లాది గారి ‘3 మంకీస్’ సీరియల్ ఆకర్షణీయమైన పేర్లతో, అబ్బురపరిచే సన్నివేశాల మేళవింపుతో కామెడీ-థ్రిల్లర్‌గా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ‘పాఠకుల అభిరుచి మారింది. ప్రముఖ రచయితలు అందరూ అస్త్రసన్యాసం చేశారు’ అని రచనల పరంపరను కొనసాగించలేక, అభియోగాన్ని పాఠకుల మీదకు నెట్టి పక్కకు తప్పుకున్నది రచయితలు మాత్రమే. ఆసక్తికర రచనలు చేస్తే పాఠకులు ఎప్పుడూ చదువుతారని ఈ సీరియల్ నిరూపిస్తోంది. ఇలాంటి రచనలను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యానికి పాఠకులందరి తరఫున కృతజ్ఞతలు. మున్ముందు కూడా సాక్షిలో సీరియల్ సీక్వెన్స్ కొనసాగుతుందని, కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ... - యంజర్లపాటి కమలాకర్‌రెడ్డి, ఖమ్మం -
త్రిమంకీస్
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 16 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘దీన్నిబట్టి నాకోటి అర్థమైంది’’ వానర్ చెప్పాడు. ‘‘ఏమిటి?’’ కపీష్ అడిగాడు. ‘‘ఎవరైనా తమ బెస్ట్ఫ్రెండ్స్ని కలుసుకోవాలనుకుంటే జైలుకి వెళ్ళాలి.’’ ‘‘నాలుగో గాడిద ఏమైంది?’’ మర్కట్ కపీష్‌ని ప్రశ్నించాడు. ‘‘అవును. నాలుగో గాడిద ఏమైంది?’’ వానర్ కూడా ప్రశ్నించాడు. వాళ్ళా ప్రశ్నలు అడిగింది వారి నాలుగో మిత్రుడి గురించి అనుకుంటే పొరపాటే. అసలు ఈ ముగ్గురూ కూడా గాడిదలు అనుకుంటే పొరపాటే. వాళ్ళని వాళ్ళు గాడిదలుగా భావించడం లేదు. ఆ నాలుగో గాడిద గురించి తెలుసుకోవాలనుకుంటే, ఓ ఏడాది వెనక్కి వెళ్ళాలి. ఏడాది క్రితం ఎక్కడికి? ముందుగా వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని మేక్‌డొనాల్డ్స్ రెస్టరెంట్లోకి! తర్వాత కాలేజీ లోకి! 5 ‘‘మన దగ్గర తైలం ఉందా?’’ మెక్‌డొనాల్డ్స్ రెస్టరెంట్ బయట నిలబడ్డ కపీష్ మిగిలిన ఇద్దరు మిత్రుల్నీ అడిగాడు. ‘‘ఎంత?’’ ‘‘ఓ ఒన్ ఫిఫ్టీ. మూడు కోక్స్కి.’’ ‘‘లేదు’’ ఇద్దరూ చెప్పారు. ‘‘ప్లాన్ ఏ ఫెయిలైంది. సరే. పదండి. తాగుదాం.’’ ‘‘నీ దగ్గర డబ్బుందా?’’ మర్కట్ అడిగాడు. ‘‘లేదు. ప్లాన్ బి ఉంది. పదండి.’’ ముగ్గురిలోకి తెలివైన కపీష్ దారిలోని రెండు టేబిల్స్ మీద ఉన్న ట్రేల్లోని రెండు ఖాళీ కోక్ గ్లాస్‌లని తీసుకుని, మిత్రులకి ఇచ్చి చెప్పాడు. ‘‘వెళ్ళి ఫౌంటెన్‌లో నింపుకుని రండి.’’ తర్వాత ట్రాష్ బిన్లో చేతిని ఉంచి లాఘవంగా ఇంకో డిస్పోజబుల్ కోక్ గ్లాస్‌ని తీసుకుని అందులోని ఐస్‌ని ఆ బిన్లో కుమ్మరించాడు. వాళ్ళ వెనక నిలబడి తన వంతు రాగానే కోక్ని నింపుకున్నాడు. ‘‘భలే ట్రిక్’’ వానర్ కోక్ని రుచి చూసి చెప్పాడు. ‘‘ఇది ఇక్కడే సాధ్యం. మనం కోక్ అడిగితే వాళ్ళు డబ్బు తీసుకుని ఖాళీ గ్లాస్‌ని ఇస్తారు. ఫౌంటెన్లోంచి నింపుకోవాలి. తర్వాత ఆ ఖాళీ గ్లాస్‌ని వెనక్కి తీసేసుకోరు. వాటిని మళ్ళీ ఎన్నిసార్లు నింపుకున్నా ఎవరూ ఏమీ అనరు. ఈ సిస్టమ్‌లోని లోపాన్ని పట్టేసాను. ఇదే ప్లాన్ బి’’ కపీష్ చెప్పాడు. ‘‘ముగ్గురం మూడు ఏభై రూపాయలు ఆదా చేశాం’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు. ముగ్గురూ కూర్చున్నాక ఎమ్మెస్ అలర్ట్ రాగానే మర్కట్ మెసేజ్ ఎక్కడ నించో చూశాడు కాని దాన్ని చదవకపోవడంతో వానర్ అడిగాడు. ‘‘ఏం మెసేజ్?’’ ‘‘నా బేంక్ నించి బేలన్స్ తెలియచేస్తూ ఎస్సెమ్మెస్ వచ్చింది. దాన్ని చూడను. నా అకౌంట్లో ఎంత లేదో తెలుస్తుందని భయం’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఇవాళే మన కాలేజీ ఆఖరి రోజు’’ వానర్ విచారంగా చెప్పాడు. ‘‘అవును. అందుకేగా ఇవాళ ప్రిన్సిపాల్ కాలేజీ ఆడిటోరియంలో మనందరికీ స్పీచ్ ఇస్తున్నాడు.’’ ‘‘కాలేజీ నించి బయటకి వెళ్ళాక మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?’’ కపీష్ తన ఇద్దరు మిత్రులని అడిగాడు. ‘‘ముందుగా నీది చెప్పు’’ వానర్ కోరాడు. ‘‘ఎస్సై ఉద్యోగం సంపాదించడం’’ కపీష్ జవాబు చెప్పాడు. ‘‘ఇంజనీరింగ్ చదివి ఎస్సై ఉద్యోగమా?’’ మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఇప్పటికే చాలామంది ఇంజనీర్లు ఎస్సైలయ్యారని తెలీదా? నీ ప్లాన్ ఏమిటి?’’ కపీష్ వానర్ని అడిగాడు. ‘‘పిడబ్ల్యుడిలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ట్లో చేరాలని! జీతం కోసం కాదు... పై సంపాదన కోసం. నువ్వు చెప్పు భాయ్’’ వానర్ మర్కట్‌ని అడిగాడు. ‘‘కోటీశ్వరుడు అవ్వాలని. నా ముప్ఫై ఐదో ఏడు వచ్చేలోగా ఓ ఐదు కోట్లు సంపాదించాలని. కుదిరితే డాలర్లు. లేదా కనీసం రూపాయలు.’’ ‘‘బావుంది.’’ వానర్ మెచ్చుకున్నాడు. ‘‘మనం కోటీశ్వరుడు కావడానికి జస్ట్ ఒక్క స్టెప్ దూరంలో ఉన్నాం’’ కపీష్ చెప్పాడు. ‘‘ఏమిటా స్టెప్?’’ మర్కట్ అడిగాడు. ‘‘మనం ఓ కోటిని సంపాదించాలి.’’ ‘‘కాని అందుకు ఒకటే సమస్య’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఏమిటది?’’ వానర్ అడిగాడు. ‘‘కోట్లు సంపాదించడం తేలికే కాని పోలీసులతో సమస్య వస్తుంది.’’ ‘‘ప్రతి సమస్యకీ ఓ పరిష్కారం ఉంటుందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నాడు. కాబట్టి ఆ పరిష్కారం కనుక్కుంటే అది సాధ్యమే అంటాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఈ ఆఖరి రోజు మనం అందరికీ గుర్తుండి పోయేలా గోల చేయాలి’’ కపీష్ చెప్పాడు. ‘‘ప్రిన్స్‌పాల్ స్పీచ్ ఇస్తూండగా మన పేర్లు రాసిన కాగితం విమానాలు ఆయన మీదకి వేేన్త సరి. విసిరింది మనమని తెలిసినా కాలేజీ నించి ఇక డిస్మిస్ చెయ్యలేడుగా?’’ ‘‘అది ప్రైమరీ స్కూల్ వాళ్ళు చేేన అల్లరి. మనం గ్రాడ్యుయేట్ విద్యార్ధి స్థాయిలో అల్లరి చేయాలి’’ కపీష్ చెప్పాడు. ‘‘అంటే?’’ (పే-ఫర్-లాఫ్ కాన్సెప్ట్ అంటే?) - మళ్లీ రేపు ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3ఝౌజుజ్ఛీట.ట్చజుటజిజీఃజఝ్చజీ.ఛిౌఝ లెటర్స్ The names of the three monkeys are very different and their robberies are quite unexpected and humourous which make a reader curious. Thanks to Malladi sir. - Sowjanya Reddy (sowjanyareddy155@gmail.com) త్రీ మంకీస్ సీరియల్ స్టోరీ బావుంది. ముగ్గురు మిత్రులు కలిశాక ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఉంది. - దేవేందర్ నాయక్, (devendar.nayak75@gmail.com) -
త్రీ మంకీస్ - 15
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 15 - మల్లాది వెంకటకృష్ణమూర్తి దుర్యోధన్ గార్డ్ వెనకే నడిచాడు. ‘‘సర్. నేనోటి అడగచ్చా?’’ గార్డ్ సందేహిస్తూ అడిగాడు. ‘‘ఏమిటో చెప్తే అడగచ్చో, లేదో చెప్తాను.’’ ‘‘మీకు దుర్యోధన్ అనే పేరు మీ పెద్దలు పెట్టిందా? లేక ఇంకెవరైనా పెట్టిందా అని అడగచ్చా?’’ ‘‘అడగచ్చు. అడుగు.’’ ‘‘సార్. మీకు దుర్యోధన్ అనే పేరు మీ పెద్దలు పెట్టిందా? లేక ఇంకెవరైనా పెట్టిందా?’’ ‘‘ఎవరూ పెట్టలేదు. నేనూ పెట్టుకోలేదు. మా నాన్నే ఆ పేరు పెట్టాడు.’’ ‘‘దేనికని అడగచ్చా సార్?’’ ‘‘అడగచ్చు. అడుగు.’’ ‘‘దేనికి మీ నాన్న మహాభారతంలోని ఓ విలన్ పేరు మీకు ఎందుకు పెట్టారు?’’ ‘‘మా నాన్న మహాభారతం చదవలేదు. చూడలేదు. ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఈ ఎన్టీఆర్ కాదు. ఇతన్ని పుట్టించిన బాబుని పుట్టించిన ఎన్టీఆర్ అభిమాని. ఆయన నటించిన డివిఎస్ కర్ణ చూసి మూర్ఛపోయి నాకీ పేరు పెట్టారు.’’ ‘‘డివిఎస్ కర్ణ? అంటే?’’ ‘‘దాన వీర శూర కర్ణ. అందులో ఆయన దుర్యోధనుడిగా నటించిన తీరు చూసి మా నాన్న నాకా పేరు పెట్టారు.’’ ‘‘మీ అన్న పేరు సర్?’’ ‘‘మీ అన్న పేరు అడగచ్చా అని అడగాలి.’’ ‘‘మీ అన్న పేరు అడగచ్చా సర్?’’ ‘‘అడగచ్చు. అడుగు.’’ ‘‘మీ అన్న పేరు సర్?’’ ‘‘రావణ్.’’ ‘‘ఆ పేరుకీ ఓ చరిత్ర ఉందాండి అని అడగచ్చా?’’ ‘‘అడగచ్చు. ఉంది. మా నాన్న ఎన్టీఆర్ నటించిన సీతారామకళ్యాణం, భూకైలాస్లు చూశాడు. వాటిలో రావణుడిగా నటించిన ఎన్టీఆర్ నటనని చూసి మూర్ఛపోయాడు. ఆయన నటనతో ఆ పాత్రల మీద అభిమానం ఏర్పడి మా అన్నకి స్ట్టైల్గా రావణ్ అనే పేరు పెట్టాడు.’’ ఇద్దరూ జైలు ఆవరణలోని ఆరుబయటకి చేరుకున్నారు. అక్కడ ఓ వైపు రిమాండ్ ఖైదీలంతా వరసగా నిలబడి ఉన్నారు. దుర్యోధన్ ఆ వరసలోకి వెళ్ళి నిలబడ్డాడు. అతను రాగానే జైలర్ విజిల్ ఊది రోల్ కాల్ పిలవసాగాడు. ‘‘అంతా వచ్చేసినట్లేనా?’’ ‘‘వచ్చేసినట్లే’’ కొందరు జవాబు చెప్పారు. ‘‘రాని వారు చేతులెత్తండి... వెరీ గుడ్. ఎవరూ చేతిని ఎత్తలేదంటే ఎవరూ సెల్స్‌లో లేరన్నమాట... నంబర్ ఫైవ్ సిక్స్ త్రి ఎయిట్.’’ ‘‘ప్రజెంట్ సార్’’ ఓ జేబు దొంగ ఓ అడుగు ముందుకి వేసి చెప్పాడు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ త్రి నైన్.’’ ‘‘ఎస్సార్’’ ఓ చెయిన్ స్నాచర్ ముందుకి ఓ అడుగు వేసి చెప్పాడు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో.’’ ‘‘హాజర్ సాబ్’’ ఇళ్ళకి కన్నం వేసేదొంగ ఓ అడుగు ముందుకు వేసి చెప్పాడు. అక్కడికి కొద్ది దూరంలో ఆడ ఖైదీలు నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర రక్షణగా ఉన్న మహిళా గార్డ్ ఇటువైపు చూస్తే, తన వంకే కళ్ళప్పగించి చూసే మర్కట్ కనిపించాడు. ఆమె తన వంక చూడగానే అతను చిరునవ్వు నవ్వాడు. ఆమె ముందు సందేహించినా తర్వాత నవ్వింది. అతను చేతిని ఊపాడు. ఆమె బదులుగా చేతిని ఊపలేదు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఒన్’’ జైలర్ తర్వాతి నంబర్ పిలిచాడు. ఎవరూ ముందుకు రాలేదు. హాజరు పలకలేదు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఒన్... కపీష్’’ తన పేరు వినగానే కపీష్ ముందుకి ఓ అడుగు వేసి చెప్పాడు. ‘‘ప్రజెంట్ సార్. పేరు పెట్టి పిలుస్తారనుకున్నాను.’’ ‘‘ఇక్కడ పేర్లుండవు. అందుకే నంబర్లు ఇచ్చారు. నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు... నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు...’’ మళ్ళీ ఎవరూ ముందుకు రాలేదు. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ టు... మర్కట్.’’ ‘‘ప్రజెంట్ సార్.’’ ‘‘నీకూ ప్రత్యేకంగా చెప్పాలా, పేర్లుండవు, నంబర్లకే హాజరు పలకాలని? మీ ఇంజనీర్ క్లాసుల్లో నంబర్లు పిలిచేవారా లేక పేర్లా? నాకు తెలీకడుగుతున్నాను చెప్పు.’’ ‘‘మేం క్లాస్‌కి వెళ్ళకపోయినా మా హాజరు ఇంకెవరైనా పలికేవారు సార్. ఇక్కడా అంతే అనుకున్నాను.’’ అప్పటికే కపీష్, మర్కట్ ఒకర్ని మరొకరు చూసుకున్నారు. ఇద్దరి మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది. ‘‘నంబర్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రి సర్. వానర్ సార్. ఉన్నాను సర్’’ వానర్ ముందుకి ఓ అడుగేని చెప్పాడు. కపీష్, మర్కట్లు అతన్ని చూశారు. అతనూ వీళ్ళ వంక చూశాడు. మళ్ళీ అందరి మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది. ‘‘లైన్ డిస్మిస్డ్ ఎవరైనా సరే, పారిపోయే ప్రయత్నం చేస్తే చర్మం ఒలుస్తా. వెళ్ళండి. ఎందుకు నవ్వుతున్నావు?’’ జైలర్ వానర్ వంక చూస్తూ కోపంగా అడిగాడు. ‘‘ఏం లేదు సార్. నథింగ్.’’ ‘‘నథింగ్? నథింగ్? లాఫ్టర్ ఈజ్ ది బెస్ట్ మెడిసన్. బట్ వెన్ యు లాఫ్ వితౌట్ రీజన్ యు నీడ్ మెడిసన్. చీల్చేస్తాను జాగ్రత్త. యు ఆర్ ఆల్ డిస్మిస్డ్ వెళ్ళండి.’’ అందరి హాజరు పూర్తవడంతో జైలర్ హాజర్ పుస్తకంతో వెళ్ళిపోయాడు. అంతా తమ తమ సెల్స్‌కి వెళ్ళసాగారు. కాని ఆ ముగ్గురు యువకులూ కదల్లేదు. ఒకరివైపు మరొకరు అడుగులు వేశారు. తర్వాత ముగ్గురూ ఒకేసారి ఆనందంగా అరిచారు. ‘‘హుర్రే.’’ ముగ్గురూ ఒకరిని మరొకరు ఆనందంగా కౌగిలించుకున్నారు. (మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో ముగ్గురు మిత్రులు కోక్ని ఎలా సంపాదించారు?) -
త్రీ మంకీస్ - 9
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 9 - మల్లాది వెంకటకృష్ణమూర్తి అక్కడ కోక్ దొరికింది. దాన్ని తాగుతూ టేబిల్ మీది దినపత్రికలో ఆ వేన్ దొంగతనం గురించి చదివాడు. టో అండ్ టో షూస్ కంపెనీ వారు దొంగతనాన్ని అరికట్టడానికి కుడి, ఎడమ బూట్ల జతలని విడదీసి విడివిడిగా రవాణా చేస్తారు. దొంగలు అవి నిరుపయోగం అని గ్రహించాక వాటిని వదిలేస్తారని, ఈ సందర్భంలో సరిగ్గా ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ వేన్ ఎక్కడ విడిచిపెట్టబడిందో కూడా రాశారు. దొంగలు ఆ వేన్‌ని సంకరజాతి పశువుల వారి కార్యాలయం ముందు వదిలి వెళ్ళారు. తను చేసిన మొదటి దొంగతనం నించి మంచి పాఠాన్ని నేర్చుకున్నాడని మర్కట్ అనుకున్నాడు. లేచి కోకోకోలా టిన్ని చెత్త బుట్టలో వేసేదాకా తనని, తన కాళ్ళని అక్కడ కూర్చున్న ఓ వ్యక్తి తదేకంగా గమనిస్తున్నాడని మర్కట్కి తెలీదు. తర్వాత అతని వైపు తిరిగి అడిగాడు. ‘‘ఏమిటి? చూస్తున్నావ్?’’ ‘‘బావున్నాయి. ఆ బూట్లెక్కడివి?’’ అతను ప్రశ్నించాడు. ‘‘టో అండ్ టో కంపెనీ షూస్కంపెనీ ఫ్యాక్టరీ నించి బయటికి వచ్చాయి.’’ ‘‘ఏ షాపులో కొన్నావు?’’ ‘‘లాభం లేదు. ఇలాంటి ఇంకో జత అక్కడ లేదు. నేను అమ్మను.’’ ‘‘నేనూ కొనదలచుకోలేదు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. సిఐడి.’’ అతను జేబులోంచి తన ఐడెంటిటీ కార్డుని చూపించి చెప్పాడు. ‘‘ఈ బూట్లు ధరించడం నేరం అని నాకు తెలీదే?’’ మర్కట్ ఆశ్చర్యంగా చెప్పాడు. ‘‘ఈ బూట్లు ధరించడం నేరం.’’ అతను వెంటనే తన జేబులోంచి ఓ పరికరాన్ని బయటికి తీశాడు. అలాంటివి మర్కట్ జేమ్స్ బాండ్ సినిమాలో చూశాడు. ఆ సినిమాలో లాగానే అందులోని ఎర్ర లైటు ఆరి వెలుగుతూ తను తొడుక్కున్న బూట్ల వైపు బాణం గుర్తు చూపిస్తోంది. ‘‘అటు, ఇటు నడు’’ సిఐడి కోరాడు. మర్కట్ ఎటు నడిస్తే ఆ బాణం గుర్తు అటు వైపు చూపించసాగింది. ‘‘ఉహు. అమ్మకపోవడమే కాదు. నా బూట్లని దాంతో ఎక్స్చేంజ్ కూడా చేయను.’’ చెప్పి వెళ్ళబోయే మర్కట్ కాలర్ని అతను పట్టుకుని ఆపాడు. అంతదాకా ఆ షాపు బయట అడుక్కునే గుడ్డి బిచ్చగాడు, వాడి అసిస్టెంట్లు కూడా వచ్చి మర్కట్ చేతులని పట్టుకున్నారు. ‘‘ఏమిటీ దౌర్జన్యం?’’ మర్కట్ నివ్వెరపోతూ అడిగాడు. ‘‘నువ్వు చదివిన ఈ వార్తలో రాయనిది నేను చెప్తా విను. టో అండ్ టో కంపెనీ వారు తాము రవాణా చేసే ప్రతీ బూట్ల వేన్లో ఓ మామూలు జత బూట్లని కూడా ఉంచుతారు. దాని సోల్లో అమర్చిన ఎలక్ట్రానిక్ జిపిఎస్ని ఈ రిసీవర్ ట్రేస్ చేసి కనుక్కుంటుంది. ఇదంతా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ద్వారా జరుగుతుంది.’’ ‘‘నాకు తెలీదు. నేను ఎలక్ట్రానిక్ ఇంజనీర్ని కాను. మెకానికల్ ఇంజనీర్ని’’ మర్కట్ నీరసంగా చెప్పాడు. మర్కట్ సెల్‌లోకి వెళ్ళాక గార్డ్ తలుపు మూసి బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. కింది బెర్త్‌లో కూర్చున్న ఒకతను సిగరెట్ కాలుస్తున్నాడు. అతను తల తిప్పి మర్కట్ వంక పరీక్షగా చూసి అడిగాడు. ‘‘ఏం నేరం?’’ ‘‘చెప్పుల దొంగతనం’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఏ గుళ్ళో? అలాంటి వారినీ పోలీసులు పట్టుకుంటున్నారా?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘నేనంత నీచంగా కనిపిస్తున్నానా? చెప్పుల వేన్‌ని దొంగిలించి పట్టుబడ్డాను. నా పేరు మర్కట్. నీ పేరు?’’ ‘‘ఏం పేర్లో? ఏమిటో? నా పేరు వేమన. దొంగ నోట్ల చలామణి. పాకిస్థాన్‌లో ప్రింటైన దొంగ నోట్లని కన్యాకుమారికి వెళ్ళి కొనుక్కొచ్చి మారుస్తూంటాను. పై బెర్త్త్ నీది.’’ ‘‘పాకిస్థాన్‌లోనా? ఐతే కాశ్మీర్ కాదా వెళ్ళేది?’’ ‘‘కాదు. కాశ్మీర్లో దొంగ నోట్ల కోసం పోలీసులు వెదుకుతారు కాని కన్యాకుమారిలో వెదకరు కదా.’’ ‘‘పాయింటే. జైల్లో జీవితం బావుంటుందా?’’ చిన్నగా నిట్టూర్చి సిగరెట్ మసిని నేల మీద రాల్చి చెప్పాడు. ‘‘మన మనసే ఓ జైలు. దాన్లోంచి బయట పడితే ఇంకా ఎక్కడైనా బావుంటుంది.’’ మళ్ళీ నిట్టూర్చి అడిగాడు. ‘‘బ్రహ్మం ఒక్కటా? రెండా?’’ ‘‘నాకవి తెలీవు. చెప్పినా వినను.’’ పై బెర్త్ మీదకి ఎక్కి పడుకున్నాడు. ‘‘విక్టర్ హ్యూగో అబద్ధం రాశాడు’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఆయనెవరు?’’ వేమన అడిగాడు. ‘‘ఫ్రెంచ్ రచయిత.’’ ‘‘ఏం అబద్ధం రాశాడు?’’ ‘‘ఇద్దరు జైలు కిటికీలోంచి చూస్తే ఒకడికి నక్షత్రాలు కనిపిస్తే ఇంకొకడికి మట్టి కనిపించిందని రాశాడు. జైల్లో అసలు కిటికీలే లేవు’’ మర్కట్ చెప్పాడు. ‘‘ఏం నక్షత్రాలో? ఏం మట్టో. అన్నీ పంచభూతాల నిర్మితమేగా?’’ మర్కట్కి అతను వేదాంతి అని అర్ధం అయింది. మళ్ళీ చెప్పాడు - ‘‘మార్క్ టై్వన్ కూడా అబద్ధం చెప్పాడు.’’ ‘‘ఆయనెవరు?’’ ‘‘అమెరికన్ రచయిత.’’ ‘‘ఏం అబద్ధం చెప్పాడు?’’ ‘‘స్కూల్ తలుపులోంచి లోపలకి వెళ్ళిన వారు జైలు తలుపులోంచి లోపలకి వెళ్ళరు అని.’’ ‘‘వాళ్ళు కూడా ఇక్కడే ఏదో సెల్స్‌లో ఉండి ఉంటారు’’ వేమన చెప్పాడు. 3 చీకటి పడుతూండగా సిఐ ఆ సందులో ‘సస్టిస్ భవన్’ అని రాసి ఉన్న ఇంటి ముందు పోలీన్ వేన్ దిగాడు. ఆ ఖరీదైన ఇంటి బయట షామియానా వేసి ఉంది. లోపలి నించి మంగళ వాయిద్యాలు కూడా వినిపిస్తున్నాయి. ఓ ఇరవై మూడేళ్ళ ముద్దాయితో సిఐ లోపలికి నడిచాడు. (మేజిస్ట్రేట్ యమధర్మరాజు దగ్గరికి తీసుకురాబడ్డ మూడో మంకీ పేరేమిటి?) -
త్రీ మంకీస్ - 8
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 8 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘మా అన్నయ్య అలా తగలడ్డాడు సార్. నేనూ తగలడదామని బేంక్‌కి వెళ్తే మా అన్న లోన్ తీర్చలేదని వాళ్ళ రికార్డుల్లో ఉందట. దాంతో మా అన్న లోన్ని కడితేనే నాకు లోన్ ఇస్తామన్నారు సార్. అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్నాను.’’ ‘‘ఏ ఉద్యోగాలకో?’’ ‘‘కొరియర్ బోయ్, రోడ్లూడ్చేవాడు, ఇసుక మోసేవాడు... చెప్పులరిగేలా తిరిగినా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు సార్.’’ ‘‘నువ్వు పిడబ్ల్యుడిలోనో, జి హెచ్ ఎంసిలోనో ఇంజినీర్‌గా పనికొస్తావుగా?’’ ‘‘కాని ఎంపి, ఎంఎల్ఏ, కనీసం ఎంఎల్‌సి రికమండేషనైనా లేకపోతే అక్కడ ఉద్యోగాలు ఎలా వస్తాయి సార్? నేను వాళ్ళెవరికీ తెలియను.’’ ‘‘అందుకని?’’ ‘‘దాంతో ఉద్యోగానికి తిరిగి తిరిగి చెప్పులు అరిగాయి. వాటిని కొనే స్థోమత కూడా లేకపోవడంతో విధి లేక దొంగతనానికి దిగాను సార్.’’ ‘‘ఈ స్టేట్మెంట్ చదివే సంతకం చేశావా?’’ ‘‘అవును సార్.’’ ‘‘ఇందులో రాసిట్లుగానే నువ్వు దొంగతనం చేశావా?’’ ‘‘అవును సార్.’’ వెంటనే జైలర్ పకపక నవ్వి చెప్పాడు. ‘‘ఐతే నువ్వూ దురదృష్టవంతుడివే అన్నమాట. సరే. నేను ఇక్కడికి వచ్చే అందరికీ చెప్పే మాటలే చెప్తాను. ఇకనించి నువ్వు మా విశ్రాంతి గృహంలో అతిథివి. వెల్కం. ఇప్పుడు ఆ దొంగతనం ఎలా చేశావో నీ మాటల్లో చెప్పు.’’ ఆ రోజు మర్కట్ దగ్గర అతని జీవితాంతానికి సరిపడా డబ్బుంది. అతనేదైనా కొనాలనుకుంటే తప్ప. కోకోకోలా కేన్ని కొనాలనుకున్నాడు. కాని దొంగతనం చేేన్త కాని కోకోకోలా కేన్ కొనేందుకు కూడా డబ్బు లేదు. ‘అవుటాఫ్ మనీ ఎక్స్‌పీరియెన్స్’ ఉన్న అతను చాలామందిలా సందేహించలేదు. తక్షణం దొంగతనంలోకి దిగాడు. ఆ రాత్రి అతను దొంగతనం చేయడానికి గాయత్రి జూవెలరీ దుకాణం వైపు నడుస్తూంటే ఓ చెప్పుల షాపు బయట ఆగి ఉన్న ఓ వేన్ కనిపించింది. దాని మీది ప్రకటనని బట్టి అది ఆ దుకాణానికి చెప్పులని డెలివరీ చేయడానికి వచ్చిందని గ్రహించాడు. వేన్ మీద ఇలా పెయింట్ చేసి ఉంది. ‘కొనండి మా టో అండ్ టో జోళ్ళు. బై రైట్ సైడ్ షూ. గెట్ లెఫ్ట్ సైడ్ షూ ఫ్రీ.’ ఒకతను సెల్ఫోన్లో మాట్లాడేది విని మర్కట్ అతను దాని డ్రెవర్ అని గ్రహించాడు. ‘‘మీ గోడౌన్ ఎక్కడ? యాదగిరి వైన్స్ పక్క గల్లీలోనా? అదెక్కడుంది? అస్టోరియా రెస్టారెంట్ ఎదురుగానా? సరే. వస్తున్నాను. అక్కడే ఉండండి’’ అతను సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ ముందుకి కాలినడకనే సాగాడు. మర్కట్ ఆ వేన్ దగ్గరికి వెళ్ళి దాని వెనక తలుపు లాగాడు. తెరుచుకోలేదు. కేబిన్ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూసాడు. ఇగ్నీషన్ తాళంచెవి వేలాడుతూ కనిపించింది. అతను క్షణకాలం సందేహించాడు. కొద్దిసేపు ‘తనకి డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా ఆ వేన్‌ని డ్రైవ్ చేయచ్చా?’ అనే మీమాంసలో పడ్డాడు. ఆ నైతిక మీమాంసలోంచి బయట పడ్డాక ఇక సందేహించలేదు. వేన్ ఎక్కి దాన్ని స్టార్ట్ చేసి డ్రయివర్ వెళ్ళిన వైపు కాక దానికి వ్యతిరేక దిశలో వేన్‌ని పోనిచ్చాడు. ఓ కిలోమీటర్ దూరంలో ఓ డెడ్ ఎండ్ సందులో వేన్‌ని ఆపి తాళం చెవి తీసుకుని దిగి వెనక తలుపు తెరిచాడు. లోపల చీకటిగా ఉండడంతో తడిమి స్విచ్ ఆన్ చేశాడు. ఎదురుగా చెప్పుల పెట్టెలు ఒక దాని మీద మరొకటి పేర్చి కనిపించాయి. వెంటనే తన కాళ్ళ వంక చూసుకున్నాడు. అవి బోసిగా ఉన్నాయి. ఓ పెట్టెని అందుకుని తెరిచి అందులోని బూట్లని నేల మీద పడేశాడు. వాటి వంక చూస్తే నల్లరంగు బూట్లు. దాదాపు డజను పెట్టెల్లోంచి బూట్లని కింద పడేశాక అతను వెతికే బ్రౌన్ రంగు బూట్లు కనిపించాయి. అవి తన సైజో కాదో చూసుకోవాలని ఒంగి వాటిని అందుకుని కుడి కాలి బూటుని తొడుక్కున్నాడు. చక్కగా సరిపోయింది. తర్వాత ఎడమ కాలి బూటుని తొడుక్కోడానికి విశ్వ ప్రయత్నం చేసినా అది ఎక్కలేదు. దాన్ని పరీక్షగా చూస్తే అదీ కుడి కాలి బూటే! పేకర్లని తిట్టుకుంటూ కింద ఉన్న నల్ల బూటుని అందుకుని కుడి కాలికి తొడుక్కున్నాడు. అదీ సరిగ్గా సరిపోయింది. తర్వాత ఎడమ కాలి బూటుని తొడుక్కోబోతే పట్టలేదు. రెండు మూడు జతల బూట్లని తొడుక్కునే ప్రయత్నం చేశాక అనుమానం వచ్చి ఇంకొన్ని పెట్టెల్ని తెరిచి చూస్తే ప్రతీ పెట్టెలో కేవలం కుడి కాలి బూట్ల జతలే కనిపించాయి. ఓపికగా ఆ వేన్‌లోని ఐదు వందల అరవై నాలుగు పెట్టెలని తెరచి చూస్తే అతని అదృష్టం బావుండి ఓ పెట్టెలో మాత్రం కుడి, ఎడమ కాళ్ళ బూట్లు ఉన్నాయి. అది పేకర్ చేసిన పొరపాటు అనుకున్నాడు. వాటిని తొడుక్కుంటే అవి చక్కగా సరిపోవడంతో అటు, ఇటు నడిచి చూసి తృప్తి పడ్డాడు. ‘దీన్ని కుట్టినవాడికి నా పాదం సైజు ఎలా తెలుసో?’ అనుకున్నాడు. డేష్ బోర్డ్ వెదికితే నాలుగు పది రూపాయల నోట్లు కనిపించాయి. వాటిని జేబులో ఉంచుకున్నాడు. కోక్ ప్రియుడైన మర్కట్ మర్నాడు ఉదయం ఆ నాలుగు పది రూపాయల నోట్లతో ఓ సెల్ఫ్ సర్వీస్ రెస్టారెంట్లోకి వెళ్ళి అడిగాడు. ‘‘కోక్ కేన్ కావాలి.’’ ‘‘సారీ. పెప్సీ ఉంది. ఓకేనా?’’ కేషియర్ అడిగాడు. ‘‘నా దగ్గర మోనోపలీ ఆటకి వాడే డబ్బుంది. అది ఓకేనా?’’ సమీపంలోని అలాంటి ఇంకో రెస్టారెంట్‌కి వెళ్లాడు. బయట అడుక్కునే వాళ్ళు చేతిని చాపగానే అరిచాడు. ‘‘దుక్కల్లా ఉన్నారు. కూలి పని చేసుకోక ఏమిటిది?’’ (మర్కట్ పోలీసులకు పట్టుబడ్డ ఫన్నీ కారణం ఊహించగలరా?) -
త్రీ మంకీస్ - 6
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 6 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘ఓ కూతురు ఉంది సార్.’’ ‘‘సరే కేసు గురించి మీరు చెప్పండి.’’ యమధర్మరాజు భర్త వైపు లాయర్ని అడిగాడు. ‘‘నా క్లైంట్ భార్య అతని మీద గృహ హింస చట్టం 498ఏ కింద కేసు పెట్టింది. నిజానికి నా క్లైంట్‌కి హింస పడదు. గాంధీ గారి ఫాన్. సరిహద్దు గాంధీ గారి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు కూడా. అందువల్ల ఆయన మనసు బాధ పడింది. అహం దెబ్బ తింది. తన భార్యంటే అసహ్యం వేసింది. దాంతో విడాకులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నాడు. యువర్ ఆనర్. ఆ కారణంగా ఆయనకి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను’’ లాయర్ కోరాడు. ‘‘మై లెరెన్డ్ కౌన్సెల్. ఆ సెక్షన్ కింద బెయిల్ ఇవ్వకూడదని తెలీదా?’’ యమధర్మరాజు ఓపికగా చెప్పాడు. ‘‘విడాకులు అతని హక్కు యువర్ ఆనర్. అవి తీసుకోడానికి నా క్లైంట్ బయటకి రావాల్సి ఉంది యువర్ ఆనర్’’ లాయర్ చెప్పాడు. ‘‘దేనికి విడాకులు?’’ ‘‘మనసు బాధపడటంతో, అహం దెబ్బ తినడంతో, తన భార్య మీద అసహ్యం వేసి నిజానికి ఈ కేసులో ఇంకో ఇష్యూ కూడా ఉంది యువర్ ఆనర్.’’ ‘‘ఏమిటది?’’ ‘‘నా క్లైంట్ తన కిడ్నీని వెనక్కి కోరుతున్నాడు.’’ ‘‘సరిగ్గా విన్నానా? ఇడ్లీని వెనక్కి కోరడమేమిటి?’’ ‘‘వినలేదు యువర్ ఆనర్. కిడ్నీ అన్నాను.’’ ‘‘సిడ్నీ అన్నారా?’’ ‘‘కిడ్నీ అన్నాను యువర్ ఆనర్. రెండేళ్ళ క్రితం నా క్లైంట్ భార్య రెండు కిడ్నీలు పని చేయడం ఆగిపోయింది. ఆవిడ బిపి పేషెంట్. అందువల్ల కిడ్నీలు దెబ్బ తిన్నాయి. నా క్లైంట్‌కి తన భార్య మీద అప్పట్లో గల ప్రేమాభిమానాలతో తన రెండు కిడ్నీలలో ఒక దాన్ని ఆమెకి ఉచితంగా దానం చేశాడు.’’ ‘‘అబ్జెక్షన్ యువర్ ఆనర్. దానం అంటేనే ఉచితం అని. ఉచితంగా దానం ఏమిటి నా బొంద?’’ భార్య తరఫు లాయర్ అభ్యంతరం చెప్పాడు. ‘‘ఇదిగో నాయుడు. టెక్నికల్ పాయింట్ల మీద తప్ప ఇలాంటి వాటి మీద అభ్యంతరాలు ఒద్దని ఎన్నిసార్లు చెప్పాలి?’’ ‘‘ఆయన కథలు రాయడం వల్ల మనకీ పీడ యువర్ ఆనర్. సరే. నా క్లైంట్ కిడ్నీని డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ఆమెకి అమర్చారు. ఆమె తన మీద గృహహింస కేసు పెట్టిన కారణంగా ఆమె నించి విడాకులు తీసుకోబోతున్నాడు కాబట్టి తన వస్తువు తన భార్య దగ్గర ఉండటం ఇష్టం లేదు. కాబట్టి దాన్ని తిరిగి వెనక్కి ఇప్పించాల్సిందిగా నా క్లైంట్ కోర్టుని కోరుతున్నాడు.’’ ‘‘ఇది నిజమేనా? కిడ్నీ ప్రస్తుతం మీ క్లైంట్ దగ్గర ఉందా?’’ యమధర్మరాజు భార్య వైపు లాయర్ని అడిగాడు. ‘‘నిజమే సార్. ఉంది.’’ ‘‘అది తిరిగి ఇవ్వడానికి ఆమెకి అభ్యంతరం ఉందా?’’ ‘‘ఉంది యువర్ ఆనర్.’’ ‘‘ఏమిటా అభ్యంతరం?’’ భర్త తరఫు లాయర్ భార్య వైపు లాయర్ని ప్రశ్నించాడు. ‘‘నేను ఇక్కడే ఉన్నాను. అది నేను అడగాల్సిన ప్రశ్న. ఏమిటా అభ్యంతరం?’’ యమధర్మరాజు చిరాగ్గా చెప్పాడు. ‘‘ఆమె డయాలసిస్‌లో ఉండగా ఆమె భర్త ఆమెకి కిడ్నీని డొనేట్ చేశాడు. ఇప్పుడు ఆమె శరీరం నించి దాన్ని వేరు చేస్తే ఆమెకి మరణం తప్పదు. కాబట్టి అది హత్యాప్రయత్నం కిందకి వస్తుంది యువర్ ఆనర్’’ భార్య తరఫు లాయర్ చెప్పాడు. ‘‘దీనికి మీరేమంటారు?’’ యమధర్మరాజు భర్త తరఫు లాయర్ని అడిగాడు. ‘‘కాని అతని క్లైంట్ ప్రాణాలు యమధర్మరాజు చేతిలో తప్ప నా క్లైంట్ చేతుల్లో లేవు యువర్ ఆనర్’’ భర్త వైపు లాయర్ చెప్పాడు. ‘‘నా చేతుల్లోనా?’’ యమధర్మరాజు ఉలిక్కిపడి అడిగాడు. ‘‘అంటే ఆయన చేతుల్లో’’ చేతిని పైకి చూపిస్తూ భర్త తరఫు లాయర్ చెప్పాడు. ‘‘ఐసీ’’ యమధర్మరాజు పైకి చూసి ఆ కేసు ఫైల్లో ఏదో రాసుకున్నాడు. ‘‘అంతే కాక నా క్లైంట్ ఆమెకి కిడ్నీ దానం చేశాడు కాని ప్రాణదానం చేయలేదు. తను దేంతో పుట్టాడో దాన్నే, కేవలం తనకి చెందినదాన్ని, అదీ గతంలో ఉచితంగా ఇచ్చిన దాన్నే నా క్లైంట్ కోరుతున్నాడు. అది సబబు. అది న్యాయం.’’ లాయర్ చెప్పాడు. ‘‘అది సబబు కాదు. అది అన్యాయం’’ రెండో లాయర్ చెప్పాడు. ‘‘యువర్ ఆనర్. ఆమె అది తనదే అన్నట్లుగా ఇవ్వననడం న్యాయం కాదు. కొన్నది ఏదైనా తనది అవుతుంది. కిడ్నీని తను కొన్నదా? బిల్ లేదా ఇన్‌వాయిస్‌ని చూపించమనండి. కొనలేదు. కాబట్టి వాటిని చూపించలేదు. పోనీ బహుమతిగా పొందిందా? గిఫ్ట్ డీడ్ని చూపించమనండి. లేదు. పోనీ కేవలం అప్పుగా తీసుకుంది అనుకుందాం. నిజానికి ఆ కిడ్నీకి ఆమె వడ్డీగా ఇంకో చిన్న కిడ్నీని కూడా కలిపి ఇవ్వాలి. కాని నా క్లైంట్ దయగల వాడు కాబట్టి వడ్డీని మాఫీ చేసి కేవలం తను అప్పుగా ఇచ్చిన తన కిడ్నీనే వెనక్కి ఇవ్వమని కోరుతున్నాడు’’ లాయర్ చెప్పాడు. ‘‘ఇదన్యాయం. అక్రమం.’’ ‘‘పోస్టాఫీస్‌లో మనిఆర్డర్ ఫారం రాయడానికి ఇచ్చిన రెండు రూపాయల పెన్నునే తిరిగి అడుగుతాం. అలాంటిది పది లక్షల ఖరీదు చేేన కిడ్నీని ఉచితంగా ఏ తలకి మాసినవాడూ ఇవ్వడు.’’ ‘‘దాని ధర పది లక్షలా? పది లక్షలు ఇస్తుందేమో నా క్లైంట్‌ని అడుగుతాను. వాయిదా కోరుతున్నాను’’ భార్య వైపు లాయర్ చెప్పాడు. ‘‘ఊహూ. నా క్లైంట్ దాన్ని అమ్మనని చెప్పాడు. అమ్మినా తన భార్యకి అసలు అమ్మనని చెప్పాడు. రైట్స్ ఆఫ్ ఎడ్మిషన్ రిజర్వ్డ్. మై క్లైంట్ డిమాండ్స్ హిజ్ కిడ్నీ బేక్’’ ఆఖరిలో ప్రతీ ఇంగ్లీష్ పదం బల్ల గుద్దుతూ చెప్పి లాయర్ తన ఆర్గ్యుమెంట్‌ని ముగించాడు.