Devatha : రుక్మిణి నిర్ణయంతో దేవుడమ్మ ఆగ్రహం.. | Devatha : Rukmini Feels Heartbroken As Devudamma Rejects Her Plea | Sakshi
Sakshi News home page

Devatha : రుక్మిణి నిర్ణయంతో దేవుడమ్మ ఆగ్రహం..

Published Thu, Jul 8 2021 3:07 PM | Last Updated on Thu, Jul 8 2021 3:16 PM

Devatha : Rukmini Feels Heartbroken As Devudamma Rejects Her Plea - Sakshi

సత్యకు న్యాయం జరగాలని రుక్మిణి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇదే విషయాన్ని దేవుడమ్మతో ప్రస్తావించగా..సత్యకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేస్తానని, ఏ లోటు రానివ్వనని దేవుడమ్మ మాటిస్తుంది. అయితే అది మాత్రమే కాదని,సత్యకు తన పెనిమిటికి పెళ్లి చేయాలని రుక్మణి తన మనసులో మాటను చెప్పేస్తుంది. దీనికి దేవుమ్మ ఏమని బదులిచ్చింది? సత్యను కోడలుగా అంగీకరిస్తుందా అన్నది తెలియాలంటే ఎపిసోడ్‌లో ఎంటర్‌ అవ్వాల్సిందే. దేవత సీరియల్‌ జులై8న 280వ ఎపిసోడ్‌ నాటి విశేషాలను తెలుసుకుందాం.

 
సత్య జీవితం బావుండాలని, ఇందుకు ఆదిత్యతో పెళ్లి ఒక్కటే పరిష్కారమని రుక్మిణి బలంగా నమ్ముతుంది. ఇదే విషయాన్ని దేవుడమ్మతో చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. తన చెల్లికి న్యాయం ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తుంది. ఇందుకు బాదులుగా సత్యకి అన్యాయం అయితే జరగదని దేవుడమ్మ బదులిస్తుంది. ఇందుకు గాను సత్యతో పాటు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు కావాల్సిన సదుపాయాలు,డబ్బు వంటి విషయాల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని మాటిస్తుంది. మరి సత్య బిడ్డకు తండ్రి ఎలా అన్న రుక్మిణి ప్రశ్నకు దేవుడమ్మ సందేహిస్తుంది. తప్పులు మీరు చేసి నన్ను పరిష్కారం అడుగుతున్నారా అని అంటుంది. అయితే ఇందుకు ఒకటే దారని, అది సత్యకు, ఆదిత్యకు పెళ్లి చేయాలని రుక్మిణి చెప్తుంది.

ఇది విన్న దేవుడమ్మ కోపంతో ఊగిపోతుంది. అసలు బుద్ది ఉందా ఇలా మాట్లాడానికి అంటూ రుక్మిణిపై కోప్పడుతుంది. ఇలా ఎప్పటికీ జరగదని తెగేసి చెప్పేస్తుంది. మరోవైపు సత్యను తీసుకెళ్లడానికి భాగ్యమ్మ వస్తుంది. ఇక్కడే ఉంటే సమస్యలు ఎక్కువ అవుతాయని, తనతో పాటు ఇంటికి తీసుకెళ్తానని పేర్కొంటుంది. దీనికి రుక్మిణి అడ్డుచెప్పగా, భాగ్యమ్మ మాత్రం వెనక్కి తగ్గదు. ఇక సత్య ఇల్లు దాటి వెళ్తే మన పరువే పోతుందని సూరి దేవుడమ్మకు చెప్తాడు. కనకం తన భర్తతో వచ్చి నానా గొడవ చేస్తుందని, అప్పుడు ఇంటి పరువు వీధికెక్కుతుందని పేర్కొంటాడు. మరి సూరి మాటలకు దేవుడమ్మ ఏకీభవించి సత్యను ఇంట్లోనే పెట్టుకుంటుందా లేక బయటకు పంపిస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement