Devatha Daily Serial
-
Mansi Joshi: 'దేవత' సీరియల్ నటి నిశ్చితార్థం (ఫోటోలు)
-
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్ నటి
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే దేవత సీరియల్ నటి వైష్ణవి ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పిన ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి తరచూ కొత్త వీడియోలతో ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. తాజాగా ఆమె కొత్త వీడియో రిలీజ్ చేస్తూ ఫాలోవర్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది. చదవండి: నిర్మాతలతో అలా ఉంటేనే హీరోయిన్లకు అవకాశాలు: నటి షాకింగ్ కామెంట్స్ తాను తల్లి కాబోతున్నానంటూ శుభవార్త పంచుకుంది. కొద్ది రోజులుగా తన యూట్యూబ్ చానల్లో ఎలాంటి అప్డేట్ ఇవ్వని వైష్ణవి.. తాజాగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెబుతూ అసలు విషయం చెప్పేసింది. ‘మా ఇంట్లోకి ఓ కొత్త మెంబర్ రాబోతున్నారు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఇంతకాలం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా వేయిట్ చేసిన అనంతరం ఇప్పుడు మీతో ఈ గుడ్‌న్యూస్ పంచుకుంటున్నా’ అని పేర్కొంది. అలాగే తన ఆరోగ్యం కూడా బాగుండటం లేదని, ఏం తిన్న వాంతులు అవుతున్నాయని చెప్పుకొచ్చిది. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. ఇంట్లో అందరు ప్రతి రెండు, మూడు గంటలకు తిను తిను అంటూ ఇబ్బంది పెడుతున్నారంంది. అనంతరం ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతినని తెలిపింది. అంతేగాకు ప్రెగ్నెన్సి సమయంలో తల్లిగా తను పాటించాల్సి జాగ్రత్తలు ఎంటనేవి కూడా కామెంట్స్ రూపంలో సూచించాలని, మీ అందరి సహకారం కావాలంటూ ఫాలోవర్స్‌ను కోరింది. ఆమె షేర్ చేసిన ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వైష్ణవి తల్లి కాబోతుందని తెలిసి ఆమె ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన 'దేవత' సీరియల్ నటి
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే దేవత సీరియల్ నటి వైష్ణవి ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే! సురేశ్ అనే వ్యక్తితో త్వరలోనే ఏడడుగులు నడవనుంది. తాజాగా వైష్ణవి తన యూట్యూబ్ చానల్లో నిశ్చితార్థపు వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమె నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. కాబోయే దంపతులు దండలు మార్చుకుని ఇద్దరూ ఉంగరాలు తొడుక్కుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, బుల్లితెర సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేశారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు వచ్చినవాళ్లతో పాటు వీడియో చూసి తమను ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది వైష్ణవి. కాగా వైష్ణవి దేవత సీరియల్లో సత్య పాత్రతో ప్రేక్షకులకు చేరువైంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ధారావాహిక నుంచి తప్పుకుంది. చదవండి: ఫోన్ చేస్తే బిజీ.. ఆరేళ్ల తర్వాత వేరొకరితో అలా... అఖిల్ బ్రేకప్ స్టోరీ ఏడేళ్ల లవ్.. బావ అనుమానించాడు: అరియానా బ్రేకప్ స్టోరీ -
ఘనంగా 'దేవత' సీరియల్ నటి ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
దేవత సీరియల్‌తో పాపులర్ అయిన నటి వైష్ణవి గాదే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. శనివారం ఆమె ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హైదరాబాదాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సన్నిహితులు, కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు హజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా బుల్లితెరపై పాపులర్ సీరియల్స్‌లో ఒకటైన దేవత సీరియల్లో సత్య పాత్ర ద్వారా వైష్ణవి బాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో కొన్ని నెలల క్రితమే ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. అంతేకాకుండా ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఆ సమయంలో ఆమెను బ్యాన్ చేశారంటూ పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తల్లో నిజం లేదంటూ వైష్ణవి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. -
Devatha : రుక్మిణి నిర్ణయంతో దేవుడమ్మ ఆగ్రహం..
సత్యకు న్యాయం జరగాలని రుక్మిణి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇదే విషయాన్ని దేవుడమ్మతో ప్రస్తావించగా..సత్యకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేస్తానని, ఏ లోటు రానివ్వనని దేవుడమ్మ మాటిస్తుంది. అయితే అది మాత్రమే కాదని,సత్యకు తన పెనిమిటికి పెళ్లి చేయాలని రుక్మణి తన మనసులో మాటను చెప్పేస్తుంది. దీనికి దేవుమ్మ ఏమని బదులిచ్చింది? సత్యను కోడలుగా అంగీకరిస్తుందా అన్నది తెలియాలంటే ఎపిసోడ్లో ఎంటర్ అవ్వాల్సిందే. దేవత సీరియల్ జులై8న 280వ ఎపిసోడ్ నాటి విశేషాలను తెలుసుకుందాం. సత్య జీవితం బావుండాలని, ఇందుకు ఆదిత్యతో పెళ్లి ఒక్కటే పరిష్కారమని రుక్మిణి బలంగా నమ్ముతుంది. ఇదే విషయాన్ని దేవుడమ్మతో చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. తన చెల్లికి న్యాయం ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తుంది. ఇందుకు బాదులుగా సత్యకి అన్యాయం అయితే జరగదని దేవుడమ్మ బదులిస్తుంది. ఇందుకు గాను సత్యతో పాటు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు కావాల్సిన సదుపాయాలు,డబ్బు వంటి విషయాల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని మాటిస్తుంది. మరి సత్య బిడ్డకు తండ్రి ఎలా అన్న రుక్మిణి ప్రశ్నకు దేవుడమ్మ సందేహిస్తుంది. తప్పులు మీరు చేసి నన్ను పరిష్కారం అడుగుతున్నారా అని అంటుంది. అయితే ఇందుకు ఒకటే దారని, అది సత్యకు, ఆదిత్యకు పెళ్లి చేయాలని రుక్మిణి చెప్తుంది. ఇది విన్న దేవుడమ్మ కోపంతో ఊగిపోతుంది. అసలు బుద్ది ఉందా ఇలా మాట్లాడానికి అంటూ రుక్మిణిపై కోప్పడుతుంది. ఇలా ఎప్పటికీ జరగదని తెగేసి చెప్పేస్తుంది. మరోవైపు సత్యను తీసుకెళ్లడానికి భాగ్యమ్మ వస్తుంది. ఇక్కడే ఉంటే సమస్యలు ఎక్కువ అవుతాయని, తనతో పాటు ఇంటికి తీసుకెళ్తానని పేర్కొంటుంది. దీనికి రుక్మిణి అడ్డుచెప్పగా, భాగ్యమ్మ మాత్రం వెనక్కి తగ్గదు. ఇక సత్య ఇల్లు దాటి వెళ్తే మన పరువే పోతుందని సూరి దేవుడమ్మకు చెప్తాడు. కనకం తన భర్తతో వచ్చి నానా గొడవ చేస్తుందని, అప్పుడు ఇంటి పరువు వీధికెక్కుతుందని పేర్కొంటాడు. మరి సూరి మాటలకు దేవుడమ్మ ఏకీభవించి సత్యను ఇంట్లోనే పెట్టుకుంటుందా లేక బయటకు పంపిస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : రుక్మిణికి షాక్..ఊహించని కోరికను బయటపెట్టిన సత్య
రుక్మిణి బయటపెట్టిన నిజంతో ఆదిత్య తల్లి ముందు దోషిగా నిలబడతాడు. నిజం ఏంటో చెప్పాలని దేవుడమ్మ దగ్గరకు వెళ్తాడు. అయితే అసలు ఆదిత్య ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా వినేందుకు దేవుడమ్మ సిద్ధపడదు. తన పెంపకంపై మచ్చ తీసుకువచ్చావంటూ ఆదిత్యపై నిందలేస్తుంది. కాళ్ల మీద పడి ప్రాధేయపడినా కనికరం చూపదు. సీన్‌కట్ చేస్తే.. ఎంత చెప్పినా వినకుండా నువ్వు అనుకున్నదే చేశావంటూ సత్య రుక్మిణిపై కోపంగా ఉంటుంది. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉందని చెప్తుంది. అదేంటో తెలియాలంటే ఎపిసోడ్లో ఎంటర్ అవుదాం. దేవత సీరియల్ జులై7న 279వ ఎపిసోడ్ నాటి విశేషాలను తెలుసుకుందాం. రుక్మిణి బయటపెట్టిన నిజంతో ఆదిత్య తల్లి ముందు దోషిగా మిగులుతాడు. ఇది జీర్ణించుకోలేకపోతున్న ఆదిత్య అసలు సత్యతో ఏం జరిగిందన్న నిజాన్ని దేవుడమ్మకు చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. తన తప్పు లేదని తల్లికి తెలియజేయాలని అనుకుంటాడు. అయితే ఆదిత్య చెప్పేది వినేందుకు దేవుడమ్మ నిరాకరిస్తుంది. ఇన్నాళ్లుగా పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావని అంటుంది. కొడుకు తప్పు చేశాడంటే, అందులో తల్లి పాత్ర కూడా ఉంటుందని, ఈ పాపంలో తననూ భాగం చేశావని చెప్తూ దేవుడమ్మ కన్నీటి పర్యంతం అవుతుంది. నిజానికి ఇందులో తన తప్పేం లేదని ఆదిత్య చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా దేవుడమ్మ వినడానికి సిద్ధపడదు. కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగానా కనికరం చూపదు. సీన్‌కట్ చేస్తే.. జరిగిన దాన్ని గుర్తు చేసుకొని సత్య బాధపడుతుంది. ఇలా జరగడానికి కారణం నువ్వే కదా అని రుక్మిణిని నిందిస్తుంది. ఎంత చెప్పినా వినకుండా నువ్వు చెయ్యాలనుకున్నదే చేశావ్ కదా అక్కా అంటూ రుక్మిణిని నిలదీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తన బిడ్డను ఈ ఇంటి వారసుడిగా చేయాలని సత్య కోరుతుంది. నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే ఇదొక్కటే పరిష్కారం అని బదులిస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను నీ బిడ్డగా చూసుకొని పెంచాలని సత్య రుక్మిణిని కోరుతుంది. మరోవైపు రుక్మిణి వద్ద నుంచి సాంత్వన పొందాలని ఆదిత్య భావించినా అవి కలలుగానే మిగిలిపోతాయి. తను ఎంతలా బాధపడుతున్నా రుక్మిణి ఆదిత్యను దగ్గరికి తీసుకోదు. సీన్ కట్ చేస్తే..తన ఇద్దరి కూతుళ్ల జీవితాలు ఇలా అయిపోయాయంటూ భాగ్యమ్మ బాధలో మునిగిపోతుంది. ఒకరికి న్యాయం చేస్తే..మరొకరు బలవుతారంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. -
Devatha : అలా ఎందుకు జరిగిందో వివరించిన ఆదిత్య..
నిజం తెలిసిన భాగ్యమ్మ తన కూతుళ్లకు ఇలా ఎందుకు జరిగిందంటూ బాధపడిపోతుంది. మరోవైపు ఈ పరిస్థితి నుంచి సత్యకు దారి చూపాలని రుక్మిణి భీష్మించుకుంటుంది. ఆదిత్య-సత్యలకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. దీంతో కమల , భాగ్యమ్మ షాక్ అవుతారు. అలా చేస్తే నీ జీవితం నాశనం అవుతుందని వివరిస్తారు. అయినా రుక్మిణి మాత్రం పట్టు వీడదు. తను అనుకన్నది చేస్తానని చెప్తుంది. మరోవైపు సత్యతో తనకున్న బంధం, తను గర్బవతి కావడం వంటి విషయాలను ఆదిత్య తన తండ్రికి వివరిస్తాడు. ఇది కేవలం తన ప్రాణాలు కాపాడటం కోసం సత్య చేసిన త్యాగమని, ఇందులో తప్పు లేదని చెప్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జులై 6న 278వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. రుక్మిణి బయటపెట్టిన నిజంతో ఇంట్లో అందరూ ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో చిక్కుకుపోయారు. తన ఇద్దరు కూతుళ్లకు ఇలాంటి పరిస్థితి దాపరించింది ఏంటి అంటూ భాగ్యమ్మ బాధలో మునిగిపోతుంది. మరోవైపు ఇప్పుడు ఏం చేయబోతున్నావ్ అంటూ రుక్మిణిని అడగ్గా..సత్య కోరుకుందే చేయాలని నిర్ణయించుకున్నా అని సమాధానమిస్తుంది. సత్యకు, ఆదిత్యలకు పెళ్లి చేస్తానని చెప్పడంతో కమల, భాగ్యమ్మ షాక్ అవుతారు. ఇలా చేస్తే నీ జీవితం ఏం కావాలంటూ ప్రశ్నిస్తారు. అయినప్పటికీ సత్య జీవితం నిలబడాలి అంటే ఇది చేయక తప్పదు అని రుక్మిణి తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తుంది. సీన్ కట్ చేస్తే..ఇంత తప్పు ఎలా జరిగిందంటూ ఈశ్వర్ ప్రసాద్ ఆదిత్యను నిలదీస్తాడు. దీంతో తాను అనారోగ్యం పాలైనప్పుడు సత్య చేసిన త్యాగాన్ని వివరిస్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తనను బతికించడానికి సత్య ఇలా చేసిందని, ఇందులో తమ తప్పు లేదని ఆదిత్య తన గతం గురించి వివరిస్తాడు. కేవలం తన ప్రాణాలు నిలబెట్టడానికి సత్య చేసిన ప్రయత్నమని చెబుతాడు. దీంతో ఆదిత్యను అర్థం చేసుకున్న ఈశ్వర్ ప్రసాద్ ఇదే విషయాన్ని దేవుడమ్మకు చెప్పమని కోరుతాడు. ఆదిత్య తన తల్లి వద్దకు వెళ్లి జరిగిన నిజం గురించి వివరించేందుకు ప్రయత్నించగా, దేవుడమ్మ వినడానికి సిద్ధపడదు. ఇప్పటిదాకా జరిగింది చాలని, ఇక తానేమీ వినాలనుకోవడం లేదని బదులిస్తుంది. కొడుకు చేసిన మోసాన్ని తట్టుకొని కుమిలిపోతుంది. మరోవైపు ఆదిత్యను ఓదార్చేందుకు రుక్మిణి ప్రయత్నిస్తుంది. సత్య గర్భవతి కావడంలో ఆదిత తప్పు లేదని తెలుసుకున్న రుక్మిణి మనసు మార్చుకుంటుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : ఆదిత్యకు షాక్ : దేవుడమ్మకు నిజం చెప్పేసిన రుక్మిణి
సత్య-ఆదిత్యల బంధంపై దేవుడమ్మకు అనుమానం కలుగుతుంది. నిజం చెప్పిన తర్వాతే తన ఇంటి నుంచి బయటకు కదలాలని సత్యపై హుకూం జారి చేస్తుంది. ఈ నిందను తన బిడ్డ ఎందుకు మోయాల్సి వస్తుందని ప్రశ్నిస్తుంది. సత్య క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మాట్లాడుతుంది. దీంతో రుక్మిణి నిప్పులాంటి ఆ నిజాన్ని బయటపెట్టేస్తుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం మరెవరో కాదు నీ కొడుకే అంటూ దేవుడమ్మకు బదులిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జులై 5న 277వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య-ఆదిత్యల బంధంపై దేవుడమ్మకు అనుమానం కలుగుతుంది. సత్య కడుపులో బిడ్డకు తన కొడుకుతో సంబంధం అట్టగట్టడంపై నిజం ఏంటో చెప్పాలంటూ సత్యను ఒత్తిడి చేస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో చెప్పి తీరాలని పేర్కొంటుంది. అయితే సత్య నోరు విప్పక పోవడంతో తన కోపాన్ని ప్రదర్శిస్తుంది. అబద్దాలు చెబుతూ ఏం సాధించాలనుకుంటున్నావ్ అంటూ సత్యను నిందిస్తుంది. గతంలో ఎవరినో తెచ్చి నా బిడ్డకు తండ్రి అని పరిచయం చేశావ్..ఇంత జరుగుతున్నా నోరు తెరవడం లేదంటే నిన్ను ఏ పేరుతో పిలవాలి అంటూ సత్య క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మాట్లాడుతుంది. దీంతో రుక్మిణి అడ్డుపడుతుంది. తన చెల్లి గురించి తప్పుగా మాట్లాడవద్దని ధీటుగా బదులిస్తుంది. సత్య మనసుపడింది, తన బిడ్డకు కారణం మరెవరో కాదు ఆదిత్యే అన్న నిజాన్ని బయటపెడుతుంది. దీంతో దేవుడమ్మ సహా ఇంట్లో వాళ్లందరూ షాక్‌కి గురవుతారు. అసలు ఏం జరిగిందో చెప్పడానికి ఆదిత్య ప్రయత్నించగా, దేవుడమ్మ వినేందుకు ఒప్పుకోదు. కన్నకొడుకు అంటే పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావని బాధపడుతుంది. నువ్వు కూడా నీ తండ్రి బాటలోనే నడిచావా అంటూ ఆదిత్య వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. మరోవైపు నిజం తెలిసి ఇన్ని రోజులు మోసం చేసిన సత్యను, ఆ నిజాన్ని కప్పిపుచ్చాలని చూసిన రుక్మిణిపై దేవుడమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రపంచంలో ఇలాంటి అక్కాచెల్లెళ్లు ఎవరైనా ఉంటారా అంటూ ఇద్దరిపై కోపం వెళ్లగక్కుతుంది. సీన్‌కట్ చేస్తే..దేవుడమ్మ లాంటి మంచి మనిషికి ఎందుకింత అన్యాయం చేశారంటూ భాగ్యమ్మ తన కూతుళ్లపై చిందులేస్తుంది. ఇలా ఎందుకు చేశారంటూ కన్నీటి పర్యంతం అవుతుంది. నిజం తెలుసుకున్న దేవుడమ్మ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : సూరికి తెలిసిపోయిన రుక్మిణి ప్రెగ్నెన్సీ విషయం
ఆదిత్యకు సత్యకు ఇచ్చి పెళ్లి చేయాలన్న తన నిర్ణయంపై రుక్మిని వెనక్కి తగ్గదు. సత ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తను చెప్పింది జరిగి తీరుతుందని చెబుతుంది. ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరని శపథం చేస్తుంది. సీన్‌కట్ చేస్తే రుక్మిణి ఆదిత్యతో ముభావంగా ఉండటాన్ని దేవుడమమతో పాటు రాజం కూడా గమనిస్తుంది. అలా ఎందుకు ఉంటుందోనన్న అనుమానం ఇద్దరిలో మొదలవుతాయి. మరోవైపు రుక్మిణి ఎవరికి చెప్పకుండా హాస్పిటల్‌కి వెళ్లడం సూరి గమనిస్తాడు. అంతేకాకుండా రుక్మిణి గర్భవతి అన్న నిజం తెలిసి షాక్ అవుతాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జూన్ 29న 272వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్యతో రుక్మిణి ముభావంగా ఉండటాన్ని దేవుడమ్మతో పాటు రాజం కూడా కనిపెడుతుంది. భర్తతో అలా ఎందుకు ఉంటున్నావంటూ ప్రశ్నించగా అదేం లేదంటూ రుక్మిణి దాటవేస్తుంది. సీన్ కట్ చేస్తే ఆదిత్యతో నీ పెళ్లి చేసి తీరుతానని రుక్మిణి సత్యతో శపథం చేస్తుంది. ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరని చెబుతుంది. సత్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కావాలని, అలా ఉంటేనే నీకు గౌరవం అంటూ సత్యను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయినా సత్య అందుకు అంగీకరించదు. మరోవైపు రుక్మిణి ఆదిత్యతో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తుంది. ఇది చూసిన సత్య వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉండటం చూసి నొచ్చుకొని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఈ ఒక్క కారణం చాలు నీకు, పెనిమిటికి పెళ్లి చేయడానికి అని రుక్మిణి భావిస్తుంది. సీన్‌కట్ చేస్తే రుక్మిణి ఎవరికీ చెప్పకుండా హాస్పిటలల్కి చెకప్‌కి వెళ్తుంది. అయితే అక్కడ రుక్మిణిని చూసిన సూరి ఆమె ఎందుకు వచ్చిందో తెలియక సందేహపడతాడు. డాక్టర్‌తో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తాడు. అయినా సరిగ్గా క్లారిటీ రాకపోవడంతో అక్కడ ఉన్న ఓ నర్సును కనుక్కుంటాడు. ఏం జరిగింది అని అడగ్గా..మొదట ఆమె చెప్పడానికి సందేహిస్తుంది. అయితే తన మాటలతో గారడి చేసిన సూరి నిజాన్ని తెలుసుకుంటాడు. రుక్మిణి గర్భవతి అన్న నిజం తెలిసి షాకవుతాడు. మరి ఈ విషయం దేవుడమ్మకు చెప్తాడా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : రుక్మిణిని మందలించిన దేవుడమ్మ
ఆదిత్యతో రుక్మిణి ప్రవర్తనపై దేవుడమ్మకు సందేహం కలుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నావంటూ నేరుగా రుక్మిణినే నిలదీస్తుంది. సత్యపై ప్రేమ ఉండటం తప్పులేదని, అలా అని భర్తను నిర్లక్ష్యం చేస్తే తాను సహించలేనని పేర్కొంటుంది. తన కొడుకు బాధ పడితే చూడలేనని చెప్పి తన బాధ్యతను గుర్తు చేస్తుంది. దీంతో దేవుడమ్మ అప్పుడే కనిపెట్టిందని, కానీ ఆమెను బాధపెట్టాలనుకోవడం తన ఉద్దేశం కాదని రుక్మిణి మనసులో అనుకుంటుంది. మరోవైపు సత్య-ఆదిత్యలు ఫోన్లో మాట్లాడుకోవడన్ని రుక్మిణి పసిగడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జూన్ 28న 271వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్యతో రుక్మిణి ప్రవర్తిస్తున్న తీరుకు విసుగుపోయిన దేవుడమ్మ రుక్మణిని పిలిచి మందలిస్తుంది. తన బిడ్డ సంతోషంగా లేకపోతే తాను తట్టుకోలేనని, ఆదిత్యతో సఖ్యతతో మెలగమని సూచిస్తుంది. సత్యపై ఒక అక్కగా చూపిస్తున్న ప్రేమను తాను అర్థం చేసుకోగలనని, అయితే తన కొడుక్కి ఏ లోటు లేకుండా చూడాల్సిన బాధ్యతను మరవద్దని చెప్పింది. బిడ్డకు జన్మనివ్వడం నీ బాధ్యత అన్న విషయం గుర్తుపెట్టుకోమని అంటోంది. దీంతో తన పెనిమిటితో మంచిగా ఉండటం లేదన్న విషయాన్ని అప్పుడే అత్తమ్మ గ్రహించిందని, కానీ ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని తలుచుకొని బాధపడుతుంది. ఇలాగే ఉంటూ సత్య, ఆదిత్యలను ఒక్కటి చేయాలని, అప్పుడే తన చెల్లికి న్యాయం జరుగుతుందని రుక్మిణి భావిస్తుంది. సీన్ కట్ చేస్తే రుక్మిణి అన్న మాటలను తలుచుకొని ఆదిత్య బాధపడుతాడు. సత్య కూడా ఇలాగే అనుకుంటుందేమోనని తనకు ఫోన్ చేస్తాడు. అయితే అక్క మనిద్దరిని ఒక్కటి చేసేవరకు ఊరుకోదని, దీన్ని ఎలా అయినా ఆపాలని సత్య ఆదిత్యతో అంటుంది. ఇక సత్య-ఆదిత్యల ఫోన్లో మాట్లాడుకోవడం చూసిన రుక్మిణి ఇలా అయినా తన చెల్లికి ఆదిత్య దగ్గరయితే అదే సంతోషమని సంబరపడుతుంది. సీన్ కట్ చేస్తే రుక్మిణి ఇల్లు శుభ్రం చేస్తూ కాలు జారి కింద పడిపోతుండగా, ఆదిత్య వచ్చి ఆమెను పట్టుకుంటాడు. అయితే ఆ సమయంలో రుక్మిణి ఆదిత్యతో దురుసుగా మాట్లాడటం దేవుడమ్మ చూస్తుంది. ఈ విషయంపై దేవుడమ్మ రుక్మిణిని నిలదీస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : రుక్మిణి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్న ఆదిత్య
రుక్మిణి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంపై ఆదిత్య బాధపడతాడు. అంతేకాకుండా ఈ విషయం దేవుడమ్మకు తెలిస్తే తట్టుకోలేదని, తనపై పెట్టుకన్న నమ్మకాన్ని వమ్ము చేయలేనని భావిస్తాడు. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉందని, ఈ ఊరు వదిలి వెళ్తేనే రుక్మిణి ఈ ఆలోచనల నుంచి బయట పడ్తుందని, దీనికి ఇదే పరిష్కారమని అనుకుంటాడు. ఇదే విషయాన్ని దేవుడమ్మతోనూ చెప్తాడు. చదువుకోడానికి హైదరాబాద్ వెళ్లాలని తన మనసులో మాటను బయటపెట్టేస్తాడు. అయితే ఇందుకు దేవుడమ్మ అంగీకరించదు. తన కోరికను నిజం చేసే పట్నం వెళ్లాలని ఆంక్షలు పెడుతుంది. దేవుడమ్మ అలా అనడానికి కారణమంటి అన్నది తెలియాలంటే ఎపిసోడ్‌లోకి ఎంటర్ అవ్వాల్సిందే..దేవత సీరియల్ జూన్ 26న 270వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత 270వ ఎనిసోడ్ : సత్యకు తనకు పెళ్లి చేయాలన్న రుక్మిణి నిర్ణయంపై ఆదిత్య బాధపడతాడు. ఒకవేళ నిజాన్ని తన తల్లి దేవుడమ్మకు తెలిసినా ఆమె తట్టుకోలేదని, మరోవైపు రుక్మిణి ఆలోచనల్ని అదుపుచేయలేనని అంటాడు. దీనికి ఒక్కటే పరిష్కారమని, రుక్మిణికి దూరంగా ఊరు వదిలి వెళ్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తాడు. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవ్వాలని, దానికోసం తాను హైదరాబాద్ వెళ్తానని ఆదిత్య దేవుడమ్మకు చెబుతాడు. అయితే మనవడిని ఎత్తుకోవాలన్నది తన కోరిక అని, మరో రెండు, మూడు నెలలు అయ్యాక వెళ్లమని దేవుడమ్మ చెబుతుంది. అయితే తాను ఇప్పుడే వెళ్లాలని ఆదిత్య ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా దేవుడమ్మ అందుకు అంగీకరించదు. ఇక మరోవైపు తన తల్లి గారింటికి వెళ్లిన రుక్మిణి,సత్యలను చూసి భాగ్యమ్మ చాలా సంతోషిస్తుంది. మామిడిపండు పులిహోర చేశానని చెప్పడంతో రుక్మిణి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. పుల్లటి పదార్థాలు రుక్మిణి ఎంతో ఇష్టంగా తినడం చూసి కమల, సత్యలకు అనుమానం వస్తుంది. కొంపదీసి నువ్వు నెల తప్పావా అని సత్య ప్రశ్నిస్తుంది. దీంతో షాక్ అయిన రుక్మిణి అదేం లేదని బదులిస్తుంది. సీన్ కట్ చేస్తే.. ఆదిత్య సడెన్‌గా పట్నం ఎందుకు వెళ్తానంటున్నాడో అని దేవుడమ్మ ఆలోచిస్తుంది. కొన్ని రోజులుగా రుక్మిణి-ఆదిత్యల ప్రవర్తనపై అనుమానం వస్తుంది. -
Devatha : సత్య-ఆదిత్యలను పెళ్లి చేసుకోవాలని కోరిన రుక్మిణి
సత్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా రుక్మిణి ఆదిత్యను కోరుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆదిత్య ఇంకోసారి ఇలాంటివి మాట్లాడొద్దని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సత్య కూడా తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని చెబుతుంది. ఇందుకు రుక్మిణి అడ్డుపడతుంది. మరోవైపు ఆదిత్యతో రుక్మిణి సరిగ్గా మాట్లాడకపోవడం లాంటివి దేవుడమ్మ కనిపెడుతుంది. వీరిద్దరి మధ్యా ఏం జరిగి ఉంటుంది అని ఆలోచనలో పడిపోతుంది. సీన్‌కట్ చేస్తే..హాస్పిటల్‌కు వెళ్లేటప్పుడు కూడా ఆదిత్యను తోడు తీసుకెళ్లకుండా దేవుడమ్మ అడ్డుపడుతుంది. రుక్మిణి-సత్యలను మాత్రమే వెళ్లాల్సిందిగా ఆదేశిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 25న 269వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్యతో మాట్లాడాలని చెప్పిన రుక్మిణి సత్య గదిలోకి రావడానికి ఎందకు భయపడుతున్నావ్ అని ప్రశ్నిస్తుంది. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని ఎందుకు ఆలోచిస్తున్నారంటూ కోప్పడుతుంది. దీనికి ఒకటే పరిష్కారం ఉందని, అది మీ ఇద్దరు ఒక్కటి కావాలని చెప్తుంది. ఆదిత్య సత్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా రుక్మిణి కోరుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆదిత్య ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగోదని తేల్చిచెప్పేస్తాడు. సత్య కూడా తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని చెప్పడంతో రుక్మిణి అడ్డుపడుతుంది. సీన్‌కట్ చేస్తే.. మృగశిర మాసం ప్రారంభం కానుండటంతో నువ్వుల నూనె రాసుకోవాలని దేవుడమ్మ ఆదిత్యకు చెబుతుంది. రుక్మిణిని పిలిచి నీ పెనిమిటికి నూనె రాయి అని చెప్పి, అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అయితే ఇందుకు రుక్మిణి ఒప్పుకోదు. దేవుడమ్మ వచ్చే సమయానికి అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో వీరిద్దరి మధ్యా ఏం జరిగి ఉంటుంది అని దేవడమ్మ సందేహిస్తుంది. సీన్‌కట్ చేస్తే..సత్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని రుక్మిణి చెప్పగ, అందుకు తన పర్మిషన్ అక్కర్లేదని చెప్తుంది. ఆదిత్యను తోడు తీసుకెళ్లబోతుంటే అందుకు దేవుడమ్మ అడ్డు చెబుతుంది. మిల్లు వద్ద పనులు ఉన్నాయని, అవి చూసుకోవాలని చెప్పి రుక్మిణి-సత్యలను వెళ్లమంటుంది. మరోవైపు రుక్మిణి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందని ఆదిత్య ఆలోచనలో పడిపోతాడు. మరి రుక్మిణి పడుతున్న ఆరాటం దేవుడమ్మ కనిపెడుతుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : రుక్మిణి ప్రవర్తనపై విసుగు చెందిన సత్య
రుక్మిణి సత్యపై అతి ప్రేమ కురిపిస్తుంటుంది. ఈ క్రమంలో ఆదిత్యను నిర్లక్ష్యం చేస్తుంది. ఇదే విషయంపై దేవుడమ్మ రుక్మిణిని నిలదీస్తుంది. మరోవైపు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని ఆదిత్యకు సలహా ఇస్తుంది. సీన్‌కట్ చేస్తే రుక్మిణి ప్రవర్తనపై సత్య కూడా ఇబ్బంది పడుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నావంటూ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవద్దని హితవు పలుకుతుంది. మరోవైపు ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెప్పి రుక్మిణి ఆదిత్యను సత్య గదిలోకి పిలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 24న 268వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్యను నిర్లక్ష్యం చేస్తూ రుక్మిణి సత్యపై అతి ప్రేమ చూపిస్తుంటుంది. దీన్ని గమనించిన దేవుడమ్మ సత్యపై ప్రేమ ఉండొచ్చు గానీ నీ భర్తను పట్టించుకోకపోవడం ఏంటని నిలదీస్తుంది. ఇక రుక్మిణి ప్రవర్తనను చూసి ఆదిత్య కూడా బాధపడతాడు. సీన్‌కట్ చేస్తే దేవుడమ్మ, ఈశ్వర్ ప్రసాద్ వెళ్లి ఆదిత్యకు నచ్చజెప్పుతారు. రుక్మిణి అలా చేసిందని మనసు నొచ్చుకోవద్దు అని చెబుతూనే, రుక్మిణిపై కోప్పడొద్దని చెబుతుంది. వారి ప్రేమకు ఇది అడ్డు రాకూడదని హితవు పలుకుతుంది. అయితే దేవుడమ్మ తనపై చూపిస్తున్న ప్రేమ, నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానని ఆదిత్య బాధపడతాడు. తన వల్ల ఇంత తప్పు జరిగినందుకు తనలో తానే మదనపడతాడు. మరోవైపు రుక్మిణి తనపై చూపిస్తున్న అతిప్రేమను చూసి సత్య చిరాకు పడుతుంది. ఆదిత్యను నిర్లక్ష్యం చేస్తూ ఏం సాధించాలనుకుంటున్నావ్ అని రుక్మిణిని నిలదీస్తుంది. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరుతుంది. ఇంతలోనే ఆదిత్య అక్కడకు వచ్చి తనను ఎందుకు పిలిచావని రుక్మిణిని అడుగుతాడు. ఇలా అమ్మ చూస్తే ఏం అనుకుంటుంది అని ప్రశ్నిస్తాడు. చూస్తే చూడని, ఎందుకు భయపడుతున్నావ్ పెనిమిటి అని రుక్మిణి బదులిస్తుంది. మరి రుక్మిణి ఆలోచన ఏంటి? సత్య- ఆదిత్యలను కలపాలన్న నిర్ణయాన్ని వాళ్లకు చెబుతుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : రుక్మిణి ప్రెగ్నెన్సీ.. సంతోషంలో ఆదిత్య
సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డ బావుండాలని కోరుకుంటూ రుక్మిణి ఆమెకు ప్రసాదం తెచ్చిస్తుంది. మరోవైపు రుక్మిణి వాంతులు చేసుకోవడం చూసి సత్య అనుమానం వ్యక్తం చేయగా అదేమీ లేదని రుక్మిణి బదులిస్తుంది. సీన్ కట్ చేస్తే తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని , అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సత్య ఆదిత్యను కోరుతుంది. రుక్మిణి వాంతులు చేసుకోవడం ఆ తర్వాత పుల్లటి మామిడికాయలు తినడం చూసి ఆమె గర్భవతి అయ్యిందంటూ దేవుడమ్మ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 22న 266వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవుడి ప్రసాదాన్ని తాను తినకండా రుక్మిణి సత్యకు ఇస్తుంది. ముడుపు దగ్గరనుంచి ప్రసాదం వరకు తనతోనే ఎందుకు చేయిస్తున్నావంటూ సత్య ప్రశ్నించగా..నీ కడుపులో బిడ్డ కోసం అని రుక్మిణి చెబుతుంది. ఇక సీన్ కట్ చేస్తే రుక్మణి వాంతులు చేసుకుంటుంది. దీంతో ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించి విషయం ఏమో అని సత్య అనుమానం వ్యక్తం చేయగా రుక్మిణి వాటిని ఖండించింది. అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. మరోవైసు రుక్మిణి తనపై చూయిస్తున్న ప్రేమానురాగాలకు సత్య భయపడిపోతుంది. ఎక్కడ తన జీవితం నాశనం చేసుకుంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని ఆదిత్యకు చెప్పి తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని, అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతుంది. సీన్‌కట్ చేస్తే రుక్మిణి వాంతులు చేసుకోవడం దేవుడమ్మ చూస్తుంది. ఏదైనా విశేషమే అని అడిగితే అదేమీ లేదని రుక్మిణి సమాధానమిస్తుంది. మరోవైపు ఈశ్వర్ ప్రసాద్ తోట నుంచి మామిడి పళ్లు తేగానే రుక్మిణి ఎంతో ఆతృతగా వాటిని తీసుకొని తింటుంది. దీంతో కోడలు నెల తప్పిందంటూ దేవుడమ్మ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆదిత్య కూడా అక్కడే ఉండటంతో విషయం తెలిసి సంతోషంలో మునిగితేలతాడు. థ్యాంక్యూ అంటూ రుక్మిణిని ఎత్తుకొని చాలా సంతోషిస్తాడు. అయితే అదేమీ లేదని, కేవలం మామిడి పళ్లతో పచ్చడి చేయడానికి తిని చూశానని రుక్మిణి చెప్పడంతో అందరూ నిరాశ చెందుతారు. మరి రుక్మిణి ప్రెగ్నెన్సీ విషయం సత్య తెలుసుకుంటుందా అని తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha :కనకం చెంప పగలకొట్టిన దేవుడమ్మ
రుక్మిణి- సత్యల మోసం గురించి దేవుడమ్మకు చెప్పాలని కనకం తెగా హడావిడి చేస్తుంది. అయితే అక్కడ సీన్ రివర్స్ కావడంతో బిక్కమొఖం వేసుకుంటుంది. అయినా తను చెప్పిందే నిజం అన్నట్లు వాదిస్తుంది. ఆ మాటల్లోనే సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆదేత్య తండ్రి అని చెప్పడంతో దేవుడమ్మ కనకం చెంప చెళ్లుమనిపిస్తుంది. తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినందుకు కనకంను ఇంట్లోంచి గెంటివేస్తుంది. ఇలాంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 21న 265వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. రుక్మిణి స్థానంలో సత్య వ్రతం చేయడాన్ని చూసి కనకం ఆశ్చర్యపోతుంది. ఈ విషయాన్ని దేవుడమ్మకు చెప్పాలని తెగ ఆరాటపడుతుంది. వెంటనే దేవుడమ్మను పిలిచి సత్య చేస్తున్న వ్రతం గురించి వివరిస్తుంది. కావాలంటే అక్కడికే వెళ్లి చూద్దామని చెప్తుంది. అయితే సరిగ్గా దేవుడమ్మ వచ్చే సమయానికి సీన్ రివర్స్ అవుతుంది. సత్య స్థానంలో రుక్మిణి పూజ చేస్తుంటుంది. దీంతో కనకంకు దిమ్మతిరిగిపోయింది. వీళ్లు కావాలని ఇలా చేస్తున్నారని, కావాలంటే పంతులును అడగాలని చెప్తుంది. అయితే ఆయన కూడా ప్లేటు మార్చేసి రుక్మిణికే అండగా నిలుస్తారు. దీంతో దేవుడమ్మ కనకంను తిట్టి పోస్తుంది. అయితే ఇందులో తన తప్పేమీ లేదని, అసలు సత్య కడుపులో పెరుగుతుంది ఆదిత్య బిడ్డే అన్నట్లు తనకు అనుమానంగా ఉందని చెప్తుంది. దీంతో దేవుడమ్మ కనకం చెంప చెల్లుమనిపిస్తుంది. తన కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తుంది. అయినా కనకం మాట వినకుండా ఆదిత్యే సత్య బిడ్డకు తండ్రి అంటూ వాదిస్తుండటంతో మరోసారి కనకంపై దేవుడమ్మ చేయిచేసుకుంటుంది. తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినందుకు గానూ వెంటనే ఇంట్లోంచి వెళ్లాలని ఆదేశిస్తుంది. అయితే తన వల్ల కనకం అత్తను బయటకు పంపొద్దని రుక్మిణి వేడుకున్నా దేవుడమ్మ అందుకు అంగీకరించదు. మరి ఇంట్లోంచి వెళ్లగొట్టినందుకు కనకం ఏం చేస్తుంది అనేది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : రుక్మిణి స్థానంలో వ్రతం చేసిన సత్య.. కనకం షాక్
సత్య గురించి రుక్మిణి అంతలా ఆలోచించడం ఏంటని దేవుడమ్మ ఆందోళన వ్యక్తం చేస్తుంది. సత్య జీవితం కోసం ఆలోచిస్తూ ఆదిత్యతో సంతోషంగా ఉండడం లేదని గుర్తిస్తుంది. ఇదే విషయాన్ని ఈశ్వర్ ప్రసాద్‌తో చెబుతుంది. సీన్‌కట్ చేస్తే రుక్మిణి చేయాల్సిన వ్రతాన్ని తను చేయకుండా చెల్లెలు సత్యను కూర్చోబెడుతుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ బావుండాలని, అందుకు ఈ వ్రతం చెయ్యమని కోరుతుంది. ఇక సత్య వ్రతంలో కూర్చోవడాన్ని చూసిన కనకం షాకవుతుంది.ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 19న 264వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత జూన్19 : సత్య చేసింది తప్పు అని తెలిసినా రుక్మిణి వెంటేసుకొని రావడాన్ని దేవుడమ్మ సహించదు. తన మాటను లెక్కచేయకుండా ఇంటికి తేవడం ఏంటని ఈశ్వర్ ప్రసాద్‌తో చర్చిస్తుంది. సత్య గురించి ఆలోచిస్తూ ఆదిత్యతో సఖ్యతగా లేకపోవడం, ఇద్దరి దాంపత్య జీవితానికి అడ్డుగా మారుతుందని ఆందోళన పడుతుంది. సీన్ కట్ చేస్తే పిల్లలు పుట్టాలని దేవుడమ్మ రుక్మిణితో చేయించాలనుకున్న వ్రతాన్ని సత్యతో చేయించాలని రుక్మిణి భావిస్తుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచి జరగాలని కోరుకుంటూ వ్రతం చేయాల్సిందిగా సత్యను కోరడంతో ఆమె షాకవుతుంది. తన మాటకు అడ్డు చెప్పకుండా చెప్పింది చేయాల్సిందిగా కోరుతుంది. దీంతో తన వల్ల రుక్మిణి-ఆదిత్యల జీవితం ఏమైపోతుందో అని సత్య కంగారు పడుతుంది. ఇలా జరగకూడదని, వెంటనే కమలకు ఫోన్ చేస్తుంది. తనకు ఈ ఇంట్లో ఉండాలనిపించడం లేదని, అయితే ఎక్కడకు వెళ్లనీయకుండా రుక్మిణి అడ్డుపడుతందని చెప్తుంది. దీంతో ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసని, ఎలాగోలా ఇంటికి వచ్చేయమని కమల చెబుతుండగా, భాగ్యమ్మ ఫోన్ తీసుకుంటుంది. అక్కడ ఉంటేనే బావుంటుందని, ఊళ్లోకి వస్తే అందరి మాటల భరించాల్సి వస్తుందని చెప్తుంది. సీన్ కట్‌చేస్తే వ్రతంలో తన స్థానంలో సత్యను కూర్చోబెడుతుంది. -
Devatha : ఆదిత్య మాటలకు షాక్ అయిన సత్య
రుక్మిణికి నిజం తెలిసిందని ఆదిత్య చెప్పడంతో సత్య షాకవుతుంది. ఇలా ఎందుకు చేశావంటూ ఆదిత్యపై కోప్పడుతుంది. సీన్ కట్ చేస్తే సత్య ఆదిత్యను ఏదో తిడుతున్నట్లు కనిపించిందని కనకం పసిగడుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడా అంటూ ఆదిత్యను రెచ్చగొడుతుంది. మరోవైపు సత్యను చూసిన రుక్మిణి ఆమె చెంప పగలకొడుతుంది. ఇలాంటి త్యాగం చేసి ఎవరిని ఉద్దరించాలనుకున్నావ్ అంటూ సత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పట్నుంచి నేను చేసే పనికి ఎందుకు, ఏమిటీ అడగకుండా ఉండాలని తను చెప్పిందే వినాలని సత్యచేత ప్రమాణం చేయించుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 15న 260వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత జూన్15వ ఎపిసోడ్ : రుక్మిణి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఏం జరిగిందంటూ సత్య ఆదిత్యను నిలదీస్తుంది. రుక్మిణి ఒంటిరిగా ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నిస్తుంది. దీంతో మన మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పేశానని ఆదిత్య చెప్పడంతో సత్య షాకవుతుంది. నిజం ఎందుకు చెప్పావంటూ కోప్పడుతుంది. ఇన్ని రోజులుఘేది జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని బాధపడుతుంది. రుక్మిణిని వెతికేందుకు వెళ్తుంది. ఇక ఆదిత్య పడుతున్న టెన్షన్ చూసి ఏం జరిగిందని కనకం ప్రశ్నిస్తుంది. ఆదిత్యను రెచ్చగొడుతూ మాట్లాడటంతో అతడు కనకంపై సీరియస్ అవుతాడు. సీన్ కట్ చేస్తే..రుక్మిణి సత్యకు కనిపించిన వెంటనే సత్య చెంప పగలకొడుతుంది. త్యాగం ఎప్పుడైనా ఒకరికి మంచికి ఉపయోగపడాలే తప్పా నాశనానికి కాదు అని హితవు పలుకుతుంది. దగ్గరుండి తన పెళ్లి చేసి ఇంత తప్పు ఇలా చేశావని నిలదీస్తుంది. అయితే చిన్నప్పటి నుంచి తనకు అన్నీ ఇచ్చిన నీకు నువ్వు కోరుకున్నది ఇవ్వాలనుకున్నాను..అందుకే ఇలా చేశాను అక్కా అని సత్య బదులిస్తుంది. ఇక ఇప్పట్నుంచి తాను చెప్పింది వినాలని, దేవుడమ్మ ఇంట్లోనే ఉండాలని సత్యతో ప్రమాణం తీసుకుంటుంది. సీన్ కట్‌చేస్తే తను చేసిన తప్పుకు క్షమించమని ఆదిత్య రుక్మిణిని కోరుతాడు. ఈ నిజం దేవుడమ్మకు తెలిస్తే తట్టుకోలేదని, తన తల్లి ముందు తనను దోషిగా నిలబెట్టవద్దని ప్రాథేయపడతాడు. -
Devatha : సత్య-ఆదిత్యలను ఒక్కటి చేయాలనుకున్న రుక్మిణి
ఆదిత్య నిజం ఒప్పుకుంటాడు. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అని రుక్మిణితో అంటాడు. సత్యను ప్రేమించింది తానే అని, అయితే ఇలా మోసం చేయాలనుకోలేదు అని పేర్కొంటాడు. ఆదిత్య మాటలకు షాక్ అయిన రుక్మిణి తనను ఒంటరిగా వదిలేయమని కోరుతుంది. మరోవైపు తన వల్లే సత్య- ఆదిత్యలు విడిపోయారని బాధపడుతుంది. ఇద్దరి కన్నీళ్లకు కారణం తానే అని ఎంతో మదనపడుతుంది. సత్య-ఆదిత్యల మధ్యలో తాను ప్రేవేశించి వారి సంతోషాన్ని పోగొట్టానని కుంగిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 14న 259వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అన్న నిజాన్ని ఆదిత్య ఒప్పుకుంటాడు. పెళ్లికి ముందు తాను ప్రేమించింది సత్యనే అని, అయితే నీకు అన్యాయం మాత్రం చేయాలనుకోలేదు అని రుక్మిణితో అంటాడు. సత్య కావాలనే ప్రేమను త్యాగం చేసిందని చెప్తాడు. ఆదిత్య మాటలకు షాకైన రుక్మిణి తన వల్లే ఇద్దరూ దూరం అయ్యారని బాధపడుతుంది. సత్య- ఆదిత్యల మధ్యలో తాను వచ్చి వారి జీవితాన్ని నాశనం చేశానని రుక్మిణి బాధపడుతుంది. ఇద్దరినీ ఒక్కటి చేయాలని అనుకుంటుంది. ఇక కొద్ది సేపు తనను ఒంటరిగా వదిలి పెట్టమని ఆదిత్యను కోరుతుంది. ఈ పరిస్థితుల్లో నిన్ను విడిచి వెళ్లను అని ఆదిత్య అంటున్నా రుక్మిణి వెళ్లాల్సిందిగా కోరుతుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆదిత్య రుక్మిణిని వదిలి ఇంటికి వస్తాడు. హాస్పిటల్‌కు అని వెళ్లి ఆదిత్య ఒక్కడే ఒంటిరిగా రావడంతో కనకం, రాజ్యంలలో అనుమానాలు మొదలవుతాయి. రుక్మిణి ఎక్కడ అని ప్రశ్నించినా ఆదిత్య సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్తాడు. జరిగిన తప్పును ఊహించుకొని తనలో తానే కుమిలిపోతాడు. ఇది చూసిన కనకం తెగ సంబరపడిపోతుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలని తహతహలాడుతుంది. మరోవైపు రుక్మిణి ఇంకా ఇంటికి రాకపోవడంతో సత్య కంగారుపడుతుంది. నిజం తెలుసుకున్న రుక్మిణి సత్య-ఆదత్యలను ఒక్కటి చేస్తుంది? ఇప్పుడు రుక్మిణి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : సత్య బిడ్డకు తండ్రిని తానే అని ఒప్పుకున్న ఆదిత్య
కనకం అన్న మాటలు తలుచుకొని సత్య కుంగిపోతుంది. మరోవైపు తనకు ఆరోగ్యం బాలేదని చెప్పి రుక్మిణి ఆదిత్యను బయటకు తీసుకెళ్తుంది. మార్గమధ్యలో మనం వెళ్లేది హాస్పిటల్‌కు కాదని, కారును మామిడితోట వద్ద ఆపమని చెప్తుంది. అక్కడే సత్య-ఆదిత్యల గురించి నిజాన్ని తెలుసుకుంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అంటూ ఆదిత్య ఒప్పుకుంటాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 12న 258వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. కనకం అన్న మాటలకు సత్య బాధపడుతుంది. తనకు వేరే వాళ్లతో పెళ్లి ఎలా చేస్తారంటూ రాజ్యాన్ని నిలదీస్తుంది. అయితే ఇది అందరి నిర్ణయం కాదని, కనకం మాటలను పట్టించుకోవద్దని రాజ్యం బదలిస్తుంది. ఇక సత్యను అంటే ఆదిత్యకు అంత కోపం ఎందుకు వస్తుందంటూ కనకం రుక్మిణిని అడుగుగుతుంది. ఏదో తన బిడ్డే అన్నట్లు ఆదిత్య మాట్లాడటం చూస్తుంటే తనకేదో అనుమానం కలుగుతుందని రుక్మిణిని చెబుతుంది. ముందే జాగ్రత్తగా ఉండమని, లేదంటే నీ జీవితం కూడా నాశనం అవుతుందని రుక్మిణి మనసులో మరింత అనుమానం రేపుతుంది. సీన్ కట్ చేస్తే తన ఆరోగ్యం బాలేదని, తనను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని రుక్మిణి ఆదిత్యను కోరుతుంది. ఇద్దరూ కలిసి వెళ్తుండగా రుక్మిణి కారును తన తోట వైపు తీసుకెళ్లమని చెప్తుంది. అయితే హాస్పిటల్‌కి కదా వెళ్లాల్సింది అని ఆదిత్య ప్రశ్నించగా..తను బాగానే ఉన్నానని, ఒక విషయం మాట్లాడటానికే తోటకు తీసుకొచ్చానని రుక్మిణి బదులివ్వడంతో ఆదిత్య షాకవుతాడు. రుక్మిణి ఏం మాట్లాడుతుందో అని టెన్షన్ పడతాడు. దీంతో దేవుడమ్మ మీద ప్రమాణం చేసి తను అడిగే ఒక ప్రశ్నకు నిజం చెప్పాలంటూ రుక్మిణి మాట తీసుకుంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటి అని రుక్మిణి ప్రశ్నిస్తుంది. దీంతో ఆదిత్య నిజాన్ని ఒప్పుకుంటాడు. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే అని నిజం చెప్పేయడంతో రుక్మిణి షాకవతుంది. తర్వాత రుక్మిణి ఏం చేస్తుంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి వంటి వివరాలను తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : సత్యకు సంబంధం చూసిన కనకం.. కోపగించుకున్న ఆదిత్య
కనకం తీరు మారదు. తన భర్త రంగా చేసిన పనికి ఇంట్లో అందరినీ ఆడిపోసుకుంటుంది. దేవుడమ్మ కూడా తనకు న్యాయం చేయలేదంటూ ఫైర్ అవుతుంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో సత్యను టార్గెట్ చేసిన కనకం ఆమెను అనరాని మాటలు అంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అనాథే అవుతాడు తప్పా మహారాజు కాలేదని సూటిపోటి మాటలతో సత్య మనసుకు గాయం చేస్తుంది. మరోవైపు కనకం మాటలకు ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సత్య విషయంలో కలగజేసుకోవద్దని, తన పనేంటో అది మాత్రమే చూసుకోవాలని చెప్పి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 11న 257వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. కనకం తన భర్త రంగా బంతితో తిరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ రాజ్యం భర్తను నిందిస్తుంటుంది. తనకు అన్యాయం చేశారంటూ ఆడిపోసుకుంటుంది. మరోవైపు రాజ్యం తోనూ తగువు పెట్టుకుంటుంది. అందరికి అన్నీ తెలిసినా ఎవరూ ఏమీ చేయలేదని అసహనం వ్యక్తం చేస్తుంది. దీంతో దేవుడమ్మ వచ్చాక తేల్చుకోవాలని రాజ్యం బదులిస్తుంది. సీన్ కట్ చేస్తే.. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. ఇదే సరైన టైం అనుకుందో ఏమో కానీ కనకం సత్యను టార్గెట్ చేస్తుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో ఇంతవరకు తెలియదని, ఇక తన జీవితం నాశనం అని అంటుంది. అంతేకాకుండా తండ్రి లేకుండా పెరిగే బిడ్డ అనాథే అవుతాడు తప్పా మహారాజు కాలేదని సూటిపోటి మాటలతో సత్య మనసుకు గాయం చేస్తుంది. కనకం మాటలకు సత్య చాలా బాధపడుతుంది. ఈశ్వర్ ప్రసాద్ కూడా ఇక ఈ టాపిక్ ఆయేయాలని చెప్పినా కనకం మాత్రం తీరు మార్చుకోదు. సత్యకు తన ఊళ్లో ఒక తెలిసిన వ్యక్తి ఉన్నాడని, తను 10వ తరగతి వరకు చదువుకున్నాడని, ఆ అబ్బాయిని సత్యకు ఇచ్చి పెళ్లి చేద్దాం అని కనకం సూచిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆదిత్య ఉక్రోషానికి లోనవుతాడు. సత్య విషయం నీకెందుకు పిన్నీ అంటూ తీవ్ర స్థాయిలో కోపం వ్యక్తం చేస్తాడు. వేరే వాళ్ల విషయాలు అంత పట్టించుకోవడం అవసరం లేదని, తన పని తాను చేసుకోవాలంటూ హితవు పలుకుతాడు. ఇంకోసారి సత్య గురించి కలగజేసుకుంటే బాగుండదని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఆదిత్య మాటలకు షాకైన రుక్మిణి తనకు ఇంత కోపం ఎందుకు వస్తుందని ఆలోచనలో పడిపోతుంది. -
Devatha : కమలను అవమానించిన కనకం..
సత్య, రుక్మిణి వాళ్లు ఇంటికి బయలుదేరుతారు. మార్గమధ్యలో వాళ్లకు రాజ్యం వాళ్లు ఎదురవుతారు. దీంతో రుక్మిణి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఏదైనా శుభవార్తా అంటూ రాజ్యం ఎంతో ఆతృతతో అడగగా లేదని రుక్మిణి సమాధానమిస్తుంది. మరోవైపు తన సూటిపోటి మాటలతో కనకం కమలను ఆడిపోసుకుంటుంది. సత్య, రుక్మిణులను దెబ్బిపొఘుస్తూ మాట్లాడుతుండగా కమల ఆమెకు గట్టి సమాధానం ఇస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 10న 256వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య, రుక్మిణులను తీసుకొని ఆదిత్య ఇంటికి బయలుదేరుతాడు. ఏ ఆడపిల్లకైనా తను గర్భవతి అయ్యిందనే సంగతి భర్తకే మొదట చెప్పాలనుకుంటుంది కదా అని రుక్మిణి ఆదిత్యను అడుగుతుంది. కానీ అందరికీ ఆ అదృష్టం రాదని చెబుతూ బాధపడుతుంది. అయితే రుక్మిణి ఇలా ఎందుకు అంటుందో సత్య, ఆదిత్యలకు అర్థం కాదు. ఇక తనకు దాహం వేస్తుందని చెప్పడంతో ఆదిత్య కొబ్బరి బోండం వద్ద కారును ఆపతాడు. అక్కడే వాళ్లకు రాజ్యం వాళ్లు కనిపిస్తారు. రుక్మిణి వాంతులు చేసుకుంటుంది అందుకే హాస్పిటల్‌కి వెళ్లాం అని చెప్పగానే ఏదైనా శుభవార్తా అని అడుగుతుంది. అదేమీ లేదని రుక్మిణి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతారు. మరోవైపు కనకం తన సూటిపోటి మాటలతో కమలను ఆడిపోసుకుంటుంది. సత్య, రుక్మిణుల గురించి పదేపదే దెబ్బిపొడుస్తుంటుంది. దీంతో ముందు రంగా మామ గురించి చూసుకోమని చెప్పి కమల గట్టి సమాధానం ఇస్తుంది. ఇక రుక్మిణి వాళ్లు రాగానే డాక్టర్ ఏం చెప్పింది? గుడ్‌న్యూసే కదా అంటూ కనకం రుక్మిణిని అడుగుతుంది. అక్కడ కొద్ది సేపు కనకం తన మాటలతో డ్రామా చేస్తుంది. సీన్ కట్ చేస్తే రంగా గురించి అన్ని తెలిసినా అతడిని గాడిలో పెట్టలేదంటూ కనకం రాజ్యం వాళ్ల భర్తపై అరుస్తుంది. తప్పును తప్పు అని చెప్పకుండా పైపెచ్చు సమర్థించారంటూ అతడిపై మండిపడుతుంది. మరోవైపు సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటీ అంటూ రుక్మిణి ఆదిత్యను ప్రశిస్తుంది. దీనికి ఆదిత్య ఏం సమాధానం చెప్తాడు? ఆ తర్వాత రుక్మిణి ఎలా రికార్ట్ అవుతుంది అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : సత్య బిడ్డకు కారణం నువ్వేనా పెనిమిటి : రుక్మిణి
సత్య-రుక్మిణిలు హాస్పిటల్‌కు వెళ్లడంతో శుభవార్తతోనే తిరిగి వస్తారని కనకం అంటుంది. దీంతో కమలలో పలు సందేహాలు కలుగుతాయి. ఇప్పుడు రుక్మిణి గర్భవతి అయితే సత్యను ఆదిత్య వదిలేస్తాడా? దేవుడమ్మ సత్య బిడ్డను ఆహ్వానిస్తుందా అని కమల రకరకాలుగా ఆలోచిస్తుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్‌కు వెళ్లగానే అక్కడ ఓ నర్సు సత్య భర్త మీరే కదా అని ఆదిత్తో అనడంతో రుక్మిని చాలా బాధపడుతుంది. ఇది పసిగట్టిన సత్య రుక్మిణికి నిజం తెలిసిపోయింది అని ఆదిత్యతో అంటుది. ఇలాంటి విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్8న 254వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య-రుక్మిణిలను తీసుకొని ఆదిత్య హాస్పిటల్‌కు వెళ్తాడు. అయితే రుక్మిణి గుడ్‌న్యూస్‌తోనే తిరిగి వస్తుందని కనకం ఈశ్వర్ ప్రసాద్‌తో అంటుంది. దీంతో ఒకవేళ రుక్మిణి గర్భవతి అయితే ఆదిత్య సత్యను వదిలేస్తాడా? ఈ నిజం తెలిస్తే దేవుడమ్మ సత్య బిడ్డను ఆహ్వానిస్తుందా అని కమల రకరకాలుగా ఆలోచిస్తుంది. నిజం తెలిస్తే సత్య-రుక్మిణి ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయని భావిస్తుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్‌కు వెళ్లగానే అక్కడ ఓ నర్సు..సత్య భర్త మీరే కదా..ఆమెను తీసుకొని లోపలికి వెళ్లండి అని ఆదిత్యతో అనగానే ముగ్గురూ ఏం చెయ్యాలో తెలియక సైలెంట్ అయిపోతారు. ఇక రుక్మిణి కూడా సత్యనే తీసుకొని వెళ్లమని ఆదిత్యకు చెప్తుంది. అయితే రుక్మిణి పడుతున్న బాధను సత్య పసిగడుతుంది. మనద్దరి మీద అక్కకు అనుమానం వచ్చిందని, అందుకే అక్కఘిలా తనలో తానే కుమిలిపోతుందేమో అని సత్య చెప్తుంది. సీన్ కట్ చేస్తే రుక్మిణి మరో డాక్టర్ వద్దకు వెళ్లి మాట్లాడుతుంది. ఆరోజు దేవుడమ్మ ఇంటికి వచ్చి రుక్మిణిని చెకప్ చేసిన డాక్టరే అక్కడా కనపడుతుంది. దీంతో ప్రెగ్నీన్సీ విషయం చెప్పొద్దని అన్నవ్వాంటే ఏదో పెద్ద విషయమే ఉంటుందని చెప్పి డాక్టర్ రుక్మిణికి మద్దతిస్తుంది. ఇక సత్య-ఆదిత్యలు బయటకు వచ్చి చూసి రుక్మిణి కనపడకపోయేసరికి కంగారు పడతారు. రుక్మిణి ఎక్కడికి వెళ్లిందో అని భయపడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన రుక్మిణి తానే వేరే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకున్నానని చెప్పడంతో షాకవుతారు. రుక్మిణి మాటలు సత్య అనుమానానికి మరింత బలం చేకూరుస్తుంది. ఇక సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటీ అంటూ రుక్మిణి ఆదిత్యను ప్రశిస్తుంది. దీనికి ఆదిత్య ఏం సమాధానం చెప్తాడు? ఆ తర్వాత రుక్మిణి ఎలా రికార్ట్ అవుతుంది అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : రుక్మిణి గర్బవతి అన్న నిజం బయటపడ్తుందా?
సత్యకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని రుక్మిణి భావిస్తుంది. దీంతో తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని సత్యను ప్రశ్నిస్తుంది. అతను ఎవరు అయినా నీకిచ్చి పెళ్లి చేస్తానని సత్యకు చెప్పడంతో ఆమె షాకవుతుంది. రుక్మిణి తన కోసం త్యాగం చేస్తుందేమో అని, అలా జరగకూడదని భావిస్తుంది. మరోవైపు రుక్మిని వాంతులు చేసుకోవడంతో అందరూ కంగారు పడతారు. అయితే రుక్మిణి మాత్రం సత్య-ఆదిత్యల విషయం తెలిసే వరకు తాను గర్భవతినన్న నిజం బయటకు రావొద్దని నిర్ణయించుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్8న 254వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యకు అమ్మానాన్నలు లేకుండా చేశానని రుక్మిణి బాధపడుతుంది. అయితే అమ్మానాన్నలు లేనిలేటు లేకుండా తనను చూసుకున్నారని సత్య జవాబిస్తుంది. అయితే తనకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని రుక్మిణి సత్యను కోరుతుంది. అతను ఎవరు అయినా సరే నీకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో సత్య షాకవుతుంది. దీనర్థం అక్క ఆదిత్యను తనకోసం త్యాగం చేస్తుందా అని తనలో తానే అనుకుంటుంది.ఘిలా చేస్తే ఇప్పటివరకు తాను చేసిన త్యాగం వృధా అవుతుందని, ఆదిత్య లేకపోతే తన అక్క చచ్చిపోతుందని, ఆమె జీవితం నాశనం కాకూడదని కోరుకుంటుంది. మరోవైపు రుక్మిణి వాంతులు చేసుకోవడం చూసి హాస్పిటల్‌కి తీసుకెళ్లమని ఈశ్వర్ ప్రసాద్ ఆదిత్యకు చెప్తాడు. అలాగే సత్యను వెంట తీసుకెళ్లి తనకు కూడా చెకప్‌లు చేయించాలని చెప్తాడు. అయితే రుక్మిణి ఎందుకు వాంతులు చేసుకుంటుందో తెలియక ఆదిత్య కంగారు పడతాడు. ఇది ప్రెగ్నెన్సీ అయితే కాదుకదా అని ఆలోచిస్తాడు. సీన్ కట్ చేస్తే రుక్మిణి ఆరోగ్యంపై ఈశ్వర్ ప్రసాద్ కమలకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాల్సిందిగా కబరు పెడతాడు. దీంతో తాను అనుకున్నట్లుగానే జరుగుతుందని, ఇక నిజం బయటకు వచ్చే రోజు దగ్గరల్లోనే ఉందని కమల బాధపడుతుంది. ఇక మరోవైపు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎలా అయినా దాయాలని, సత్య-ఆదిత్యల గురించి నిజం తెలిసే వరకు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడాలని రుక్మిణి భావిస్తుంది. మరి హాస్పిటల్లో రుక్మిణి అనుకున్నదే జరుగుతుందా? ఆమె గర్భవతి అన్న విషయం అందరికి తెలిసిపోతుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : తల్లి కాబోతున్న రుక్మిణి.. బాధలో సత్య
రాధా-కృష్ణుల బొమ్మపై నిజం తెలిసేవరకు తాను గర్భవతి అన్న విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని రుక్మిణి నిర్ణయించుకుంటుంది. ఆ బొమ్మ సత్యే ఆదిత్యకు ఇచ్చిందని రుక్మిణి బలంగా నమ్ముతుంది. కానీ సత్య-ఆదిత్యలకు ఏ సంబంధం ఉండకూడదని కోరుకుంటుంది. తన చెల్లెలు సత్య జీవితం బాగుండాలని ఆశిస్తుంది. మరోవైపు రుక్మిణి పడుతున్న వేదనను చూసి సత్య కంగారుపడుతుంది. తమ గురించి నిజం తెలిస్తే రుక్మిణి బతకదని ఆదిత్యకు చెబుతుంది. సీన్ కట్‌చేస్తే సత్య-రుక్మిణిల గురించి కమల బాధపడుతుంది. వాళ్లిద్దరి జీవితాలు నాశనం అవుతాయేమో అని కంగారుపడుతుంది. మరోవైపు తనను క్షమించమని సత్య రుక్మిణిని కోరుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్7న 253వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత జూన్ 7 : సత్యకు ఇచ్చిన రాధా-కృష్ణుల బొమ్మ చూసి రుక్మిణి మనసులో అనేక సందేహాలు కలుగుతాయి. ఆ బొమ్మ గురించి ఏం అడిగినా ఇద్దరూ ఒకేలా సమాధానం చెబుతుండటంతో రుక్మిణికి మరింత అనుమానం కలుగుతుంది. ఈ బొమ్మ సంగతి తేలే వరకు తాను గర్భవతి అన్న నిజాన్ని బయటపెట్టకూడదని రుక్మిణి నిర్ణయించుకుంటుంది. మరోవైపు రుక్మిణి ఆరోగ్య పరిస్థితి చూసి సత్య బాధపడుతుంది. ఆదిత్యకు, తనకు ఉన్న సంబంధం గురించి అక్కకు తెలిసిపోయిదేమో అని కంగారు పడుతుంది. ఇదే విషయాన్ని ఆదిత్యతో చెబుతుంది. నేనే నీకు బొమ్మ ఇచ్చిన విషయం అక్కకు తెలిసిపోయింది అందుకే ఇలా అయ్యిందంటూ సత్య ఆదిత్యతో అంటుంది. ఇక సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన రుక్మిణి ఇద్దరిని చూసి ఇక్కడేం చూస్తున్నారంటూ ప్రశ్నిస్తుంది. భోజనానికి పిలవడానికి వచ్చానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే.. కాసేపటికి సత్య గదిలోకి రుక్మిణి వస్తుంది. తన ఆరోగ్యంపై రుక్మిణి చూపిస్తున్న శ్రద్ద చూసి సత్య తనను క్షమించమని కోరుతుంది. నీ వల్లే మా అమ్మానాన్నలు చనిపోయారంటూ చెప్పినందుకు నువ్వెంత బాధపడుతున్నావో తెలుసని, అందుకు క్షమించమని సత్య రుక్మిణిని కోరుతుంది. ఇక సత్య-రుక్మిణిల జీవితం ఎటు పోతుందో అని కమల బాధపడుతుంది. నిజం తెలిసే రోజు తొందర్లోనే ఉందని తెలిసి బాధపడుతుంది. -
Devatha : పసరు మందుతో సత్యను చంపాలనుకున్న కమల
రుక్మిణి జీవితం నాశనం అవుతుందంటూ కమల బాధపడిపోతుంది. దీనంతటికి కారణం సత్యే అని తనపై కోపం పెంచుకుంటుంది. సత్యను చంపేస్తే ఎవరికి ఏ బాధ ఉండదని నిర్ణయించుకుంటుంది. సీన్ కట్ చేస్తే సత్య-ఆదిత్యలు మరోసారి రుక్మిణి కంటపడతారు. సత్యను ఆదిత్య స్వయంగా తన చేత్తో ఎత్తుకొని తీసుకెళ్లడం చూసి రుక్మిణి గుండె పగులుతుంది. వాళ్లు మాట్లాడుకుంటున్న మాటల విని మరింత బాధపడిపోతుంది. ఇది నిజం కావొద్దంటూ ప్రార్థిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్3న 250వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత జూన్ 3 : సత్య-ఆదిత్యలపై తనకున్న అనుమానం గురించి రుక్మిణి కమలతో పంచుకుంటుంది. తాను స్వయంగా తయారుచేసిన రాధాకృష్ణల బొమ్మ సత్యను ఇస్తే అది ఆదిత్య దగ్గరికి ఎలా వచ్చిందంటూ సందేహం వ్యక్తం చేస్తుంది. దీంతో రుక్మిణి జీవితం నాశనం అవుతుందంటూ కమల బాధపడిపోతుంది. త్వరలోనే ఈ నిజం బయటకు వచ్చేస్తుందేమో అని కంగారు పడిపోతుంది. దీనంతటికి కారణం సత్యే అని తనపై కోపం పెంచుకుంటుంది. ఎంత వద్దని చెప్పినా సత్య అక్కడికి పోయి రుక్మిణి జీవితాన్ని నాశనం చేస్తోందంటూ తనపై కక్ష పెంచుకుంటుంది. దీంతో ఓ పసరు మందు నూరి సత్యకు తినిపించాలనుకుంటుంది. అది ఏం మందు అని భాష అడగ్గా సత్యను చంపేద్దామనుకుంటున్నా అని కమల చెప్పిన సమాధానంతో భాష షాక్ అవుతాడు. దీనంతటికి కారణం సత్యే అని, అసలు సత్యనే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపేస్తే అప్పుడు ఎవరికీ ఏ బాధ ఉండదని కమల బదులిస్తుంది. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? చీమకు కూడా హాని చేయని నువ్వు ప్రాణం తీసేంత ధైర్యం ఉందా అంటూ కమల చేస్తోన్న తప్పును ఎత్తిచూపుతాడు. ఇలాంటివి చేయోద్దని గట్టిగా చెప్తాడు. మరోవైపు సత్య కాలికి ఏదో గుచ్చుకొని బాధపడుతుంటే ఆదిత్య అక్కడికి వస్తాడు. సత్యను చూసి తట్టుకోలేక తనను ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఆ దృశ్యం రుక్మిణి కంటపడటంతో గుండె పగిలినంత పని అయ్యింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇది నిజం కాకూదంటూ ప్రార్థిస్తుంది. కలలో కూడా ఇలాంటిది జరగడకూడదని అనుకుంటుంది. సత్య-ఆదిత్యల ప్రేమ విషయం మున్ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : రుక్మిణి ప్రశ్నలకు షాకైన సత్య-ఆదిత్యలు
కృష్ణ-సత్యభామల బొమ్మ తన వద్ద ఎక్కడినుంచి వచ్చిందని రుక్మిణి ఆదిత్యను నిలదీస్తుంది. దీంతో షాకైన ఆదిత్య ఎవరో కావాల్సిన వారు ఇచ్చారంటూ మాట దాటేస్తాడు. సీన్ కట్ చేస్తే..సత్య గదిలోంచి ఆదిత్య రావడాన్ని చూసిన రుక్మిణి వాళ్లిద్దరి మధ్యా తానే అడ్డుగా ఉన్నానా అని ఆలోచిస్తుంది. మరోవైపు తాను ఇచ్చిన బొమ్మ ఎక్కడ ఉందంటూ రుక్మిణి సత్యను ప్రశ్నిస్తుంది. ఇక తన అనుమానం మరింత బలపడిందని రుక్మిణి భావిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే2న 249వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత మే2 ఎపిసోడ్: ఆదిత్య లాకర్లో తాను సత్యకు బహుమతిగా ఇచ్చిన కృష్ణ-సత్యభామల బొమ్మ చూసి రుక్మిణి షాకవుతుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదిత్యేనా అని అనుమానపడుతుంది. తన అనుమానం నిజం కాకూడదంటూ దేవుణ్ని ప్రార్థిస్తుంది. ఇక ఆ బొమ్మ ఎక్కడిదంటూ రుక్మిణి ఆదిత్యని నిలదీయడంతో ఆదిత్య ఆశ్చర్యపోతాడు. ఎవరో కావాల్సిన వాళ్లు ఇచ్చుంటారంటూ ఆదిత్య సందేహిస్తూ చెప్తాడు. ఇక ఇదే విషయాన్ని ఆదిత్య సత్యతో చెప్తాడు. దీంతో తమ విషయం ఎక్కడ బయటపడిపోతుందేమో అని సత్య కంగారుపడిపోతుంది. ఆ బొమ్మ స్వయంగా రుక్మిణి తన చేత్తో తయారు చేసిందని, ఇప్పుడు తనకు ఏం సమాధానం చెప్పాలంటూ ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే రుక్మిణి అటువైపు వస్తుండడాన్ని గమనించిన ఆదిత్య సత్య గదిలోంచి జారుకునే ప్రయత్నం చేస్తుండగా రుక్మిణి ఆదిత్యని కనిపెడతుంది. సత్య గదిలోకి ఎందుకు వెళ్లాలంటూ అడగ్గా ఏదో ఎగ్జామ్స్ కోసమని చెప్పి ఆదిత్య వెళ్లిపోతాడు. సీన్‌కట్ చేస్తే తాను పూజ చేస్తున్న సమయంలో సత్యను కూడా అక్కడకి వచ్చి హారతి తీసుకోమని రుక్మిణి అడుగుతుంది. అయితే దేవుణ్ని దండం పెట్టుకుంటుండగా అక్కడ కృష్ణ-సత్యభామల బొమ్మ చూసి సత్య కంగు తింటుంది. ఇక తాను బహుమతిగా ఇచ్చిన బొమ్మ ఎక్కడుందంటూ సత్యను అడగ్గా అది పాండిచ్చెరిలోనే ఉండిపోయిందని చెప్పి సత్య అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. దీంతో సత్య-ఆదిత్యలపై రుక్మిణికి అనుమానం బలపడుతుంది. ఇద్దరూ మాటల్లో తడబాటును రుక్మిణి గమనిస్తుంది. మరి ఈ నిజాన్ని రుక్మిణి ఎలా తెలుసుకుంటుంది అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : సత్య-ఆదిత్యలపై రుక్మిణికి మొదలైన అనుమానం
సత్య గదిలోకి ఆదిత్య వెళ్లడాన్ని చూసిన కనకం అక్కడే తలుపు చాటున వాళ్ల మాటలన్ని వింటుంది. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన రుక్మిణి మనసులో అనుమానం అనే బీజాన్ని బలంగా నాటుతుంది. సత్య-ఆదిత్యల గురించి ఊళ్లో నానారకాలుగా మాట్లాడుకుంటున్నారని, అనుమానం రేకెత్తిస్తుంది. ఇక రుక్మిణి తన గదిలోకి వెళ్లగానే మరో షాక్ తగులుతుంది. తాను స్వయంగా తయారు చేసిన కృష్ణా-రాధల బొమ్మ తన బీరువాలో చూసి ఆశ్చర్యపోతుంది. సత్యకు ఇచ్చిన బొమ్మ ఆదిత్య బీరువాలో ఉండటం చూసి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే1న 247వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత సీరియల్ మే1 : సత్య గురించి దేవుడమ్మ అడిగే ప్రశ్నలకు తానే సమాధానం చెప్పుకుంటానని రుక్మిణి కనకంతో అంటుంది. తన చెల్లి అంటే తనకు ప్రాణం అని, తన కోసం ఏమైనా చేయడానికి సిద్ధమే అని ధీటుగా బదులిస్తుంది. సీన్ కట్ చేస్తే సత్యకు సడెన్‌గా ఎక్కిళ్లు రావడంతో పక్కన మంచినీళ్లు కోసం వెతుకుతుంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆదిత్య సత్య గదిలోకి వెళ్తాడు. నీళ్లందించి తన ఆరోగ్యం గురించి వాకబు చేస్తాడు. అయితే ఆదిత్య సత్య గదిలోకి వెళ్లడం గమనించిన కనకం వీళ్లు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని తలుపు చాటునే ఉంటుంది. ఇద్దరూ క్లోజ్‌గా మాట్లాడుకుంటున్న సమయంలో రుక్మిణి కూడా అక్కడికి వస్తే బాగుంటుందని కనకం అనుకుంటుండగానే ఆమె అక్కడికి వస్తుంది. దీన్ని అవకాశంగా మార్చుకున్న కనకం సత్య-ఆదిత్యలు చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారని, ఒకరి యోగక్షేమాల పట్ల మరొకరు శ్రద్ధ వహిస్తున్నారని అంటుంది. అయితే ఇది మామూలు విషయమే అని, ఆదిత్య బావ కాబట్టి కొంచెం జాగ్రత్తలు చెబుతున్నాడని రుక్మిణి జావాబిస్తుంది. అయితే సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో పాండిచ్చెరి వెళ్లి వెతికినా మీకు కనిపించలేదని, ఇప్పటికే సత్య-ఆదిత్యలపై ఊళ్లో జనాలు నానారకాలుగా మాట్లాడుతున్నారని రుక్మిణి మనసులో అనుమానపు బీజాన్ని రేకెత్తిస్తుంది. దీంతో అదే ఆలోచిస్తున్న రుక్మిణి తన గదిలోకి వెళ్లి బీరువా తెరవగా అక్కడ ఓ బొమ్మ చూసి షాకవుతుంది. అది కృష్ణ, సత్యభామల అందమైన బొమ్మ అది. అది స్వయంగా రుక్మిణి తన చేత్తో తయారుచేసి సత్యకు తాను చదువుకుంటున్న సమయంలో ఇచ్చింది. మరి అది ఇక్కడికి ఎలా వచ్చింది? సత్యను ప్రేమించి మోసం చేసింది నా పెనిమిటేనా అని రుక్మిణికి సందేహం కలుగుతుంది. ఇలా జరగకూడదని, తాను అనుకుంటుంది నిజం కాకూడదని బాధపడుతుంటుంది. మరి రుక్మిణికి సత్య-ఆదిత్యల విషయం తెలుస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : తన బిడ్డకు తండ్రి కావాలంటున్న సత్య.. ఆదిత్య ఒప్పుకుంటాడా?
సత్యను ఇంట్లోకి తెచ్చినందుకు రుక్మిణి ఆదిత్యకు ధన్యవాదాలు తెలుపుతుంది. తనను పెళ్లి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తూ సంబరపడిపోతుంది. ఇక సత్య తీరుపై కనకం పరోక్షంగా నిప్పులు కక్కుతుంది. ఆమెను అనరాని మాటలతో చిత్రవద చేస్తుంది. సూటి పోటి మాటలతో సత్యను బాధపెడుతుంది. ఇక సత్య-రుక్మిణిల జీవితాలను తలుచుకొని కమల ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏ క్షణం అయినా నిజం తెలుస్తుందని భయపడిపోతుంది. మరోవైపు తన బిడ్డను అనాథగా ఈ లోకానికి పరిచయం చెయ్యలేనని సత్య ఆదిత్యతో అంటుంది. తన బిడ్డకు తండ్రి కావాలని ఆదిత్యను వేడుకుంటోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే30న 247వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవత సీరియల్ మే30 : సత్యను ఇంటికి తీసుకొచ్చేందుకు సహకరించిన ఆదిత్యకు రుక్మిణి ధన్యవాదాలు తెలుపుతుంది. తన మనసుకు కష్టం కలుగుతుందని తెలిసి దేవుడమ్మకు ఇష్టం లేకపోయినా సత్యను ఇంటికి రానిచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అంటూ పొంగిపోతుంది. ఇక సత్యను ఇంట్లోకి తేవడం ఏమాత్రం ఇష్టం లేని కనకం సత్యను పరోక్షంగా ఆడిపోసుకుంటుంది. కొంచెం కూడా సిగ్గూ, మానం, మర్యాద లేని బతుకులు అని నిందలేస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ అని దేవుడమ్మ భర్త ప్రశ్నించగా..వేరే బయట అడుక్కునే వాళ్ల గురించి అని బదులిస్తుంది. కానీ అక్కడున్న వారందికి ఆమె సత్యనే అంటుంది అని అర్థమైపోయింది. ఇలాంటి వారు బతకడం కంటే చావడం మేలని సూటిపోటి మాటలతో సత్యను బాధపెడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే సత్య-రుక్మిణిల జీవితాలను తలుచుకొని కమల నిస్సహాయ స్థితిలో కుమిలిపోతుంది. నిజం చెబితే రుక్మిణి, చెప్పకపోతే సత్య జీవితాలు నాశనం అవుతున్నాయంటూ బాధపడుతుంటుంది. ఇక మరోవైపు కనకం అన్న మాటలను తలచుకొని సత్య బాధపడుతుంది. ఈలోగా అక్కడికి ఆదిత్య చేరుకుంటాడు. కనకం అన్న మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని అంటాడు. అయితే తాను బాధపడుతుంది కనకం అన్నందుకు కాదని, తన బిడ్డకు తండ్రి లేని వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం చెయ్యలేనని సత్య అంటుంది. తన బిడ్డకు తండ్రి కావాలని ఆదిత్యను వేడుకుంటోంది. తన బిడ్డను అనాథగా ఈ లోకానికి చూపించలేనని చెప్తుంది. మరి సత్య మనసులో ఏముందో ఆదిత్య తెలుసుకుంటాడా? సత్య బిడ్డకు తండ్రి స్థానాన్ని ఆదిత్య తీసుకోగలడా అనేది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Devatha : సత్యను తనతో ఇంటికి తీసుకెళ్లిన రుక్మిణి
రుక్మిణి సత్యను తనతో పాటు తీసుకెళ్లడానికి భాగ్యమ్మ ఇంటికి వెళ్తుంది. వద్దని కమల ఎంత చెప్పినా రుక్మిణి వినిపించుకోదు. మరోవైపు తన వ్యూహాం అమలవుతున్నందుకు సత్య మురిసిపోతుంది. పైకి మాత్రం వద్దని నటిస్తూ లోలోపల సంబరపడిపోతుంది. ఇక సత్యను చూడగానే కనకం మండిపోతుంది. తనను ఇంట్లోకి రానివచ్చేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే29న 246వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవుడమ్మ ఇంట్లోకి ఎలా అయినా వెళ్లాలని సత్య పథకం పన్నుతుంది. ఇందుకు తగ్గట్లుగానే తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని, ఇక బతకడమే వ్యర్థమని డ్రామాలు ఆడుతుంది. అదే సమయంలో అక్కడికి రుక్మిణి వస్తుంది. నువ్వు చచ్చి ఇంక ఎంత మందిని చంపుతావాంటూ సత్యపై కోప్పడుతుంది. సత్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లడానికే వచ్చానని చెప్తుంది. అయితే సత్యపై ఇప్పటికే దేవుడమ్మకు చాలా కోపం ఉందని, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లడం మంచిది కాదని కమల వారిస్తుంది. అయినప్పటికీ రుక్మిణి సత్యను తనతో పాటు తీసుకెళ్తుంది. ఇక సత్యను రుక్మిణి ఇంట్లోకి తెస్తుండగా కనకం అడ్డుపడుతుంది. దేవుడమ్మ ఇంట్లో లేని సమయంలో సత్యను తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్తుంది. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకొని, నందాను తీసుకొచ్చి మోసం చేసిందని ఇలాంటి వ్యక్తిని లోపలికి తేవద్దని మందలిస్తుంది. దీంతో ఆదిత్య అడ్డుపడి తన తల్లి ఊళ్లోకి రాగానే తానే సంజాయషీ చెప్పుకుంటానని చెప్తాడు. సత్య గురించి తప్పుగా మాట్లాడొద్దని కనకంతో వాదిస్తాడు. ఇక సత్యను లోపలికి తీసుకెళ్లమని రుక్మిణికి చెప్పడంతో ఆమె సత్యను ఇంట్లోకి తీసుకెళ్లుంది. ఆదిత్య విషయం ముందే తెలియడంతో కనకం మండిపోతుంది. త్వరలోనే ఈ నిజం తెలిసి మీరంతా గుండె పగిలి ఏడుస్తారని తనలో తానే అనుకుంటుంది. ఇక సత్యను ఇంట్లోకి రానిచ్చినందుకు రుక్మిణి ఆదిత్యకు ధన్యవాదాలు తెలుపుతుంది. తనను దేవుడిలా ప్రశంసిస్తుంది. -
Devatha : సత్య-ఆదిత్యల ప్రేమ విషయాన్ని కనకంతో చెప్పేసిన నందా
రుక్మిణి సహాయంతో దేవుడమ్మ ఇంట్లోకి వెళ్లాలని సత్య పథకం పన్నుతుంది. ఇందుకోసం భాగ్యమ్మ వద్ద మొసలి కన్నీళ్లు కారుస్తుంది. త్వరలోనే తన ప్లాన్ సక్సెస్ కానుందని సంతోషపడిపోతుంటుంది. మరోవైపు ఆదిత్యపై కోపంతో రగిలిపోయిన నందా సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యే అన్న నిజాన్ని కనకంతో చెప్పేస్తాడు. మరి నిజం తెలిసిన కనకం ఏం చేస్తుంది? ఆదిత్య-సత్యల విషయం అందరికి తెలిసిపోతుందా? లాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే28న 245వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. రుక్మిణిని అడ్డు పెట్టుకొని ఎలా అయినా దేవుడమ్మ ఇంట్లోకి ప్రేవేశించాలని సత్య పథకం పన్నుతుంది. ఇందుకు తగ్గట్లుగానే భాగ్యమ్మతో తన జీవితం ఇలా అయ్యిందంటూ నటిస్తూ కన్నీళ్లు కారుస్తుంది. ఇది చూసిన భాగ్యమ్మ చలించినపోయి రుక్మిణికి ఫోన్ చేసి సత్య పరిస్థితి గురించి చెబుతుంది. ఇలానే వదిలేస్తే సత్య మనకు బతకదని బాధపడుతుంది. భాగ్యమ్మ మాట్లాడుతుండటాన్ని గమనించిన సత్య త్వరలోనే ప్లాన్ సక్సెస్ అవుతుందని సంబరపడిపోతుంటుంది. మరోవైపు సత్యను ఎలా అయినా ఇంటికి తీసుకురావాలని రుక్మిణి ఆదిత్యను బతిమాలుతుంది. దేవుడమ్మను ఒప్పించే బాధ్యత నీదేనని చెప్పి ఆదిత్య కాళ్లు పట్టుకుంటుంది. సీన్ కట్ చేస్తే తనను కొట్టినందుకు ఆదిత్యపై నందా పగతో రగిలిపోతాడు. ఆదిత్య-సత్యల బండారం బయటపెట్టి ఆ ఇంట్లో చిచ్చు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. కనకంకు ఫోన్ చేసి సత్య కడపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యే అన్న నిజాన్ని చెప్పేస్తాడు. దీంతో షాకైన కనకం ఆదిత్య ఇంత కథ నడిపించాడా అని ఆశ్చర్యపోతుంది. దీన్నే అస్త్రంగా మార్చుకొని దేవుడమ్మపై తాను పెత్తనం చెలాయించాలని భావిస్తుంది. సీన్ కట్ చేస్తే ఆదిత్యకు నందా ఫోన్ చేస్తాడు. మీ ఇంట్లో ఒకరికి నిజం చెప్పేసానని, ఇక రుక్మిణికి నిజం తెలియకుండా జాగ్రత్త పడమని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో ఈ నిజాన్ని నందా ఎవరికి చెప్పాడో తెలియక ఆదిత్య కంగారుపడతాడు. ఆదిత్య గురించి కనకం అందరికి చెప్పేస్తుందా? దేవుడమ్మకు ఈ నిజం తెలియనుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : నందాను చితకబాదిన ఆదిత్య..కనకంకు ఫోన్ చేసిన నందా
కనకంకి నందా ఫోన్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆదిత్యతో తానింకా టచ్‌లోనే ఉన్నానని చెప్తాడు. దీంతో ఎందుకు నందాతో మాట్లాడుతున్నావంటూ ఇంట్లో వాళ్లు నిలదీయడంతో ఆదిత్య కంగారుపడుతుంటాడు. అది గమనించిన కనకం దీని వెనక ఏదో మతలబు ఉందని గ్రహిస్తుంది. ఇక నందాను చితకబాదిన ఆదిత్య ఇంకోసారి తనను ఇబ్బంది పెడితే చంపేస్తానని నందాను బెదిరిస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే27న 244వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య పరిస్థితి తలుచుకొని ఆదిత్య దిగాలుగా ఉంటాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఇలా ఎందుకు ఉన్నావంటూ ఆదిత్యను వాళ్ల నాన్న అడుగుతాడు. సత్య పరిస్థితి ఇలా అయిపోవడంతో రుక్మిణి బాధపడుతుందని అందుకే దీన్నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నా అని ఆదిత్య బదులిస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే తాను డబ్బులు డిమాండ్ చేస్తే మొదటిసారి ఆదిత్య నో అనడంతో నందా ఆశ్చర్యపోతాడు. తన పొగరును ఎలా అయినా దించాలన ఉద్దేశంతో ఏదో ఒక పథకం రచించాలని అనుకుంటాడు. ఇందుకు కనకం అయితే సరిగ్గా సరిపోతుందని, ఆమెకు ఫోన్ చేస్తాడు. దేవుడమ్మకు ఉన్న విలువ నీకు లేదని రెచ్చగొడుతూ, మరోవైపు తాను ఆదిత్యతతో ఇంకా టచ్‌లోనే ఉన్నానని చెప్తాడు. దీంతో కనకం వచ్చి ఆదిత్యను ఈ విషయం గురించి ప్రశ్నించగా, అదేం లేదని, దాటవేసే ప్రయత్నం చేస్తాడు. తను చేసిన తప్పుకు బాధపడతున్నాడని, ఇందుకు దేవుడమ్మకు క్షమాపణలు చెప్పమని చెప్పాడని, అంతే తప్పా తనతో నాకేం మాటలు లేవని చెప్తాడు. అయితే ఆదిత్య తడపాటును గమనించిన కనకం ఇందులో ఏదో మతలబు ఉందని , అది తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక ఆదిత్య చెప్పిన చోటుకు వెళ్లిన నందా అక్కడ ఆదిత్య డబ్బు తీసుకురాకపోగా, వెంట పెద్ద కర్ర తేవడం చూసి షాకవుతాడు. అయితే అప్పటికే కోపంతో రగిలిపోతున్న ఆదిత్య నందాను కొడతాడు. ఇంకోసారి తన గురించి కానీ, సత్య గురించి కాని ఆలోచిస్తే తన అంతు చూస్తానని బెదిరిస్తాడు. -
Devatha : రుక్మిణిపై దేవుడమ్మ ఆగ్రహం..స్మశానం నుంచి వచ్చావంటూ..
సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యేనంటూ నందా ఓ ఫోటోను పంపిస్తాడు. డబ్బులు డిమాండ్ చేస్తూ వెంటనే ఇవ్వకపోతే నిజాన్ని బయటకు చెబుతానంటూ బెదిరిస్తాడు. అయితే వాటికి లొంగని ఆదిత్య తనను నేరుగా కలిస్తే సమాధానం ఇస్తానని ఘాటుగా స్పందిస్తాడు. మరోవైపు సత్య ఇంటికి వెళ్లొచ్చిన రుక్మిణిని దేవుడమ్మ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. స్మశానం నుంచి తిరిగొచ్చి నేరుగా ఇంట్లోంచి వెళ్లకూడదని తెలీదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే26న 243వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను చూసి వాళ్ల పుటట్టింటి నుంచి తిరిగొచ్చిన రుక్మిణిని గుమ్మం వద్దే దేవుడమ్మ అడ్డుకుంటుంది. స్మశానం నుంచి తిరిగొచ్చి నేరుగా ఇంట్లోంచి వెళ్లకూడదని తెలీదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రుక్మిణి తలపై నీళ్లు పోసి ఇప్పుడు వెళ్లు లోపలికి అని చెబుతుంది. ఇక దేవుడమ్మ తీరుతో అందరూ షాకవుతారు. సత్యపై చేసిన తప్పుకు ఇంతలా శిక్షించడం అవసరమా అని కనకం ప్రశ్నించగా, సత్య చేసింది తప్పు కాదు నేరం అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే నందా తన ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతూ పార్టీ చేసుకుంటాడు. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదిత్యే అంటూ వాళ్లిద్దరు దిగిన ఫోటోను నేరుగా ఆదిత్యకే పంపిస్తాడు. అర్జెంటుగా 2 లక్షల రూపాయలు కావాలని, లేదంటే నిజాన్ని అందరికి చెబుతానని బెదిరిస్తాడు. అయితే నందా బెదిరింపులకు లొంగని ఆదిత్య తననే డైరెక్ట్‌గా కలిస్తే నీ బెదిరింపులకు ఫుల్స్టాప్ పెడతానని చెబుతాడు. ఇక సీన్ కట్ చేస్తే..రుక్మిణి భయం భయంగా ఉంటే దేవుడమ్మ తనను దగ్గరికి తీసుకుంటుంది. తన చేతులతో స్వయంగా జుడ వేస్తానని చెప్పి ప్రేమతో లాలించడం చూసి కనకం షాకావుతుంది. ఇదేంటని అడగ్గా తన కోపం కేవలం సత్య మీదే అని, రుక్మిణి మీద కాదని బదులిస్తుంది. ఇక మాట మధ్యలో రంగాను తీసుకొస్తే తనను క్షమిస్తావా అని దేవుడమ్మ ప్రశ్నించగా కనకం ఆలోచనలో పడుతుంది. -
Devatha : స్వార్థంగా ఆలోచిస్తున్న సత్య.. రుక్మిణిని అడ్డు పెట్టుకొని..
సత్యను చూడటానికి రుక్మిణి దేవుడమ్మకు చెప్పెకుండా వాళ్లింటికి వెళ్తుంది. నిజం తెలిసిన దేవుడమ్మ రుక్మిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు తన తల్లిదండ్రులు రుక్మిణి వల్లే చనిపోయారన్న నిజం తెలిసినప్పటి నుంచి సత్య స్వార్థంగా ఆలోచిస్తుంది. రుక్మిణిని అడ్డం పెట్టుకొని దేవుడమ్మ ఇంటికి ఎలా వెళ్లాలా అని ప్లాన్ చేస్తుంటుంది.ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే25న 242వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను ఎలా కలవాలో తెలియక రుక్మిణి మదనపడుతుంటుంది. దేవుడమ్మను అడిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అర్థమవుతుంది. ఈలోగా కనకం వచ్చి దేవుడమ్మకు తెలియకుండా వెళ్లి వచ్చేయమని సలహా ఇస్తుంది. అప్పటివరకు ఇంట్లో తాను మ్యానెజ్ చేస్తానని చెప్పి రుక్మిణిని వాళ్లింటికి పంపిస్తుంది. ఇక సత్యను చూడగానే రుక్మిణి కన్నీటి పర్యంతమవుతుంది. సత్యను ఇలా ముభావంగా ఉండొద్దని ఎప్పటికప్పుడు భోజనం తిని మందులు వేసుకోవాలని చెప్తుంది. ఇక తన తల్లిదండ్రులు రుక్మిణి వల్లే చనిపోయారన్న నిజం తెలిసినప్పటి నుంచి సత్య స్వార్థంగా ఆలోచిస్తుంది. రుక్మిణిని అడ్డం పెట్టుకొని దేవుడమ్మ ఇంటికి ఎలా వెళ్లాలా అని ప్లాన్ చేస్తుంటుంది. మరోవైపు రుక్మిణి ఇంట్లో లేదన్న నిజం దేవుడమ్మకు తెలిసిపోతుంది. భాగ్యమ్మకు ఫోన్ చేసి కనుక్కోగా రుక్మిణి అక్కడే ఉందని చెప్పడంతో దేవుడమ్మ కోప్పడుతుంది. అయితే రుక్మిణి తప్పేం ఉండకపోవచ్చని, భయం వల్ల తను అలా చేసిందేమో అని ఆదిత్య రుక్మిణిని వెనకేసుకొని వస్తాడు. -
Devatha : ఆదిత్య జీవితంలోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న సత్య
సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో తెలుసుకోవాలని రుక్మిణి భావిస్తుంది. ఇదే విషయాన్ని ఆదిత్యతో ప్రస్తావించగా, తన గురించి ఏమైనా తెలిసిందేమోనని ఆదిత్య కంగారు పడతాడు. ఇక ఇప్పటివరకు తాను చేసిన త్యాగాల వల్ల తన జీవితం నాశనం అయిపోయిందని భావించిన సత్య ఈ చీత్కారాలకు ముగింపు పలకాలని అనుకుంటుంది. అందుకోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. సత్యకు ఏదైతే నిజం తెలియకూడదో అది తెలిసిపోయిందని భాగ్యమ్మ రుక్మిణితో చెబుతుంది. సత్య దగ్గరకు వెళ్తానని రుక్మిణి దేవుడమ్మకు చెప్తుంది. మరి దేవుడమ్మ రుక్మిణిని వాళ్ల పుట్టింటికి వెళ్లేందుకు అనుమతిస్తుందా?ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే24న 241వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య పరిస్థితి గురించి రుక్మిణి బాధపడుతుంటుంది. తనకు అన్యాయం జరిగిందని మదనపడుతుంటుంది. అయితే సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో తెలుసుకోవాలనుకుంటుంది. ఈలోగా ఆదిత్య అక్కడకు రావడంతో ఈ విషయాన్ని ఆదిత్యకు చెప్తుంది. దీంతో తన పేరు చెప్పిందేమోనని ఆదిత్య కంగారు పడిపోతుంటాడు. సత్య ఏమైనా చెప్పిందా అని ఆతృతగా అడుగుతాడు. ఇక సీన్‌కట్ చేస్తే సత్యను అలా ఇంటి నుంచి వెళ్లగొట్టడం పట్ల కనకం దేవుడమ్మను ప్రశ్నిస్తుంది. తొందరపడ్డవేమో అని అడగ్గా సత్య గురించి మరింత నీచంగా మాట్లాడుతుంది దేవుడమ్మ. ఇక తన పుట్టబోయే బిడ్డను ఈ సమాజం ఎలా స్వీకరిస్తుందో అని సత్య ఆలోచిస్తుంటుంది. ఈ ఛీత్కారాలకు, అవమానాలకు ముగింపు పలకాలని అనుకుంటుంది. ఇప్పటివరకు తాను చేసిన త్యాగాలు చాలని, ఇకపై తన జీవితం గురించి మాత్రమే ఆలోచించాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం ఆదిత్యతోనే తాను ఉండాలని, మళ్లీ ఆ ఇంటికి వెళ్లాలని భావిస్తుంది. ఇక సత్యకు తన తల్లిదండ్రులు ఎలా చనిపోయారో అన్న నిజం తెలిసిపోయిందని భాగ్యమ్మ రుక్మిణికి చెబుతుంది. దీంతో షాక్ అయిన రుక్మిణి సత్య ఇప్పుడు మరింత కుంగిపోతుందంటూ బాధపడుతుంటుంది. ఇలాంటి సమయంలో సత్య పక్కన తను ఉండటం ఉత్తమమని, వెంటనే సత్య దగ్గరికి వెళ్లాలని భావిస్తుంది. అయితే ఈ విషయాన్ని దేవుడమ్మతో చెప్తుంది. మరి దేవుడమ్మ రుక్మిణిని వాళ్ల పుట్టింటికి వెళ్లేందుకు అనుమతిస్తుందా? సత్య ఆదిత్య జీవితంలోకి తిరిగి వచ్చేస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : నిజం తెలిసి ఇంట్లోంచి వెళ్లిపోతానన్న సత్య
సత్యను వెతకడానికి వెళ్లిన ఆదిత్యపై దేవుడమ్మ మండిపడుతుంది. తన మాటను కాదని సత్య కోసం వెళ్లడం ఏంటని నిలదీస్తుంది. మరోవైపు తన తల్లిదండ్రులు ఎవరో చెప్పమని సత్య భాగ్యమ్మని ప్రశ్నిస్తుంది. తన అమ్మానాన్నలు ఎలా చనిపోయారో చెప్పాలని భాగ్యమ్మను కోరుతుంది. ఇక చేసేదేమీ లేక భాగ్యమ్మ నిజాన్ని బయటపెట్టేస్తుంది. సత్య తల్లిదండ్రుల చావుకు రుక్మిణి అని, అయితే అది తెలియక చేసిన తప్పని భాగ్యమ్మ చెప్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే22న 240వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను వెతకడానికి ఎందుకు వెళ్లావంటూ దేవుడమ్మ ఆదిత్యని నిలదీస్తుంది. తన మాటంటే లెక్కలేదా అంటూ ఆదిత్యపై మండిపడుతుంది. ఇక సత్య-రుక్మిణి జీవితం ఇలా అవ్వడానికి తానే కారణమని, తనే సరైన నిర్ణయం తీసుకొని ఉంటే సత్యకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆదిత్య తనను తాను శిక్షించుకుంటాడు. ఇక తన జన్మరహస్యం గురించి నందా చెప్పిన నిజాలను తలుచుకొని సత్య బాధపడుతుంది. మరోవైపు తన బిడ్డను ఈ సమాజం ఎలా స్వాగతిస్తుందో అని కుమిలిపోతుంటుంది. తండ్రి ఎవరో తెలియకుండా తాను పెంచగలనా అని తనను తానే ప్రశ్నించుకుంటుంది. సీన్‌కట్ చేస్తే.. ఊరిలో వాళ్లు సైతం సత్యకు జరిగిన అవమానంపై మాట్లాడటం సత్య వింటుంది. భాగ్యమ్మ దగ్గరకు వచ్చి తాను ఈ ఇంట్లోంచి వెళ్లిపోతానని, అప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురుకావని చెప్తుంది. భాగ్యమ్మ అందుకు అడ్డు చెబుతుండటంతో తన జన్మరహస్యం గురించి చెప్పమని సత్య నిలదీస్తుంది. దీంతో సత్య తన కన్నకూతురు కాదన్న నిజాన్ని చెప్తుంది. అంతేకాకుండా సత్య తల్లిదండ్రులు చనిపోవడానికి గత కారణాలను సైతం బయపెడుతుంది. ఇక ఈ నిజం తనకు తెలుసని రుక్మిణితో చెప్పొద్దని సత్య కోరుతుంది. నిజం తెలుసు కాబట్టి ఈ అవమానాలు భరించలేక సత్య ఊరు విడిచి వెళ్తుందా లేదా అన్నది తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. -
Devatha : సత్యను ఒప్పించి ఇంటికి తీసుకెళ్లిన ఆదిత్య
సత్య గురించి కంగారు పడుతున్న రుక్మిణిని కనకం ఓదారుస్తుంది. సత్యకి ఏమీ కాదంటూ ధైర్యం చెప్తుంది. మరోవైపు సత్యను వెతకడానికి ఆదిత్య వెళ్తాడు. సత్యను ఒప్పించి వాళ్లింటో దిగబెడతాడు. ఇక సత్యను చూసి భాగ్యమ్మ సంతోషడినా దేవుడమ్మ చేసిన పనికి మాత్రం అసహనం వ్యక్తం చేస్తుంది. తన బిడ్డను అవమానించారంటూ బాధపడుతుంది. దేవుడమ్మని దేవతలా కొలిచామని, అలాంటిది తమకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ ఆదిత్యను నిలదీస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే21న 239వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య గురించి రుక్మిణి కంగారు పడుతుంటుంది. తన చెల్లి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని మధనపడుతుండగా కనకం వచ్చి రుక్మిణికి ధైర్యం చెప్తుంది. ఇక సత్యను ఒప్పించి వాళ్లింటికి తీసుకెళ్తాడు ఆదిత్య. సత్యను చూడగానే భాగ్యమ్మ సంతోషపడుతుంది. కూతుర్ని దగ్గరకు తీసుకుంటుంది. మరోవైపు సత్యను ఇంతలా అవమానం చేసిన దేవుడమ్మపై గుర్రుమంటుంది భాగ్యమ్మ. ఎందుకు ఎంత పెద్ద శిక్ష వేశారంటూ ఆదిత్యను నిలదీస్తుంది. ఆ ఇంటికి తీసుకెళ్తా అని దేవుడమ్మే తన కూతుర్ని తీసుకెళ్లిందని, ఇప్పుడు ఇంట్లోంచి గెంటేసిందంని భాదపడుతుంది. ఇక దేవుడమ్మ చేసిన పనికి ఆదిత్య తన వైపు నుంచి భాగ్యమ్మను క్షమాపణ కోరతాడు. సీన్ కట్ చేస్తే సత్యను సేఫ్‌గా ఇంట్లో దిగబెట్టి వచ్చనని ఆదిత్య రుక్మిణితో చెప్తుండగా దేవుడమ్మ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. సత్యను వెతకడానికి ఎందుకు వెళ్లావంటూ ఆదిత్యపై మండిపడుతుంది. ఇంకా సత్యపై జాలి చూపించాల్సిన అవసరం ఏముందంటౌ ఆదిత్యపై విరుచుకుపడుతుంది. మరి దేవుడమ్మ ప్రశ్నలకు ఆదిత్య ఏం సమాధానం చెప్తాడో తర్వాతి ఎపిసోడ్లో తెలుస్తుంది. -
Devatha : సత్య తల్లిదండ్రుల చావుకు కారణం ఎవరో రివీల్ చేసిన నందా
సత్యకు తన జన్మరహస్యం చెప్పి నందా షాకిస్తాడు. అంతేకాకుండా తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం ఎవరో కూడా చెప్తాడు. మరోవైపు సత్యకు బ్రెయిన్ వాష్ చేశానని, ఇప్పుడు మొత్తం తను చెప్పిందే వింటుందని ఆదిత్యతో చెప్పి మరో ప్లాన్ వేసే పనిలో ఉన్నాడు నందా. మరి సత్య నిజంగానే నందా చెప్పినట్లు విని అతడి దగ్గరే ఉండిపోతుందా లేక భాగ్యమ్మ వాళ్లింటికి వెళఉ వెళ్తుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే20నన 238వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేయడంతో సత్య రోడ్డున పడుతుంది. తన పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తన తల్లి భాగ్యమ్మకు ముఖం చూపించుకోలేక బాధపడుతుంది. ఇది గమనించిన నందా అక్కడికి చేరుకొని సత్యతో మాటలు కలిపే ప్రయత్నం చేస్తాడు. అయితే నందాను సత్య ఛీదరించుకుంటుండంతో ఎలాగైనా సత్య పొగరును అణచివేయాలని బావిస్తాడు. సత్య జన్మరహస్యం గురించి బయటపెట్టేస్తాడు. తన కన్నతల్లి భాగ్యమ్మ కాదన్న నిజాన్ని తనకు తెలుసని చెప్తాడు. అంతేకాకుండా సత్య తల్లిదండ్రుల చావుకు కారణం కూడా భాగ్యమ్మ కుటుంబసభ్యులే అని చెప్పి సత్యకి ఊహించని షాకిస్తాడు. అయితే నిజమో కాదో అని ఆలోచిస్తుండగానే కావాలంటే మీ ఇంటికి వెళ్లి కనుక్కోపో అని నందా అని అంటాడు. మొత్తంగా సత్యను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తను చెప్పింది వినేటట్లు డ్రామా క్రియేట్ చేస్తాడు. ఇక సీన్‌కట్ చేస్తే సత్య ఇంకా ఇంటికి చేరుకోలేదని తెలిసి రుక్మిణి కంగారు పడుతుంటుంది. సత్యకు ఏమవుతుందో అని భయపడిపోతుంటుంది. వెంటనే సత్యను వెతకాలని భర్త ఆదిత్యను కోరుతుంది. ఇక ఆదిత్య బయటకు వెళ్తుండగా నందా ఫోన్ చేసి సత్య ఇప్పుడు తన దగ్గరే ఉందని, తను చెప్పినట్లు వింటుందని చెప్పడంతో ఆదిత్య షాకవుతాడు. సత్యను ఏం చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. మరి సత్య నిజంగానే నందా చెప్పినట్లు విని అతడి దగ్గరే ఉండిపోతుందా లేక భాగ్యమ్మ వాళ్లింటికి వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
Devatha : సంతోషంలో మునిగితేలుతున్న రంగా-బంతి
సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేసిందని తెలిసి రంగా తెగ సంబంరపడిపోతాడు. ఇన్నాళ్లకు తను అనుకున్నది సాధ్యమైదంటూ ఆనందంలో మునిగితేలతాడు. ఇంక ఇంటికి రమ్మని దేవుడమ్మ అడిగినా రంగా అందుకు ఒప్పుకోడు. ఇక సత్య పరిస్థితి తెలుసుకున్న భాగ్యమ్మ నిట్టూర్చింది. తన కుటుంబానికే ఇలా ఎందుకు అవుతుదని బాధపడిపోతుంది. సత్యను రోడ్డుపై చూసిన నందా అక్కడికి వచ్చి మళ్లీ తన బుద్ది చూపించుకున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ సత్యతో తిట్లు తింటాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే19న 237వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేసిందని తెలుసుకున్న రంగా ఎంతో సంతోషపడతాడు. తను అనుకున్నది నిజం అయిందంటూ తన ఆనందాన్ని బంతితో పంచుకుంటాడు. దేవుడమ్మ తన దగ్గరికి వచ్చి తలదించేకునే రోజు దగ్గర్లోనే ఉందని అంటుంబగా దేవుడమ్మ నుంచి రంగాకు ఫోన్ వస్తుంది. కనకం వచ్చిందని, వెంటనే ఇంటికి రావాలని కోరుతుంది. అయితే రంగా మాత్రం చాలా దురుసుగా మాట్లాడుతూ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని, తనకిష్టం వచ్చిందే చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సీన్ కట్ చేస్తే సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి పంపిందన్న నిజం తెలిసి భాగ్యమ్మ తట్టుకోలేకపోయింది. ఏం పాపం చేశామని నా బిడ్డలకు ఆ దేవుడు శిక్ష వేస్తున్నాడంటూ కుంగిపోతుంది. ఇక టైం బాగోలేక ఇలాంటి గతి పట్టిందని నందా అనుకుంటుండగా రోడ్డుపై సత్య కనిపిస్తుంది. దీంతో షాకైన నందా నిన్ను కూడా గెంటేసిందా అంటూ సత్యతో సెటైరికల్‌గా మాట్లాడతాడు. నిన్ను భార్యగా ఫిక్సయ్యానని, తనతో పాటు వచ్చేయమని నందా సత్యను కోరతాడు. దీంతో గట్టి సమాధానం చెప్పిన సత్య నీ వల్లే ఇలా రోడ్డు మీదకి వచ్చానని బాధపడుతుంది. ఇంత జరిగినా బుద్ది మార్చుకోని నందా సత్య పొగరుని దింగాలని ప్లాన్ చేస్తుంటాడు. అదేంటో తెలియాల్సి ఉంది. -
Devatha : ఇంట్లోంచి వెళ్లిపోయిన సత్య అఘాయిత్యం చేసుకుంటుందా?
సత్యను దేవుడమ్మ ఇంట్లొంచి గెంటేస్తుంది. రుక్మిణి ఎంత బతిమాలినా దేవుడమ్మ కరగదు. ఇక తనకు న్యాయం జరిగేవరకు ఆ ఇంట్లోనే ఉంటానని కనకం దేవుడమ్మకి చెప్తుంది. ఇక సత్య-నందాల విషయం ఇంత వరకు పసిగట్టలేకపోయిన ఆదిత్యను తిట్టిన దేవుడమ్మ అతడి అసమర్థను ఎత్తిచూపుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే18న 236వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేస్తుంది. అనుకోని పరిణామంతో షాక్ అయిన రుక్మిణి సత్యను ఇంట్లోంచి పంపించొద్దని దేవుడమ్మను వేడుకుంటుంది. అయినా సరే దేవుడమ్మ కరగదు సరి కదా ఇలానే చేస్తు నువ్వు కూడా ఇంటి బయట ఉంటావ్ అంటూ రుక్మిణిని హెచ్చరిస్తుంది. ఇక సత్య-నందాలు చేసిన తప్పుతో ఇంట్లోంచి రెండు శవాలు వెళ్లిపోయాయని, అందరూ తలంటు స్నానం చేయాలని ఇంట్లో వాళ్లని ఆదేశిస్తుంది దేవుడమ్మ. సీన్‌కట్ చేస్తే తనకు జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చెబుతావంటూ కనకం దేవుడమ్మను ప్రశ్నిస్తుంది. తనకు న్యాయం జరిగేంత వరకు ఈ ఇంట్లోనే ఉంటానని చెప్తుంది. ఇక సత్యను ఇంట్లోంచి పంపించడం పట్ల రుక్మిణి చాలా బాధపడుతుంది. ఎలా అయినా దేవుడమ్మను క్షమించమని చెప్పమని రుక్మిణి ఆదిత్యను కోరుతుంది. అయితే సత్య పేరు ఎత్తగానే దేవుడమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇద్దరూ తనతో పాటే కలిసి చదువుకున్నా వాళ్ల మానసిక స్థితి ఏంటో తెలుసుకోలేకపోవడం నీ అసమర్థత అంటూ ఆదిత్య లోపాలను ఎత్తిచూపుతుంది. -
Devatha : సత్యను కొట్టిన దేవుడమ్మ..ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఆదేశం
నందాను ఇంట్లోంచి గెంటేస్తారు. ఇదే అవకాశం అన్నట్లు దేవుడమ్మ తప్పులను ఎత్తిచూపుతూ దారుణంగా అవమానిస్తుంది రాజేశ్వరి. దీంతో సత్యను లాగి కొట్టిన దేవుడమ్మ తనను మోసం చేసినందుకు సత్యపై మండిపడుతుంది. వెంటనే తన ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే17న 235వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. నందా అసలు నైజాన్ని రుక్మిణి బయటపెడుతుంది. దీంతో నందాను తన కళ్లముందు నుంచి వెళ్లకపోతే చంపేస్తానని దేవుడమ్మ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే అక్కడ్నుంచి జారుకుంటాడు నందా. సరిగ్గా అదే సమయానికి రాజేశ్వరి అక్కడికి వస్తుంది. గతంలో తన కుటుంబంలో ఇలాంటి తప్పే జరిగితే మోసం చేసినవాడు సహా కుటుంబం మొత్తాన్ని ఊరు నుంచి వెళ్లగొట్టిన దేవుడమ్మ ఇప్పుడేం న్యాయం చేస్తుందంటూ ప్రశ్నిస్తుంది. నందా గురించి ముందే తెలిసినా సత్య డ్రామాలు ఆడిందా అంటూ దేవుడమ్మ మనసులో విషాన్ని నూరిపోస్తుంది. పెద్దరికం తెలియని నువ్వు ఊళ్లో అందరికి నీతులు చెప్తావా అంటూ దేవుడమ్మను దారుణంగా అవమానిస్తుంది. దీంతో కోపంతో ఊగిపోయిన దేవుడమ్మ సత్యపై చేయిచేసుకుంటుంది. కన్నబిడ్డలా చూసుకున్న తనను మోసం చేశావంటూ సత్యపై మండిపడుతుంది. ఎవరో అనామకుడిని ఇంటికి తెచ్చి ఇంత పెద్ద తప్పు ఎలా చేయాలనిపించిందంటూ ఫైర్ అవుతుంది. వెంటనే తన ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది. అయితే నందా తప్పు చేస్తే తన చెల్లిని ఎందుకు శిక్షిస్తున్నారంటూ రుక్మిణి అడ్డుచెప్పే ప్రయత్నం చేసినా దేవుడమ్మ వినిపించుకోందు. సత్య చేసింది మోసం కాదు, నేరమని ఘాటుగా బదులిస్తుంది. సత్య కూడా క్షమించమని దేవుడమ్మను వేడుకున్నా ఆమె మాత్రం కరగదు సరి కదా సత్యపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీళ్లేదని ఆఙ్ఞాపిస్తుంది. -
Devatha : నందాను ఇంట్లోంచి గెంటేసిన రుక్మిణి
నందా నిజస్వరూపం గురించి పూస గుచ్చినట్లు వివరించిన సత్య. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరు అని ప్రశ్నించిన రుక్మిణి. నందాను ఇంట్లోంచి బయటకు గెంటేసిన రుక్మిణి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 234వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. నందా బండారం బయటపడింది. ఇన్ని రోజులుగా నందా పెడుతున్న టార్చర్ గురించి సత్య రుక్మిణితో చెబుతుంది. తామిద్దరికీ ఏ సంబంధం లేదని, అనుకోని పరిస్థితుల్లో నందా తనకు కనపించాడని, తన అనుమతి లేకుండానే నందా తన లైఫ్‌లోకి వచ్చాడని బయటపెట్టేస్తుంది. అయితే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు అన్న నిజాన్ని మాత్రం చెప్పదు. ఇక నందా గురించి తెలుసుకున్న రుక్మిణి కోపంతో రగిలిపోతుంది. నందా తలకు కొడవలి పెట్టి తాను చెప్పినట్లుగా ఓ పేపర్లో రాయమని చెప్తుంది రుక్మిణి. ఊహించని పరిణామంతో షాకైన నందా రుక్మిణి చెప్పినట్లు చేస్తాడు. ఇక నందాను ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంటే దేవుడమ్మ ఎంట్రీ ఇస్తుంది. ఏం జరిగిందంటూ ప్రశ్నించగా నందా బండారం మొత్తం బయపెట్టేస్తుంది రుక్మిణి. సత్య కోసం 2 లక్షలు పెట్టి నగ తెచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించాడని, అది గిల్టు నగ అని తేలిపోయి, నందా చరిత్ర బయటపడిందని వివరిస్తుంది. సత్యని ఢోకా చేయడానికి ఇక్కడకి వచ్చాడని, తనకున్న అప్పులు తీర్చుకునేందుకు ఈ పథకం రచించినట్లు వివరిస్తుంది. ఒక నందా అసలు స్వరూపం తెలుసుకన్న దేవుడమ్మ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కోపంతో నందా సత్య-ఆదిత్యల ప్రేమ విషయం బయటకు చెప్పేస్తాడా అన్నది తర్వాతి ఎపిసోడ్లో తేలనుంది. -
Devatha : నందా గురించి రుక్మిణితో నిజం చెప్పేసిన సత్య
నందా-సత్యలు ప్రేమికులు కాదని నిర్ధారణకు వచ్చిన రుక్మిణి, కనకం. సత్య సీమంతానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన దేవుడమ్మ. మరోవైపు నందా ఆగడాలు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సత్య. నందా నిజస్వరూపాన్ని బయటపెట్టిన సత్య. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 233వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. కనకం వేసిన మాస్టర్ ప్లాన్‌తో నందా-సత్యలు దొరికిపోతారు. వాళ్లు చెప్పే సమాధానాలు ఒక్కటీ మ్యాచ్ కాకపోవడంతో సత్య-నందాలు ప్రేమికులు కాదని నిర్ధారణకు వస్తారు. దీంతో నిజం ఎలా అయినా బయటపెట్టి సత్య జీవితాన్ని కాపాడాలని అనుకుంటారు. సీన్ కట్‌చేస్తే ఈశ్వర్ ప్రసాద్‌కు కాల్ చేసిన దేవుడమ్మ తాను త్వరలోనే ఇంటికి వస్తున్నానని ఈలోగా సత్య సీమంతానికి కావల్సిన ఏర్పాటు చేయాలని చెప్తుంది. దీంతో ఫంక్షన్ హాలు సహా అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని ఈశ్వర్ ప్రసాద్ మిగతా కుటుంబసభ్యులకు చెప్తాడు. ఇక సత్య కోసం ఒక నగను బహుమతిగా ఇచ్చిన నందా, సత్యపై ప్రేమ ఒలకొబోస్తూ దీని ధర 2 లక్షలు ఉంటుందని బిల్డప్ ఇస్తాడు. దీంతో సత్యపై నందాకు ఎంతో ప్రేమ ఉందని, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని రుక్మిణి కనకంతో అంటుంది. అయితే నందా ఇచ్చిన నగను చూస్తుండగా అనుకోకుండా కిందపడి విరిగిపోతుంది. నగను తదేకంగా పరిశీలించిన కనకం ఇది గిల్టు నగ అని తేల్చేస్తుంది. దీంతో నందాపై కోపంతో రగిలిపోయిన రుక్మిణి అసలు ఈ నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో తెలుసుకోవాలని సత్యను అడుగుతుంది. అయితే అప్పటికే సత్య ఆత్మహత్యయత్నినికి ప్రయత్నించిదని తెలుసుకున్న రుక్మిణి సత్యపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ నిలదీస్తుంది. నందాపై రుక్మిణికున్న అనుమానాలను పటాపంచులు చేస్తూ నందా గురించి నిజాలు బయటపెట్టేసింది సత్య. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు నందా కారణం కాదని, అసలు తామిద్దరికి ఎటువంటి సంబంధం లేదన్న నిజాన్ని బట్టబయలు చేసేస్తుంది. దీంతో మరి నీ కడుపుతో పెరగుతున్న బిడ్డకు తండ్రెవరు అని రుక్మిణి నిలదీస్తుంది. మరి సత్య నిజం చెప్పేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
Devatha: కనకం మాస్టర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన సత్య-నందా
నందా ప్రవర్తనపై కనకం,రుక్మిణి సహా ఈశ్వర్ ప్రసాద్‌కు కూడా అనుమానం కలుగుతుంది. రాజేశ్వరితో నందా ఫోన్ మాట్లాడటం రుక్మిణి స్వయంగా వింటుంది. సత్య-నందాలు నిజంగానే ప్రేమికులా అన్న విషయం తెలుసుకోవడానికి కనకం ఓ మాస్టర్ ప్లాన్‌ను రచిస్తుంది. ఇందులో సత్య-నందాలు బొక్కబోర్లాపడతారు... ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 232వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్య-నందాల పెళ్లి విషయంపై ఆదిత్య సీరియస్ అవుతాడు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి ముహూర్తం ఎలా పెట్టారంటూ ఫైర్ అవుతాడు. దీనికి పెళ్లి నాది కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని నందాను ఆదిత్య అడగ్గా, ఈశ్వర్ ప్రసాద్ కల్పించుకొని ఆదిత్యకు బాధ్యత ఉంటుంది కదా అని నందాకు సర్దిచెప్తాడు. ఇక నందా వాలకంపై కనకంతో పాటు రుక్మిణి సైతం అనుమానం వ్యక్తం చేస్తుంది. కనకంతో కలిసి నందా ఎలాంటి వాడన్నది ఆదిత్యను అడుగుతుంది. అయితే సూటిగా చెప్పకుండా నందా కొంచెం వేరేలా ఉంటాడు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు అంటూ అతడిపై అనుమానం వచ్చేలా మాట్లాడుతాడు. ఇక దేవుడమ్మ భర్త ఈశ్వర్ ప్రసాద్‌కు కూడా నందా ప్రవర్తనపై అనుమానం కలుగుతుంది. ఈ విషయం వెంటనే దేవుడమ్మతో చెప్పాలనుకుంటాడు. కానీ వేరే ఊరు వెళ్లిన ఆమెకి ఇప్పుడు ఈ విషయాలు చెప్పి ఎందుకు బాధపెట్టడం అని ఫోన్ కట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే నందా రాజేశ్వరితో మాట్లాడటం రుక్మిణి స్వయంగా వింటుంది. అయితే ఆ రాజేశ్వరి దేవుడమ్మ శత్రువేనా, కాదా అన్నది ఎలా తెలుసుకోవాలని అని కనకంను అడుగుతుంది. దీంతో నందా చూపు, మాటతీరు అంతా తేడాగా ఉందని, అసలు అతను చెప్పేవన్నీ అబద్దాలేమో అని కనకం అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో ఎలా అయినా నందా బండారం బయట పెట్టాలని రుక్మిణి- కనకం నిర్ణయించుకుంటారు. ఇందుకోసం కనకం ఓ మాస్టర్ ప్లాన్‌ను రచించింది. దీని ప్రకారం కనకం సత్యతో, రుక్మిణి నందా దగ్గరికి వెళ్లి మీరు ఎక్కడ కలిశారు? మొదట ఎవరు ప్రపోజ్ చేశారు? ఏ గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకున్నారు వంటి ప్రశ్నలను అడగుతారు. ఇక్కడే సత్య-నందాలు దొరికిపోయారు. ఇద్దరూ వేరు వేరు సమాధానాలు చెప్తారు. దీంతో రుక్మిని-కనకంల అనుమానం మరింత బలపడుతుంది. మరి వీళ్ల తర్వాతి ప్లాన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. -
Devatha : నందా నిజ స్వరూపం కనకం తెలుసుకుంటుందా?
నందా ప్రవర్తనపై ఓ కన్నేసిన ఉంచాలని రుక్మిణి డిసైడ్ అవుతుంది. ఇక నందా చరిత్ర తెలుసుకోవాలని కనకం ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు వారం రోజుల్లో తాను సత్యని పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరికి షాకిస్తాడు నందా..ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 231వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. నందా ప్రవర్తనపై కనకం అనుమానం నిజమై ఉంటుందా అని రుక్మిణి ఆలోచిస్తుంటుంది. ఇదే విషయాన్ని భర్త ఆదిత్యతో అడిగి తెలుసుకుంటుంది. ఇద్దరూ ఒకే కాలేజీలో చదివారు కదా నందా నిజంగానే మంచివాడా అని అడుగుతుంది. దీంతో ఇదే మంచి ఛాన్స్ అనుకున్న ఆదిత్య నందా గురించి ఇంక్వ్యైరీ చేయాలని, అతని గురించి తనకూ పెద్దగా తెలియదని చెప్తాడు. ఒకవేళ పెళ్లి తర్వాత నందా మంచివాడు కాదని తెలిస్తేఘేమీ చేయలేమని, సత్య జీవితం నాశనం అవుతుందని హెచ్చరిస్తాడు. కాబట్టి నందా ఎలాంటి వాడో తెలుసుకోవాలని, ఆ తర్వాతే పెళ్లి చేయాలని చెప్తాడు. దీనికి సరేనన్న రుక్మిణి ఇప్పట్నుంచి నందాపై ఓ కన్నేసి ఉంచుతానని చెప్తుంది. ఇక నందా తీరుపై మొదటినుంచి అనుమానం వ్యక్తం చేస్తోన్న కనకం అతడి వివరాలు కనుక్కోవాలని ఆరాట పడుతుంది. ఎంత ఆస్తి ఉంది? ఎక్కడి నుంచి వచ్చాడు వంటి ప్రశ్నలను అడుగుతుంది. దీంతో తన గుట్టు రట్టవుతుందే అని భయపడిన నందా టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కనకం మాత్రం అదే విధంగా తన ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దీంతో తనపై కనకంకి అనుమానం వచ్చిందని గ్రహించిన నందా ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే నందా-సత్యలు ఇప్పటివరకు ప్రేమగా ఉండటం చూడలేదని, ఇందులో ఏదో రహస్యం దాగుందని కనకం కనిపెడుతుంది. అదేంటో కనిపెట్టాలని ప్లాన్లు వేస్తుంది. మరోవైపు సత్య పక్కన నందా కూర్చోబోతుండగా ఖుర్చీని పక్కకు లాగి తాను కూర్చుంటుంది. పెళ్లి కాకుండా పక్కపక్కన కూర్చోవద్దని చెప్తుంది. దీంతో ఒళ్లు మండిన నందా.. మీరేం కంగారు పడకండి అని, మరో వారం రోజుల్లో తమ పెళ్లి ఉందని చెప్పి అందరికి షాకిస్తాడు. దీనిపై మిగతా కుటుంబసభ్యులు ఎలా రియాక్ట్ అవుతారా? అసలు ఈ నిర్ణయాన్ని ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
Devatha Serial: నందా చెంప చెళ్లుమనిపించిన సత్య
నందా-సత్యల తీరుపై కనకం అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని రుక్మిణితో కూడా చెప్తుంది. మరోవైపు నందా ప్రవర్తనతో విసిగిపోయిన సత్య అతడి చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో అంతు చూస్తానంటూ నందా రివేంజ్ ప్లాన్ చేయాలని చూస్తాడు..ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 230వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. ఆదిత్య ఇచ్చిన 10 లక్షల రూపాల చెక్కును నందా తీసుకుంటాడు. అయితే ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే అని, తనకు ఊర్లో ఉన్న 5ఎకరాల పొలం రాసివ్వాలని డిమాండ్ చేస్తాడు. నందా ఇలా ప్లేటు మార్చడంతో షాకైన ఆదిత్య ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటాడు. ఇక నందా ప్రవర్తనపై మొదటినుంచి అనుమానం వ్యక్తం చేస్తోన్న కనకం అదే విషయాన్ని రుక్మిణితో ప్రస్తావిస్తుంది. నందా వాలకం చాలా అనుమానంగా ఉందని, అసలు అతని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారా అని ప్రశ్నిస్తుంది. దీంతో రుక్మిణికి కూడా అనుమానం వస్తుంది. ఎందుకైనా మంచిది నందాపై ఒక కన్నేసి ఉంచాలని అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే.. నందా తీరుతో కుమిలిపోతున్న సత్య తన గదిలో అంటించిన చిన్ననాటి నందా ఫోటోలను చింపి పారేస్తుంది. అదే సమయంలో రుక్మిణి అక్కడికి రావడం గమనించిన నందా.. సత్య నిద్ర పోతుందని అబద్దం చెప్పి రుక్మిణిని అక్కడ్నుంచి పంపిస్తాడు. ఇక తన బెడ్‌పై నందా ఉండటం చూసి సత్య మరింత కోపంతో ఊగిపోతుంటుంది. నందా చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో నీ అంతు చూస్తానని నందా వార్నింగ్ ఇస్తాడు. ఇదే విషయాన్ని ఆదిత్యతో చెబుతూ తనను చాలా అవమానించారని, ఇక నిజాన్ని అందరికి చెప్పి వెళ్లిపోతానని నందా అంటాడు. సరిగ్గా ఇదే సమయానికి అక్కడికి వచ్చిన కనకం ఏంటా నిజం? ఎక్కడికి వెళ్తావు అని ఆరాతీస్తుంది. దీంతో బయటకు తీసుకెళ్తా అంటే సత్య రావడం లేదని, అందుకే నందా ఫీల్ అవుతున్నాడని ఆదిత్య కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ నందా తీరుపై కనకం మనసులో మాత్రం అనుమానం అలానే ఉంటుంది. ఇక నందా శని ఎప్పుడు విరగడవుతుందా అని ఆదిత్య తల పట్టుకుంటాడు. -
Devatha : నందాకు 10 లక్షల చెక్ ఇచ్చిన ఆదిత్య
నందా-సత్యల సఖ్యతపై రుక్మిణి అనుమానం వ్యక్తం చేస్తుంది. సత్యను విడచి వెళ్లాల్సిందిగా ఆదిత్య నందాను కోరతాడు. 10 లక్షల రూపాయల చెక్కును కూడా అందిస్తాడు. మరి నందా ఆ డబ్బులను తీసుకొని వెళ్లిపోతాడా? నందాపై అనుమానం వచ్చిన కనకం ఏం చేస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత ఎపిసోడ్ 229వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. అత్యమ్మ లేకపోతే ఇళ్లంతా బోసిపోయిందని రుక్మిణి ఆదిత్యతో అంటుండగా నందా ఎంటర్ అయ్యాడు. కావాలని మాట కలుపుదామని ట్రై చేసి రుక్మిణి ముందు బుక్కవుతాడు. మీరు లేకపోతే కూడా ఇళ్లంతా ఇలాగే ఉంటుందని,అన్నయ్య(ఆదిత్య)కు కూడా ఏమీ తోచదని రుక్మిణిని ఉద్దేశించి అంటాడు. సత్య కూడా ఏదో పొగొట్టుకున్నట్లు ఉంటుందని చెప్తాడు. అయితే సత్య, నువ్వు మాట్లాడునుకేది ఈ ఇంట్లో ఇంత వరకు చూడలేదు అని రుక్మిణి అనుమానం వ్యక్తం చేయగా, దేవాలయం లాంటి ఈ ఇంట్లో పెళ్లి కాకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు అని యాక్టింగ్ చేస్తాడు నందా. తానెక్కడ దొరికిపోతానో అని కంగారు పడతాడు. రుక్మిణికి అనుమానం మొదలైందని, త్వరలోనే నీ గుట్టు రట్టవుతుందని ఆదిత్య నందాకు వార్నింగ్ ఇస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే ఇంట్లోనే మాట్లాడమని, బయటకు వెళ్లొద్దని రుక్మిణి సత్యతో అంటుంది. ఇక నందా గురించి ఆలోచిస్తూ తన జీవితం నాశనమైపోయిందంని భాదపడుతుంటుంది సత్య. ఇక నందా ఎలాంటివాడో తెలుసుకోవాలని కనకం ఆదిత్యను ప్రశ్నలడుగుతుంటుంది. కాలేజీ రోజుల్లో ఎలా ఉండేవాడు అంటూ ఎంక్వైరీ చేయగా, కూల్‌గా అక్కడ్నుంచి తప్పించుకుంటాడు ఆదిత్య. సీన్ కట్ చేస్తే.. మాట్లాడాలని చెప్పి సత్య, నందాను టెర్రస్ మీదకి పిలుస్తాడు ఆదిత్య. ఈ డ్రామాలు ఆపేసి సత్యని వదిలేయాల్సిందిగా ఆదిత్య నందాను కోరతాడు. ఇందుకు 10 లక్షల రూపాయల చెక్కును అందిస్తాడు. ఇది చూసిన నందా నీ ప్రేమ గొప్పది..నీ మనసు గొప్పదంటూ ఆదిత్యను ప్రశంసిస్తాడు. ఇక వచ్చిన రోజే ఈ చెక్కు ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేదని, ఇకపై మీకు కనిపించకుండా వెళ్లిపోతానని నందా ఆదిత్యతో అంటాడు. -
Devatha serial : సత్యని ఘోరంగా అవమానించిన కనకం
దేవడమ్మపై కనకం చిర్రుబుర్రలాడుతూనే ఉంటుంది. తనకు అన్యాయం జరగడానికి దేవడమ్మే కారణమంటూ దెప్పిపొడుస్తుంది. మరోవైపు పెళ్లికి ముందే కడుపు చేయించుకుందంటూ సత్యని అనరాని మాటతో అవమానిస్తుంటుంది. కనకంను తన ట్రాప్‌లోకి ఎలా తెచ్చుకోవాలా అని నందా ఆలోచిస్తుంటాడు..ఇలా దేవుడమ్మ సీరియల్ నేడు (మే8న) 228వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. పుట్టింటి నుంచి రావడం రావడంతోనే దేవుడమ్మపై ఆడిపోసుకుంటుంది రంగా భార్య కనకం. ఆ తర్వాత దేవుడమ్మ ఇంటికి వెళ్లి పెళ్లికి ముందే కడుపు చేయించుకుందంటూ సత్యని సూటిపోటి మాటలు అంటుండగా, రుక్మిణి వాదిస్తుంది. ఏదైనా ఉంటే తన అత్మమ్మ దేవుడమ్మతో చేసుకోవాలని, అనవరంగా తమతో గొడవలు పెట్టుకోవద్దని ఘాటుగా బదులిచ్చింది. దీంతో చేయాల్సిన తప్పులు చేసి ఇది తప్పు అంటే మాత్రం రోషం పొడుచుకొచ్చిందా అంటూ మరోసారి సత్య-రుక్మిణిలపై విరుచుకుపడుతుంది. సీన్ కట్ చేస్తే సత్య సీమంతం తంతు తర్వాత ఊరు విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తన బతుకు అగమ్యగోచరంగా మారుతుందని ఆదిత్య నందాకి వార్నింగ్ ఇస్తాడు. ఆడిన డ్రామాలు చాలని నందాపై ఫైరవుతాడు. సత్యని ఇంతలా ఇబ్బందిపెడుతున్నావని తెలిస్తే తన తల్లి దేవుడమ్మ నిన్ను బతకనియ్యదు అని నందాతో చెప్తాడు. అయితే ఆదిత్య బెదిరింపులకు లొంగని నందా తనతో పెట్టుకుంటే అసలు నిజాన్ని ఊరి పెద్ద మనుషులకు చెప్పి పరువుతీస్తానని హెచ్చరిస్తాడు. సీన్ కట్ చేస్తే తన తల్లి దేవుడమ్మపై నిందలు వేయొద్దని ఆదిత్య తన పిన్ని కనకంతో వాదిస్తాడు. తప్పు బాబాయి చేస్తే తన తల్లిని అనడం ఏంటని ప్రశ్నిస్తాడు. సత్యని ఇంటికి తెచ్చినందుకు ఏదో ఆస్తులు కరిగిస్తుందంటూ తన తల్లిపై లేనిపోని ఆబంఢాలు వేయొద్దని చెప్తాడు. అయితే పెళ్లి చేసినప్పుడు ఉన్న బాధ్యత ఇప్పుడు కూడా నిలబెట్టుకోవాలని, తన భర్త రంగా వల్ల తన జీవితం నాశనం అయ్యిందని, ఇందుకు ఒక రకంగా కారణం దేవుడమ్మే అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కనకం. సీన్ కట్ చేస్తే కనకంతో ఎలా మాట కలపాలా అని నందా ఆలోచిస్తుండగా కనకం స్వయంగా వచ్చి అతని వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. దీంతో నిజాలు బయటపడతాయో అని తెలివిగా మీకు చాలా అన్యాయం జరిగింది ఆంటీ అంటూ టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. -
Devatha : సత్య అంటే నీకు మస్తు ప్రేమ కదా పెనిమిటి : రుక్మిణి
సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్లాడో ఆదిత్య తెలుసుకుంటాడు. మరోవైపు బంతితో కలిసి రంగా వెళ్లిపోయడన్న విషయం తెలిసి రంగా భార్య ఊరు వచ్చి దేవుడమ్మపై నిందలు వేస్తుంది.. ఇలా దేవత సీరియల్ నేడు (మే7న)227వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇవాల్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేయండి.. సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియక ఆదిత్య టెన్షన్ పడుతుంటాడ. ఏమైందని రుక్మిణి అడగ్గా..ఏమీ లేదు..స్టడీస్ గురించి ఆలోచిస్తున్నానంటూ అబద్దం చెప్తాడు. ఇక సత్య ఎక్కడికి వెళ్లింది? అసలే ఒట్టి మనిషి కూడా కాదు అంటూ అభిమానం చూపిస్తుంటాడు. దీనికి ఒకింత షాక్ అయిన రుక్మిణి..సత్య అంటే నీకు మస్తు ప్రేమ కదా అని అమాయకంగా అడుగుతుంది. మీ చెల్లెలు అంటే ఈ ఇంటి మనిషి కంటే అందుకే అంటూ ఆదిత్య తడుముకుంటూ సమాధానం చెప్తాడు. ఇక రంగా బంతితో కలిసి ఊరు వదిలేసి వెళ్లిపోయాడన్న విషయాన్ని రుక్మిణి తన మామ ఈశ్వర్ ప్రసాద్‌తో చెప్పగా పరువు తీసాడంటూ రంగాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నందాను సత్య లైఫ్ నుంచి ఎలా తప్పించాలో తెలియక తీవ్రంగా మధనపడుతుంటాడు. ఇంతలో నందా వచ్చి బయటకు వెళ్లాలి కారు తాళాలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. మొదట ఇవ్వనని భీష్మించుకున్న ఆదిత్య సడెన్‌గా రుక్మిణి వచ్చేసరికి కాస్త తగ్గుతాడు. ఇక భార్య కూడా నందాకు సపోర్ట్ చేయడంతో కారు తాళాలు ఇస్తాడు. మంచి ముహూర్తంలో సత్య మెడలో తాళి కడతానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే.. నందా ఎక్కడికి తీసుకెళ్లాడు ఏం చేశాడు అన్న వివరాలను సత్యని అడిగి తెలుసుకుంటాడు ఆదిత్య. తనను భార్యలా ఫీల్ అవొద్దని నందాకు వార్నింగ్ ఇవ్వమని ఆదిత్య సత్యని కోరతాడు. నేను ప్రేమించింది ఇతన్నే..నా బిడ్డకు తండ్రి ఇతనే అనే పరిచయం చేసిన నందాను ఇప్పడు కాదు అని ఎలా చెప్పగలను? ఏమని చెప్పగలనంటూ సత్య బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే బంతితో రంగా వెళ్లిపోయాడన్న నిజం తెలిసి రంగా భార్య ఊరికి చేరుకుంటుంది. పిన్నిని పలకరించడానికి వెళ్లిన ఆదిత్యతో దేవుడమ్మపై అగ్గి మీద గుగ్గిలం అవుతుంటుంది.