Devatha : నిజం తెలిసి ఇంట్లోంచి వెళ్లిపోతానన్న సత్య | Devatha Serial : Basha Requests Satya Not To Leave The House | Sakshi
Sakshi News home page

Devatha : నిజం తెలిసి ఇంట్లోంచి వెళ్లిపోతానన్న సత్య

Published Sat, May 22 2021 2:49 PM | Last Updated on Sat, May 22 2021 3:19 PM

Devatha Serial : Basha Requests Satya Not To Leave The House - Sakshi

సత్యను వెతకడానికి వెళ్లిన ఆదిత్యపై దేవుడమ్మ మండిపడుతుంది. తన మాటను కాదని సత్య కోసం వెళ్లడం ఏంటని నిలదీస్తుంది. మరోవైపు తన తల్లిదండ్రులు ఎవరో చెప్పమని సత్య భాగ్యమ్మని ప్రశ్నిస్తుంది. తన అమ్మానాన్నలు ఎలా చనిపోయారో చెప్పాలని భాగ్యమ్మను కోరుతుంది. ఇక చేసేదేమీ లేక భాగ్యమ్మ నిజాన్ని బయటపెట్టేస్తుంది. సత్య తల్లిదండ్రుల చావుకు రుక్మిణి అని, అయితే అది తెలియక చేసిన తప్పని భాగ్యమ్మ చెప్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత సీరియల్‌ మే22న 240వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్యను వెతకడానికి ఎందుకు వెళ్లావంటూ దేవుడమ్మ ఆదిత్యని నిలదీస్తుంది. తన మాటంటే లెక్కలేదా అంటూ ఆదిత్యపై మండిపడుతుంది. ఇక సత్య-రుక్మిణి జీవితం ఇలా అవ్వడానికి తానే కారణమని, తనే సరైన నిర్ణయం తీసుకొని ఉంటే సత్యకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆదిత్య తనను తాను శిక్షించుకుంటాడు. ఇక తన జన్మరహస్యం గురించి నందా చెప్పిన నిజాలను తలుచుకొని సత్య బాధపడుతుంది. మరోవైపు తన బిడ్డను ఈ సమాజం ఎలా స్వాగతిస్తుందో అని కుమిలిపోతుంటుంది. తండ్రి ఎవరో తెలియకుండా తాను పెంచగలనా అని తనను తానే ప్రశ్నించుకుంటుంది.

సీన్‌కట్‌ చేస్తే.. ఊరిలో వాళ్లు సైతం సత్యకు జరిగిన అవమానంపై మాట్లాడటం సత్య వింటుంది. భాగ్యమ్మ దగ్గరకు వచ్చి తాను ఈ ఇంట్లోంచి వెళ్లిపోతానని, అప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురుకావని చెప్తుంది. భాగ్యమ్మ అందుకు అడ్డు చెబుతుండటంతో తన జన్మరహస్యం గురించి చెప్పమని సత్య నిలదీస్తుంది. దీంతో సత్య తన కన్నకూతురు కాదన్న నిజాన్ని చెప్తుంది. అంతేకాకుండా సత్య తల్లిదండ్రులు చనిపోవడానికి గత కారణాలను సైతం బయపెడుతుంది. ఇక ఈ నిజం తనకు తెలుసని రుక్మిణితో చెప్పొద్దని సత్య కోరుతుంది. నిజం తెలుసు కాబట్టి ఈ అవమానాలు భరించలేక సత్య ఊరు విడిచి వెళ్తుందా లేదా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement