Devatha : రుక్మిణికి షాక్‌..ఊహించని కోరికను బయటపెట్టిన సత్య | Devatha : Satya Makes An Unexpected Request To Rukmini | Sakshi
Sakshi News home page

Devatha : రుక్మిణికి షాక్‌..ఊహించని కోరికను బయటపెట్టిన సత్య

Published Wed, Jul 7 2021 3:12 PM | Last Updated on Wed, Jul 7 2021 3:23 PM

Devatha : Satya Makes An Unexpected Request To Rukmini - Sakshi

రుక్మిణి బయటపెట్టిన నిజంతో ఆదిత్య తల్లి ముందు దోషిగా నిలబడతాడు. నిజం ఏంటో చెప్పాలని దేవుడమ్మ దగ్గరకు వెళ్తాడు. అయితే అసలు ఆదిత్య ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా వినేందుకు దేవుడమ్మ సిద్ధపడదు. తన పెంపకంపై మచ్చ తీసుకువచ్చావంటూ ఆదిత్యపై నిందలేస్తుంది. కాళ్ల మీద పడి ప్రాధేయపడినా కనికరం చూపదు. సీన్‌కట్‌ చేస్తే.. ఎంత చెప్పినా వినకుండా నువ్వు అనుకున్నదే చేశావంటూ సత్య రుక్మిణిపై కోపంగా ఉంటుంది. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉందని చెప్తుంది. అదేంటో తెలియాలంటే ఎపిసోడ్‌లో ఎంటర్‌ అవుదాం. దేవత సీరియల్‌ జులై7న 279వ ఎపిసోడ్‌ నాటి విశేషాలను తెలుసుకుందాం. 

రుక్మిణి బయటపెట్టిన నిజంతో ఆదిత్య తల్లి ముందు దోషిగా మిగులుతాడు. ఇది జీర్ణించుకోలేకపోతున్న ఆదిత్య అసలు సత్యతో ఏం జరిగిందన్న నిజాన్ని దేవుడమ్మకు చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. తన తప్పు లేదని తల్లికి తెలియజేయాలని అనుకుంటాడు. అయితే ఆదిత్య చెప్పేది వినేందుకు దేవుడమ్మ నిరాకరిస్తుంది. ఇన్నాళ్లుగా పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావని అంటుంది. కొడుకు తప్పు చేశాడంటే, అందులో తల్లి పాత్ర కూడా ఉంటుందని, ఈ పాపంలో తననూ భాగం చేశావని చెప్తూ దేవుడమ్మ కన్నీటి పర్యంతం అవుతుంది. నిజానికి ఇందులో తన తప్పేం లేదని ఆదిత్య చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా దేవుడమ్మ వినడానికి సిద్ధపడదు. కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగానా కనికరం చూపదు.

సీన్‌కట్‌ చేస్తే.. జరిగిన దాన్ని గుర్తు చేసుకొని సత్య బాధపడుతుంది. ఇలా జరగడానికి కారణం నువ్వే కదా అని రుక్మిణిని నిందిస్తుంది. ఎంత చెప్పినా వినకుండా నువ్వు చెయ్యాలనుకున్నదే చేశావ్‌ కదా అక్కా అంటూ రుక్మిణిని నిలదీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తన బిడ్డను ఈ ఇంటి వారసుడిగా చేయాలని సత్య కోరుతుంది. నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే ఇదొక్కటే పరిష్కారం అని బదులిస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను నీ బిడ్డగా చూసుకొని పెంచాలని సత్య రుక్మిణిని కోరుతుంది. మరోవైపు రుక్మిణి వద్ద నుంచి సాంత్వన పొందాలని ఆదిత్య భావించినా అవి కలలుగానే మిగిలిపోతాయి. తను ఎంతలా బాధపడుతున్నా రుక్మిణి ఆదిత్యను దగ్గరికి తీసుకోదు. సీన్‌ కట్‌ చేస్తే..తన ఇద్దరి కూతుళ్ల జీవితాలు ఇలా అయిపోయాయంటూ భాగ్యమ్మ బాధలో మునిగిపోతుంది. ఒకరికి న్యాయం చేస్తే..మరొకరు బలవుతారంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement