ఆదిత్యతో రుక్మిణి ప్రవర్తనపై దేవుడమ్మకు సందేహం కలుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నావంటూ నేరుగా రుక్మిణినే నిలదీస్తుంది. సత్యపై ప్రేమ ఉండటం తప్పులేదని, అలా అని భర్తను నిర్లక్ష్యం చేస్తే తాను సహించలేనని పేర్కొంటుంది. తన కొడుకు బాధ పడితే చూడలేనని చెప్పి తన బాధ్యతను గుర్తు చేస్తుంది. దీంతో దేవుడమ్మ అప్పుడే కనిపెట్టిందని, కానీ ఆమెను బాధపెట్టాలనుకోవడం తన ఉద్దేశం కాదని రుక్మిణి మనసులో అనుకుంటుంది. మరోవైపు సత్య-ఆదిత్యలు ఫోన్‌లో మాట్లాడుకోవడన్ని రుక్మిణి పసిగడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జూన్ 28న 271వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
ఆదిత్యతో రుక్మిణి ప్రవర్తిస్తున్న తీరుకు విసుగుపోయిన దేవుడమ్మ రుక్మణిని పిలిచి మందలిస్తుంది. తన బిడ్డ సంతోషంగా లేకపోతే తాను తట్టుకోలేనని, ఆదిత్యతో సఖ్యతతో మెలగమని సూచిస్తుంది. సత్యపై ఒక అక్కగా చూపిస్తున్న ప్రేమను తాను అర్థం చేసుకోగలనని, అయితే తన కొడుక్కి ఏ లోటు లేకుండా చూడాల్సిన బాధ్యతను మరవద్దని చెప్పింది. బిడ్డకు జన్మనివ్వడం నీ బాధ్యత అన్న విషయం గుర్తుపెట్టుకోమని అంటోంది. దీంతో తన పెనిమిటితో మంచిగా ఉండటం లేదన్న విషయాన్ని అప్పుడే అత్తమ్మ గ్రహించిందని, కానీ ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని తలుచుకొని బాధపడుతుంది. ఇలాగే ఉంటూ సత్య, ఆదిత్యలను ఒక్కటి చేయాలని, అప్పుడే తన చెల్లికి న్యాయం జరుగుతుందని రుక్మిణి భావిస్తుంది.
సీన్ కట్ చేస్తే రుక్మిణి అన్న మాటలను తలుచుకొని ఆదిత్య బాధపడుతాడు. సత్య కూడా ఇలాగే అనుకుంటుందేమోనని తనకు ఫోన్ చేస్తాడు. అయితే అక్క మనిద్దరిని ఒక్కటి చేసేవరకు ఊరుకోదని, దీన్ని ఎలా అయినా ఆపాలని సత్య ఆదిత్యతో అంటుంది. ఇక సత్య-ఆదిత్యల ఫోన్‌లో మాట్లాడుకోవడం చూసిన రుక్మిణి ఇలా అయినా తన చెల్లికి ఆదిత్య దగ్గరయితే అదే సంతోషమని సంబరపడుతుంది. సీన్ కట్ చేస్తే రుక్మిణి ఇల్లు శుభ్రం చేస్తూ కాలు జారి కింద పడిపోతుండగా, ఆదిత్య వచ్చి ఆమెను పట్టుకుంటాడు. అయితే ఆ సమయంలో రుక్మిణి ఆదిత్యతో దురుసుగా మాట్లాడటం దేవుడమ్మ చూస్తుంది. ఈ విషయంపై దేవుడమ్మ రుక్మిణిని నిలదీస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment