సత్య-ఆదిత్యల బంధంపై దేవుడమ్మకు అనుమానం కలుగుతుంది. నిజం చెప్పిన తర్వాతే తన ఇంటి నుంచి బయటకు కదలాలని సత్యపై హుకూం జారి చేస్తుంది. ఈ నిందను తన బిడ్డ ఎందుకు మోయాల్సి వస్తుందని ప్రశ్నిస్తుంది. సత్య క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మాట్లాడుతుంది. దీంతో రుక్మిణి నిప్పులాంటి ఆ నిజాన్ని బయటపెట్టేస్తుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం మరెవరో కాదు నీ కొడుకే అంటూ దేవుడమ్మకు బదులిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జులై 5న 277వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
సత్య-ఆదిత్యల బంధంపై దేవుడమ్మకు అనుమానం కలుగుతుంది. సత్య కడుపులో బిడ్డకు తన కొడుకుతో సంబంధం అట్టగట్టడంపై నిజం ఏంటో చెప్పాలంటూ సత్యను ఒత్తిడి చేస్తుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో చెప్పి తీరాలని పేర్కొంటుంది. అయితే సత్య నోరు విప్పక పోవడంతో తన కోపాన్ని ప్రదర్శిస్తుంది. అబద్దాలు చెబుతూ ఏం సాధించాలనుకుంటున్నావ్ అంటూ సత్యను నిందిస్తుంది. గతంలో ఎవరినో తెచ్చి నా బిడ్డకు తండ్రి అని పరిచయం చేశావ్..ఇంత జరుగుతున్నా నోరు తెరవడం లేదంటే నిన్ను ఏ పేరుతో పిలవాలి అంటూ సత్య క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మాట్లాడుతుంది. దీంతో రుక్మిణి అడ్డుపడుతుంది.
తన చెల్లి గురించి తప్పుగా మాట్లాడవద్దని ధీటుగా బదులిస్తుంది. సత్య మనసుపడింది, తన బిడ్డకు కారణం మరెవరో కాదు ఆదిత్యే అన్న నిజాన్ని బయటపెడుతుంది. దీంతో దేవుడమ్మ సహా ఇంట్లో వాళ్లందరూ షాక్‌కి గురవుతారు. అసలు ఏం జరిగిందో చెప్పడానికి ఆదిత్య ప్రయత్నించగా, దేవుడమ్మ వినేందుకు ఒప్పుకోదు. కన్నకొడుకు అంటే పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావని బాధపడుతుంది. నువ్వు కూడా నీ తండ్రి బాటలోనే నడిచావా అంటూ ఆదిత్య వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది.
మరోవైపు నిజం తెలిసి ఇన్ని రోజులు మోసం చేసిన సత్యను, ఆ నిజాన్ని కప్పిపుచ్చాలని చూసిన రుక్మిణిపై దేవుడమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రపంచంలో ఇలాంటి అక్కాచెల్లెళ్లు ఎవరైనా ఉంటారా అంటూ ఇద్దరిపై కోపం వెళ్లగక్కుతుంది. సీన్‌కట్ చేస్తే..దేవుడమ్మ లాంటి మంచి మనిషికి ఎందుకింత అన్యాయం చేశారంటూ భాగ్యమ్మ తన కూతుళ్లపై చిందులేస్తుంది. ఇలా ఎందుకు చేశారంటూ కన్నీటి పర్యంతం అవుతుంది. నిజం తెలుసుకున్న దేవుడమ్మ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment