రుక్మిణి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంపై ఆదిత్య బాధపడతాడు. అంతేకాకుండా ఈ విషయం దేవుడమ్మకు తెలిస్తే తట్టుకోలేదని, తనపై పెట్టుకన్న నమ్మకాన్ని వమ్ము చేయలేనని భావిస్తాడు. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉందని, ఈ ఊరు వదిలి వెళ్తేనే రుక్మిణి ఈ ఆలోచనల నుంచి బయట పడ్తుందని, దీనికి ఇదే పరిష్కారమని అనుకుంటాడు. ఇదే విషయాన్ని దేవుడమ్మతోనూ చెప్తాడు. చదువుకోడానికి హైదరాబాద్ వెళ్లాలని తన మనసులో మాటను బయటపెట్టేస్తాడు. అయితే ఇందుకు దేవుడమ్మ అంగీకరించదు. తన కోరికను నిజం చేసే పట్నం వెళ్లాలని ఆంక్షలు పెడుతుంది. దేవుడమ్మ అలా అనడానికి కారణమంటి అన్నది తెలియాలంటే ఎపిసోడ్‌లోకి ఎంటర్ అవ్వాల్సిందే..దేవత సీరియల్ జూన్ 26న 270వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
దేవత 270వ ఎనిసోడ్ :
సత్యకు తనకు పెళ్లి చేయాలన్న రుక్మిణి నిర్ణయంపై ఆదిత్య బాధపడతాడు. ఒకవేళ నిజాన్ని తన తల్లి దేవుడమ్మకు తెలిసినా ఆమె తట్టుకోలేదని, మరోవైపు రుక్మిణి ఆలోచనల్ని అదుపుచేయలేనని అంటాడు. దీనికి ఒక్కటే పరిష్కారమని, రుక్మిణికి దూరంగా ఊరు వదిలి వెళ్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తాడు. ఐఏఎస్‌కు ప్రిపేర్ అవ్వాలని, దానికోసం తాను హైదరాబాద్ వెళ్తానని ఆదిత్య దేవుడమ్మకు చెబుతాడు. అయితే మనవడిని ఎత్తుకోవాలన్నది తన కోరిక అని, మరో రెండు, మూడు నెలలు అయ్యాక వెళ్లమని దేవుడమ్మ చెబుతుంది. అయితే తాను ఇప్పుడే వెళ్లాలని ఆదిత్య ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా దేవుడమ్మ అందుకు అంగీకరించదు.
ఇక మరోవైపు తన తల్లి గారింటికి వెళ్లిన రుక్మిణి,సత్యలను చూసి భాగ్యమ్మ చాలా సంతోషిస్తుంది. మామిడిపండు పులిహోర చేశానని చెప్పడంతో రుక్మిణి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. పుల్లటి పదార్థాలు రుక్మిణి ఎంతో ఇష్టంగా తినడం చూసి కమల, సత్యలకు అనుమానం వస్తుంది. కొంపదీసి నువ్వు నెల తప్పావా అని సత్య ప్రశ్నిస్తుంది. దీంతో షాక్ అయిన రుక్మిణి అదేం లేదని బదులిస్తుంది. సీన్ కట్ చేస్తే.. ఆదిత్య సడెన్‌గా పట్నం ఎందుకు వెళ్తానంటున్నాడో అని దేవుడమ్మ ఆలోచిస్తుంది. కొన్ని రోజులుగా రుక్మిణి-ఆదిత్యల ప్రవర్తనపై అనుమానం వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment