ఆదిత్యకు సత్యకు ఇచ్చి పెళ్లి చేయాలన్న తన నిర్ణయంపై రుక్మిని వెనక్కి తగ్గదు. సత ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తను చెప్పింది జరిగి తీరుతుందని చెబుతుంది. ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరని శపథం చేస్తుంది. సీన్‌కట్ చేస్తే రుక్మిణి ఆదిత్యతో ముభావంగా ఉండటాన్ని దేవుడమమతో పాటు రాజం కూడా గమనిస్తుంది. అలా ఎందుకు ఉంటుందోనన్న అనుమానం ఇద్దరిలో మొదలవుతాయి. మరోవైపు రుక్మిణి ఎవరికి చెప్పకుండా హాస్పిటల్‌కి వెళ్లడం సూరి గమనిస్తాడు. అంతేకాకుండా రుక్మిణి గర్భవతి అన్న నిజం తెలిసి షాక్ అవుతాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో .దేవత సీరియల్ జూన్ 29న 272వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
ఆదిత్యతో రుక్మిణి ముభావంగా ఉండటాన్ని దేవుడమ్మతో పాటు రాజం కూడా కనిపెడుతుంది. భర్తతో అలా ఎందుకు ఉంటున్నావంటూ ప్రశ్నించగా అదేం లేదంటూ రుక్మిణి దాటవేస్తుంది. సీన్ కట్ చేస్తే ఆదిత్యతో నీ పెళ్లి చేసి తీరుతానని రుక్మిణి సత్యతో శపథం చేస్తుంది. ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరని చెబుతుంది. సత్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కావాలని, అలా ఉంటేనే నీకు గౌరవం అంటూ సత్యను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయినా సత్య అందుకు అంగీకరించదు. మరోవైపు రుక్మిణి ఆదిత్యతో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తుంది. ఇది చూసిన సత్య వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉండటం చూసి నొచ్చుకొని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఈ ఒక్క కారణం చాలు నీకు, పెనిమిటికి పెళ్లి చేయడానికి అని రుక్మిణి భావిస్తుంది.
సీన్‌కట్ చేస్తే రుక్మిణి ఎవరికీ చెప్పకుండా హాస్పిటలల్‌కి చెకప్‌కి వెళ్తుంది. అయితే అక్కడ రుక్మిణిని చూసిన సూరి ఆమె ఎందుకు వచ్చిందో తెలియక సందేహపడతాడు. డాక్టర్‌తో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తాడు. అయినా సరిగ్గా క్లారిటీ రాకపోవడంతో అక్కడ ఉన్న ఓ నర్సును కనుక్కుంటాడు. ఏం జరిగింది అని అడగ్గా..మొదట ఆమె చెప్పడానికి సందేహిస్తుంది. అయితే తన మాటలతో గారడి చేసిన సూరి నిజాన్ని తెలుసుకుంటాడు. రుక్మిణి గర్భవతి అన్న నిజం తెలిసి షాకవుతాడు. మరి ఈ విషయం దేవుడమ్మకు చెప్తాడా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment