Devatha : సత్య బిడ్డకు కారణం నువ్వేనా పెనిమిటి : రుక్మిణి | Devatha Serial : Satya Shares Her Suspicion With Adithya | Sakshi
Sakshi News home page

Devatha : సత్య బిడ్డకు కారణం నువ్వేనా పెనిమిటి : రుక్మిణి

Published Wed, Jun 9 2021 3:19 PM | Last Updated on Wed, Jun 9 2021 3:26 PM

Devatha Serial : Satya Shares Her Suspicion With Adithya - Sakshi

సత్య-రుక్మిణిలు హాస్పిటల్‌కు వెళ్లడంతో శుభవార్తతోనే తిరిగి వస్తారని కనకం అంటుంది. దీంతో కమలలో పలు సందేహాలు కలుగుతాయి. ఇప్పుడు రుక్మిణి గర్భవతి అయితే సత్యను ఆదిత్య వదిలేస్తాడా? దేవుడమ్మ సత్య బిడ్డను ఆహ్వానిస్తుందా అని కమల రకరకాలుగా ఆలోచిస్తుంది. సీన్‌ కట్‌ చేస్తే హాస్పిటల్‌కు వెళ్లగానే అక్కడ ఓ నర్సు సత్య భర్త మీరే కదా అని ఆదిత్తో అనడంతో రుక్మిని చాలా బాధపడుతుంది. ఇది పసిగట్టిన సత్య రుక్మిణికి నిజం తెలిసిపోయింది అని ఆదిత్యతో అంటుది. ఇలాంటి  విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌8న 254వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్య-రుక్మిణిలను తీసుకొని ఆదిత్య హాస్పిటల్‌కు వెళ్తాడు. అయితే రుక్మిణి గుడ్‌న్యూస్‌తోనే తిరిగి వస్తుందని కనకం ఈశ్వర్‌ ప్రసాద్‌తో అంటుంది. దీంతో ఒకవేళ రుక్మిణి గర్భవతి అయితే ఆదిత్య సత్యను వదిలేస్తాడా? ఈ నిజం తెలిస్తే దేవుడమ్మ సత్య బిడ్డను ఆహ్వానిస్తుందా అని కమల రకరకాలుగా ఆలోచిస్తుంది. నిజం తెలిస్తే సత్య-రుక్మిణి ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయని భావిస్తుంది. సీన్‌ కట్‌ చేస్తే హాస్పిటల్‌కు వెళ్లగానే అక్కడ ఓ నర్సు..సత్య భర్త మీరే కదా..ఆమెను తీసుకొని లోపలికి వెళ్లండి అని ఆదిత్యతో అనగానే ముగ్గురూ ఏం చెయ్యాలో తెలియక సైలెంట్‌ అయిపోతారు. ఇక రుక్మిణి కూడా సత్యనే తీసుకొని వెళ్లమని ఆదిత్యకు చెప్తుంది. అయితే రుక్మిణి పడుతున్న బాధను సత్య పసిగడుతుంది. మనద్దరి మీద అక్కకు అనుమానం వచ్చిందని, అందుకే అక్కఘిలా తనలో తానే కుమిలిపోతుందేమో అని సత్య చెప్తుంది.

సీన్‌ కట్‌ చేస్తే రుక్మిణి మరో డాక్టర్‌ వద్దకు వెళ్లి మాట్లాడుతుంది. ఆరోజు దేవుడమ్మ ఇంటికి వచ్చి రుక్మిణిని చెకప్‌ చేసిన డాక్టరే అక్కడా కనపడుతుంది. దీంతో ప్రెగ్నీన్సీ విషయం చెప్పొద్దని అన్నవ్వాంటే ఏదో పెద్ద విషయమే ఉంటుందని చెప్పి డాక్టర్‌ రుక్మిణికి మద్దతిస్తుంది. ఇక సత్య-ఆదిత్యలు బయటకు వచ్చి చూసి రుక్మిణి కనపడకపోయేసరికి కంగారు పడతారు. రుక్మిణి ఎక్కడికి వెళ్లిందో అని భయపడతారు. అప్పుడే అక్కడికి వచ్చిన రుక్మిణి తానే వేరే డాక్టర్‌ వద్దకు వెళ్లి చూపించుకున్నానని చెప్పడంతో షాకవుతారు. రుక్మిణి మాటలు సత్య అనుమానానికి మరింత బలం చేకూరుస్తుంది. ఇక సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటీ అంటూ రుక్మిణి ఆదిత్యను ప్రశిస్తుంది. దీనికి ఆదిత్య ఏం సమాధానం చెప్తాడు? ఆ తర్వాత రుక్మిణి ఎలా రికార్ట్‌ అవుతుంది అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement