కనకం అన్న మాటలు తలుచుకొని సత్య కుంగిపోతుంది. మరోవైపు తనకు ఆరోగ్యం బాలేదని చెప్పి రుక్మిణి ఆదిత్యను బయటకు తీసుకెళ్తుంది. మార్గమధ్యలో మనం వెళ్లేది హాస్పిటల్‌కు కాదని, కారును మామిడితోట వద్ద ఆపమని చెప్తుంది. అక్కడే సత్య-ఆదిత్యల గురించి నిజాన్ని తెలుసుకుంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అంటూ ఆదిత్య ఒప్పుకుంటాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 12న 258వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
కనకం అన్న మాటలకు సత్య బాధపడుతుంది. తనకు వేరే వాళ్లతో పెళ్లి ఎలా చేస్తారంటూ రాజ్యాన్ని నిలదీస్తుంది. అయితే ఇది అందరి నిర్ణయం కాదని, కనకం మాటలను పట్టించుకోవద్దని రాజ్యం బదలిస్తుంది. ఇక సత్యను అంటే ఆదిత్యకు అంత కోపం ఎందుకు వస్తుందంటూ కనకం రుక్మిణిని అడుగుగుతుంది. ఏదో తన బిడ్డే అన్నట్లు ఆదిత్య మాట్లాడటం చూస్తుంటే తనకేదో అనుమానం కలుగుతుందని రుక్మిణిని చెబుతుంది. ముందే జాగ్రత్తగా ఉండమని, లేదంటే నీ జీవితం కూడా నాశనం అవుతుందని రుక్మిణి మనసులో మరింత అనుమానం రేపుతుంది. సీన్ కట్ చేస్తే తన ఆరోగ్యం బాలేదని, తనను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని రుక్మిణి ఆదిత్యను కోరుతుంది.
ఇద్దరూ కలిసి వెళ్తుండగా రుక్మిణి కారును తన తోట వైపు తీసుకెళ్లమని చెప్తుంది. అయితే హాస్పిటల్‌కి కదా వెళ్లాల్సింది అని ఆదిత్య ప్రశ్నించగా..తను బాగానే ఉన్నానని, ఒక విషయం మాట్లాడటానికే తోటకు తీసుకొచ్చానని రుక్మిణి బదులివ్వడంతో ఆదిత్య షాకవుతాడు. రుక్మిణి ఏం మాట్లాడుతుందో అని టెన్షన్ పడతాడు. దీంతో దేవుడమ్మ మీద ప్రమాణం చేసి తను అడిగే ఒక ప్రశ్నకు నిజం చెప్పాలంటూ రుక్మిణి మాట తీసుకుంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటి అని రుక్మిణి ప్రశ్నిస్తుంది. దీంతో ఆదిత్య నిజాన్ని ఒప్పుకుంటాడు. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే అని నిజం చెప్పేయడంతో రుక్మిణి షాకవతుంది. తర్వాత రుక్మిణి ఏం చేస్తుంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి వంటి వివరాలను తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment