
కనకంకి నందా ఫోన్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆదిత్యతో తానింకా టచ్‌లోనే ఉన్నానని చెప్తాడు. దీంతో ఎందుకు నందాతో మాట్లాడుతున్నావంటూ ఇంట్లో వాళ్లు నిలదీయడంతో ఆదిత్య కంగారుపడుతుంటాడు. అది గమనించిన కనకం దీని వెనక ఏదో మతలబు ఉందని గ్రహిస్తుంది. ఇక నందాను చితకబాదిన ఆదిత్య ఇంకోసారి తనను ఇబ్బంది పెడితే చంపేస్తానని నందాను బెదిరిస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే27న 244వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
సత్య పరిస్థితి తలుచుకొని ఆదిత్య దిగాలుగా ఉంటాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఇలా ఎందుకు ఉన్నావంటూ ఆదిత్యను వాళ్ల నాన్న అడుగుతాడు. సత్య పరిస్థితి ఇలా అయిపోవడంతో రుక్మిణి బాధపడుతుందని అందుకే దీన్నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నా అని ఆదిత్య బదులిస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే తాను డబ్బులు డిమాండ్ చేస్తే మొదటిసారి ఆదిత్య నో అనడంతో నందా ఆశ్చర్యపోతాడు. తన పొగరును ఎలా అయినా దించాలన ఉద్దేశంతో ఏదో ఒక పథకం రచించాలని అనుకుంటాడు. ఇందుకు కనకం అయితే సరిగ్గా సరిపోతుందని, ఆమెకు ఫోన్ చేస్తాడు.
దేవుడమ్మకు ఉన్న విలువ నీకు లేదని రెచ్చగొడుతూ, మరోవైపు తాను ఆదిత్యతతో ఇంకా టచ్‌లోనే ఉన్నానని చెప్తాడు. దీంతో కనకం వచ్చి ఆదిత్యను ఈ విషయం గురించి ప్రశ్నించగా, అదేం లేదని, దాటవేసే ప్రయత్నం చేస్తాడు. తను చేసిన తప్పుకు బాధపడతున్నాడని, ఇందుకు దేవుడమ్మకు క్షమాపణలు చెప్పమని చెప్పాడని, అంతే తప్పా తనతో నాకేం మాటలు లేవని చెప్తాడు. అయితే ఆదిత్య తడపాటును గమనించిన కనకం ఇందులో ఏదో మతలబు ఉందని , అది తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక ఆదిత్య చెప్పిన చోటుకు వెళ్లిన నందా అక్కడ ఆదిత్య డబ్బు తీసుకురాకపోగా, వెంట పెద్ద కర్ర తేవడం చూసి షాకవుతాడు. అయితే అప్పటికే కోపంతో రగిలిపోతున్న ఆదిత్య నందాను కొడతాడు. ఇంకోసారి తన గురించి కానీ, సత్య గురించి కాని ఆలోచిస్తే తన అంతు చూస్తానని బెదిరిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment