
నందాను ఇంట్లోంచి గెంటేస్తారు. ఇదే అవకాశం అన్నట్లు దేవుడమ్మ తప్పులను ఎత్తిచూపుతూ దారుణంగా అవమానిస్తుంది రాజేశ్వరి. దీంతో సత్యను లాగి కొట్టిన దేవుడమ్మ తనను మోసం చేసినందుకు సత్యపై మండిపడుతుంది. వెంటనే తన ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే17న 235వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
నందా అసలు నైజాన్ని రుక్మిణి బయటపెడుతుంది. దీంతో నందాను తన కళ్లముందు నుంచి వెళ్లకపోతే చంపేస్తానని దేవుడమ్మ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే అక్కడ్నుంచి జారుకుంటాడు నందా. సరిగ్గా అదే సమయానికి రాజేశ్వరి అక్కడికి వస్తుంది. గతంలో తన కుటుంబంలో ఇలాంటి తప్పే జరిగితే మోసం చేసినవాడు సహా కుటుంబం మొత్తాన్ని ఊరు నుంచి వెళ్లగొట్టిన దేవుడమ్మ ఇప్పుడేం న్యాయం చేస్తుందంటూ ప్రశ్నిస్తుంది. నందా గురించి ముందే తెలిసినా సత్య డ్రామాలు ఆడిందా అంటూ దేవుడమ్మ మనసులో విషాన్ని నూరిపోస్తుంది. పెద్దరికం తెలియని నువ్వు ఊళ్లో అందరికి నీతులు చెప్తావా అంటూ దేవుడమ్మను దారుణంగా అవమానిస్తుంది. దీంతో కోపంతో ఊగిపోయిన దేవుడమ్మ సత్యపై చేయిచేసుకుంటుంది.
కన్నబిడ్డలా చూసుకున్న తనను మోసం చేశావంటూ సత్యపై మండిపడుతుంది. ఎవరో అనామకుడిని ఇంటికి తెచ్చి ఇంత పెద్ద తప్పు ఎలా చేయాలనిపించిందంటూ ఫైర్ అవుతుంది. వెంటనే తన ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది. అయితే నందా తప్పు చేస్తే తన చెల్లిని ఎందుకు శిక్షిస్తున్నారంటూ రుక్మిణి అడ్డుచెప్పే ప్రయత్నం చేసినా దేవుడమ్మ వినిపించుకోందు. సత్య చేసింది మోసం కాదు, నేరమని ఘాటుగా బదులిస్తుంది. సత్య కూడా క్షమించమని దేవుడమ్మను వేడుకున్నా ఆమె మాత్రం కరగదు సరి కదా సత్యపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీళ్లేదని ఆఙ్ఞాపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment