
నందా ప్రవర్తనపై ఓ కన్నేసిన ఉంచాలని రుక్మిణి డిసైడ్ అవుతుంది. ఇక నందా చరిత్ర తెలుసుకోవాలని కనకం ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు వారం రోజుల్లో తాను సత్యని పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరికి షాకిస్తాడు నందా..ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 231వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
నందా ప్రవర్తనపై కనకం అనుమానం నిజమై ఉంటుందా అని రుక్మిణి ఆలోచిస్తుంటుంది. ఇదే విషయాన్ని భర్త ఆదిత్యతో అడిగి తెలుసుకుంటుంది. ఇద్దరూ ఒకే కాలేజీలో చదివారు కదా నందా నిజంగానే మంచివాడా అని అడుగుతుంది. దీంతో ఇదే మంచి ఛాన్స్ అనుకున్న ఆదిత్య నందా గురించి ఇంక్వ్యైరీ చేయాలని, అతని గురించి తనకూ పెద్దగా తెలియదని చెప్తాడు. ఒకవేళ పెళ్లి తర్వాత నందా మంచివాడు కాదని తెలిస్తేఘేమీ చేయలేమని, సత్య జీవితం నాశనం అవుతుందని హెచ్చరిస్తాడు. కాబట్టి నందా ఎలాంటి వాడో తెలుసుకోవాలని, ఆ తర్వాతే పెళ్లి చేయాలని చెప్తాడు. దీనికి సరేనన్న రుక్మిణి ఇప్పట్నుంచి నందాపై ఓ కన్నేసి ఉంచుతానని చెప్తుంది.
ఇక నందా తీరుపై మొదటినుంచి అనుమానం వ్యక్తం చేస్తోన్న కనకం అతడి వివరాలు కనుక్కోవాలని ఆరాట పడుతుంది. ఎంత ఆస్తి ఉంది? ఎక్కడి నుంచి వచ్చాడు వంటి ప్రశ్నలను అడుగుతుంది. దీంతో తన గుట్టు రట్టవుతుందే అని భయపడిన నందా టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కనకం మాత్రం అదే విధంగా తన ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దీంతో తనపై కనకంకి అనుమానం వచ్చిందని గ్రహించిన నందా ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు.
సీన్ కట్ చేస్తే నందా-సత్యలు ఇప్పటివరకు ప్రేమగా ఉండటం చూడలేదని, ఇందులో ఏదో రహస్యం దాగుందని కనకం కనిపెడుతుంది. అదేంటో కనిపెట్టాలని ప్లాన్‌లు వేస్తుంది. మరోవైపు సత్య పక్కన నందా కూర్చోబోతుండగా ఖుర్చీని పక్కకు లాగి తాను కూర్చుంటుంది. పెళ్లి కాకుండా పక్కపక్కన కూర్చోవద్దని చెప్తుంది. దీంతో ఒళ్లు మండిన నందా.. మీరేం కంగారు పడకండి అని, మరో వారం రోజుల్లో తమ పెళ్లి ఉందని చెప్పి అందరికి షాకిస్తాడు. దీనిపై మిగతా కుటుంబసభ్యులు ఎలా రియాక్ట్ అవుతారా? అసలు ఈ నిర్ణయాన్ని ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment