
నందా-సత్యల తీరుపై కనకం అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని రుక్మిణితో కూడా చెప్తుంది. మరోవైపు నందా ప్రవర్తనతో విసిగిపోయిన సత్య అతడి చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో అంతు చూస్తానంటూ నందా రివేంజ్ ప్లాన్ చేయాలని చూస్తాడు..ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ 230వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
ఆదిత్య ఇచ్చిన 10 లక్షల రూపాల చెక్కును నందా తీసుకుంటాడు. అయితే ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే అని, తనకు ఊర్లో ఉన్న 5ఎకరాల పొలం రాసివ్వాలని డిమాండ్ చేస్తాడు. నందా ఇలా ప్లేటు మార్చడంతో షాకైన ఆదిత్య ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటాడు. ఇక నందా ప్రవర్తనపై మొదటినుంచి అనుమానం వ్యక్తం చేస్తోన్న కనకం అదే విషయాన్ని రుక్మిణితో ప్రస్తావిస్తుంది. నందా వాలకం చాలా అనుమానంగా ఉందని, అసలు అతని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారా అని ప్రశ్నిస్తుంది. దీంతో రుక్మిణికి కూడా అనుమానం వస్తుంది. ఎందుకైనా మంచిది నందాపై ఒక కన్నేసి ఉంచాలని అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే.. నందా తీరుతో కుమిలిపోతున్న సత్య తన గదిలో అంటించిన చిన్ననాటి నందా ఫోటోలను చింపి పారేస్తుంది. అదే సమయంలో రుక్మిణి అక్కడికి రావడం గమనించిన నందా.. సత్య నిద్ర పోతుందని అబద్దం చెప్పి రుక్మిణిని అక్కడ్నుంచి పంపిస్తాడు. ఇక తన బెడ్‌పై నందా ఉండటం చూసి సత్య మరింత కోపంతో ఊగిపోతుంటుంది. నందా చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో నీ అంతు చూస్తానని నందా వార్నింగ్ ఇస్తాడు.
ఇదే విషయాన్ని ఆదిత్యతో చెబుతూ తనను చాలా అవమానించారని, ఇక నిజాన్ని అందరికి చెప్పి వెళ్లిపోతానని నందా అంటాడు. సరిగ్గా ఇదే సమయానికి అక్కడికి వచ్చిన కనకం ఏంటా నిజం? ఎక్కడికి వెళ్తావు అని ఆరాతీస్తుంది. దీంతో బయటకు తీసుకెళ్తా అంటే సత్య రావడం లేదని, అందుకే నందా ఫీల్ అవుతున్నాడని ఆదిత్య కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ నందా తీరుపై కనకం మనసులో మాత్రం అనుమానం అలానే ఉంటుంది. ఇక నందా శని ఎప్పుడు విరగడవుతుందా అని ఆదిత్య తల పట్టుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment