Devatha : సత్య-ఆదిత్యలను ఒక్కటి చేయాలనుకున్న రుక్మిణి | Devatha Serial : Rukmini Takes A Decision After Learning The Truth | Sakshi
Sakshi News home page

Devatha : సత్య-ఆదిత్యలను ఒక్కటి చేయాలనుకున్న రుక్మిణి

Published Mon, Jun 14 2021 2:52 PM | Last Updated on Mon, Jun 14 2021 3:18 PM

Devatha Serial : Rukmini Takes A Decision After Learning The Truth - Sakshi

ఆదిత్య నిజం ఒప్పుకుంటాడు. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అని రుక్మిణితో అంటాడు. సత్యను ప్రేమించింది తానే అని, అయితే ఇలా మోసం చేయాలనుకోలేదు అని పేర్కొంటాడు. ఆదిత్య మాటలకు షాక్‌ అయిన రుక్మిణి తనను ఒంటరిగా వదిలేయమని కోరుతుంది. మరోవైపు తన వల్లే సత్య- ఆదిత్యలు విడిపోయారని బాధపడుతుంది. ఇద్దరి కన్నీళ్లకు కారణం తానే అని ఎంతో మదనపడుతుంది. సత్య-ఆదిత్యల మధ్యలో తాను ప్రేవేశించి వారి సంతోషాన్ని పోగొట్టానని కుంగిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌ 14న 259వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం తానే అన్న నిజాన్ని ఆదిత్య ఒప్పుకుంటాడు. పెళ్లికి ముందు తాను ప్రేమించింది సత్యనే అని, అయితే నీకు అన్యాయం మాత్రం చేయాలనుకోలేదు అని రుక్మిణితో అంటాడు. సత్య కావాలనే ప్రేమను త్యాగం చేసిందని చెప్తాడు. ఆదిత్య మాటలకు షాకైన రుక్మిణి తన వల్లే ఇద్దరూ దూరం అయ్యారని బాధపడుతుంది. సత్య- ఆదిత్యల మధ్యలో తాను వచ్చి వారి జీవితాన్ని నాశనం చేశానని రుక్మిణి బాధపడుతుంది. ఇద్దరినీ ఒక్కటి చేయాలని అనుకుంటుంది. ఇక కొద్ది సేపు తనను ఒంటరిగా వదిలి పెట్టమని ఆదిత్యను కోరుతుంది. ఈ పరిస్‌థితుల్లో నిన్ను విడిచి వెళ్లను అని ఆదిత్య అంటున్నా రుక్మిణి వెళ్లాల్సిందిగా కోరుతుంది.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆదిత్య రుక్మిణిని వదిలి ఇంటికి వస్తాడు. హాస్పిటల్‌కు అని వెళ్లి ఆదిత్య ఒక్కడే ఒంటిరిగా రావడంతో కనకం, రాజ్యంలలో అనుమానాలు మొదలవుతాయి. రుక్మిణి ఎక్కడ అని ప్రశ్నించినా ఆదిత్య సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్తాడు. జరిగిన తప్పును ఊహించుకొని తనలో తానే కుమిలిపోతాడు. ఇది చూసిన కనకం తెగ సంబరపడిపోతుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలని తహతహలాడుతుంది. మరోవైపు రుక్మిణి ఇంకా ఇంటికి రాకపోవడంతో సత్య కంగారుపడుతుంది. నిజం తెలుసుకున్న రుక్మిణి సత్య-ఆదత్యలను ఒక్కటి చేస్తుంది? ఇప్పుడు రుక్మిణి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement