Devatha : రుక్మిణి ప్రెగ్నెన్సీ.. సంతోషంలో ఆదిత్య | Devatha Serial : Adithya Feels Thrilled When He Learns About Rukminis Pregnancy | Sakshi
Sakshi News home page

Devatha : రుక్మిణి ప్రెగ్నెన్సీ.. సంతోషంలో ఆదిత్య

Published Tue, Jun 22 2021 4:06 PM | Last Updated on Tue, Jun 22 2021 4:13 PM

Devatha Serial : Adithya Feels Thrilled When He Learns About Rukminis Pregnancy - Sakshi

సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డ బావుండాలని కోరుకుంటూ రుక్మిణి ఆమెకు ప్రసాదం తెచ్చిస్తుంది. మరోవైపు రుక్మిణి వాంతులు చేసుకోవడం చూసి సత్య అనుమానం వ్యక్తం చేయగా అదేమీ లేదని రుక్మిణి బదులిస్తుంది. సీన్‌ కట్‌ చేస్తే తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని , అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సత్య ఆదిత్యను కోరుతుంది. రుక్మిణి వాంతులు చేసుకోవడం ఆ తర్వాత పుల్లటి మామిడికాయలు తినడం చూసి ఆమె గర్భవతి అయ్యిందంటూ దేవుడమ్మ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌ 22న 266వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

దేవుడి ప్రసాదాన్ని తాను తినకండా రుక్మిణి సత్యకు ఇస్తుంది. ముడుపు దగ్గరనుంచి ప్రసాదం వరకు తనతోనే ఎందుకు చేయిస్తున్నావంటూ సత్య ప్రశ్నించగా..నీ కడుపులో బిడ్డ కోసం అని రుక్మిణి చెబుతుంది. ఇక సీన్‌ కట్‌ చేస్తే రుక్మణి వాంతులు చేసుకుంటుంది. దీంతో ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించి విషయం ఏమో అని సత్య అనుమానం వ్యక్తం చేయగా రుక్మిణి వాటిని ఖండించింది. అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. మరోవైసు రుక్మిణి తనపై చూయిస్తున్న ప్రేమానురాగాలకు సత్య భయపడిపోతుంది. ఎక్కడ తన జీవితం నాశనం​ చేసుకుంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని ఆదిత్యకు చెప్పి తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని, అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతుంది.

సీన్‌కట్‌ చేస్తే రుక్మిణి వాంతులు చేసుకోవడం దేవుడమ్మ చూస్తుంది. ఏదైనా విశేషమే అని అడిగితే అదేమీ లేదని రుక్మిణి సమాధానమిస్తుంది. మరోవైపు ఈశ్వర్‌ ప్రసాద్‌ తోట నుంచి మామిడి పళ్లు తేగానే రుక్మిణి ఎంతో ఆతృతగా వాటిని తీసుకొని తింటుంది. దీంతో కోడలు నెల తప్పిందంటూ దేవుడమ్మ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆదిత్య కూడా అక్కడే ఉండటంతో విషయం తెలిసి సంతోషంలో మునిగితేలతాడు. థ్యాంక్యూ అంటూ రుక్మిణిని ఎత్తుకొని చాలా సంతోషిస్తాడు. అయితే అదేమీ లేదని, కేవలం మామిడి పళ్లతో పచ్చడి చేయడానికి తిని చూశానని రుక్మిణి చెప్పడంతో అందరూ నిరాశ చెందుతారు. మరి రుక్మిణి ప్రెగ్నెన్సీ విషయం సత్య తెలుసుకుంటుందా అని తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement