
నటి, డ్యాన్సర్ మాన్సీ జోషి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు ప్రియుడు రాఘవతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది.

ఆదివారం (అక్టోబర్ 20న) నిశ్చితార్థం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ దేవత సీరియల్‌లో నటించింది.

ఈ సీరియల్‌లో సత్య క్యారెక్టర్ నుంచి నటి వైష్ణవి తప్పుకోగా.. ఆ స్థానాన్ని మాన్సీ భర్తీ చేసింది.

ఈమె ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని ప్రేక్షకులకు దగ్గరైంది.













