Devatha Serial Actress Vaishnavi Rami Reddy Engagement Pics Viral - Sakshi
Sakshi News home page

Devatha Serial Vyshnavi Engagement: 'దేవత' సీరియల్‌ ఫేం వైష్ణవి ఎంగేజ్‌మెంట్‌

Published Sun, Mar 27 2022 10:57 AM | Last Updated on Sun, Mar 27 2022 11:51 AM

Devatha Serial Fame Actress Vyshani Got Engaged Photos Viral - Sakshi

దేవత సీరియల్‌తో పాపులర్‌ అయిన నటి వైష్ణవి గాదే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. శనివారం ఆమె ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌ హైదరాబాదాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సన్నిహితులు, కుటుంబసభ్యులతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు హజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా బుల్లితెరపై పాపులర్‌ సీరియల్స్‌లో ఒకటైన దేవత సీరియల్‌లో సత్య పాత్ర ద్వారా వైష్ణవి బాగా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే వ్యక్తిగత కారణాలతో కొన్ని నెలల క్రితమే ఆమె ఆ సీరియల్‌ నుంచి తప్పుకుంది. అంతేకాకుండా ఇండస్ట్రీకి కూడా  దూరమైంది. ఆ సమయంలో ఆమెను బ్యాన్‌ చేశారంటూ పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తల్లో నిజం లేదంటూ వైష్ణవి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement