Devatha Serial Actress Vaishnavi Engagement Video Viral - Sakshi
Sakshi News home page

Vyshnavi Engagement: దేవత సీరియల్‌ నటి ఎంగేజ్‌మెంట్‌ వీడియో చూశారా?

Published Sat, Apr 9 2022 5:14 PM | Last Updated on Sat, Apr 9 2022 6:09 PM

Devatha Serial Actress Vaishnavi Engagement Video Viral - Sakshi

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే దేవత సీరియల్‌ నటి వైష్ణవి ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే! సురేశ్‌ అనే వ్యక్తితో త్వరలోనే ఏడడుగులు నడవనుంది. తాజాగా వైష్ణవి తన యూట్యూబ్‌ చానల్‌లో నిశ్చితార్థపు వీడియోను షేర్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌ అవుతోంది. 

ఇక ఈ వీడియోలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమె నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. కాబోయే దంపతులు దండలు మార్చుకుని ఇద్దరూ ఉంగరాలు తొడుక్కుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, బుల్లితెర సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేశారు.

ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌కు వచ్చినవాళ్లతో పాటు వీడియో చూసి తమను ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది వైష్ణవి. కాగా వైష్ణవి దేవత సీరియల్‌లో సత్య పాత్రతో ప్రేక్షకులకు చేరువైంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ధారావాహిక నుంచి తప్పుకుంది.

చదవండి: ఫోన్‌ చేస్తే బిజీ.. ఆరేళ్ల తర్వాత వేరొకరితో అలా... అఖిల్‌ బ్రేకప్‌ స్టోరీ

ఏడేళ్ల లవ్‌.. బావ అనుమానించాడు: అరియానా బ్రేకప్‌ స్టోరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement