vaishnavi
-
మంచి సందేశంతో ‘మహీష’
ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "మహీష". ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. మహీష సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, హీరో ప్రవీణ్ కె.వి. మాట్లాడుతూ - చిన్న సినిమాలు ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేయడం కష్టం. మీ మీడియా సపోర్ట్ ఉంటేనే అది సాధ్యం. రీసెంట్ గా రిలీజ్ చేసిన మా మూవీ టీజర్ కు దాదాపు రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది పెద్ద నెంబర్ కాకపోవచ్చు కానీ మా మహీష సినిమా టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని చెప్పేందుకు ఈ వ్యూస్ నిదర్శనం. మా సినిమాలో విలన్ గా చేసిన విజయ్ రాజ్ గారికి మంచి పేరొస్తుంది. మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీగా ఉన్నాం. త్వరలోనే మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తాం. మహీష సినిమాలో మంచి మేసేజ్ తో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది’ అన్నారు. ప్రెజెంట్ మహిళల మీద జరుగుతున్న ఘటనల అంశాలతో పాటు ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయని అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవెంకట్. ‘మహీష మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటిగా నాకు ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు నటి శ్రీలత. -
తెలుగింటి.. వెలుగులు! ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
అమ్మానాన్నలు వెంట లేకుండానే... టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్‌ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్ అసోషియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్ క్యాంప్ రెగ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్ సైన్స్ టెక్నాలజీ వర్క్‌షాపులో ఈ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.ఆలోచనలను పంచుకున్నాం..దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాలæవిద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.– వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడపురాతన జీవశాస్త్రంపై పరిశోధన..ఈ వర్క్‌షాపు ద్వారా వివిధప్రాంతాల విశిష్టత, ఆయాప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపైప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్‌షాపు కచ్చితంగా ఉపయోగమే.– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడఎనిమిదో ఏడు..చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్‌షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్‌షాపు లక్ష్యం. ఈ వర్క్‌షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్ ద సన్’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ. ఫొటోలు: తలాటం సత్యనారాయణ -
పరీక్షల్లో ఫెయిల్‌కావడంతో.. విద్యార్థిని తీవ్ర నిర్ణయం!
కరీంనగర్: పరీక్షల్లో ఫెయిల్‌కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపిన వివరాలు.. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. కుటుంబ సభ్యులు గమనించి హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తండ్రి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కాస్త విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కన్నడ సీరియల్లో ఓ నటి హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటీ నడపడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతకీ అదేం సీరియల్? ఎవరు ఫిర్యాదు చేశారు? పోలీసుల రియాక్షనేంటో చూసేద్దాం..హెల్మెట్ లేకుండా..కన్నడలో ప్రసారమవుతున్న సీరియల్స్‌లో సీతారామ ధారావాహిక ఒకటి. ఈ సీరియల్లోని ఓ ఎపిసోడ్లో నటి వైష్ణవి గౌడ స్కూటీ నడిపింది. అయితే హెల్మెట్ లేకుండా రోడ్డుపై దర్జాగా వెళ్లిపోయింది. ఇది చూసిన జయప్రకాశ్ అనే వ్యక్తి ఈ సీన్‌ను లైట్ తీసుకోలేదు. సెలబ్రిటీలను చూసి జనాలు కూడా చెడిపోతారని.. సమాజానికి తప్పుడు సందేశం పంపిన నటి వైష్ణవిపై, సీరియల్ డైరెక్టర్‌పై, సదరు ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బండి యజమానికి సైతం ఫైన్దీనిపై స్పందించిన పోలీసులు ఈ సీన్ చిత్రీకరణ బెంగళూరులోని నందిని లే అవుట్లో షూట్ చేసినట్లుగా గుర్తించారు. వైష్ణవితో పాటు, ఆమె వాడిన బండి యజమానికి రూ.500 చొప్పున చలానా విధించారు. ఇది జరిగి ఐదారు రోజులు కావస్తోంది. ఈ ఘటనపై సీతారామ సీరియల్ ప్రొడక్షన్ మేనేజర్ స్పందిస్తూ.. ఇక మీద రాబోయే ఎపిసోడ్లలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.చదవండి: భర్త కోసం స్పెషల్ పోస్ట్.. ఆ క్యాప్షన్ అర్థం అదేనా? -
అయ్యో వైష్ణవి
దుండిగల్: మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లిపోయింది.. రెండేళ్ల క్రితం తండ్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదకొండేళ్ల వయస్సులోనే ఈ రెండు ఘటనలు ఆ బాలికను కలచివేశాయి. అయినాసరే తట్టుకుని చదువుతోంది.. కానీ ఇప్పుడు అర్ధంతరంగా ఏమైందో ఏమో అనుమానాస్పద స్థితిలో అనాథాశ్రమంలో బలవన్మరణానికి పాల్పడింది. సూరారం ప్రాంతానికి చెందిన దివంగత నీలం సతీశ్ కుమార్తె వైష్ణవి(11) దుండిగల్‌లోని స్పూర్తి ఫౌండేషన్‌లో ఆరవ తరగతి చదువుతూ అక్కడే ఉంటోంది. వదిన పెళ్లి ఉండటంతో ఈ నెల 3న ఇంటికి వెళ్లిన వైష్ణవి అక్కడ బంధువులతో సంతోషంగా గడిపింది. 8న తిరిగి ఫౌండేషన్‌కు వచ్చింది. ఉదయం తోటి స్నేహితులతో కలిసి ఆనందంగా ఆటలు ఆడింది. అదే రోజు మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైష్ణవి ఉరి వేసుకున్న గదిలోనే గతేడాది మరో బాలిక ఇదే విధంగా ఆత్మహత్యకు పాల్పడటంపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉందని, 8వ తేదీ మధ్యాహ్నం వరకు స్నేహితులతో ఆటలు ఆడిందని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య..
కరీంనగర్: డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో మండలంలోని మద్దులపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని పూసల వైష్ణవి (20) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూసల రాజేశం కూతురు వైష్ణవి కరీంనగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.డిగ్రీ ఫస్టియర్ ఫస్ట్ సెమ్, సెకండియర్‌లో సెకండ్ సెమిస్టర్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఆదివారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
డిగ్రీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య..
కరీంనగర్: డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో మండలంలోని మద్దులపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని పూసల వైష్ణవి (20) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూసల రాజేశం కూతురు వైష్ణవి కరీంనగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. డిగ్రీ ఫస్టియర్ ఫస్ట్ సెమ్, సెకండియర్‌లో సెకండ్ సెమిస్టర్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఆదివారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
‘మా ఊరి రాజారెడ్డి’ రిలీజ్ డేట్ ఫిక్స్
నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఊరి రాజారెడ్డి’. రవి బాసర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 25న ట్రైలర్ ని మార్చ్ 1న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు రజిత మరియు సునీత మాట్లాడుతూ : ఎంతో ఇష్టంతో చాలా కష్టపడి ఈ సినిమా ని నిర్మించాం. మంచి మంచి లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసాం. ప్రేక్షకుల ఆశీస్సులు ఆదరణ మాపై ఈ సినిమాపై ఉండాలని ఈ సినిమా మన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామన్నారు. దర్శకుడు రవి బాసర మాట్లాడుతూ : మార్చ్ 1న మా ఊరి రాజారెడ్డి సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి మంచి లొకేషన్స్ లో ఈ సినిమాని చిత్రీకరించాం. బోరిగామా విలేజ్, గోపాల్ పేట్ తండా, గండి రామన్న దేవస్థానం, కడం హరితహారం ప్రాజెక్టు మరియు నిర్మల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. మంచి లొకేషన్స్ లో ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాం. ఈనెల 25న ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాం. ఈ సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
సూర్యాపేట రూరల్ : సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి (17) గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురుకుల పాఠశాలలో శనివారం ఫేర్వెల్ డే ఉండగా విద్యార్థిని తండ్రి ఉదయం 9గంటలకు వచ్చి పూలు , గాజులు ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం పాఠశాల ఆవరణలో జరిగిన ఫేర్‌వెల్‌డేలో వైష్ణవి పాల్గొన్నది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి హాస్టల్ గదికి వెళ్లిపోయింది. గంట తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వైష్ణవి అపస్మారకస్థితిలో ఉంది. ఈ విషయాన్ని వారు వెంటనే ప్రిన్సిపల్‌తో పాటు సిబ్బందికి చెప్పడంతో వైష్ణవిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. హాస్టల్ సిబ్బంది ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా తెలియజేయడంతో వారు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. తమ కూతురును విగతజీవిగా చూసి బోరున విలపించారు. శనివారం సాయంత్రం పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ డేకు వెళ్లేందుకు తయారైన తర్వాత వీడియో కాల్ చేసి తమతో నవ్వుతూ మాట్లాడిందని విద్యార్థిని తల్లిదండ్రులు వెంకన్న, భాగ్యమ్మ రోదిస్తూ తెలిపారు. తమ కూతురు కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చిన సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ కలిసి ఎలా చదువుతున్నావని పలకరించిందని చెప్పారు. అప్పుడు తమ కూతురు.. హాస్టల్లో అన్నం బాగుండడం లేదని, రాళ్లు వస్తున్నాయని చెప్పగా అక్కడి నుంచే మున్సిపల్ చైర్పర్సన్ ఫోన్లో ప్రిన్సిపల్‌తో మాట్లాడారని చెప్పారు. ఈ విషయం మనసులో పెట్టుకుని తమ కూతురును వేధించారని, దీంతోనే మనస్తాపంతో మృతిచెందిందని, తమ కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. వైష్ణవి మృతదేహంపై గాయాలు ఉండడంతో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. సూర్యాపేట రూరల్ పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం హాస్టల్‌కు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, వారం రోజుల క్రితం భువనగిరిలోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరుకముందే సూర్యాపేటలో మరో బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. -
ఇద్దరు టెన్త్ విద్యార్థినుల ఆత్మహత్య
సాక్షి, యాదాద్రి, భువనగిరి క్రైం: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్‌కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. యూనిఫాం చున్నీలతో ఉరేసుకుని.. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. మమ్మల్ని ఒకే దగ్గర సమాధి చేయాలి టెన్త్ విద్యార్థినుల గదిలో దొరికిన సూసైడ్ నోట్‌ను తోటి విద్యార్థినులు పోలీసులకు అప్పగించారు. ‘మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు పడలేక పోతున్నాం. మా శైలజ మేడం తప్ప ఎవ్వరూ మమ్మల్ని నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి. మా ఆఖరి కోరిక ఇది..’ అంటూ భవ్య, వైష్ణవి నోట్ రాశారు. భవ్య 3 వతరగతి నుంచి ఇదే వసతి గృహంలో ఉంటున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన వీరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఏడవ తరగతి విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో భవ్య, వైష్ణవికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వార్డెన్ శైలజ తెలిపారు. కాగా ఈ ఘటనపై వసతి గృహంలోని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. -
కొత్తింట్లోకి బుల్లితెర నటి, గృహప్రవేశం వీడియో షేర్ చేసిన వైష్ణవి
బుల్లితెర నటి వైష్ణవి తాజాగా గృహప్రవేశం చేసింది. ఇరుకు గదులతో ఇబ్బందిపడుతున్న ఆమె తాజాగా కొత్తింటికి షిఫ్ట్ అయింది. ఈ దీపావళిని కొత్తింట్లోనే సెలబ్రేట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కుడికాలు పెట్టి కొత్తింట్లో అడుగుపెట్టిన నటి ముందుగా పూజగదిలో దేవుళ్లను శుభ్రం చేసి కుంకుమ పెట్టి పూజ చేసింది. తర్వాత ఇంటిని బంతిపూలతో అందంగా అలంకరించింది. అయితే ఇంట్లో కొన్ని పనులు ఇంకా జరుగుతున్నందున పూర్తి సామాగ్రిని తెచ్చుకోలేదంది. అందుకని రైస్ కుక్కర్లోనే పాలు పొంగించేసింది. సొంతింటి కల సాకారానికి ఇంకాస్త సమయం పడుతుందని, ప్రస్తుతానికైతే ఇది అద్దె ఇల్లు అని పేర్కొంది. పాత ఇల్లు ఉండటానికి ఇరుకుగా మారటంతో 3.5 బీహెచ్‌కేలో అద్దెకు దిగామని చెప్పింది. ఈ ఇల్లు విశాలంగా ఉందని, గాలి,వెలుతురు చాలా బాగా వస్తున్నాయని సంతోషపడిపోయింది. ప్రతి గదిలో కప్‌బోర్డులు ఉన్నాయంది. ఇంకా కొన్ని గదులు మేకోవర్ చేయాలంది. ఇది చూసిన జనాలు.. త్వరలోనే సొంతింటి కల కూడా నెరవేరుతుందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ముగ్గులేసిన సితార, ఉపాసన ఇంట దీపావళి పార్టీ.. దీపాల కాంతుల్లో వితికా -
బాధను భరించలేక.. యువతి విషాద నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: సారంగపూర్ మండలంలోని పొట్య గ్రామానికి చెందిన అలుగొండ వైష్ణవి(17) తలనొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందని సారంగాపూర్ ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. కొన్నేళ్లుగా సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడం, ఖరీదైన చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో శనివారం ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైష్ణవి తండ్రి దత్తన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఇంటి మిద్దె కూలడంతో ఒక్కసారిగా చిన్నారి.. తీవ్ర విషాదం!
మహబూబ్‌నగర్: శిథిలావస్థకు చేరిన ఓ ఇంటి మట్టి మిద్దె కూలి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మద్దెల్‌బీడ్‌లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నర్సప్పకు భగవంతు, బస్వరాజు, అంజి అనే ముగ్గురు కుమారులు. అందరూ 30 ఏళ్లు క్రితం నిర్మించిన మట్టిమిద్దె ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. ఉదయం పత్తి ఏరే పని ఉండడంతో అందరూ పొలం వద్దకు వెళ్లారు. ఇంటి వద్ద అంజి భార్య అనిత, బస్వరాజు కుమార్తె వైష్ణవి ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో కట్టె స్తంభంతో కూలడంతో అక్కడే ఆడుకుంటున్న వైష్ణవి, నర్సప్ప చిన్నకోడలు అనిత మట్టి మిద్దె కూలింది. దీంతో వారిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి.. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి, వెంటనే వారిని నారాయణపేట జిల్లాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. వైష్ణవి (3) మార్గమధ్యంలోనే మృతి చెందింది. అనిత చికిత్స పొందుతోంది. -
వాళ్ళ పైన బిత్తిరి సత్తి కామెంట్స్ వింటే నవ్వు ఆపుకోలేరు
-
బాబు కోసం బంగారం షాపింగ్ చేసిన బుల్లితెర నటి
బుల్లితెర నటి వైష్ణవి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! తనకు కొడుకు పుట్టగానే నటి తమ్ముడు ఆ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తమ కుటుంబంలోకి వెలుగులు తీసుకొచ్చిన పసివాడి కోసం తాజాగా నటి బంగారం కొనుగోలు చేసింది. ఆమె షాపింగ్ చూస్తే నెల రోజులు కూడా నిండని బాబు కోసం ఇన్ని వస్తువులు కొనచ్చా? అని అనిపించక మానదు. పిల్లలకు ఏమేం వేస్తారో అన్నీ చూపించండి అంటూ షాపింగ్ మొదలుపెట్టింది వైష్ణవి. కళ్లకు నచ్చినవాటిని పక్కనపెడుతూ షాపింగ్ కొనసాగించింది. బాబుకు దిష్టి తగలకుండా 4 గ్రాముల దిష్టిపూసల దండ జత తీసుకుంది. అలాగే 8 గ్రాముల కడెం(జత), 1 గ్రాము ఉంగరం, ఒక చైన్, 14 గ్రాముల బ్రేస్లెట్ తీసుకుంది. బంగారం షాపుకు వచ్చాక ఆడవాళ్ల కన్ను నగల మీద పడకుండా ఉంటుందా? కొత్తగా ఏమేం డిజైన్లు వచ్చాయో కనుక్కుంటూ వాటిని ఓసారి తనివితీరా చూసింది. పనిలో పనిగా తను కూడా బంగారు ఆభరణాలు కొనుక్కుంది. లక్ష్మీదేవి నెక్లెస్, మ్యాచింగ్ గాజులు, చెవికమ్మలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఇకపోతే నటి వైష్ణవి రామిరెడ్డి బుల్లితెరపై సీరియల్స్‌లో నటించింది. సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాక వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ నటనకు గుడ్‌బై చెప్పింది. సెప్టెంబర్‌లో గర్భవతినన్న విషయాన్ని వెల్లడించిన ఆమె ఆ మధ్య సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
బుల్లితెర నటి వైష్ణవి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు విజయ్ సింహా సోషల్ మీడియాలో వెల్లడించాడు. కొత్త ప్రపంచంలోకి స్వాగతం మామా అంటూ చిన్నారి పాదాల బ్లూప్రింట్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. అబ్బాయి పుట్టాడంటగా.. కంగ్రాచ్యులేషన్స్ అంటూ నటి సునంద మాలశెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా అందుకు థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు విజయ్ సింహా. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా వైష్ణవి రామిరెడ్డి.. సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాక నటనకు గుడ్‌బై చెప్పింది. కానీ అటు సోషల్ మీడియాలో, ఇటు యూట్యూబ్ వీడియోలతో నిరంతరం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంది. ఈ క్రమంలోనే గత సెప్టెంబర్‌లో తను గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన సీమంతం వేడుక ఫోటోలను సైతం విడుదల చేసింది. View this post on Instagram A post shared by Strikers (@strikersinsta) -
యాక్షన్ థ్రిల్లర్
విన్ను మద్దిపాటి, స్మిరితరాణి బోర జంటగా సాయిశివన్ జంపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్రంథాలయం’. ఎస్.వైష్ణవి శ్రీ నిర్మించిన ఈ సినిమా మార్చి 3న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకులు బి.గోపాల్, కాశీ విశ్వనాథ్, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ట్రైలర్ రిలీజయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్ గ్రూప్‌లలో మా ట్రైలర్ వైరల్‌గా మారింది’’ అన్నారు సాయిశివన్ జంపాన, ఎస్.వైష్ణవి శ్రీ. -
బుల్లితెర నటి వైష్ణవి సీమంతం ఫోటోలు వైరల్
బుల్లితెర నటి వైష్ణవి రామిరెడ్డి పెళ్లి చేసుకున్నాక నటనకు గుడ్‌బై చెప్పింది. అయితే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ వీడియోలతో నిరంతరం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇటీవలే ఆమె తల్లి కాబోతున్న శుభవార్తను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే! తాజాగా తనకు సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పింక్ కలర్ పట్టు చీరలో మెరిసిపోతున్న వైష్ణవి ముఖం కళకళలాడుతోంది. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు నటికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గతేడాది సురేశ్ అనే వ్యక్తిని పెళ్లాడింది వైష్ణవి. సెప్టెంబర్‌లో తాను గర్భవతినన్న విషయాన్ని బయటపెట్టింది. View this post on Instagram A post shared by Vyshnavee Gade (@i_vyshnaveeramireddy) View this post on Instagram A post shared by Vyshnavee Gade (@i_vyshnaveeramireddy) చదవండి: నా తల్లిదండ్రులే నన్ను మోసం చేశారు: సీనియర్ నటి -
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్ నటి
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే దేవత సీరియల్ నటి వైష్ణవి ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పిన ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి తరచూ కొత్త వీడియోలతో ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. తాజాగా ఆమె కొత్త వీడియో రిలీజ్ చేస్తూ ఫాలోవర్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది. చదవండి: నిర్మాతలతో అలా ఉంటేనే హీరోయిన్లకు అవకాశాలు: నటి షాకింగ్ కామెంట్స్ తాను తల్లి కాబోతున్నానంటూ శుభవార్త పంచుకుంది. కొద్ది రోజులుగా తన యూట్యూబ్ చానల్లో ఎలాంటి అప్డేట్ ఇవ్వని వైష్ణవి.. తాజాగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెబుతూ అసలు విషయం చెప్పేసింది. ‘మా ఇంట్లోకి ఓ కొత్త మెంబర్ రాబోతున్నారు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఇంతకాలం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా వేయిట్ చేసిన అనంతరం ఇప్పుడు మీతో ఈ గుడ్‌న్యూస్ పంచుకుంటున్నా’ అని పేర్కొంది. అలాగే తన ఆరోగ్యం కూడా బాగుండటం లేదని, ఏం తిన్న వాంతులు అవుతున్నాయని చెప్పుకొచ్చిది. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. ఇంట్లో అందరు ప్రతి రెండు, మూడు గంటలకు తిను తిను అంటూ ఇబ్బంది పెడుతున్నారంంది. అనంతరం ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతినని తెలిపింది. అంతేగాకు ప్రెగ్నెన్సి సమయంలో తల్లిగా తను పాటించాల్సి జాగ్రత్తలు ఎంటనేవి కూడా కామెంట్స్ రూపంలో సూచించాలని, మీ అందరి సహకారం కావాలంటూ ఫాలోవర్స్‌ను కోరింది. ఆమె షేర్ చేసిన ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వైష్ణవి తల్లి కాబోతుందని తెలిసి ఆమె ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
హీరోయిన్ వైష్ణవి పట్వర్ధన్ లేటెస్ట్ ఫోటోస్
-
ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన 'దేవత' సీరియల్ నటి
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే దేవత సీరియల్ నటి వైష్ణవి ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే! సురేశ్ అనే వ్యక్తితో త్వరలోనే ఏడడుగులు నడవనుంది. తాజాగా వైష్ణవి తన యూట్యూబ్ చానల్లో నిశ్చితార్థపు వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమె నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. కాబోయే దంపతులు దండలు మార్చుకుని ఇద్దరూ ఉంగరాలు తొడుక్కుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, బుల్లితెర సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేశారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు వచ్చినవాళ్లతో పాటు వీడియో చూసి తమను ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది వైష్ణవి. కాగా వైష్ణవి దేవత సీరియల్లో సత్య పాత్రతో ప్రేక్షకులకు చేరువైంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ధారావాహిక నుంచి తప్పుకుంది. చదవండి: ఫోన్ చేస్తే బిజీ.. ఆరేళ్ల తర్వాత వేరొకరితో అలా... అఖిల్ బ్రేకప్ స్టోరీ ఏడేళ్ల లవ్.. బావ అనుమానించాడు: అరియానా బ్రేకప్ స్టోరీ -
అమ్మా నాన్న లేని బిడ్డ.. అండగా నేనుంటా
నవాబుపేట: అధికారం చాలా మందికి ఉంటుంది... కానీ ఆదుకునే గుణం అందులో కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ ఉంటారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టర్... నవాబుపేటలోని కేజీబీవీకి వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను చూసేందుకు ఆదివారం హాస్టల్‌కు వచ్చిన బంధువులతో ఆయన మాట్లాడారు. చాలామంది తమ పిల్లలకు పండ్లు, ఇతర వస్తువులు తెచ్చామని చెబితే... ఓ అవ్వ మాత్రం తన మనవరాలిని చూసేందుకు వచ్చానని, కట్టుకునేందుకు పాత దుస్తులు తెచ్చానంది. తల్లిదండ్రి లేని తన మనవరాలు ఇక్కడే ఆరోతరగతి చదువుతోందని, అన్నీ తానై చూసుకుంటున్నానని చెప్పి కంటతడిపెట్టింది. అవ్వ మాటలు విన్న కలెక్టర్ చలించిపోయారు. ఆ విద్యార్థినిని పిలిపించి మాట్లాడారు. ‘ఇంటర్ వరకు ఇక్కడే ఉంటది, ఇంకెందుకు బెంగ’అని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎవరు చూసుకుంటారని ఆ బాలిక కన్నీళ్లు కార్చడంతో కలెక్టర్ కదిలిపోయారు. భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నావని ప్రశ్నించగా, పోలీçసు అధికారి కావాలని ఉందని బాలిక సమాధానం చెప్పింది. దీంతో కలెక్టర్ ఆ చిన్నారిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానన్నారు. కలెక్టర్ దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన ఆ విద్యార్థిని మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కూచూర్‌కు చెందిన వైష్ణవి. తల్లిదండ్రులు మల్లేష్, అలివేలు గతంలో మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మమ్మ లక్ష్మమ్మ, తాత రాంచంద్రయ్య చూసుకుంటున్నారు. -
దీప్తి కోసమే ఆ టాటూ వేసుకున్నా: షణ్ముఖ్
కంటెంట్ ఉంటే చాలు క్రేజ్ దానంతటదే వస్తుందనడానికి "సాఫ్ట్వేర్ డెవలపర్" మంచి ఉదాహరణ. యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ షార్ట్ఫిలిమ్ ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు.. మిగతావి చూడకుండా ఉండలేనంతగా యువతను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులను ఇంతలా తన బుట్టలో వేసుకుంటోన్న సాఫ్ట్వేర్ డెవలపర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సూపర్ సిరీస్‌లోని హీరోహీరోయిన్లు షణ్ముఖ్ జశ్వంత్, వైష్ణవి చైతన్యతో యాంకర్ సత్తి గరంగరం ముచ్చట్లు పెట్టారు. సాఫ్ట్వేర్ డెవలపర్లో ఆ ఎపిసోడ్ నా ఫేవరెట్ ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ.. దర్శకుడు సుబ్బు, తాను మొదటగా రెండో సీజన్ స్క్రిప్ట్ రాసేసుకున్నామని చెప్పాడు. దాన్ని అమెరికాలో చిత్రీకరించేందుకు ప్లాన్ కూడా చేశామన్నాడు. ఆ సీజన్లో కొత్త టీమ్ ఉండబోతుందని, అయితే వైష్ణవికి పెళ్లైంది కాబట్టి ఆమె ఉండదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసినదాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీసే ఎక్కువ ఇష్టమని, అందులోనూ తొమ్మిదో ఎపిసోడ్ మరింత ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ చూసిన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మా సిరీస్ బాగుందని ప్రశంసించాకని, అలాగే మరికొందరు డైరెక్టర్లు ఫోన్ చేసి మెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నాడు. (చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు) దీప్తికి ఇష్టమైతే కలిసి నటిస్తాం "వెబ్ సిరీస్‌లో చూపించినట్లు కాకుండా నేను నిజజీవితంలో చాలా సైలెంట్‌గా ఉంటా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. సినిమాలో అవకాశం వచ్చేవరకు పరిగెడుతూనే ఉంటాను. ఇండస్ట్రీలో సూర్య, అల్లు అర్జున్ నాకు ఫేవరెట్. ఈ మధ్యే సూర్య సినిమా 'ఆకాశమే నీ హద్దురా' చూసి ఏడ్చేశాను" అని చెప్పాడు. తన చేతికున్న టాటూ గురించి చెప్తూ అది దీప్తి సునయన కోసం వేయించుకున్నానని రహస్యాన్ని బయటపెట్టాడు. ఆమెకు ఇష్టమైతే మళ్లీ కలిసి నటిస్తామని మనసులో మాట బయట పెట్టాడు. (చదవండి: సూపర్ సిరీస్..‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’) అదే నా పెద్ద డ్రీమ్: వైష్ణవి వైష్ణవి మాట్లాడుతూ.. నా జీవితంలో మిస్టర్ షన్నూలాంటి వాళ్లు ఎవరూ లేరు. భవిష్యత్తులో వస్తారేమో చూడాలి. సినిమా హీరోయిన్గా చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే నాని టక్ జగదీశ్, నాగశౌర్య సినిమాల్లో కీలక పాత్రల్లో చేస్తున్నా. బిగ్‌బాస్‌లోకి అవకాశం వస్తే వెళ్తాను. అనుష్క నా ఫేవరెట్ హీరోయిన్. నా డ్రీమ్ ఒక్కటే.. వైష్ణవి అంటే ట్రెడిషనల్.. ట్రెడిషనల్ అంటే వైష్ణవి. ఆ పేరు రావాలి" అని చెప్పుకొచ్చింది. -
షన్ను-వైష్ణవితో సత్తి ముచ్చట్లు
-
షన్ను, వైష్ణవిలతో గరం ముచ్చట్లు
-
షార్ట్ అండ్ స్వీట్.. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’
తెలుగు తెరపై కొన్ని ఆణిముత్యాలు మనకు ఇప్పటికీ గుర్తుంటాయి.. ఎప్పటికీ మన మదిలో నిలిచిపోతాయి.. కొంతకాలంగా సోషల్ మీడియా హవా బాగా నడుస్తోంది. ప్రతి ఒక్కరి టాలెంట్‌కు యూట్యూబ్ ప్లాట్‌ఫాం ఇస్తుంది. ఇదే యూట్యూబ్ వేదికగా ఇటీవల విడుదలైన షార్ట్‌ఫిలిం ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో పది ఎపిసోడ్స్‌ని 80.6 మిలియన్స్ (8కోట్ల మంది) వీక్షించారు. అందరి మన్ననలు సొంతం చేసుకుని సౌత్‌లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ సోషల్ మీడియాలో ట్రెండ్ ఇప్పటి వరకు ఈ పది ఎపిసోడ్స్‌ని 86 మిలియన్స్ ప్రజలు వీక్షించారు. 1.50 మిలియన్ మంది ఛానల్‌ను సబ్‌స్రై్కబ్ చేసుకున్నారు. అక్టోబర్ నెలలోనే 1.04 మిలియన్స్ సబ్‌స్రైబ్ చేసుకోవడంతో యూట్యూబ్‌లో సౌత్ ఇండియా రికార్డ్ నెలకొల్పింది. వెబ్ సిరీస్ సూపర్‌హిట్ ఇన్ఫినిటమ్ మీడియా నెట్వర్క్ సొల్యూషన్స్ సంస్థ నిర్మించిన ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాలకు చెందిన వారు ఈ సిరీస్‌ను వీక్షిస్తున్నారు. ఈ సిరీస్‌లో జీవితాంతం గుర్తుండిపోయే క్యారెక్టర్ షన్నూ. లీడ్‌రోల్ చేసిన షన్నూ(షన్మఖ్ జశ్వంత్) తన యాక్టింగ్ స్కిల్స్‌తో విమర్శకుల్ని సైతం మెప్పించాడు. – షన్నూ(షన్ముఖ్ జశ్వంత్) ఆసక్తికరమైన క్యారెక్టర్లు ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మరో రెండు ఆసక్తికరమైన క్యారెక్టర్లను పరిచయం చేశాడు దర్శకుడు సుబ్బు.కె. మేనేజర్‌గా ఉన్న అరవింద్(జయచంద్ర) తన కంపెనీలో చేసే ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చుతూ టైంకి పని చేపించుకుంటాడు. పిజ్జా, బర్గర్లు లాంటివి ఆర్డర్ చేస్తూ.. మా మేనేజర్ భలే మంచోడనే ట్యాగ్‌లైన్‌ని సొంతం చేసుకున్నాడు. –మేనేజర్ అరవింద్(జయచంద్ర), హెచ్ఆర్ శృతి(శ్రీవిద్య) లుక్స్‌తో ఫ్లాట్ చేసిన చైతన్య ఫీమేల్ లీడ్ రోల్ చేసిన వైష్ణవి చైతన్యకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఈ వెబ్‌సిరీస్‌లో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చేసిన మాదిరిగా చేయడం తనకు తానే సాటిగా మలుచుకుంది. తన లుక్స్, హావభావాలతో నెట్టింట్లోని ప్రతి అబ్బాయిని ఫ్లాట్ చేసింది. క్యూట్ లుక్స్, స్వీట్ వాయిస్‌తో షన్నూ మాట్లాడుతుంటే.. మొబైల్స్‌లో అది చూస్తున్న ప్రేక్షకుడు గాల్లో తేలిపోయారు. –వైష్ణవి (వైష్ణవి చైతన్య) హైప్ కోసం చేశా.. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ అనేది నా మైండ్‌లో లేదు. సీజన్ టూ అని స్క్రిప్ట్ రాసుకున్నాను. సీజన్ టూ చేద్దాం అనుకునే సమయంలో సీజన్ వన్ చేయాలి కదా అన్నారు. సో, సీజన్ వన్‌కి ఏదైనా హైప్ తెస్తేనే.. సీజన్ టూకు క్రేజ్ వస్తుందనే ఐడియా వచి్చంది. అందుకే 10 ఎపిసోడ్స్‌తో ఉన్న ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ని చేశా. నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది. – సుబ్బు.కె. డైరెక్టర్ ట్రెండింగ్ అవుతున్నాం.. మేం నమ్మి అవకాశం ఇచి్చనందుకు డైరెక్టర్ కె.సుబ్బు బాగా తీశారు. సోషల్ మీడియాలో వస్తున్న క్రేజ్ చూస్తుంటే భలే ఆనందమేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మా సిరీస్‌నే ట్రెండింగ్‌లో ఉంది. ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్స్‌కి 100శాతం న్యాయం చేశారు. ఇదే స్ఫూర్తి, ఆనందంతో సీజన్ టూని ఇంతకన్నా క్వాలిటీగా, ప్రతి ప్రేక్షకుడూ మర్చిపోలేని విధంగా నిర్మించి తీరుతా. –వందనా బండారు, ప్రొడ్యూసర్, ఇన్ఫినిటమ్ మీడియా నెట్వర్క్ సొల్యూషన్స్ -
నిన్న కళాశాల.. నేడు చెరసాల
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిన్నటి వరకు కళాశాలలో ఓ ప్రొఫెసర్‌గా విద్యార్థులకు పాఠాలు చెప్పాడు. ప్రస్తుతం ప్రియురాలి అనుమానాస్పద కేసులో అరెస్టయి జైలు పక్షిగా మారిపోయాడు. తెలుగు అధ్యాపకురాలు హరిశాంతి అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి డీజీ వైష్ణవీ కళాశాల ప్రాఫెసర్ నటరాజ్‌ను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తిరువళ్లూరు జిల్లా కారంబాక్కం తాలూకా ఎల్ల యమ్మన్ ఆలయం వీధికి చెందిన హరిశాంతి (32) ఉన్నత విద్యావంతురాలు. మద్రాసు యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు పొందిన హరిశాంతి చెన్నై పెరంబూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగుటీచర్గా పనిచేసేవారు. మద్రాసు యూనివర్సిటీలో తోటి విద్యార్థి నటరాజ్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారినట్లు సమాచారం. పీహెచ్డీ పట్టా అందుకున్న తరువాత హరిశాంతి, నటరాజ్ ఇద్దరూ చెన్నై అన్నానగర్ ఆర్చ్ సమీపం, అరుబాక్కంలోని డీజీ వైష్ణవీ కళాశాలలో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరారు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. అయితే 2016లో నటరాజ్ మరో యువతిని పెళ్లిచేసుకోగా ఇద్దరు బిడ్డల తండ్రి కూడా అయ్యాడు. ఈ బాధతోనే మరో కారణం చేతనో హరిశాంతి డీజీ వైష్ణవీ కళాశాల ఉద్యోగాన్ని మానివేసి పెరంబూరులోని ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరింది. అయినా తరచూ కళాశాలకు రాకపోకలు సాగిస్తుండేది. యథాప్రకారం ఈ నెల 17న సాయంత్రం డీజీ వైష్ణవీ కళాశాలకు వచ్చిన హరిశాంతి తెలుగుశాఖ గదిలో ఉరివేసుకుని వేలాతుండగా మరుసటి రోజు ఉదయం కళాశాల సిబ్బంది గుర్తించారు. ఆమె చేతి మణికట్టు పదునైన వస్తువుతో కోసినట్లుగా కూడా ఉంది. ఆరుంబాక్కం పోలీసులు ఆమె మృతదేహాన్ని కీల్పాక్ పోస్టుమార్టానికి పంపారు. ప్రొఫెసర్ నటరాజ్‌తో స్నేహం, ప్రేమ విఫలం, ఆత్మహత్యకు దారితీసిన కారణాలను హరిశాంతి తన సెల్‌ఫోన్ వాట్సాప్‌లో నమోదు చేసినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. హరిశాంతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై నటరాజ్‌ను గురువారం రాత్రి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. -
పిల్లలను కౌన్సెలింగ్‌తో మార్చుకోవాలి
ప్రకాశం, తాళ్లూరు: పరువు హత్యలో కొత్తపాలెం గ్రామంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి వైష్ణవి కుటుంబాన్ని జాతీయ మహిళా కమిటీ సభ్యురాలు తమ్శిశెట్టి రమాదేవి, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ విశాలక్ష్మి బృందం మంగళవారం కలిశారు. వారి నివాసం వద్దకు వెళ్లి పరిస్థితులను ఆరా తీశారు. వైష్ణవి తాతయ్య అంజిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైష్ణవి పోస్టుమార్టం పూర్తికావటంతో దహన ప్రక్రియలు పూర్తి చేశామని తెలిపారు. అనంతరం సీఐ శ్రీనివాసరావుతో పోలీస్‌స్టేషన్‌లో సమావేశమై కేసు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయంలో మహిళా కమిటీ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి విలేకరులతో మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించామని తెలిపారు. తల్లిదండ్రులు క్షణికావేశాన్ని మాని మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను కౌన్సెలింగ్ ద్వారా మార్చుకోవాలే కానీ ఇలా క్రూరంగా వ్యవహరించటం తగదని అన్నారు. ఐసీడీఎస్ జిల్లా పీడీ విశాలక్ష్మి మాట్లాడుతూ బాలికలకు విద్యార్థి దశ నుంచే మంచి చెడ్డల విచక్షణను తల్లిదండ్రులు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. యాంత్రిక యుగంలో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయిందని, సెల్ ఫోన్ టీవీల కాలక్షేపంతో పిల్లలకు, తల్లిదండ్రులకు దూరం పెరుగుతోంద న్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా మానవతా విలువలపై విద్యార్థులను నిత్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేటి సమాజంలో ఇటువంటి పరువు హత్యలు జరగటం తీవ్ర పరిణామమని అన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాధిత మహిళల కోసం స్త్రీ, శిశు సంక్షేమం ద్వారా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో సఖీ పథకం కూడా ఒకటి అన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ కేవీపీ రాజకుమారి, జీసీడీఓ జ్యోతి సుప్రయ, గృహ హింస చట్టం లీగల్ కౌన్సెలర్ సరళ, వన్ స్టెప్ సఖీ కౌన్సెలర్ సాహిన్ తదితరులు పాల్గొన్నారు. -
వైష్ణవికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఓపెన్ కరాటే టోర్నీలో శంకర్జీ స్మారక బాలికల హైస్కూల్‌కు చెందిన వైష్ణవి స్వర్ణాన్ని గెలుచుకుంది. కరీంనగర్లో జరిగిన ఈటోర్నీలో శంకర్ జీ విద్యార్థులు మొత్తం 11 పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 1 స్వర్ణం, 3 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. సీహెచ్ వైష్ణవి (పసిడి), బి. కీర్తి, ఎస్. కీర్తన, సి. తులసి (రజతాలు), భూమిక, అశ్విత, శోభ, ఎన్. దిశ, లావణ్య, హర్షిత, లావణ్య (కాంస్యాలు) పతకాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. శ్రీనివాస్, శంకర్ జీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు. -
తీశాక చూస్తే మీటూ అయింది!
వైష్ణవి సుందర్. వయసు 32. ఫిల్మ్ మేకర్. చెన్నైలో ఉంటారు. యాక్టివిస్టు, రచయిత్రి కూడా. ఇప్పటికే నాలుగు చిత్రాలు తీశారు వైష్ణవి. ఇప్పుడొక డాక్యుమెంటరీ తీశారు. అదే.. ‘బట్ వాట్ వజ్ షి వేరింగ్’. ఎక్కువ నిడివి గల డాక్యుమెంటరీ. దీర్ఘచిత్రం అనొచ్చు. ఇందులో.. ఉద్యోగం చేసే చోట లైంగిక వేధింపులకు గురైన 32 మంది మహిళల గురించి చెప్పారు. నవంబరు 3 న చెన్నైలోని మాక్స్ ముల్లర్ భవన్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మీ టూ ఉద్యమం మొదలవడానికి వైష్ణవి చిత్రీకరించిన మీ టూ కథలు, వ్యథలే ఇవన్నీ! ‘బట్ వాట్ వజ్ షి వేరింగ్’.. డాక్యుమెంటరీనే అయినప్పటికీ చిత్రం అనే అనాలి. 2013 లో వచ్చిన లైంగిక వేధింపుల (వర్క్‌ప్లేస్‌లో) నిరోధక చట్టాన్ని ఆధారంగా ఈ దీర్ఘచిత్రం నడుస్తుంది. అప్పట్లో ఉద్యోగాల్లో పురుషుల వల్ల ఇబ్బందులకు గురైన మహిళలు ఆ విషయాన్ని బయటకు చెప్పాలంటే భయపడేవారు. అవమానంగా భావించేవారు. మీ టూ వచ్చాక ఇప్పుడు కొంత నయం అయింది. ఇందులో వైష్ణవి సుందర్ ప్రధానంగా న్యాయపరమైన అంశాలను చూపారు. సుప్రీంకోర్టు 1997లో ఇచ్చిన విశాఖ గైడ్ లైన్స్‌ని కూడా ప్రస్తావించారు. లైంగిక వేధింపుల కేసులను విచారించడంలోని మార్గదర్శకాలవి. 110 నిమిషాల నిడివిలో ఉన్న ఈ చిత్రాన్ని 17 సెగ్మెంట్లుగా విడగొట్టారు వైష్ణవి. చట్టానికి సంబంధించి అనేక ప్రశ్నలు సంధించారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి చర్చించారు. లైంగిక వేధింపుల కారణంగా మహిళల ఆరోగ్యం ఏ విధంగా దెబ్బ తింటోందో కూడా తెలియచెప్పారు. చట్టం ఏం సాధించింది? డాక్యుమెంటరీ కోసం వైష్ణవి ముప్పై రెండు మందిని ఇంటర్వ్యూ చేశారు. సమాజంలో రకరకాల సామాజిక, ఆర్థిక, వృత్తుల విభాగాలకు చెందిన వారిని ఇందులో ప్రశ్నించారు. కొందరు ఈ సమస్యను ఎదుర్కొన్నవారు, కొందరు ఈ సమస్యను ఎదుర్కొన్నవారికి చేరువగా ఉన్నవారు సంభాషించారు. వీరంతా ^è ట్టానికీ, చట్టాన్ని అమలు చేయడానికి ఉన్న తేడా గురించి మాట్లాడారు. చట్టం ఏం సాధించింది అని ముందుగా ప్రశ్నించారు డాక్యుమెంటరీలో. ఇందులో ఒక విభాగానికి ‘‘దేర్ ఈజ్ యాక్ట్ నౌ, బట్ ఈజ్ దేర్ ఎ సొల్యూషన్’ అని పెట్టారు. ‘మీ టూ’ కథలే ఇవన్నీ!! ‘‘డాక్యుమెంటరీ తీయాలనుకున్నప్పుడు నాకు ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదు. నాలో పరిశోధనాత్మక లక్షణం ఉండటంతో ఈ విధంగా రూపొందించాను’’ అంటారు వైష్ణవి. చిత్రీకరణ కోసం సుందర్ 2016లో పరిశోధన ప్రారంభించిన ప్పుడు తన పరిశోధన ఇప్పటి ‘మీ టూ’తో యాదృచ్ఛింగా కలుస్తుందని ఆమెకెలా తెలుస్తుంది? ‘‘నా డాక్యుమెంటరీ చూసి... ఇది టైమ్లీగా ఉంది అంటున్నారు. పది సంవత్సరాల క్రితమే ఉద్యోగ ప్రదేశంలో లైంగిక వేధింపుల గురించి చట్టం వచ్చింది. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ విడుదల కావడం అంతా కో ఇన్సైడ్’’ అంటారు వైష్ణవి. డాక్యుమెంటరీ తీయడానికి ఫండింగ్ పెద్ద సమస్య అయ్యింది వైష్ణవికి. ఫండింగ్ రాని థీమ్! ‘నేను గతంలో తీసిన సినిమాలకు ఫండింగ్ బాగా వచ్చింది. చాలామందిని స్వయంగా కలిసి అడిగాను. కాని ఈ దీర్ఘచిత్రం లైంగిక వేధింపుల అంశం కావడంతో అడగడానికి కొంచెం మొహమాటపడ్డాను. అదొక్కటే కాదు, మహిళలకి సంబంధించిన అంశాలకు ఫండింగ్ రావడం కూడా కష్టమే. దీని నిర్మాణానికి విరాళాలు అడిగినప్పుడు నాకు 100 రూ. 50 రూ. 10 రూ. వచ్చాయి. ప్రతి రూపాయినీ బ్యాంకులో జమ చేశాను. పది వేలు కాని, ఐదు వేలుకాని వస్తే డాక్యుమెంటరీ తీయడం సులభం అయ్యేది కాని, పది రూపాయల చొప్పున పోగు చేయడం వల్ల కాస్త ఇబ్బంది అనిపించింది’’ అంటారు వైష్ణవి. ఇందులో వైష్ణవి చేసిన ప్రతి ఇంటర్వ్యూలోనూ బ్యాక్‌గ్రౌండ్ నలుపు రంగు వేశారు. ఇలా వేయడం వలన అందరినీ సమానంగా చూపినట్టు అవుతుందని ఆమె భావించారు. మనసు విప్పి మాట్లాడారు ‘‘ఒక సీఈవో మాట్లాడుతున్నప్పుడు ఆమె పని చేసే చోటును చూపలేదు. ఇక్కడ అది ప్రధానం కాదు. వారి సమస్యను ఫోకస్ చేయాలే కాని, వారి ఉద్యోగ ప్రదేశం కాదని భావించాను’’ అని వైష్ణవి సమాధానం. బాధితులు సామాన్యులైతేనేం, కోటీశ్వరులైతేనేం అనే భావనతోనే ఈ విధంగా చూపారు ఆమె. అలాగే బాధితులను టైట్ ఫ్రేమ్స్‌లో చూపారు. ‘‘వారు చెప్పే మాటలు వినాలనిపిస్తుంది. ఎందుకంటే వారు మనతో మాట్లాడుతున్నంత చక్కగా వివరాలు చెప్పారు’’ అంటారామె. ఈ డాక్యుమెంటరీలో అందరూ మహిళలే పనిచేయడం విశేషం. – జయంతి -
విష్ణు సేనాపతి విష్వక్సేనుడు
శైవ సంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులు తొలిగా విష్వక్సేనుని స్మరిస్తారు,ç పూజిస్తారు. ఈయన విష్ణుగణాలకు అధిపతి. వైకుంఠ సేనాని. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉంటాడు. కుడిచేతిలో అభయముద్రనిస్తూ ఎడమచేతిని కటి వద్ద ఉంచుకుని, పర హస్తములలో శంఖు చక్రాలను ధరించి దర్శనమిస్తాడు. వైష్ణవులు స్మరించే గురుపరంపరలో ఈయన స్థానం మూడవది. మొదట విష్ణువు, రెండు లక్ష్మీ దేవి. విష్వక్సేనుల వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు. బంగారుశరీర వర్ణంతో విశాలమైన కనులతో పుట్టుకతోనే దేహంపై శంఖం, ఖడ్గం, ధనస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుడతాడు. ఈయనను కశ్యపమహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాలను నేర్పిస్తాడు. తరువాత వృషభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహంతో సేనాపతిగా అవతరిస్తాడు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో విష్వక్సేనుల వారి సన్నిధి ఉందనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్వామివారి ఆలయానికి చుట్టూ ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ఈ సన్నిధి కనిపిస్తుంది. అయితే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రాంతాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తుల రద్దీ వలన ఈ సన్నిధి దగ్గరికి వెళ్లడానికి అందరికీ అవకాశం ఉండదు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా సేనాపతి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈయన నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు వాహనంపై వేంచేస్తారు. విజ్ఞానాన్నిచ్చే విష్వక్సేన రూపం విష్వక్సేనుడు జ్ఞాన ప్రదాయకుడు. ఈయన నాలుగు చేతులతో పద్మపీఠంపై ఆసీనుడై నిజ హస్తాలతో కుడిచేత అభయ ముద్ర లేక సూచి హస్తం లేక పుష్పాన్ని ధరించి ఉంటాడు. కొన్నిచోట్ల దండాన్ని ధరించి కూడా కనిపిస్తాడు. ఎడమచేత కటి ముద్రను గాని, గదను గానీ ధరించి ఉంటాడు. పర హస్తాలలో శంఖు చక్రాలను ధరిస్తాడు. విష్ణు స్వరూపానికి ఈయనకు ఒకటే తేడా. మహావిష్ణువుకు శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి. విష్వక్సేనుడికి అవి ఉండవు. వైష్ణవాగమాలైన పాంచరాత్రాగమం, వైఖానస ఆగమం విష్వక్సేన స్వరూపాన్ని చాలా చక్కగా వివరించాయి. ఈ స్వామి ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని పరాశర సంహిత చెప్పింది. – డా. ఛాయా కామాక్షీదేవి -
మరణించే వరకూ జైలే
విజయవాడ లీగల్: ఎనిమిదిన్నరేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం కలిగించిన చిన్నారి పలగాని నాగవైష్ణవి (10) కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులకు విజయవాడ సెషన్స్ న్యాయస్థానం జీవిత కాల (మరణించే వరకు) జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్, పంది వెంకట్రావు అలియాస్ కృష్ణను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్లు 302, 364, 307, 201, 392, 120బి రెడ్ విత్ 34 ప్రకారం వీరికి బతికి ఉన్నంతకాలం జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఎం.బబిత గురువారం తీర్పు వెలువరించారు. దీనికి తోడు శ్రీనివాసరావు, యంపరాల జగదీష్‌లకు రూ.4,500 చొప్పున, పంది వెంకట్రావుకు రూ.4వేలు జరిమానా కూడా విధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలన కేసు: నాగవైష్ణవి, కారు డ్రైవర్ లక్ష్మణరావు హత్య ఎనిమిదిన్నరేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం కలిగించింది. విజయవాడకు చెందిన పలగాని ప్రభాకర్‌రావు మొదటి భార్య పలగాని వెంకటేశ్వరమ్మ, రెండో భార్య నర్మదాదేవి మధ్య విభేదాలు ఉండేవి. ఆయన తన రెండో భార్య నర్మదాదేవి, ఆమె కుమార్తె అయిన నాగవైష్ణవి పేరుతో రూ.కోట్ల ఆస్తులు కొనుగోలు చేయడంతో మొదటి భార్య వెంకటేశ్వరమ్మ విభేదించారు. తన అక్కకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వెంకటేశ్వరమ్మ సోదరుడు పంది వెంకట్రావు బావ పలగాని ప్రభాకరరావుపై కక్ష పెంచుకున్నారు. ఆయన కుమార్తె నాగవైష్ణవిని హత్య చేసి కక్ష తీర్చుకోవాలని మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్‌లతో రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నాగవైష్ణవి(10ఏళ్లు), ఆమె సోదరుడు సాయి తేజేష్ గౌడ్లను వారి కుటుంబ డ్రైవర్ లక్ష్మణరావు 2010 జనవరి 30న ఉదయం 8 గంటలకు విజయవాడ న్యూ అయోధ్యనగర్‌లోని స్వగృహం నుంచి కారు (ఏపీ 03ఆర్ 2223)లో పాఠశాలకు తీసుకెళుతుండగా సత్యనారాయణపురం రైల్వే కాలనీ సమీపంలో మోర్ల శ్రీనివాసరావు రాయి విసిరి కారు అద్దం పగలగొట్టాడు. డ్రైవర్ లక్ష్మణరావు దిగి చూస్తుండగా మోర్ల శ్రీనివాసరావు, జగదీష్ కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది గమనించిన నాగవైష్ణవి సోదరుడు సాయితేజేష్‌గౌడ్ కారు నుంచి దూకి పారిపోయాడు. నాగవైష్ణవిని శ్రీనివాసరావు, జగదీష్ కిడ్నాప్ చేశారు. నాగవైష్ణవిని తీసుకుని కారులో సీతానగరం చేరుకున్నారు. కారులోనే గొంతునులిమి హత్య చేశారు. మృతదేహాన్ని గుంటూరులోని ఆటోనగర్‌లోగల మసీదు రోడ్డులో ఉన్న మోర్ల శ్రీనివాసరావుకు చెందిన శారద ఇండస్ట్రీస్ (ఎం/ఎస్ ఏఎస్ ఆటో లింక్స్)కు తరలించారు. రాత్రి 11 గంటలకు ఎలక్ట్రికల్ బ్రాయిలర్‌లో వేసి కాల్చేశారు. ఆ మర్నాడు ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాచ్మెన్ బూడిదగా మారిని నాగవైష్ణవి మృతదేహాన్ని చూసి కంగారుతో పారిపోయాడు. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కారు డ్రైవర్ లక్ష్మణరావు హత్య, నాగవైష్ణవి కిడ్నాప్ కలకలం రేపింది. తన కుమార్తె నాగవైష్ణవి మరణించిందన్న వార్త విన్న తండ్రి పలగాని ప్రభాకర్‌రావు గుండెపోటుతో మృతి చెందాడు. బాలిక చెవికి ఉన్న డైమండ్ రింగ్‌ను పోలీసులు తమ దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలతో గుర్తించారు. కేసు విచారించిన సత్యనారాయణపురం పోలీసులు పంది వెంకట్రావ్ అలియాస్ కృష్ణ, మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్, పంది వెంకట్రావులపై ఐపీసీసెక్షన్లు 302, 307, 364, 201, 427, 379, 120బీ, రెడ్‌విత్ 34, ప్రకారం చార్జిషీటు దాఖలు చేశారు. 8 ఏళ్ల విచారణ అనంతరం న్యాయస్థానం వారు ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు తీర్పు వెలువరించిన నేపధ్యంలో పోలీసులు కోర్టు ప్రాంగణంలో మోహరించారు. చిన్నారి నాగవైష్ణవి కేసు ఎనిమిది సంవత్సరాలు పైబడి విచారణ జరిగినప్పటికీ న్యాయం జరిగిందని ఈ కేసులో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.బ్రహ్మానందరెడ్డి అన్నారు. గుండెలను పిండి చేసిన విషాదం నాగవైష్ణవి హత్య, తదనంతర పరిణామాలు ఆద్యంతం గుండెలు పిండే విషాదామే. ఈ ఉదంతంలో నలుగురు తల్లడిల్లి చనిపోయారు. తన ఉపాధి చూపిన యజమాని పిల్లలను కాపాడేందుకు యత్నించిన కారుడ్రైవర్ లక్ష్మణరావు దారుణ హత్యకు గురయ్యాడు. అల్లారుముద్దుగా చూసుకున్న తన కుమార్తెను దారుణంగా చంపారన్న విషయం తెలియడంతోనే పలగాని ప్రభాకర్ కుప్పకూలిపోయారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి చెందారు. ఇక వైష్ణవి తల్లి నర్మదాదేవి పడిన కష్టం గుండెలు పిండేస్తుంది. కన్నకూతుర్ని, కట్టుకున్న భర్తను కోల్పోయి న్యాయం కోసం పోలీసు అధికారులు, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగి, తిరిగి విసిగి తీవ్ర నిరాశకు గురైంది. ఈ కేసులో తీర్పు ఎంతకూ రాకపోవటతో రెండేళ్ల కిందట మనోవ్యధతో అనారోగ్యానికి గురై చనిపోయారు. కోర్టులో న్యాయం కోసం ఎదురుచూస్తూ ఎనిమిది నెలల కిందట ప్రభాకర్ సోదరుడు వైష్ణవి బాబాయి పలగాని సుధాకర్ కూడా ఇదే వ్యధతో చనిపోయారు. -
’జడ్జిమెంట్ సరైనదే అని భావిస్తున్నా’
-
అది మా అమ్మ చివరి కోరిక: నాగవైష్ణవి అన్న
సాక్షి, విజయవాడ : ఎనిమిది సంవత్సరాల క్రితం 2010లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ జడ్జి ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవితఖైదు ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తీర్పువెలువరించింది. కోర్టు తీర్పుపై నాగవైష్ణవి సోదరుడు హరీష్ స్పందించారు. నాగవైష్ణవి కేసులో జడ్జిమెంట్ కరెక్ట్‌గా వచ్చిందని భావిస్తున్నానని అన్నారు. తాను ఎప్పుడు లైఫ్ అండ్ టిల్ డెత్ అనే తీర్పు వినలేదని చెప్పాడు. తీర్పు లేటుగా వచ్చిందని, రెండేళ్ళ క్రితం తీర్పు వచ్చి ఉంటే ఈ కేసు కోసం పోరాడిన తన తల్లి, బాబాయ్‌తో పాటు ఎంతో మంది సంతోషించేవారని పేర్కొన్నారు. ఇక మీదట మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా తీర్పు వచ్చిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని మా అమ్మ కోరుకునేదని హరీష్ కన్నీరు మున్నీరయ్యారు. నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు -
నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు
-
నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు
సాక్షి, విజయవాడ : ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ జడ్జి ఈ కేసులో తుది తీర్పు ప్రకటించారు. గురువారం నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తుది తీర్పును వెలువరించింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు అనిపించేలా ఈ తీర్పు ఉందని ప్రజలు భావిస్తున్నారు. వైష్ణవి హత్య నేపథ్యం : విజయవాడకు చెందిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా దుండగులు అడ్డగించి డ్రైవరును హతమార్చి వైష్ణవిని కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు తీవ్ర గాలింపుల అనంతరం, గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లోని ప్లాట్ నెంబరు 445లో చిన్నారి శవం లభ్యమైంది. అభం శుభం తెలియని చిన్నారిని వేధింపులకు గురిచేసి, అనంతరం బాయిలర్‌లో వేసి బాలికను కాల్చి చంపినట్లులో పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌పై కోపంతో ఆయన మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ హత్యకు కట్ర పన్నిట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. వారిపై ఐపీసీ 302, 367, 420, 201, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. వైష్ణవి హత్య వార్త తెలియడంతో బాలిక కుటుంబం షాక్‌కు గురైంది. తన గారాలపట్టి హత్యకు గురైందన్న విషయం తెలసుకొని ప్రభాకర్ పుత్రికా శోకంతో కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్తి కోసం సొంతవారే చిన్నారిని దారుణంగా హతమార్చడంపై ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నిందితలను కఠింగా శిక్షించాలంటూ ఆందోళనలు చేశారు. -
‘ఆ రక్తంలో ఇన్ఫెక్షన్ లేదు’
సాక్షి, సిటీబ్యూరో: కళ్లు తిరిగి కిందపడటంతో ఆస్పత్రిలో చేరి, ఇన్ఫెక్షన్తో చేయిని కోల్పోయిన బాధితురాలు వైష్ణవికి సరఫరా చేసిన రక్తంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని జనని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు లక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. గడువు తీరిన, ఇన్ఫెక్షన్తో కూడిన రక్తం సరఫరా చేసినట్లు బాధితురాలి తండ్రి, చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తాము దాతల నుంచి డిసెంబర్ 11న రక్తాన్ని సేకరించి, అన్ని రకాల పరీక్షలు చేసి, ఏ లోపం లేదని తేలిన తర్వాతే జనవరి 3న బాధితురాలికి రక్తం సరఫరా చేసినట్లు తెలిపారు. 2005 నుంచి తాము రక్తనిధి కేంద్రాన్ని నడుపుతున్నామని, ఇప్పటి వరకు తమ సేవల్లో ఎలాంటి లోపం తలెత్తలేదని ఆయన వివరించారు. -
కళ్లు తిరిగాయని వెళితే.. చేయి తీసేశారు
వైష్ణవి.. ఈ ఫొటోలో ఉన్నమ్మాయే..చక్కగా ఉంది కదూ..అయితే.. ఇదంతా నెల క్రితం వరకూ..మరిప్పుడు..ఒక చేయి లేదు.. రెండో చేయి పనిచేయడం లేదు.. కాళ్లు కూడా.. స్వల్ప అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన యువతి రక్తం ఎక్కించడంతో వాచిపోయిన బాధితురాలి చేయి ఇన్ఫెక్షన్ సోకిందంటూ కుడి చేయి తొలగింపు పని చేయకుండా పోయిన ఎడమ చేయి.. కాళ్లు హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలి తల్లిదండ్రులు సాక్షి, హైదరాబాద్: చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే.. చివరికది చేయి తీసేదాకా వెళ్లింది. ఆస్పత్రుల నిర్లక్ష్యం.. తమ బంగారుకొండ జీవి తాన్ని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసిందంటూ వైష్ణవి తల్లిదండ్రులు శనివారం మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు రూ.24 లక్షల బిల్లు అయిం దని, ఆ మొత్తం చెల్లిస్తేనే తదుపరి వైద్య సేవలు కొనసాగిస్తామని ఆస్పత్రులు స్పష్టం చేయడంతో దిక్కుతోచని స్థితిలో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. వారేం చెప్పారంటే.. కళ్లు తిరిగి పడిపోయి ఆస్పత్రికి వెళ్తే.. మౌలాలి హనుమాన్‌నగర్‌కు చెందిన రాంశెట్టి సుధాకర్ కుమార్తె వైష్ణవి(17) ఈ నెల 3వ తేదీన అకస్మాత్తుగా కళ్లుతిరిగి పడిపోయింది. దీంతో తల్లి దండ్రులు చికిత్స కోసం ఆమెను నాచారం లోని ప్రసాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ సుమప్రసాద్ బాధితురాలు రక్తహీనతతో బాధ పడుతోందని, ఆమెకు రక్తం ఎక్కిం చాల్సి ఉందని చెప్పి అడ్మిట్ చేశారు. వారే ‘జనని వలంటరీ బ్లడ్ బ్యాంక్’ నుంచి రక్తం తెప్పించారు. అయితే రక్తం ఎక్కిస్తున్న సమయంలో వైష్ణవి చేయి నల్లగా కమిలి పోయి శరీరమంతా భరించలేని మంటతో ఇబ్బంది పడింది. ఇన్ఫెక్షన్ సోకిందని, మెరుగైన వైద్యం అందించాలని సదరు వైద్యురాలు 4వ తేదీన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్య చికిత్స వల్లే: వైష్ణవి తండ్రి సుధాకర్ వైష్ణవిని అడ్మిట్ చేసుకున్న అపోలో వైద్యులు తల్లిదండ్రులను పిలిచి పరిస్థితి విషమించిందని, కుడి చేయిని వెంటనే తొలగించాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదమని స్పష్టం చేశారు. తమకు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా బలవంతంగా తమతో సంతకం చేయించుకుని తమ కుమార్తె కుడి చేయిని తొలగించారని సుధాకర్ ఆరోపించారు. ఉన్న ఇల్లు అమ్మి వైద్య ఖర్చులు చెల్లించానని, మరో రూ.20 లక్షలు చెల్లించాలని, లేదంటే చికిత్స నిలిపి వేస్తామని ఆస్పత్రి వైద్యులు బెదిరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 15 రోజులుగా వైద్యుల నిర్లక్ష్య చికిత్స వల్లే తన కూతురు ప్రాణాపాయ స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ వైద్యులపై చర్యలు తీసుకోవా లని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంపై సుధాకర్ నాచారం పోలీసులకూ ఫిర్యాదు చేశాడు. అంతేకాక తమ కుమార్తెకు ఈ గతి పట్టించిన సదరు కార్పొరేట్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రాణాలకు ప్రమాదమనే తొలగించాం: అపోలో వివరణ వైష్ణవి ఎనీమియాతో బాధపడు తోందని, అప్పటికే ఆమెకు 3 నర్సింగ్ హోమ్స్‌లో చూపించారని, ఆయా ఆస్ప త్రుల్లో రక్తం కూడా ఎక్కించారని, ఏ బ్లడ్ బాటిల్ ద్వారా ఇన్ఫెక్షన్ సోకిందో తెలియ దని అపోలో ఆస్పత్రి వివరణ ఇచ్చింది. ఆమెను తమ వద్దకు తీసుకొచ్చే సమయా నికి తీవ్రమైన ఇన్ఫెక్షన్తో బాధపడు తోందని, ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని తొలగించకపోతే అది విస్తరించి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని పేర్కొంది. ఇదే అంశాన్ని యువతి తల్లిదండ్రులకు వివ రించామని, వారు చికిత్సకు అంగీకరించిన తర్వాతే ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని తొలగించి.. మానవతా దృక్పథంతో చికిత్స అందిస్తున్నామని తెలిపింది. బిల్లు చెల్లిం చాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, రూ.19 లక్షల బిల్లు అయితే.. వారు ఇప్పటి వరకు రూ.4 లక్షలే చెల్లించారని వెల్లడించింది. -
బాబుల్‌రెడ్డినగర్‌లో చైన్‌స్నాచింగ్
మైలార్ దేవులపల్లి : రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్‌రెడ్డినగర్‌లో బుధవారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. వైష్ణవి అనే మహిళ ఆమె భర్తతో స్కూటీపై ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వైష్ణవి మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ మేరకు బాధితురాలు మైలార్దైవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
హైదరాబాద్ చిన్నారుల ఆచూకీ లభ్యం
-
హైదరాబాద్ చిన్నారుల ఆచూకీ లభ్యం
హైదరాబాద్: నగరంలోని హైదర్ గూడ నుంచి అదృశ్యమైన చిన్నారులు వైష్ణవి, మాధవి ఆచూకీ లభ్యమైంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో వీరిని కనుగొన్నారు. వీరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఆరో తరగతి చదువుతున్న మాధవి గతంలో కూడా పారిపోయిందని చెప్పారు. వాచ్‌మన్ నుంచి రూ.500 తీసుకుందని, ఆ డబ్బు ఎక్కడిదని టీచర్ అడిగి తల్లిదండ్రులను తీసుకురమ్మనడంతో భయంతో పారిపోయిందని వివరించారు. వీరిని ఆచూకీ కోసం రైల్వేస్టేషన్లు, బస్లాండ్ ల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్టు చెప్పారు. మూడు బృందాలతో గాలింపు జరిపినట్టు తెలిపారు. చివరకు ఐ.పోలవరంలో తాతయ్య ఇంటికి చిన్నారులు వెళ్లినట్టు గుర్తించామని డీసీపీ వెల్లడించారు. చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బాలిక అదృశ్యం
హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఓ చిన్నారి అదృశ్యమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసం వద్ద వంటపని చేస్తున్న శరణప్ప దంపతులకు వైష్ణవి (5) అనే కుమార్తె ఉంది. అయితే ఆ పాప బుధవారం మధ్యహ్నం నుంచి కనిపించడంలేదు. పాఠశాలకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి వైష్ణవిని 14 ఏళ్ల బాలిక తీసుకెళ్తున్నట్లు సీసీ టీవీ ఫూటేజీలో కనిపిస్తుండటంతో.. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్నా.. అని పిలువు బిడ్డా!
గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు పూణె నుంచి దామరగిద్ద తండాకు చేరిన చిన్నారులు వైష్ణవి, విరాట్ మృతదేహాలు ఎక్కడ చావుకేక వినిపించినా.. రోదనలు మాత్రం పాలమూరువే. ఎక్కడ ఏ ఘోరం జరిగినా ఉలిక్కిపాటుకు గురయ్యేది ఇక్కడివారే..! పొట్టకూటి కోసం వెళ్లినవారు ఎక్కడో ఓ చోట చనిపోతున్నారు. లేదంటే తమ పిల్లలను కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఊపిరాడక ఇద్దరు వలసకూలీలు చనిపోయారు. పూణేలో పిల్లర్ గుంతలోపడి ప్రాణాలొదిన ఇద్దరు పసిహృదయాల మరణవేదన ఇలాంటి ఉదంతాలకు సజీవసాక్ష్యమే..! దామరగిద్ద : ‘నాన్నా.. అని ఒక్కసారి పిలువు బిడ్డా.. మీ అమ్మను చూడు! తమ్ముడిని కాపాడబోయి చనిపోయవా.. తల్లీ!’ అంటూ విగతజీవులుగా మారిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వలస పనులకు తల్లిదండ్రులు మహారాష్ట్రలోని పూణేకు వెంట తీసుకెళ్లిన తమ ఇద్దరు పిల్లలు పిల్లర్ గోతిలోపడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. చిన్నారులు వైష్ణవి(5), విరాట్(4) మృతదేహాలను దామరగిద్ద తండాకు తీసుకొచ్చారు. అక్క, తమ్ముడి మృతదేహాలను చూసి ప్రతిఒక్కరూ చలించిపోయారు. తండాకు చెందిన శాంతాబాయ్, కిష్టానాయక్ దంపతులు నెలరోజుల క్రితం బతుకుదెరువుకోసం పూణెకు వలసవెళ్లారు. తమతోపాటు ఇద్దరు పిల్లలకు వెంట తీసుకెళ్లారు. సోమవారం భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమై పిల్లలను అక్కడే వదిలిపెట్టారు. అక్కడే ఆడుకుంటున్న అక్కాతమ్ముళ్లు వైష్ణవి, విరాట్ భవన నిర్మాణం కోసం తవ్విన పిల్లర్‌గుంతలో పడిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నించిన వైష్ణవి కూడా నీళ్లలోనే ప్రాణాలు విడిచింది. ‘ చిన్నారుల తల్లిదండ్రులు శాంతాబాయ్, కిష్టానాయక్ ఆవేదనను చూసిన ప్రతిఒక్కరూ చలించిపోయారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శివారులో ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా సిద్దిపేటలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న సిద్దిపేటకు చెందిన వైష్ణవి(18), వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన సాయి ప్రేమించుకుంటున్నారు. అయితే, గురువారం మధ్యాహ్నం వారు సిరిసిల్ల శివారులో యాసిడ్ తాగి పడి ఉండగా స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మా లేమ్మా .. నాన్న వచ్చాను
ఎస్వీయూలో విద్యార్థిని ఆత్మహత్య అనారోగ్యమే కారణమంటున్న పోలీసులు కూతురి మృతదేహాన్ని చూసి కుప్పకూలిన తండ్రి రెండు నెలల్లో ఎస్వీయూలో ఇద్దరి ఆత్మహత్య తిరుపతి క్రైం: అమ్మా లేవమ్మా .. మీ నాన్నను వచ్చాను. ఒక్కసారి లే చి చూడు తల్లీ, రాత్రి కూడా బాగానే మాట్లాడావు కదమ్మా, ఇంతలో ఏమైంది తల్లీ, ఏదైనా ఉంటే నాన్న కు చెప్పు కన్నా.. అంటూ ఆ తండ్రి తరుక్కుపోయేలా బిడ్డ మృతదేహంపై పడి ఏడుస్తుంటే చూపరుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎస్వీయూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బుధవారం రాత్రి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లాకు చెందిన రాపూరు మండలం మెనుపూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, సుజాత రెండో కుమార్తె వైష్ణవి (22) ఎంకాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఎస్వీ యూనివర్సిటీలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఇటీవల సంక్రాంతి సెలవుల్లో తల్లిదండ్రులతో గడిపి ఆదివారం రాత్రి హాస్టల్‌కు చేరుకుంది. ఈమెతో పా టు మరో ఐదుగురు ఉండేవారు. బుధవారం రాత్రి స్నేహితులు ఎవరూ ఊరి నుంచి రాకపోవడంతో స్నేహితులు తమకు రూంకు రమ్మని పిలిచినా వెళ్లలేదు. పక్క రూంలో ఉన్న బీపీఈడీ విద్యార్థులు గురువారం తెల్లవారుజామున గ్రౌండ్‌కు వెళ్లేందుకు లేవగా వైష్ణవి రూంలో లైట్ వెలుగుతుంది. విద్యార్థినులు గది తలుపులు తట్టగా ఎంత సేపటికి తెరవలేదు. దీంతో వారు కాళ్లతో తన్ని డోర్ తెరుచుకునేలా చేశారు. లోపల వైష్ణవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. భ యాందోళనకు గురైన విద్యార్థిను లు స్టీవార్డెన్స్కు ఫిర్యాదు చేశారు. వారు చూసి పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా వైష్టవి కొంత కాలంగా లోబీపీ, కడుపునొప్పితో బాధపడుతోందని తెలిసింది. అందుకే ఉరి వేసుకుని ఉంటుం దని, నిజానిజాలు పోస్టుమార్టంలో తేలుతాయని పోలీసులు తెలిపారు. అమ్మాయి ఉరి వేసుకున్న సమయంలో చెవుల్లో ఇయిర్‌ఫోన్స్ అలాగే ఉన్నాయని ఎస్వీ యూనివర్సిటీ సీఐ రామకృష్ణ తెలిపారు. తండ్రి మాత్రం రాత్రే ఫోన్ చేసి తమతో మాట్లాడిందని, అక్కతో కూడా మాట్లాడాలి ఫోన్ ఇవ్వండి అంటే నిద్రపోతోందని ఉదయాన్నే ఫోన్ చేయిస్త్తానని చెప్పానని బోరున విలపించాడు. తన కూతురుకు ప్రేమ వ్యవహరాలు ఏమీలేవని, ఉంటే నిర్మొహమ్మాటంగా తనకు చెబుతుందని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు ఎస్వీ యూనివర్సిటీలో రెండు నెలల కిందట ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్లో ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎస్వీయూలో ఆత్మహత్యల నివారణపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నా తగ్గడం లేదు. ఒకటి మరిచిపోయే లోపు మరో ఘటన చోటుచేసుకుంటున్నాయి. -
తిరుపతి మహిళా వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
-
తిరుపతి మహిళా వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి : తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీకి సమీపంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన వైష్ణవి తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్శిటీలో ఎం.కాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాగా ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండేదని హాస్టల్ లోని ఆమె స్నేహితులు,సిబ్బంది తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆమె తన సొంత ఊరికి వెళ్ళి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వైష్ణవి కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళేది కాదని తోటి విద్యార్థినులు తెలిపారు. ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరిని బలిగొన్న ‘క్షణికావేశం’
రసూల్‌పురా: క్షణికావేశం రెండు నిండు ప్రాణాలు బలిగొంది. భర్తలో మార్పు రావడంలేదని ఇల్లాలు, తల్లి లేకుండా తాము ఉండలేమని ఇద్దరు కూతుళ్లు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసింది. కాలిన గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్న ముగ్గురిలో తల్లి కవిత మృత్యువుతో పోరాడుతుండగా, ఆమె ఇద్దరు కూతుళ్లు వైష్ణవి (18), భావన (16) మృతిచెందారు. కవిత తండ్రి శ్యాంసుందర్ లోహియా, సోదరుడు ఆనంద్ లోహియాలు శనివారం కార్ఖాన పీఎస్‌లో కవిత భర్త దినేష్‌పై ఫిర్యాదు చేశారు. మూడు సంవత్సరాలుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, వారి మృతికి కారణమైన దినేష్‌ను కఠినంగా శిక్షించాలని వారు సీఐ నాగేశ్వర్రావును కోరారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి చేరుకుని అక్కడ ఉన్న దినేష్, అతడి సోదరుడు నరేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి సిబ్బంది పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను శ్యాంసుందర్ లోహియా కుటంబ సభ్యులకు అప్పగించారు. ముందుగానే పెట్రోల్ తెచ్చుకున్నారు.. దినేష్ ప్రవర్తనను మార్చుకోకపోవడంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకోవాలని పెట్రోల్ పంప్ నుంచి లీటరున్నర పెట్రోల్ తెచ్చుకున్నారు. శుక్రవారం ఒంటిపై పోసుకుని కవిత నిప్పంటించుకోగానే, తల్లి లేకుండా తాము బతుకలేమని ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనలో పలు అనుమానస్పద అంశాలపై పోలీసులు దృష్టి సారించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన అనంతరం ఇంట్లోని సీసీ కెమెరాలు మాయమైనట్లు సమాచారం. కాగా వాచ్‌మెన్‌ను కూడా దినేష్ పంపించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలోని పాత ఇంటిని కొలుగోలు చేసి దానిని కూల్చివేసి తిరిగి భవనాన్ని నిర్మించుకున్నారని, చుట్టు పక్కల వారితో కలసి మెలసి ఉండేవారు కాదని కాలనీ వాసులు పేర్కొన్నారు. -
కార్ఖానలో దారుణం
మంటల బారినపడిన తల్లీ, ఇద్దరు కూతుళ్లు గాంధీ ఆస్పత్రికి తరలింపు ప్రమాదకరంగా ముగ్గురి పరిస్థితి భర్త నిర్లక్ష్యం చేయడం వల్లేనని భార్య వాంగ్మూలం రసూల్‌పురా: అనుమానాస్పదస్థితిలో తల్లి, ఇద్దరు కూతుళ్లు మంటల బారినపడ్డారు. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ యజమాని దినేష్ కథనం ప్రకారం... కార్ఖాన ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో నివసించే దినేష్ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో మామా జ్యుయెలర్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య కవిత(40), వైష్ణవి(18), భావన (16) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9గంటల ప్రాంతంలో ముగ్గురికి ఒకేసారి మంటలు అంటుకున్నాయి. దినేష్ ఉంటున్న పైఅంతస్తులో అతని సోదరుడి కుటుంబం నివాసం ఉంటోంది. దినేష్ సోదరుని ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరుపులు, కేకలు విని కిందికి దిగివచ్చిన దినేష్ మంటలార్పేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతని చేతులకు కూడా గాయాలయ్యాయి.ఈ ముగ్గురిని వెంటనే స్థానికుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్త నిర్లక్ష్యం వల్లే... భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది తానే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నానని కవిత మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిందని ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపారు. తల్లి లేకుండా తాము బతకలేమని ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్యకు యత్నించినట్టు కవిత పేర్కొన్నట్టు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అయితే ఇద్దరు పిల్లలు మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వైష్ణవి శుభారంభం
జాతీయ ఓపెన్ టెన్నిస్ న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి పెద్దిరెడ్డి వైష్ణవి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ఆరో సీడ్ వైష్ణవి 6-2, 6-0తో శ్వేతా శ్రీహరి (తమిళనాడు)పై గెలిచింది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి రిషిక సుంకర కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో టాప్ సీడ్ రిషిక 6-3, 6-4తో చామర్తి సాయి సంహిత (తమిళనాడు)ను ఓడించింది. బాలికల అండర్-18 సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు చల్లా హర్షసాయి, మౌళిక రామ్ మూడో రౌండ్లోకి ప్రవేశించగా... అమినేని శివాని, ఇస్కా అక్షర ఓడిపోయారు. రెండో రౌండ్లో హర్షసాయి 6-1, 7-5తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై, మౌళిక 7-5, 6-2తో ఇషా బుద్వాల్ (మధ్యప్రదేశ్)పై గెలిచారు. శివాని 1-6, 3-6తో వన్షిక సాహ్ని (ఢిల్లీ) చేతిలో; అక్షర 1-6, 0-6తో అభినిక (తమిళనాడు) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారులు విఘ్నేశ్, విష్ణువర్ధన్ ముందంజ వేశారు. తొలి రౌండ్లో విఘ్నేశ్ 6-3, 6-3తో అజయ్ యాదవ్‌పై, విష్ణువర్ధన్ 7-5, 6-4తో బెరైడ్డి సాయిశరణ్ రెడ్డిపై గెలిచారు. మరో మ్యాచ్‌లో స్కోరు 2-6, 3-0తో ఉన్నదశలో షేక్ అబ్దుల్లా ప్రత్యర్థి ప్రజ్వల్ దేవ్ (కర్ణాటక) గాయం కారణంగా వైదొలిగాడు. బాలుర అండర్-18 విభాగం రెండో రౌండ్లో నిఖిల్ సాయి మన్నెపల్లి 1-6, 3-6తో అమర్నాథ్ అరోరా (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు. -
ఆస్పత్రి నుంచి అభినంద్, శివకుమార్ డిశ్చార్జ్
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులను వైద్యలు బుధవారం డిశ్చార్జ్ చేశారు. విద్యార్థులు అభినంద్, శివకుమార్‌ల ఆరోగ్యం మెరుగుపడటంతో వారిని ఇంటికి పంపిస్తున్నారు. మరోవైపు వరుణ్ గౌడ్, ప్రశాంత్, శరత్‌ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. -
కన్నుమూసిన మరో చిన్నారి
తూప్రాన్: రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైష్ణవి(11) యశోద ఆసుపత్రిలో మృత్యువుతో ఆరు రోజులుగా పోరాడి మంగళవారం తెల్లవారు జాము న తుదిశ్వాస విడిచింది. వైష్ణవి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఇస్లాంపూర్ గ్రామానికి తీసుకుచ్చారు. అప్పటికే వైష్ణవి మృతి చెందిన విషయంలో తెలియడంతో బంధువులు పెద్దసంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహం రావడంతో భోరున విలపించారు. దీంతో మసాయిపేట వద్ద జరిగిన రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన తాళ్ల సరోజన, సంజీవ్‌గౌడ్‌ల కుమార్తె వైష్ణవి(11) ఆసుపత్రిలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఎలాగైనా వైద్యులు బతికిస్తారని ఆశించిన తల్లికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. సాయంత్రం అంత్యక్రియలు జరిపించారు. ఇదిలా ఉండగా వైష్ణవి తల్లి సరోజకు కోన్నేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన సంజీవ్‌గౌడ్‌తో పెళ్లి జరిగింది. అయితే కుటుంబ తగాదాల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చి ఏడాది కాలంగా గ్రామంలో నివసిస్తోంది. గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో కూలీగా పని చేస్తూ కూతురును ప్రయోజకురాలిని చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తోంది. అయితే వైష్ణవి రైలు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తాను ఇంకేవరి కోసం బతకాలని కన్నీటిపర్యంతమైంది. కాగా గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలారి శ్రీశైలం, బాలమణి దంపతుల కుమారుడు తరుణ్(9) సోమవారం రాత్రి మృతి చెందగా గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్డం నిర్వహించిన అనంతరం మంగళవారం సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి మృతి
-
చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి మృతి
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారుల్లో వైష్ణవి (11) అనే విద్యార్థిని యశోదా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. దాంతో ఇప్పటిదాకా మరణించిన విద్యార్థుల సంఖ్య 18కి చేరుకుంది. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలిలోనే 14 మంది చిన్నారులు, బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందిన సంగతి విదితమే. తీవ్రంగా గాయపడ్డ 20 మంది విద్యార్థ్ధులను అదే రోజు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందజేస్తున్నారు. వారిలో ప్రశాంత్, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేషన్ పైనే ఉంచి వైద్యసేవలను అందజేస్తున్నారు. వీరిలో చిన్నారి తరుణ్ గతరాత్రి మృతి చెందాడు. యశోద ఆస్పత్రి ఆవరణలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ పిల్లల్లో ప్రశాంత్ (6), వరుణ్‌గౌడ్ (7)) పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. -
పదహారేళ్లకే పాపులారిటీ!
స్పందనకు వయసుతో సంబంధం లేదు... ఆకాశంలోని అందమైన హరివిల్లును చూసి ఆనందించడానికి, నెలవంక అందం గురించి అలవోకగా చెప్పడానికి వయసుతో సంబంధం లేదు! కానీ వాటికి అక్షరరూపం ఇవ్వడానికి అనుభవంతో కూడిన వయసుండాలి... అయితే, భావాలను వ్యక్తీకరించడానికి వయసుతో పనిలేదు, భాషపై తీవ్రమైన కసరత్తు చేయనక్కర్లేదు... ఆలోచన ఉంటే చాలు భావాన్ని అక్షరాల్లో వ్యక్తీకరించవచ్చు... అని అంటుందామె. అందుకు తగ్గట్టుగా 16 యేళ్ల వయసుకే 16 కథలతో ‘డియర్ డైరీ’ పేరుతో ఒక సంకలనం తెచ్చింది. ఇంగ్లిష్‌లో రచనలు సాగించిన ఆ తెలుగమ్మాయి పేరు వైష్ణవి మాగంటి. హైదరాబాద్‌లోని ఒక స్కూల్లో 11వ తరగతి చదువుతున్న వైష్ణవి రచనా శైలిని మెచ్చి పెంగ్విన్ ర్యాండమ్హౌస్ అనే ప్రసిద్ధ పబ్లిషర్లు కథలను ప్రచురించారు. అమెజాన్‌డాట్‌కామ్ వంటి సైట్లో కూడా ఆ పుస్తకం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో వైష్ణవితో ఇంటర్వ్యూ... తొలిసారిగా రచయిత్రిగా పేరును అచ్చురూపంలో చూసుకొన్నప్పుడు ఏమనిపించింది?! వైష్ణవి: నిజంగా కళ్ల నుంచి నీళ్లొచ్చేశాయి. ఫస్ట్ కాపీని చూడగానే భావోద్వేగాలకు లోనయ్యాను. చెల్లెలు జాహ్నవిని గట్టిగా హగ్ చేసుకొని ఆనందాన్ని పంచుకొన్నాను. అదంతా కొద్దిసేపే.. తర్వాత మామూలే. ఆనందమైనా, బాధ అయినా కొద్దిసేపే! రచయిత్రి కావడానికి స్ఫూర్తి ఏమిటి?! వైష్ణవి: నీకు నచ్చింది చెయ్యి... నీ డ్రీమ్స్‌ను ఫాలో అవ్వు... అంటూ అమ్మానాన్నలు జయశ్రీ, బలరాంలు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను రచనావ్యాసంగం వైపు నడిపించింది. చిన్నప్పటి నుంచి చాలా చిన్న సంఘటనకైనా భావోద్వేగ పూరితంగా స్పందించడం అలవాటు. చిన్న చిన్న అనుభవాలను కూడా ప్రత్యేకంగా చూడటమే నన్ను రచయిత్రిని చేసింది. తొలి రచన ఎప్పుడు చేశారు? వైష్ణవి: ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచే రాయడం అలవాటు. నాకున్న ఇమాజినేషన్‌తో డిటెక్టివ్, మిస్టరీ కథలను రాసే దాన్ని... అయితే వాటికి పేర్లు మాత్రం పెట్టేదాన్ని కాదు. రాసిన వాటిని ఎలా భద్రం చేసేవారు? వైష్ణవి: ఇంతవరకూ కథలేవీ పబ్లిష్ కాలేదు. మామయ్య బహుమతిగా ఇచ్చిన పెన్‌తో రాయడం, ఇంట్లో వాళ్లకు చూపించడం... వాళ్లే నా కథలకు పాఠకులు. జాహ్నవి వాటిని టైప్ చేసి పెట్టేది. ఇప్పటివరకూ ఎన్నికథలు రాశారు? అచ్చువేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? వైష్ణవి: చాలానే రాశాను. రాసిన వాటిలో బెస్ట్ 16ని తీసుకొని పుస్తకంగా తీసుకురావాలని అనుకొన్నాను. ఆ పదహారే ఎందుకంటే.. ఇప్పుడు నా వయసు 16. పుస్తకాన్ని చిరకాల జ్ఞాపకంగా మార్చుకోవడానికి అలా చేశాను. నా కథలను పబ్లిష్ చేయాలన్న ఆలోచన కూడా ఎన్నో రోజులుగా ఉన్నదే. అయితే అది చాలా కష్టంతో కూడుకొన్నది అనుకొన్నాను. కానీ ఇంత సులభంగా సాధ్యమవుతుందని అనుకోలేదు! మరి అంత సులభంగా పబ్లిషర్స్ ఎలా దొరికారు?! వైష్ణవి: ఆన్లైన్లో ఆ పబ్లిషర్ల గురించి తెలుసుకొని మెయిల్ ద్వారా సంప్రదించాను. వారి నుంచి ఫోన్ వచ్చింది. నా కథల గురించి వివరించాను. రాతప్రతులను పంపితే ఓకే చేశారు. పబ్లిష్ చేసి పుస్తకం నా చేతిలో పెట్టారు! కేవలం రెండు నెలల్లోనే మొత్తం పని పూర్తి అయ్యింది. మీ పుస్తకం అమెజాన్డాట్కామ్లో కూడా అమ్మకానికి ఉంచారు కదా, ఏమనిపించింది?! వైష్ణవి: పెద్ద పెద్ద రచయితల పుస్తకాలను అమ్మకానికి ఉంచే అమెజాన్‌లో నా బుక్ ఉందనేది చాలా గ్రేట్ ఫీలింగ్. ఈ వయసులో చాలా తక్కువ మందికే ఇది సాధ్యం అవుతుందని అందరూ పొగిడేస్తున్నారు. వింటున్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది. కానీ గర్వం మాత్రం లేదు... ‘డియర్డైరీ’ అనే పేరెందుకు పెట్టారు? వైష్ణవి: నాకు ఇష్టంగా రాసుకొన్న డైరీ లాంటివి ఈ కథలన్నీ. అందుకే ఆ పేరు. ఈ కథలన్నింటిలో మీకు బాగా ఇష్టమైనది? వైష్ణవి: అమ్మ గురించి రాసిన ‘మై హ్యాపీ మీల్’. అలాగే అమ్మమ్మ, తాతయ్యల గురించి రాసిన ‘ద నోట్’ నాకు బాగా ఇష్టం. కథలేనా? కవితలూ ఇంకా ఏమైనా రాస్తుంటారా? వైష్ణవి: ‘హార్ట్ఫాంట్’ పేరుతో ఒక బ్లాగ్ ఉంది. అందులో కోట్స్, కవిత్వం, నా ఆలోచనల గురించి రాస్తుంటాను.. పుస్తకాలు బాగా చదువుతారా? ఇష్టమైన రచయిత ఎవరు? వైష్ణవి: రచయితలు నికోలస్ స్పార్క్, జేకే రౌలింగ్, చేతన్ భగత్...లు బాగా ఇష్టం. మిస్టరీ, రొమాన్స్, ఫిక్షన్ బాగా ఇష్టంగా చదువుతాను. రాయడానికి ప్రత్యేకమైన మూడ్ అవసరమా?! వైష్ణవి: కచ్చితంగా... మంచి వాతావరణంలో మనసు స్వేచ్ఛగా స్పందిస్తుంది. అలాంటప్పుడు నాలోని భావాలు స్వచ్ఛంగా, సహజంగా జనిస్తాయి. రచయిత్రిగా స్థిరపడే ఉద్దేశం ఉందా?! వైష్ణవి: రాయాలనే ఉద్దేశం కన్నా ముందు రాసే శక్తి ఉందని భావిస్తున్నాను. పాఠకుడితో కనెక్ట్ అయ్యేలా భావాలు పలికించే శక్తి నాకు ఉందనే ఆత్మవిశ్వాసం ఉంది. పూర్తిస్థాయి రచయిత్రిగా స్థిరపడటానికి అదే నా ప్లస్ పాయింట్! - జీవన్‌రెడ్డి.బి -
మెయిన్ ‘డ్రా’కు శ్రీకృష్ణప్రియ, వైష్ణవి
న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.శ్రీకృష్ణప్రియ, కె.వైష్ణవి, చేతన్ ఆనంద్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లోని చివరి రౌండ్లో శ్రీ కృష్ణప్రియ 21-14, 21-17తో వైశాలి బరియా (గుజరాత్)పై, వైష్ణవి 21-11, 24-26, 24-22తో లలితా దహియా (హర్యానా)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో మూడుసార్లు జాతీయ చాంపియన్ చేతన్ ఆనంద్ 21-11, 21-13తో ఎన్వీఎస్ విజేత (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గాడు. మరోవైపు రాష్ట్రానికే చెందిన సి.రాహుల్ యాదవ్ 21-23, 18-21తో రోహన్ కాస్టెలినో (కర్ణాటక) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ విభాగం క్వాలిఫయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి పది మంది బరిలోకి దిగారు. చివరి రౌండ్లో జి.వృశాలి, సంతోషి హాసిని, వి.ప్రమద, వి.హారిక, ఎం.పూజ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయి త్రుటిలో మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. చివరి రౌండ్లో చిత్రలేఖ (రైల్వేస్) 25-23, 13-21, 21-17తో వృశాలిపై, కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర) 21-8, 13-21, 21-19తో సంతోషి హాసినిపై, రసిక రాజె (మహారాష్ట్ర) 21-9, 21-10తో ప్రమదపై, వైష్ణవి అయ్యర్ (కర్ణాటక) 21-13, 16-21, 21-15తో వి.హారికపై, ధన్య నాయర్ (రైల్వేస్) 21-10, 18-21, 21-6తో పూజపై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో సృజన్ నందలూరి-వినయ్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) జోడి 11-21, 21-11, 24-22తో సంతోష్ రావూరి-చైతన్య రెడ్డి (ఆంధ్రప్రదేశ్) జంటను ఓడించి మెయిన్ ‘డ్రా’కు చేరింది. బుధ, గురువారాల్లో ఇంటర్ స్టేట్, ఇంటర్ జోనల్ టీమ్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయి. శుక్రవారం నుంచి సోమవారం వరకు వ్యక్తిగత విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు ఉంటాయి.