అమ్మా లేమ్మా .. నాన్న వచ్చాను
ఎస్వీయూలో విద్యార్థిని ఆత్మహత్య
అనారోగ్యమే కారణమంటున్న పోలీసులు
కూతురి మృతదేహాన్ని చూసి కుప్పకూలిన తండ్రి
రెండు నెలల్లో ఎస్వీయూలో ఇద్దరి ఆత్మహత్య
తిరుపతి క్రైం: అమ్మా లేవమ్మా .. మీ నాన్నను వచ్చాను. ఒక్కసారి లే చి చూడు తల్లీ, రాత్రి కూడా బాగానే మాట్లాడావు కదమ్మా, ఇంతలో ఏమైంది తల్లీ, ఏదైనా ఉంటే నాన్న కు చెప్పు కన్నా.. అంటూ ఆ తండ్రి తరుక్కుపోయేలా బిడ్డ మృతదేహంపై పడి ఏడుస్తుంటే చూపరుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎస్వీయూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బుధవారం రాత్రి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లాకు చెందిన రాపూరు మండలం మెనుపూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, సుజాత రెండో కుమార్తె వైష్ణవి (22) ఎంకాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఎస్వీ యూనివర్సిటీలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. ఇటీవల సంక్రాంతి సెలవుల్లో తల్లిదండ్రులతో గడిపి ఆదివారం రాత్రి హాస్టల్‌కు చేరుకుంది. ఈమెతో పా టు మరో ఐదుగురు ఉండేవారు. బుధవారం రాత్రి స్నేహితులు ఎవరూ ఊరి నుంచి రాకపోవడంతో స్నేహితులు తమకు రూంకు రమ్మని పిలిచినా వెళ్లలేదు. పక్క రూంలో ఉన్న బీపీఈడీ విద్యార్థులు గురువారం తెల్లవారుజామున గ్రౌండ్‌కు వెళ్లేందుకు లేవగా వైష్ణవి రూంలో లైట్ వెలుగుతుంది.
విద్యార్థినులు గది తలుపులు తట్టగా ఎంత సేపటికి తెరవలేదు. దీంతో వారు కాళ్లతో తన్ని డోర్ తెరుచుకునేలా చేశారు. లోపల వైష్ణవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. భ యాందోళనకు గురైన విద్యార్థిను లు స్టీవార్డెన్స్‌కు ఫిర్యాదు చేశారు. వారు చూసి పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా వైష్టవి కొంత కాలంగా లోబీపీ, కడుపునొప్పితో బాధపడుతోందని తెలిసింది. అందుకే ఉరి వేసుకుని ఉంటుం దని, నిజానిజాలు పోస్టుమార్టంలో తేలుతాయని పోలీసులు తెలిపారు. అమ్మాయి ఉరి వేసుకున్న సమయంలో చెవుల్లో ఇయిర్‌ఫోన్స్ అలాగే ఉన్నాయని ఎస్వీ యూనివర్సిటీ సీఐ రామకృష్ణ తెలిపారు. తండ్రి మాత్రం రాత్రే ఫోన్ చేసి తమతో మాట్లాడిందని, అక్కతో కూడా మాట్లాడాలి ఫోన్ ఇవ్వండి అంటే నిద్రపోతోందని ఉదయాన్నే ఫోన్ చేయిస్త్తానని చెప్పానని బోరున విలపించాడు. తన కూతురుకు ప్రేమ వ్యవహరాలు ఏమీలేవని, ఉంటే నిర్మొహమ్మాటంగా తనకు చెబుతుందని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు
ఎస్వీ యూనివర్సిటీలో రెండు నెలల కిందట ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్‌లో ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎస్వీయూలో ఆత్మహత్యల నివారణపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నా తగ్గడం లేదు. ఒకటి మరిచిపోయే లోపు మరో ఘటన చోటుచేసుకుంటున్నాయి.