Working Womens Hostel
-
ఆఫీసులో అమ్మ... ఇంట్లో బిడ్డ
ఐఏఎస్ అధికారిణి, ఇద్దరు పిల్లల తల్లి అయిన దివ్య మిట్టల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ‘నేను ఒక ఐఏఎస్ అధికారిణి ని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్) బెంగళూరులో చదివాను. వీటిని సాధించడానికి చాలా కష్టపడ్డాను. కానీ, నా ఇద్దరు చిన్నారి కూతుళ్లను పెంచే క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఏదీ నన్ను సిద్ధం చేయలేదు..’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఉద్యోగం చేసే అమ్మల శాతం పెరుగుతోంది. అదే సమయంలో పిల్లల పెంపకం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా అనే ఆందోళనా పెరుగుతోంది. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను నేటి తల్లులు ఎలా సమతుల్యతను సాధించాలో నిపుణులు సూచిస్తున్నారు.వయస్సుతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ‘అమ్మా’ అని పిలుస్తాం. ఈ పిలుపు తల్లీ బిడ్డ జీవితాంతం పంచుకునే అనుబంధానికి స్పష్టమైన సూచన. ప్రాచీన కాలం నుండి సమాజంలో మహిళలు పిల్లల సంరక్షకులుగా పరిగణించబడ్డారు. వారి విధి ఇంటికి, ఇంట్లోని వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది. దీంతో తల్లులు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలనే ఈ భావన పిల్లలను వారి జీవితాల్లో, అభివృద్ధిలో సురక్షితంగా ఉంచింది. నేడు సమాజంలో తల్లులు ఇంటి పనుల నిర్వహణలోనూ, పిల్లల సంరక్షణలోనూ రెండు పాత్రలను పోషిస్తున్నారు. పిల్లల సంరక్షణలో తండ్రుల వాటా పెరిగినప్పటికీ మహిళలు ఇప్పటికీ వారి ఇంట్లో మొదటి సంర క్షకులుగా ఉంటున్నారు.విజయవంతమైన మార్పుప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ గురించి చేసిన అధ్యయనాల్లో దాదాపు 73 శాతం మంది మహిళలు 30 ఏళ్ల వయసులో తమ పిల్లలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టారని, 27 శాతం మంది కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారని గమనించారు. వారిలో దాదాపు 16 శాతం మంది తమ వృత్తిపరమైన పని జీవితంలో అధికారులుగా ఉన్నారు. కాబట్టి తల్లులుగా ఉన్న మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను విజయవంతంగా మార్చుకుంటున్నారని కూడా స్పష్టమైంది.‘ఉద్యోగినిగా డబ్బు సంపాదిస్తూ పిల్లలకు కావల్సినవి సమకూర్చగలుగుతున్నాను. కానీ, వారిని సక్రమంగా పెంచగలుగుతున్నానా..’ అనుకునే తల్లులకు సాంకేతికత వరంగా మారింది. సమయానుకూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకోవచ్చు.సానుకూల ప్రభావాలు → ఉద్యోగ తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రెండు పని చక్రాలతో తమ జీవితాలు సజావుగా నడుస్తున్నట్టు చూస్తారు. ఉన్నత విద్యను పొందగల సామర్థ్యం, భౌతిక, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగల సామర్థ్యం కారణంగా వారు మరింత సంతృప్తికరమైన జీవితాలను గడుపుతారు. ఇప్పుడు ఉద్యోగాల్లోకి వెళ్లే మహిళలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కెరీర్ అవకాశాలను సరైన ప్యాకేజీలతో అందుకుంటున్నారు. → హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం పనిచేసే తల్లుల కుమార్తెలు వారి తల్లులకంటే 23శాతం ఎక్కువ సంపాదిస్తారని తెలిసింది. మరోవైపు పనిచేసే తల్లుల కుమారులు బాధ్యతాయుతమైన పెద్దలుగా ఎదుగుతారు. వారి ఆఫీసుల్లో లింగ సమానత్వాన్ని ఇష్టపడతారు. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను గౌరవిస్తారు. వారు భవిష్యత్తులో తమ కుమార్తెలకు అద్భుతమైన తండ్రులుగా కూడా పెరుగుతారు.→ తమ తల్లి జీవితంలోని దుఃఖకరమైన రోజులనూ చూసి ఉంటారు. అంతేకాదు తమ తల్లి పట్టుదల, దృఢ సంకల్పం వారు మానసికంగా, ఆర్థికంగా తమ సామర్థ్యాల మేరకు తమను తాము ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. అన్నింటికంటే వారు హీరోలలో తమ తల్లిని ఒక షీ–రో గా చూస్తారు.మెరుగైన సమయ నిర్వహణ → పనిచేసే తల్లులు ప్రతిరోజూ తమ పిల్లలతో కనీసం ఒకటి లేదా రెండు గంటలు గడపగలిగేలా సమయాన్ని ప్లాన్చేసుకోవాలి. ఇది ఒక దినచర్యగా అనుసరించాలి. వేర్వేరు పనులను షెడ్యూల్ చేయడం, వాటిని సమయానికి పూర్తి చేయడం అనే మీ అలవాటు మీ పిల్లలు అదే అడుగు జాడల్లో నడవడానికి ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. → పిల్లలు టైమ్‌టేబుల్‌కు కట్టుబడి ఉండటానికి కూడా ప్రోత్సహిస్తుంది. పిల్లలు మీ పనిని పూర్తి చేయడంలో సహకరిస్తున్నందుకు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. → కాలక్రమంలో పిల్లల సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది వారి మెరుగైన జీవితానికి సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లలతో మరింత నాణ్యమైన సమయాన్ని గడపడానికి సహాయపడుతుంది. రోజువారీ జీవన విధానంలో ముఖ్యమైన వాటికి సమయం ఇస్తూ, తమ పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ, చేస్తున్న పని గురించి పిల్లలకు క్లారిటీ ఇవ్వడం వల్ల మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. హద్దులు అవసరంపని, కుటుంబంతో పాటు వ్యక్తిగత అవసరాలకూప్రాముఖ్యం ఇవ్వండి. శారీరక, భావోద్వేగ శ్రేయస్సు కోసం స్వీయ సంరక్షణ అవసరం అనేది గుర్తుంచుకోవాలి. రోజులో పిల్లలకోసమే అన్నట్టుగా కొంత సమయం గడపండి. ఆ సమయంలో ఏదైనా పని నైపుణ్యాలు నేర్పించాలా, చదువు పట్ల దృష్టి పెట్టాలా, ఆనందంగా ఉంచడానికిప్రాధాన్యత ఇవ్వాలా.. ఇలా దేనికది బేరీజు వేసుకోవాలి. సహాయకులుగా ఉండేవారి మద్దతు ఎలా అందుతుందో చెక్ చేసుకోండి. వృత్తిపరమైన వృద్ధికి, తల్లి పాత్రకు విలువనిచ్చేవారిని సహాయకులుగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. ప్రతి ఒక్కరూ పనులు చేసేలా, బాధ్యత తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. –ప్రొ÷. పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ నిపుణులుఅమ్మా, నువ్వే నా హీరో..నా పెద్ద కూతురికి 8 ఏళ్లు. ప్రపంచం గురించి ఇప్పటికే భిన్నమైన ఆలోచనలను చేస్తుంటుంది. ఎదిగే క్రమంలో ఆమె ఆలోచనల కాంతిని మసకబారనివ్వం. కొన్నిసార్లు పని ఒత్తిడిలో చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఆ అలసటలో ఏడుపు వచ్చేస్తుంటుంది కూడా. అలాంటప్పుడు నా కూతురు నన్ను కౌగిలించుకుని, ‘నువ్వు నా హీరోవి‘ అని చెబుతుంది. అంటే, పిల్లలు మనల్ని గమనిస్తారు. వారు మన వైఫల్యాల నుండి దృఢంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. పడిపోవడం సహజమే అని ఆమెకు చూపించండి, ఆపై లేవండి. నా ఉద్యోగం నాకు ఇది నేర్పింది. ఏది జరిగినా నువ్వు స్థిరంగా ఉంటావని చూపించండి. మాతృత్వంలో తమకు తాము వేసుకునే ప్రశ్నల్లో కొంత అపరాధ భావనతో నిండి ఉంటాయి. నేను పిల్లలకు సరైనదే ఇస్తున్నానా, ఏమైనా తప్పులు చేస్తే.. ఇలాంటివి తలెత్తుతుంటాయి. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ సొంత మార్గంలో ప్రయాణిస్తూ ఆమె దేనినైనా వెంబడించగల ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని గుర్తించాలి. తనను తాను క్షమించుకుంటూ ముందుకు సాగడం కూడా చాలా ముఖ్యం. మీకు ఒకరి కంటే పిల్లలు ఎక్కువమంది ఉంటే ఆ బాధ్యత పది రెట్లు పెరుగుతూనే ఉంటుంది. అందుకని, పిల్లలను ప్రేమించడం కంటే కూడా న్యాయంగా ఉండడటం ముఖ్యం. – దివ్యా మిట్టల్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కేంద్ర బడ్జెట్ 2024-25 : మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్
కేంద్ర బడ్జెట్ 2024-25లో కేంద్ర మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పథకాలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్లో మాదిరిగానే పేదలు, మహిళలు, యువత, రైతులపై కేంద్రం దృష్టి సారిస్తుందని అన్ని తెలిపిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేకంగా, మహిళలు ,బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం సీతారామన్ రూ. 3 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, శ్రామిక మహిళల కోసం వర్కింగ్ విమెన్ హాస్ట్సల్‌ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పిస్తూ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికమంత్రి తెలిపరారు పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం , క్రెచ్‌ల స్థాపన ద్వారా వర్క్‌ఫోర్స్‌లో మహిళల అధిక భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తామన్నారు. అలాగే మహిళలకు నిర్దిష్ట నైపుణ్య కార్యక్రమాలు,మహిళా ఎస్‌హెచ్‌జి సంస్థలకు మార్కెట్ యాక్సెస్‌ను ప్రోత్సహించడానికి ఇది ప్రయత్నిస్తుందని కూడా చెప్పారు.ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించామన్నారు నిర్మలా సీతారామన్. 'ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్' కోసం మూడు పథకాలను కూడా ప్రకటించారు. ఉపాధి మరియు నైపుణ్యం కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ తొలి స్కీమ్ ‘ఎ’ ‘ఫస్ట్ టైమర్స్’ కోసం, ‘తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన’ కోసం స్కీమ్ ‘బి’ , యజమానులకు మద్దతిచ్చేందుకు స్కీమ్ ‘సి’ని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు స్కీంల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్‌వో పథకం, 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం లాంటివి ఇందులో ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. -
నవవధువు అనుమానాస్పద మృతి
పంజగుట్టలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఘటన పంజగుట్ట: వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఓ నవవధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అనూష (27) చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) పూర్తి చేసింది. 2014 జూలై నుంచి బంజారాహిల్స్‌లోని ధర్మల్ పవర్ టెక్నో ఇండియా లిమిటెట్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఫైనాన్షియర్‌గా పని చేస్తోంది. రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న సొనాలికా క్యాస్టేల్ అపార్ట్మెంట్లో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఈనెల 8వ తేదీని అనూషకు రాజమండ్రికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్‌తో పెళ్లైంది. దుస్తులు తెచ్చుకొనేందుకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్‌లో ఉండే తన బంధువుల ఇంటికి వెళ్లిన అనూష రాత్రి 10.30కి హాస్టల్‌కు తిరిగి వచ్చింది. భోజనం చేయమని ఆయా అడగ్గా... చేసి వచ్చానని చెప్పి, పాలు తాగి బెడ్రూమ్లోకి వెళ్లింది. ఉదయం ఆమె బెడ్‌పై శవమై కనిపించింది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. నోటి నుంచి తెల్లటి నురుగు కారడం బట్టి విషం తాగి ఆత్మహత్య చేసుకుందా? లేక ఫుడ్ఫైయిజిన్ అయిందా? గుండెపోటు వచ్చిందా.. అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ గదిలో ఒక్కత్తే ఉంది... అనూషతో పాటు హాస్టల్లో మొత్తం 8 మంది ఉంటున్నారు. అనూష ఉండే గదిలో హర్షిత అనే యువతి ఉంటోంది. ఆమె షిరిడీ వెళ్లడంతో అనూష ఒక్కత్తే ఆదివారం రాత్రి తన గదిలో పడుకుంది. సోమవారం ఉదయం నగరానికి తిరిగి చేరుకున్న హర్షిత సుమారు 7.20కి హాస్టల్లోని తమ గదికి వెళ్లగా అనుమానాస్పదస్థితిలో అనూష బెడ్‌పై పడి ఉంది. వెంటనే హాస్టల్ సిబ్బంది పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు 108 సిబ్బందిని ర ప్పించారు. అనూషను పరిశీలించిన 108 సిబ్బంది అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్థారించారు. పోలీసులు క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి ఆధారాల కోసం శోధించారు. పోలీస్ జాగిలం మృతదేహం వద్ద నుంచి డోర్ పక్కనే ఉన్న లిఫ్ట్ వద్దకు వచ్చి... తిరిగి కామన్ బాల్కనీలోకి వెళ్లింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనూష తల్లిదండ్రులు నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త అర్జున్ కూడా బెంగళూరు నుంచి నగరానికి బయలుదేరినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం అనూష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు. -
అమ్మా లేమ్మా .. నాన్న వచ్చాను
ఎస్వీయూలో విద్యార్థిని ఆత్మహత్య అనారోగ్యమే కారణమంటున్న పోలీసులు కూతురి మృతదేహాన్ని చూసి కుప్పకూలిన తండ్రి రెండు నెలల్లో ఎస్వీయూలో ఇద్దరి ఆత్మహత్య తిరుపతి క్రైం: అమ్మా లేవమ్మా .. మీ నాన్నను వచ్చాను. ఒక్కసారి లే చి చూడు తల్లీ, రాత్రి కూడా బాగానే మాట్లాడావు కదమ్మా, ఇంతలో ఏమైంది తల్లీ, ఏదైనా ఉంటే నాన్న కు చెప్పు కన్నా.. అంటూ ఆ తండ్రి తరుక్కుపోయేలా బిడ్డ మృతదేహంపై పడి ఏడుస్తుంటే చూపరుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎస్వీయూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బుధవారం రాత్రి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లాకు చెందిన రాపూరు మండలం మెనుపూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, సుజాత రెండో కుమార్తె వైష్ణవి (22) ఎంకాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఎస్వీ యూనివర్సిటీలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఇటీవల సంక్రాంతి సెలవుల్లో తల్లిదండ్రులతో గడిపి ఆదివారం రాత్రి హాస్టల్‌కు చేరుకుంది. ఈమెతో పా టు మరో ఐదుగురు ఉండేవారు. బుధవారం రాత్రి స్నేహితులు ఎవరూ ఊరి నుంచి రాకపోవడంతో స్నేహితులు తమకు రూంకు రమ్మని పిలిచినా వెళ్లలేదు. పక్క రూంలో ఉన్న బీపీఈడీ విద్యార్థులు గురువారం తెల్లవారుజామున గ్రౌండ్‌కు వెళ్లేందుకు లేవగా వైష్ణవి రూంలో లైట్ వెలుగుతుంది. విద్యార్థినులు గది తలుపులు తట్టగా ఎంత సేపటికి తెరవలేదు. దీంతో వారు కాళ్లతో తన్ని డోర్ తెరుచుకునేలా చేశారు. లోపల వైష్ణవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. భ యాందోళనకు గురైన విద్యార్థిను లు స్టీవార్డెన్స్కు ఫిర్యాదు చేశారు. వారు చూసి పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా వైష్టవి కొంత కాలంగా లోబీపీ, కడుపునొప్పితో బాధపడుతోందని తెలిసింది. అందుకే ఉరి వేసుకుని ఉంటుం దని, నిజానిజాలు పోస్టుమార్టంలో తేలుతాయని పోలీసులు తెలిపారు. అమ్మాయి ఉరి వేసుకున్న సమయంలో చెవుల్లో ఇయిర్‌ఫోన్స్ అలాగే ఉన్నాయని ఎస్వీ యూనివర్సిటీ సీఐ రామకృష్ణ తెలిపారు. తండ్రి మాత్రం రాత్రే ఫోన్ చేసి తమతో మాట్లాడిందని, అక్కతో కూడా మాట్లాడాలి ఫోన్ ఇవ్వండి అంటే నిద్రపోతోందని ఉదయాన్నే ఫోన్ చేయిస్త్తానని చెప్పానని బోరున విలపించాడు. తన కూతురుకు ప్రేమ వ్యవహరాలు ఏమీలేవని, ఉంటే నిర్మొహమ్మాటంగా తనకు చెబుతుందని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు ఎస్వీ యూనివర్సిటీలో రెండు నెలల కిందట ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్లో ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎస్వీయూలో ఆత్మహత్యల నివారణపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నా తగ్గడం లేదు. ఒకటి మరిచిపోయే లోపు మరో ఘటన చోటుచేసుకుంటున్నాయి. -
చెదిరిన స్వాతి కలలు
సీటు మారడం వల్లే ప్రమాదం పీటలెక్కని ప్రేమ వివాహం మృతురాలు స్వాతి దీనగాథ చెన్నై, సాక్షి ప్రతినిధి : అందరినీ అలరిస్తూ ఆటపాటలతో తడిసిముద్దచేసే ‘స్వాతి’ కలలు చెదిరిపోయూయి. తల్లిదండ్రులతో ముచ్చట్లు, బామ్మతో కబుర్లు, ప్రేమించిన వ్యక్తితో వివాహం...ఇలా ఆమె కన్నకలలను రైలు బాంబు కబళించివేసింది. ఇటీవలే చేరిన ఉద్యోగంలో విరామం తీసుకుని తల్లిదండ్రులను కలుసుకునేందుకు బెంగళూరులో బయలుదేరింది. తనను అమితంగా ప్రేమించే అవ్వకు బహుమతులు, కుటుంబ సభ్యులకు తినుబండారాలను సిద్ధం చేసుకుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోనే ఆలస్యం కావడంతో పరుగుపరుగున ఆటోలో రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు- గువాహటి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఆమెకు అప్పుడు తెలియదు తాను మృత్యుకుహరంలోనే కూర్చుంటున్నానని. తనతో పాటు రైలు ఎక్కిన చెన్నైకి చెందిన స్నేహితురాలు రజితతో కలిసి వారికి కేటాయించిన సీటు నెంబరు 9,10లో కూర్చున్నారు. అయితే ఒక కుటుంబం వచ్చి ‘ప్లీజ్ 23, 24 సీట్లలో కూర్చుంటారా’ అని అడిగింది. స్నేహశీలైన స్వాతి సంతోషంగా అంగీకరించింది. మంచి ఉద్యోగం, ఇంటివారికి బహుమతులు వారిని కలవబోతున్నామనే ఆనందం, తాను ప్రేమించిన వ్యక్తితో జరగనున్న వివాహం ఆమెను నిద్రపోనివ్వలేదు. అలాగే గుంటూరులోని వారింటిలో కూడా ఎపుడు తెల్లారుతుందా, స్వాతి వస్తుందా అని జాగారం చేశారు. సీటు మారడంతో దురదృష్టం ఆమె వెన్నంటే నిలిచింది. వారు కూర్చున్న సీటు కిందనే బాంబును అమర్చి ఉన్నారు. చెన్నై రాగానే స్నేహితురాలికి టాటా చెప్పి సాగనంపింది. ఆ వెంటనే పెద్ద శబ్దంతో బాంబు పేలడంతో స్వాతి కన్నుమూసింది. పేలుడు జరగడంతో వెంటనే వెనక్కు వచ్చిన స్నేహితురాలి రజిత కన్నీరుమున్నీరైంది. వెళ్లొస్తానని చెప్పింది... ఇలా వెళ్లిపోతుందని అనుకోలేదంటూ విలపించింది. తెల్లారగానే వచ్చిన ఫోన్‌ను అందుకున్న స్వాతి తండ్రి రామకృష్ణన్, తల్లి కామాక్షిదేవి, బామ్మ రాజ్యలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బీటెక్‌లో 91 శాతం మార్కులతో వర్సిటీ పరిధిలోనే మెరుగైన ర్యాంకును సొంతం చేసుకున్నారు. స్వాతి. చిత్రలేఖనం, కవిత, ఫొటోగ్రఫీలలో దిట్ట. బీటెక్ ఉత్తీర్ణతలో సాధించిన ఉత్సాహంతో ఎంటెక్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్ ద్వారా బెంగళూరులో ఉద్యోగం పొందారు. పరిచయం లేని ఊరు వద్దన్నారు పెద్దలు. అందివచ్చిన తొలి ఉద్యోగం వద్దనకూడదంటూ వారికి నచ్చజెప్పి స్వాతి బెంగళూరు వెళ్లిపోయారు. జనవరిలో తొలి జీతంతో బామ్మకు సెల్‌ఫోన్ కొనిచ్చారు. ప్రతిరోజు రాత్రి స్వాతితో మాట్లాడితేగానీ నిద్రపోను, ఇక తనను నిద్రపుచ్చేదెవరని బామ్మ కన్నీరుమున్నీరయ్యూరు. కాలేజీలోనే ప్రేమ హైదరాబాద్‌లో చదువుతుండగానే తన సహ విద్యార్థిని ఆమె ప్రేమించారు. అయితే సాధారణ కుటుంబం, బాధ్యతలు ఉండటం వల్ల పెళ్లివాయిదా వేద్దామని చెప్పి అతడిని ఆమె ఒప్పించారు. ఆతను సైతం ఆనందంగా అంగీకరించాడు. ఈ దశలో ప్రేమికునికి ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. వెంటనే స్వాతి తన ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. వారుసైతం అంగీకరించారు. మరో నెలన్నర రోజుల్లో వారిద్దరి వివాహం జరిపేలా నిశ్చయించారు. చక్కనైన ఉద్యోగం, పెద్దల అనుమతితో ప్రేమించిన వ్యక్తితో వివాహం వంటి రంగుల రంగుల కలలు కంటున్న స్వాతిని రైలు బాంబు కబళించివేసింది, భవిష్యత్తుపై ఆమె కన్న కలల ఆమె దేహం మాదిరే ఛిద్రమైపోయాయి. ఆమెను అభిమానించి, ప్రేమించే వారిని కన్నీటి సంద్రంలోకి నెట్టివేశాయి.