మహిళలు, బాలికలకోసం వర్కింగ్ విమెన్స్ హాస్ట్సల్
మహిళలు ,బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాలకు రూ. 3 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్ 2024-25లో కేంద్ర మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పథకాలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్‌లో మాదిరిగానే పేదలు, మహిళలు, యువత, రైతులపై కేంద్రం దృష్టి సారిస్తుందని అన్ని తెలిపిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేకంగా, మహిళలు ,బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం సీతారామన్ రూ. 3 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, శ్రామిక మహిళల కోసం వర్కింగ్ విమెన్ హాస్ట్సల్‌ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పిస్తూ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికమంత్రి తెలిపరారు పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం , క్రెచ్‌ల స్థాపన ద్వారా వర్క్‌ఫోర్స్‌లో మహిళల అధిక భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తామన్నారు. అలాగే మహిళలకు నిర్దిష్ట నైపుణ్య కార్యక్రమాలు,మహిళా ఎస్‌హెచ్‌జి సంస్థలకు మార్కెట్ యాక్సెస్‌ను ప్రోత్సహించడానికి ఇది ప్రయత్నిస్తుందని కూడా చెప్పారు.
ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించామన్నారు నిర్మలా సీతారామన్. 'ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్' కోసం మూడు పథకాలను కూడా ప్రకటించారు. ఉపాధి మరియు నైపుణ్యం కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ తొలి స్కీమ్ ‘ఎ’ ‘ఫస్ట్ టైమర్స్’ కోసం, ‘తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన’ కోసం స్కీమ్ ‘బి’ , యజమానులకు మద్దతిచ్చేందుకు స్కీమ్ ‘సి’ని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు స్కీంల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్‌వో పథకం, 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం లాంటివి ఇందులో ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment