women and child development
-
కేంద్ర బడ్జెట్ 2024-25 : మహిళలు, బాలికలకు గుడ్ న్యూస్
కేంద్ర బడ్జెట్ 2024-25లో కేంద్ర మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పథకాలను ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్లో మాదిరిగానే పేదలు, మహిళలు, యువత, రైతులపై కేంద్రం దృష్టి సారిస్తుందని అన్ని తెలిపిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం ప్రత్యేకంగా, మహిళలు ,బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం సీతారామన్ రూ. 3 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, శ్రామిక మహిళల కోసం వర్కింగ్ విమెన్ హాస్ట్సల్‌ను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు.కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పిస్తూ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికమంత్రి తెలిపరారు పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం , క్రెచ్‌ల స్థాపన ద్వారా వర్క్‌ఫోర్స్‌లో మహిళల అధిక భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తామన్నారు. అలాగే మహిళలకు నిర్దిష్ట నైపుణ్య కార్యక్రమాలు,మహిళా ఎస్‌హెచ్‌జి సంస్థలకు మార్కెట్ యాక్సెస్‌ను ప్రోత్సహించడానికి ఇది ప్రయత్నిస్తుందని కూడా చెప్పారు.ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యాల కోసం రూ.1.48 లక్షల కోట్లు కేటాయించామన్నారు నిర్మలా సీతారామన్. 'ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్' కోసం మూడు పథకాలను కూడా ప్రకటించారు. ఉపాధి మరియు నైపుణ్యం కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ తొలి స్కీమ్ ‘ఎ’ ‘ఫస్ట్ టైమర్స్’ కోసం, ‘తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన’ కోసం స్కీమ్ ‘బి’ , యజమానులకు మద్దతిచ్చేందుకు స్కీమ్ ‘సి’ని కేంద్రం ప్రకటించింది. ఈ మూడు స్కీంల ద్వారా ఉద్యోగాలను కల్పించనున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్‌వో పథకం, 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం లాంటివి ఇందులో ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. -
Smriti Zubin Irani: క్యోం కి స్మృతీ భీ కభీ అభినేత్రీ థీ
స్మృతి జుబిన్ ఇరానీ. ఇప్పుడు కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ఒకప్పుడు హిందీ టీవీ సీరియల్ వీక్షకుల అభిమాన నటి. సంప్రదాయ కుటుంబం నుంచి వచి్చనా మోడల్‌గా, నటిగా రాణించారు. రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్‌గాందీనే మట్టికరిపించారు. ఈసారి కూడా అమేథీలో కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్నారు... రాజకీయ ప్రయాణం.. నటనతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ 2003లో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి ఓడారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాం«దీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2017లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీపై బాగా దృష్టి పెట్టారు. నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు. కాంగ్రెస్‌పై, రాహుల్‌పై విమర్శలతో హోరెత్తించారు. 2019లో అమేథీలో రాహుల్‌ను ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అమేథీలో స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే ఉంటానని ప్రకటించారు. 2021లో మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం చేశారు. ‘దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయండి’ అంటూ మళ్లీ రాహుల్‌కు సవాలు విసురుతున్నారు. కేంద్రంలో మానవ వనరులు, సమాచార–ప్రసార, జౌళి శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి. బహుభాషా ప్రావీణ్యం... స్మృతి 1976 మార్చి 23న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జని్మంచారు. తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా వ్యాపారి. తల్లి శిబానీ నే బాగ్చీ బెంగాలీ. ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆగ్జీలియమ్ స్కూల్లో చదివారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మోడలింగ్ వైపు వెళ్లారు. తర్వాత నటనలో అదృష్టం పరీక్షించుకునేందుకు ముంబైలో అడుగుపెట్టారు. పలు ఉత్పత్తులకు మోడల్‌గా చేస్తూనే నటిగా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు. పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతలను తలకెత్తుకున్నారు. పలు సీరియళ్లలో నటించారు. క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక టీవీ సీరియల్‌కు సహదర్శకత్వంతో పాటు పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జై బోలో తెలంగాణ’ సినిమాతో తెలుగు ప్రజలకూ పరిచయమయ్యారు. 2001లో జుబిన్ ఇరానీని పెళ్లాడారు. వీరికి కొడుకు జోహార్, కూతురు జోయిష్ ఉన్నారు. వైవిధ్యమైన కుటుంబ, సినీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. వివాదాలకు కేరాఫ్ రకరకాల కారణాలతో స్మృతి తరచూ వివాదాల్లో పడుతుంటారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో చాందినీచౌక్ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఢిల్లీ యూనివర్సిటీ (స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్)లో 1996లో బీఏ చదివానని పేర్కొన్నారు. 2014, 2019ల్లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడేమో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో చేరినట్టు వెల్లడించారు. దాంతో ఆమె డిగ్రీలో చేరింది 1994లోనా, 1996లోనా, చదివింది బీఏనా, కామర్సా అనే విమర్శలొచ్చాయి. 2014లో మానవ వనరుల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశానికి విద్యా మంత్రా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. సమస్య కోర్టు దాకా వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో ఆమె మానవ వనరుల నుంచి జౌళి శాఖకు మారారు. -
వినూత్న బోధనా పద్ధతులపై దృష్టి పెట్టండి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరాలకోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేశామని, నిధులకు వెనుకాడకుండా.. ఏరాష్ట్రంలో లేని విధంగా ఖర్చుచేసి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాయలంలో ఆయన స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష ప్రారంభానికి ముందు.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ(YSR Sampoorna Poshana), టేక్‌హోం రేషన్ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రేషన్ సరుకులను స్వయంగా పరిశీలించి.. లబ్ధిదారులకు స్వయంగా ఆయనే కిట్లను అందజేశారు. ఇక సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరుకుల నాణ్యతపై నిరంతరం సమీక్ష చేయాలి. నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలి. గతంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పౌష్టికాహారం కోసం ప్రతిఏటా చేస్తున్న ఖర్చు సుమారుగా రూ.2300 కోట్లు. రక్తహీనత, పౌష్టికాహారలేమి లాంటి సమస్యలు పూర్తిగా రాష్ట్రంలో తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలి. దీనికోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అంగన్వాడీలను సందర్శించాలి. అక్కడ పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలి. ఏమైనా సమస్యలు ఉంటే వారికి మంచి వైద్యాన్ని అందించాలి అని అధికారులకు సూచించారాయన. బాల్యవివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, చదువుల్లో బాలికలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతిదీవెన, విద్యా దీవెన ఏరకంగా ఉపయోగపడతాయన్నదానిపై బాగా అవగాహన కల్పించాలి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా కూడా ఏ రకంగా బాల్యవివాహాలను నిరోధిస్తుందో కూడా వారికి వివరించాలి. కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధనను అందుకే పెట్టాం. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మర ప్రచారం నిర్వహించాలి. అంగన్ వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలి. దీనికోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. అంగన్వాడీ కేంద్రాలకు నిర్వహించే మరమ్మతుల్లో ముందుగా టాయిలెట్ల మరమ్మతును ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఫౌండేషన్ స్కూలు పిల్లలకు విద్యాబోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. ఇప్పుడున్న విద్యావిధానం కాక ఇతర విద్యావిధానాలనుకూడా పరిశీలించాలి. ఇప్పుడు మనం నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా పద్ధతులతో నేర్పించే అంశాలపై దృష్టిపెట్టాలి. ఇంగ్లిషు భాషలో పరిజ్ఞానం, ఉచ్ఛారణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలి. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలయ్యింది. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లలమీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లల మెదడు బాగా వృద్ధిచెందే వయసు కాబట్టి, వినూత్న బోధనా పద్దతుల ద్వారా వారికి మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈ వయసులో పునాదిగట్టిగా పడితే.. ఇక పై తరగతుల్లో విద్యార్ధుల ప్రయాణం సాఫీగా ఉంటుంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖపైనా సీఎం జగన్ సమీక్షలో మంత్రి ఉషాశ్రీచరణ్, సంబంధిత విభాగపు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
అంగన్వాడీల నిర్వహణ బాగుండాలి: సీఎం జగన్
-
అంగన్వాడీలపై సమీక్ష.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో అంగన్వాడీలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్దేశించుకున్న ప్రమాణాలతో అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్‌లు రూపకల్పన చేయాలని, తద్వారా సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించవచ్చని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలన్నారు. ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ల నియామకాలను ప్రారంభించామని, దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలని పేర్కొన్నారు. చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ నోటిఫికేషన్ విడుదల అంగన్వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈమేరకు కార్యాచరణ సిద్ధంచేసుకోవాలన్న సీఎం..అంగన్వాడీల్లో నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖతో కలిసి ఈమేరకు కార్యాచరణ చేసుకోవాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►అంగన్వాడీల రూపురేఖలను సంపూర్ణంగా మార్చాలి ►అంగన్వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఎలాంటి సదుపాయాలు కల్పించుకోవాలి? ఏ రకంగా వాటిని తీర్చిదిద్దాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలి. ►విడతల వారీగా ఆ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ►పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా చూసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాలి. ►పిల్లలు రోజూ తీసుకునే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టిపెట్టాలి. ►అంగన్వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్ ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలి. ►స్కూళ్లకు, అంగన్వాడీలకు సరఫరాచేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణకు మరిన్ని చర్యలు. ►డిసెంబర్1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను చేపట్టనున్న మార్క్‌ఫెడ్.ప్రత్యేక యాప్ ద్వారా దీని పర్యవేక్షణ. ►నవంబరు నుంచి నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్ ద్వారా పర్యవేక్షణ. ►ఈ ఆహార నాణ్యత బాగుందా? లేదా? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ పర్యవేక్షణ. ►ఈలోగా పంపిణీ అవుతున్న ఆహారం క్వాలిటీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. ►క్వాలిటీ, క్వాంటిటీపై యాప్‌ల ద్వారా సమగ్ర పర్యవేక్షణ ఉండాలి. ►అంగన్వాడీల పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజి క్లినిక్స్ ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలి: ►సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి: ►శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత పెంచేలా తగిన ఆలోచనలు చేయాలి. ►దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుంది. ►అంగన్వాడీలపై సూపర్వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్ చేయాలలి. ►అంగన్వాడీలకు, సూపర్వైజర్లకు మొత్తంగా దాదాపు 57వేలమందికి సెల్ఫోన్ల్ పంపిణీ కార్యక్రమాన్నిసీఎం ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టిహారం, ఇతర సేవలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు, సమగ్రపర్యవేక్షణ కోసం అంగన్వాడీ సెంటర్లకు, వర్కింగ్ సూపర్ వైజర్లకు ఈ సెల్‌ఫోన్స్ ప్రభుత్వం అందిస్తుంది. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవాలి. ►గతంలో పిల్లల భోజనానికి నెలకు సుమారురూ.500 కోట్లు ఉండేది, ఈరోజు నెలకు సుమారుగా రూ.1900 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ►విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమాలకోసం చాలా పెద్ద ఎఫర్ట్ పెడుతున్నాం. ►ఇంగ్లిషు మీడియంను చిన్ననాటినుంచే అలవాటు చేయడానికి ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ తీసుకువచ్చాం. ►నాడు – నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నాం. ►ఇన్నివేల కోట్లు ఖర్చుచేసి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం. ►ఇన్ని కార్యక్రమాలు చేసినా..సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు. ►అందుకే కచ్చితమైన పర్యవేక్షణ అవసరం. ►అధికారులు కూడా సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ►దేశంలో నంబర్‌వన్ కావడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం ఈ సమీక్షా సమావేశంలో మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ బాబు, మార్క్‌ఫెడ్ ఎండీ పి ఎస్ ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
లబ్ధిదారుల ఇంటికెళ్లి పలకరించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడమే కాదు.. వారి ఇళ్లకే వెళ్లి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పలకరించనున్నారు. పోషణ్ అభియాన్ 2.0 స్కీమ్‌లో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇంటింటికీ తిరగడం (విజిట్) లేదని పేర్కొంది. ఇకపై రోజుకు నాలుగు ఇళ్లకు తిరిగి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలని కేంద్రం అదనపు మార్గదర్శకాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్ని అంగన్వాడీ కేంద్రాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల యోగక్షేమాలు చూడడంతోపాటు వారి ఇంటికి వెళ్లి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం తెలుసుకోవాలని పేర్కొన్నారు. వారి ఇళ్లకే వెళ్లి క్షేమ సమాచారం తెలుసుకోవడం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు ఎవరైనా రాకపోయినా, వారికి ఏదైనా సమస్య ఉన్నా నేరుగా తెలుసుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి రోజు కనీసం ఒక గర్భిణి, ఓ బాలింత, రెండేళ్లలోపు వయసు గల ఇద్దరు పిల్లల ఇళ్లకు విజిట్‌కు వెళ్లాలి. రోజుకు నాలుగు ఇళ్ల చొప్పున నెలలో 25 రోజులపాటు వంద విజిట్లు పూర్తి చేయాలి. కనీసం 60 శాతం అయినా వాటిని పూర్తి చేయాలనే నిబంధన విధించారు. అలా చేయకపోతే ఇన్సెంటివ్‌లు ఇవ్వకూడదని కేంద్ర ఆదేశాల్లో పేర్కొంది. ఈ హోం విజిట్‌కు సంబంధించిన అంశాలను ఐసీడీఎస్‌ల పరిధిలోని అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనితోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఇటీవల చేపట్టిన ‘గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్’నూ సమర్థవంతంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆడపిల్ల పుట్టిందా.. ఇష్టం లేకపోతే, ఈ ఊయలలో వేయండి!
సాక్షి,సంగారెడ్డి: ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లలంటే చిన్న చూపే. ప్రసవ వేదన ఎంతైనా భరిస్తారు కానీ ఆడపిల్ల పుట్టిందంటే మాత్రం భరించరు. ఆసుపత్రిలో మహిళకు ప్రసవం కాగానే అమ్మాయి పుడితే మీకు లక్ష్మీ దేవి పుట్టిందని సిబ్బంది చెప్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు, అత్తా మామలు ఆమ్మో ఆడ పిల్లా అని నిర్వేదానికి గురవుతారు. ఇంకొంతమంది అయితే వాళ్లలో రాక్షసత్వాన్ని బయటకి తీసి రెండు మూడు రోజుల వయసున్న ఆడ పిల్లలలను కూడా ముళ్లపొదల్లో, చెత్తకుప్పల్లో వదిలేసి వెళ్తారు. ఈనేపథ్యంలో మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అలా ఒక్క ఆడ బిడ్డ కూడా చనిపోవద్దని సంగారెడ్డి జిల్లాలో చిన్నారులను కాపాడటానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డు మహిళా ప్రాంగణం ఆవరణలో మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఊయలను ఏర్పాటు చేశారు. ఎవరికైనా పిల్లలను పెంచటం ఇష్టం లేకపోతే వారిని పడెయ్యొద్దని, ఈ ఊయలలో ఉంచి వెళ్లాలని వారిని ప్రభుత్వం చూసుకుంటుందని మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి పద్మావతి తెలిపారు. -
మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సాక్షి, న్యూఢిల్లీ: మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం నూతన చట్టాన్ని తీసుకురానుంది. ఈ బిల్లుపై ముసాయిదా విడుదల చేసిన కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు కోరింది. 2018లో ముసాయిదా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ప్రవేశపెట్టలేదు. ఆ సమయంలో లేవనెత్తిన ఆందోళనలకు నూతన ముసాయిదాలో పరిష్కారం చూపారని నిపుణులు చెబుతున్నారు. భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు వచ్చిన అనంతరం కేంద్ర మంత్రివర్గానికి ఆపై పార్లమెంటులోనూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. మానవ అక్రమ రవాణా చేసే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష పడేలా కేంద్రం ఈ చట్టాన్ని రూపొందించింది. బాధితులకు పునరావాస చర్యలు ఏ విధంగా తీసుకోవాలో కూడా చట్టం స్పష్టత ఇచ్చింది. చట్టం ప్రకారం నిందితులను దర్యాప్తు చేయడానికిప్రత్యేక ఏజెన్సీనికేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రతి జిల్లాలోనూ సెషన్స్ కోర్టులను ప్రత్యేక కోర్టుగా పరిగణించాలి. గెజిటెడ్ అధికారి స్థాయి పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలి. చట్టం అమలుకు ప్రభుత్వాలు యాంటీ ట్రాఫికింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీన్ని బాధితుల పునరావాసానికి వినియోగించాలి. బాధితులు వేరే జిల్లా,రాష్ట్రానికి చెందిన వారైతే మెరుగైన భద్రత కోసం జిల్లా కమిటీ వారిని అవసరమైతే సొంత ప్రాంతానికి పంపొచ్చు. బాధితులు ఇతర దేశానికి చెందిన వారైతే ఆ సమయంలో ఉన్న చట్టాలు అనుసరించి రాష్ట్ర కమిటీ వారిని వారి దేశానికి పంపొచ్చు. చట్టం అమలుకు సంబంధించి చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ ద్వారా నిబంధనలు పేర్కొనాలి. అనంతరం రాష్ట్రంలోని ఉభయసభల్లోనూ ఆమోదం పొందాలి. డిస్ట్రిక్ట్ యాంటీ ట్రాఫికింగ్ కమిటీ చైర్పర్సన్: జిల్లా కలెక్టర్ సభ్యుడు/సభ్యురాలు: ముగ్గురిలో ఇద్దరు సామాజిక కార్యకర్తలు. వీరిలో మహిళ సభ్యురాలిని జిల్లా న్యాయమూర్తి నియమించాలి. జిల్లా న్యాయ సేవల అథారిటీ నుంచి ఒకరిని జిల్లా న్యాయమూర్తి నామినేట్ చేయాలి. సామాజిక న్యాయ లేదా మహిళ శిశు అభివృద్ధి విభాగం నుంచి జిల్లా అధికారి సభ్య కార్యదర్శిగా ఉంటారు. ప్రతి నెలా కమిటీ సమావేశం కావాలి. స్టేట్ యాంటీ ట్రాఫికింగ్ కమిటీ చైర్పర్సన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులు: ఎనిమిది మంది. మహిళ, శిశు అభివృద్ధి, హోం, కార్మిక, ఆరోగ్య విభాగాల కార్యదర్శులు డీజీపీ, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ కార్యదర్శిలతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సెంట్రల్ యాంటీ ట్రాఫికింగ్ అడ్వైజరీ బోర్డు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ బోర్డు ఏర్పాటు చేయాలి. చట్టం అమలును ఈ బోర్డు పర్యవేక్షించాలి. రక్షణ గృహాలు: బాధితులకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వం నేరుగా లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్షణ గృహాలు ఏర్పాటు చేయాలి. బాధితులకు నివాసం, ఆహారం, దుస్తులు, కౌన్సిలింగ్, ఆరోగ్య రక్షణ ఈ గృహాల్లో కల్పించాలి. ప్రత్యేక గృహాలు: దీర్ఘకాలంగా బాధితులకు పునరావాసం కల్పించడానికి జిల్లాకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యేక గృహాలు వీరి కోసం ఏర్పాటు చేయాలి. రక్షణ, ప్రత్యేక గృహాలను చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలి. బాధితులకు ప్రత్యేంగా లైంగిక దాడులకు గురైన మహిళలకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి. నేరం.. శిక్ష ► బాధితులకు ఆశ్రయంకల్పించే విషయంలో రక్షణ, ప్రత్యేక గృహాల ఇన్‌ఛార్జి నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడాదిపాటు జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. ► చట్టం ప్రకారం బాధితులు, సాక్షుల పేర్లు, ఫొటోలు ఏ మాధ్యమం ద్వారానైనా ప్రచురించిన ప్రసారం చేసినా చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు ఆరు నెలల వరకూ జైలు లేదా రూ.లక్షల వరకు జరిమానా లేదా రెండింటిని విధిస్తారు. ► అక్రమ రవాణా చేయడానికి మాదకద్రవ్యాలు, మద్యం, సైకోట్రోపిక్ పదార్ధాలను నిందితులు వినియోగించినట్లు రుజువైతే పదేళ్లు వరకూ జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. రసాయనాలు, హర్మోన్ల ఇంజక్షన్లు నిందితులు ఉపయోగించినట్లు తేలితే పదేళ్ల వరకూ జైలు, రూ.లక్ష తక్కువకాకుండా జరిమానా విధిస్తారు. ► ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లైతే వారికి మూడు నెలల వరకూ జైలు, రూ.20 వేల వరకూ జరిమానా లేదారెండు విధించొచ్చు. ► నిందితులు బెయిల్ లేదా సొంత పూచీకత్తుపై విడుదల అవుతుంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని అడ్డుకోవచ్చు. ఈ సమయంలో బెయిలు ఇస్తే నిందితుడు ఎలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు నమ్మితే బెయిలు ఇవ్వొచ్చు. -
బాల భారతం.. బలహీనం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విసిరిన పంజాకు లక్షల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోయాయి. ఫలితంగా ఆయా కుటుంబాల్లోని పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. బాల భారతం బలహీనంగా మారుతోంది. దేశంలో గత ఏడాది నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల్లో 9,27,606 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనే ఉన్నారని తెలియజేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 3,98,359 మంది, బిహార్‌లో 2,79,427 మంది బాధిత బాలలు ఉన్నారు. లద్దాఖ్, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్‌లో తీవ్రమైన పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న చిన్నారులెవరూ లేకపోవడం గమనార్హం. అనారోగ్య ముప్పు అధికం ఎత్తుకు తగిన బరువు లేకుండా... చాలా బలహీనంగా ఉంటే తీవ్రమైన పోషకాహార లోపంగా (ఎస్ఏఎం) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్వచించింది. ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. అలాంటి వారికి ఏదైనా వ్యాధి సోకితే మరణించే అవకాశాలు 9 రెట్లు అధికంగా ఉంటాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘దేశంలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. నిరుద్యోగ సమస్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే మొదలయ్యింది. ఫలితంగా ఆకలి రక్కసి కాటేస్తోంది. ఆకలి ఉన్నచోట పోషకాహార సమస్య కచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలి’’అని హెచ్ఏక్యూ సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఇనాక్షీ గంగూలీ సూచించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. 2020 నవంబర్ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు మహారాష్ట్రలో 70,665 మంది, గుజరాత్లో 45,749, ఛత్తీస్‌గఢ్‌లో 37,249, ఒడిశాలో 15,595, తమిళనాడులో 12,489, జార్ఖండ్‌లో 12,059, ఆంధ్రప్రదేశ్‌లో 11,210, తెలంగాణలో 9,045, అస్సాంలో 7,218, కర్ణాటకలో 6,899, కేరళలో 6,188, రాజస్తాన్‌లో 5,732 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఈ సమాచారం సేకరించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్వాడీ కేంద్రాలదే కీలక బాధ్యత అని ఇనాక్షీ గంగూలీ చెప్పారు. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళల్లో పోషకాహార సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో పోషన్ అభియాన్ పథకాన్ని ప్రారంభించింది. -
మంత్రి రేఖ ఆర్యకు కరోనా పాజిటివ్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య కరోనా భారీన పడ్డారు. ఆమె ఉత్తరఖండ్ ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. కరోనా టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు రేఖా ఆర్య ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని, డాక్టర్ల సమక్షంలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత వారం రోజులుగా తనతో కలిసిన వారు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మంత్రితో పాటు ఆమె భర్త, ముగ్గురు పిల్లలకి వైరస్ సోకింది. मेरी कोरोना टेस्ट रिपोर्ट पॉजिटिव आई है। मैं एसिम्प्टमैटिक हूँ और कोई परेशानी नहीं है । डॉक्टर्स की निगरानी में मैंने स्वयं को आइसोलेट कर लिया है। आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे निकट संपर्क में आयें हैं, कृपया सावधानी बरतें और अपनी जाँच करवाएं। — Rekha Arya (@rekhaaryaoffice) December 12, 2020 -
స్త్రీ, శిశు.. సంక్షేమానికి 20 శాతం అధిక నిధులు
న్యూఢిల్లీ: స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 2,9164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్ మ్యాప్ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ జనాభాలో 40 శాతమున్న పిల్లలకు జరపాల్సిన కేటాయింపులు మాత్రం అంచనాలకు అనుగుణంగా లేవని చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ సీఈఓ పూజా మర్వాహా పెదవివిరిచారు. బడ్జెట్ ప్రసంగంలోకానీ, విజన్ 2030లో కానీ పిల్లల ప్రస్తావనే లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తావన లేకపోవడంపై కూడా ఎన్జీవోలు నిరాశ వ్యక్తం చేశారు. ప్రధాన కేటాయింపులు ► ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి కేటాయింపులు రూ. 1,200 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పెంపు. ► ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలు, బాలింతలకు రూ. 6,000 సాయం. ► జాతీయ పౌష్టికాహార మిషన్(ఎన్ఎన్ఎం) ద్వారా పదికోట్ల మందికి ప్రయోజనం. ఈ పథకానికి రూ. 3,400 కోట్ల కేటాయింపు. ► శిశు అభివృద్ధి సేవలకు కేటాయింపులు రూ. 925 కోట్ల నుంచి రూ. 1500కు పెంపుదల. ► బేటీ బచావ్, బేటీ పడావో పథకానికి రూ. 200 కోట్ల నుంచి రూ. 280 కోట్ల కేటాయింపుల పెంపుదల. ► అంగన్వాడీ సేవలకు రూ. 19,834.37 కోట్ల కేటాయింపులు. ► నేషనల్ క్రెచ్ స్కీమ్‌కు రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు కేటాయింపులు పెంచారు. ► వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పథకానికి కేటాయింపులు రూ. 52 కోట్ల నుంచి రూ. 165 కోట్లకు పెంపు. ► మహిళా శక్తి కేంద్రాల పథకానికి కేటాయింపులు రూ. 115 నుంచి రూ. 150 కోట్లకు పెంచారు. ► ఉజ్వల(అక్రమ రవాణా నుంచి కాపాడిన మహిళలను ఆదుకునే పథకం)కు కేటాయింపులు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు, విడో గృహాలకు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు. ► మహిళా సాధికారత, సశక్తిత మిషన్‌కు బడ్జెట్‌ను రూ. 1,156 కోట్ల నుంచి రూ. 1,330 కోట్లకు పెంపుదల. ‘ఆమె’కోసం రూ.1,330 కోట్లు న్యూఢిల్లీ: మహిళల రక్షణ, సాధికారతకోసం బడ్జెట్లో రూ.1,330 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గత బడ్జెట్‌కన్నా ఈ మొత్తం రూ.174 కోట్లు అధికమని శుక్రవారం లోక్‌సభలో ఆయన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపారు. గత నాలుగేళ్లుగా మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా ‘మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి’సాధించగలిగామని ఆయన అన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన లబ్ధిదారుల్లో 70 శాతంపైగా మహిళలు ఉన్నారని, సులువైన రుణ పద్ధతి ద్వారా వారు స్వయంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకున్నారని గోయల్ చెప్పారు. అలాగే 26 వారాల ప్రసూతి సెలవుల ద్వారా మహిళలకు ఉపాధిలో ఆర్థిక భరోసా కలిగిందన్నారు. ఉజ్వల యోజన ద్వారా ఎనిమిది కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను ప్రభుత్వం అందిస్తోందని, ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య ఆరుకోట్లు దాటిందని, మిగిలినవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందజేస్తామని ఆయన వెల్లడించారు. -
ముళ్ల పొదలు, మురికి కాలువలే 'ఊయల'
సందర్భం దివంగత సీఎం వైఎస్ రాజ శేఖరరెడ్డి, అప్పటి కేంద్రమంత్రి రేణుకా చౌదరి స్త్రీశిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రవేశ పెట్టిన ఊయల పథకాన్ని పటి ష్టంగా అమలు చేయించడంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. ఈ ఊయల పథకం ద్వారా ప్రత్యేక పరిస్థితిలో బిడ్డను వద్దనుకునే తల్లులు తమ పేరుతో మొదలుకొని వ్యక్తిగత సమాచారం ఏదీ తెలపకుండానే ఊయలలో బిడ్డను ఉంచితే చాలు ఆ బిడ్డ బాగోగులు స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే చూసుకునేది. ఎవరు ఏ మంచి పథకాన్ని ప్రవేశపెట్టినా దాన్ని నూటికి నూరు శాతం అమలు చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలితాలను అందజేయడం రాజశేఖరరెడ్డి నైజం. కొందరు స్త్రీలు, యువతులు అనుకోని సందర్భా లలో గర్భవతులై పుట్టిన బిడ్డను చూసే దిక్కులేక ఏమి చేయాలో పాలుపోక తాము చావడమో లేదా కన్న బిడ్డని చంపడమో మాత్రమే ముందున్న మార్గం అయినప్పుడు కొందరు హృదయాన్ని పాషాణంగా మార్చుకొని రెండవ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. పొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాపలు ఇలా ఘోరమైన మృత్యువుకు బలవడం అందరిని కలచి వేస్తుంది. దీనికి తల్లులను రాక్షసులుగా తిట్టుకుంటాం కానీ, బిడ్డ పుట్టడా నికి అంతే కారణమైన తండ్రి జోలికి ఎవరూ వెళ్లరు. ఈ దయనీయ స్థితిని ఆపడానికి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఊయల ఉండేటట్లు అందులో పిల్లలు వద్ద నుకున్న వారి వివరాలు సైతం తెలపనవసరం లేకుండా పిల్లలని ఊయలలో వదిలి పెడితే చాలు వారిని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పెంచేటట్లు చర్యలు తీసుకున్నారు. ఈ పథకం ఇప్పుడూ ఉన్నప్పటికీ స్త్రీశిశు సంక్షేమ శాఖ నిర్లక్ష్యంతో దీనికి కావలసిన నిధులు పుష్కలంగా ఉన్నా అనేకమంది పసిబిడ్డలు హత్యలకు గురౌతున్నారు. ఈ పసిబిడ్డలు మురికి కాలువలు, ముళ్లపొదలు, పొత్తిళ్లుగా మారి ప్రాణాలు వదలకుండా ఉండాలంటే ఈ ఊయల పథకాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మితిమీరిన అవినీతి, నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పిల్లల సంక్షే మంపై ఎలాంటి ధ్యాస, లక్ష్యం, లేని స్త్రీ శిశు సంక్షేమ శాఖ దురదృష్టంతో స్త్రీలు సమాజంలో నేరస్తులుగా నిల బడుతున్నా, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారే తప్ప, ఊరూరా ఊయల పథ కాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం లేదు. ఊయల పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం తోపాటు, టీవీలు, పత్రికల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు గ్రామ సర్పంచులను అంగన్వాడీ కార్యకర్తలను ఊయల ప్రచార సారథులుగా చేసుకొని గ్రామ స్థాయిలో అవగాహన కల్పించి ఈ ఊయల తెగిన తాళ్లను బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు, మొబైల్ : 93910 24242 అచ్యుతరావు -
ఏమిటీ లెక్కలు?
ఒంగోలు టౌన్: ‘మహిళా శిశు అభివృద్ధి సంస్థకు సంబంధించిన కార్యక్రమాలను సమీక్షిస్తానని ముందుగానే చెప్పాను.. పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు.. కాగితాలపై ఒకరకంగా, చెప్పేటప్పుడు ఇంకో రకంగా ఉన్నాయి.. మీ పనితీరు సక్రమంగా లేకపోవడంతో పేదలకు అంగన్వాడీ కేంద్రాల సేవలు అందడం లేదని’ మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రి పీతల సుజాత ఆ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం స్థానిక సీపీఓ కాన్ఫెరెన్స్ హాలులో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. జిల్లాలో ఎన్ని ప్రాజెక్టుల్లో అమృతహస్తం పథకం అమలవుతుంది? ఎంతమంది లబ్ధిదారులున్నారో మంత్రి పలువురు సీడీపీఓలను అడిగారు. అయితే వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృతహస్తం పథకానికి సంబంధించి అటెండెన్స్, ఎన్రోల్మెంట్లో తేడా ఉందని, ఎందుకు తేడా ఉంటుందని సంబంధిత ప్రాజెక్టుల సీడీపీఓలను ప్రశ్నించారు. కొంతమందికే ‘అమృతహస్తం’ అందిస్తున్నారు, మిగిలిన వారికి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. బేస్తవారపేట సీడీపీఓ మాట్లాడుతూ తమ ప్రాజెక్టు పరిధిలో కొంతమంది గొప్పోళ్ల పిల్లలు ఉన్నారని, వారు అమృత హస్తం తీసుకునేందుకు రావడం లేదని చెప్పడంతో వారిని ఎందుకు నమోదు చేశారని మంత్రి ప్రశ్నించారు. పేదోళ్లకు ఈ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలామృతం పథకానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు లేకపోవడంపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీడీ, పీడీల మధ్య సమన్వయం లేదు మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్, జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ల మధ్య సమన్వయం కొరవడిందని మంత్రి గుర్తించారు. కీలకమైన ఇద్దరు అధికారుల మధ్య సమన్వయం లేకుంటే శాఖపనితీరు ఏవిధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. జిల్లాలోని సీడీపీఓల పనితీరు నివేదికలు ఎందుకు ఇవ్వలేదని ప్రాజెక్టు డెరైక్టర్‌ను ప్రశ్నించారు. ఇప్పటివరకు నెలవారీగా నివేదికలు అందిస్తున్నారని, ఇకనుంచి ఏరోజుకారోజు నివేదికలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు డెరైక్టర్, సీడీపీఓలు రోజుకో అంగన్వాడీ కేంద్రాన్ని విధిగా తనిఖీ చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసే పౌష్టికాహారంలో నాణ్యత తక్కువగా ఉంటే ఆ కాంట్రాక్టును రద్దుచేసి మరొకరికి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ శిశుగృహల్లోని చిన్నారుల నిర్వహణకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తుందని, దాన్ని రెండువేల రూపాయలకు పెంచాలని మంత్రిని కోరారు. కిశోర బాలికలకు శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ నిధులు పెంచాలన్నారు. గృహహింస వంటి కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు.