Girl Child Protection By Sangareddy Women And Child Department Of Cradle Scheme- Sakshi
Sakshi News home page

Girl child: ఆడబిడ్డ ఇష్టంలేకపోతే.. మేం చూసుకుంటాం!

Published Sat, Aug 14 2021 1:00 PM | Last Updated on Sat, Aug 14 2021 3:43 PM

For Girl child: Sangareddy Women and Child Department credle scheme - Sakshi

సాక్షి,సంగారెడ్డి: ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లలంటే చిన్న చూపే. ప్రసవ వేదన ఎంతైనా భరిస్తారు కానీ ఆడపిల్ల పుట్టిందంటే మాత్రం భరించరు. ఆసుపత్రిలో మహిళకు ప్రసవం కాగానే అమ్మాయి పుడితే మీకు లక్ష్మీ దేవి పుట్టిందని సిబ్బంది చెప్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు, అత్తా మామలు ఆమ్మో ఆడ పిల్లా అని నిర్వేదానికి గురవుతారు. ఇంకొంతమంది అయితే వాళ్లలో రాక్షసత్వాన్ని బయటకి తీసి రెండు మూడు రోజుల వయసున్న ఆడ పిల్లలలను కూడా ముళ్లపొదల్లో, చెత్తకుప్పల్లో వదిలేసి వెళ్తారు. ఈనేపథ్యంలో మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కీలక  నిర్ణయం తీసుకుంది. 

అలా ఒక్క ఆడ బిడ్డ కూడా చనిపోవద్దని సంగారెడ్డి జిల్లాలో చిన్నారులను కాపాడటానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి బైపాస్‌ రోడ్డు మహిళా ప్రాంగణం ఆవరణలో మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఊయలను ఏర్పాటు చేశారు. ఎవరికైనా పిల్లలను పెంచటం ఇష్టం లేకపోతే వారిని పడెయ్యొద్దని, ఈ  ఊయలలో ఉంచి వెళ్లాలని వారిని ప్రభుత్వం చూసుకుంటుందని మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి పద్మావతి తెలిపారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement