girl childs
-
గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’
‘ఒక్క బాల్‌తో జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను’ అంటాడు ఒక ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు. ‘ఫుట్‌బాల్ అనేది జీవితాన్ని కూడా అర్థం చేయిస్తుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబు చెప్పడానికి రాజస్థాన్‌లోని ఎన్నో గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు దాటి బయటికి రాని అమ్మాయిలు, ఫుట్‌బాల్ వల్ల గ్రౌండ్లోకి రాగలిగారు. ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎదగడమే కాదు అనేక కోణాల్లో జీవితాన్ని అర్థం చేసుకున్నారు. బాల్య వివాహాలను బహిష్కరించే చైతన్యం పొందారు... రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలో చబియావాస్, హిసియావాస్లాంటి ఎన్నో గ్రామాలలో బాల్యవివాహాలు అనేవి సర్వసాధారణం. హిసియావాస్ గ్రామానికి చెందిన నిషా గుజ్జార్, కిరణ్‌లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అప్పుడు నిషా వయసు పది సంవత్సరాలు. కిరణ్ వయసు పన్నెండు సంవత్సరాలు. కొంతకాలం తరువాత... నిషా ఊళ్లోని ఫుట్‌బాల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకుంది. రోజూ రెండు గంటల పాటు ఆట నేర్చుకునేది. చబియావాస్ గ్రామానికి చెందిన పదమూడు సంవత్సరాల మమతకు గత సంవత్సరం నిశ్చితార్థం అయింది. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలా అని అని ఇంట్లో ఎదురు చెప్పే ధైర్యమూ లేదు. మరో గ్రామానికి చెందిన నీరజకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. అత్తారింటికి వెళితే పనే లోకం అవుతుంది. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నిషాలాగే మమతా, నీరజ ఇంకా ఎంతోమంది అమ్మాయిలు శిక్షణా కేంద్రంలో పేరు నమోదు చేసుకొని ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు... ‘పద్దెనిమిది సంవత్సరాలు దాటితేగానీ పెళ్లి చేసుకోను’ అని పెద్దలకు ధైర్యంగా చెప్పేసింది నిషా. వాళ్లు ఒప్పుకున్నారు. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలి. నా చదువు పూర్తి కావాలి’ అని ధైర్యంగా చెప్పింది మమత. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ‘పెళ్లి ఇప్పుడే వద్దు. నాకు చదువుకోవాలని ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలనేది నా కల’ అని ఇంట్లో వాళ్లకు చెప్పింది నీరజ. ఇంత మార్పు ఎలా వచ్చింది? నీరజ మాటల్లో చెప్పాలంటే... ‘ఫుట్‌బాల్ ఆడడం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసం, నా మనసులోని మాటను బయటికి చెప్పే శక్తి వచ్చింది’ ఫుట్‌బాల్ ఆడడంతోపాటు అమ్మాయిలందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేవారు. అందులో ఎక్కువమంది చిన్న వయసులోనే పెళ్లి, నిశ్చితార్థం అయిన వారు ఉన్నారు. మాటల్లో చిన్న వయసులోనే పెళ్లి ప్రస్తావన వచ్చేది. ‘ఎవరో కాదు మనమే అడ్డుకుందాం. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం’ అనే చైతన్యం వారిలోకి వచ్చి చేరింది. ‘ఒకప్పుడు సంప్రదాయ దుస్తులు తప్ప వేరే దుస్తులు ధరించే అవకాశం లేదు. స్కూలుకు పంపడమే గొప్ప అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్‌వేర్‌లో నన్ను నేను చూసుకుంటే గర్వంగా ఉంది. ఒకప్పుడు ఆటలు అంటే మగపిల్లలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు మాత్రం పెద్దల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది స్వప్న. ‘మహిళా జన్ అధికార్’ అనే స్వచ్ఛందసంస్థ రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ఆడపిల్లలకు ఫుట్‌బాల్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈ ఫుట్‌బాల్ శిక్షణా కేంద్రాలు కాస్తా చైతన్య కేంద్రాలుగా మారాయి. ‘వ్యూహాత్మకంగానే గ్రామాల్లో ఫుట్‌బాల్ శిక్షణాకేంద్రాలు ప్రారంభించాం. దీనివల్ల అమ్మాయిలు ఈ ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో ఆడడం ఒక కోణం అయితే, సామాజిక చైతన్యం అనేది మరో కోణం. ఆట గురించి మాత్రమే కాకుండా మహిళల భద్రత, మహిళల హక్కులు, లింగ సమానత్వం... మొదలైన ఎన్నో అంశాల గురించి బోధిస్తున్నాం’ అంటోంది ‘మహిళా జన్ అధికార్’ బాధ్యురాలు ఇందిరా పంచోలి. -
ఆడపిల్ల పుట్టిందా.. ఇష్టం లేకపోతే, ఈ ఊయలలో వేయండి!
సాక్షి,సంగారెడ్డి: ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లలంటే చిన్న చూపే. ప్రసవ వేదన ఎంతైనా భరిస్తారు కానీ ఆడపిల్ల పుట్టిందంటే మాత్రం భరించరు. ఆసుపత్రిలో మహిళకు ప్రసవం కాగానే అమ్మాయి పుడితే మీకు లక్ష్మీ దేవి పుట్టిందని సిబ్బంది చెప్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు, అత్తా మామలు ఆమ్మో ఆడ పిల్లా అని నిర్వేదానికి గురవుతారు. ఇంకొంతమంది అయితే వాళ్లలో రాక్షసత్వాన్ని బయటకి తీసి రెండు మూడు రోజుల వయసున్న ఆడ పిల్లలలను కూడా ముళ్లపొదల్లో, చెత్తకుప్పల్లో వదిలేసి వెళ్తారు. ఈనేపథ్యంలో మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అలా ఒక్క ఆడ బిడ్డ కూడా చనిపోవద్దని సంగారెడ్డి జిల్లాలో చిన్నారులను కాపాడటానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డు మహిళా ప్రాంగణం ఆవరణలో మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఊయలను ఏర్పాటు చేశారు. ఎవరికైనా పిల్లలను పెంచటం ఇష్టం లేకపోతే వారిని పడెయ్యొద్దని, ఈ ఊయలలో ఉంచి వెళ్లాలని వారిని ప్రభుత్వం చూసుకుంటుందని మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి పద్మావతి తెలిపారు. -
చిన్నారుల అనుమానాస్పద మృతి.. తల్లి పనేనా..?
కృష్ణాజిల్లా, పెడన: ఒకరి తర్వాత ఒకరు 48 గంటల్లో అక్కాచెల్లెళ్లు చనిపోవడం పెడన పట్టణంలో సంచలనం కలిగించింది. వివరాలిలా ఉన్నాయి. మోకా రామాంజనేయులు, నాంచారమ్మలకు ఇద్దరు ఆడ పిల్లలు. పెడన చేపల మార్కెట్లోని నిరుపయోగంగా ఉన్న దుకాణాల్లోని ఒకదాంట్లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన రామాంజనేయులు ఈ ఏడాది జనవరి 1న అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి నాంచారమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. మంచిచెడ్డ అంతా బంధువులే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల కిందట చుట్టుపక్కల వారితో పాటు, బంధువుల వద్ద కూడా మేం కూడా చనిపోతాం.. అని అంటోంది. అయితే, శనివారం రాత్రి వీరి చిన్న కుమార్తె మోకా దివ్య (3) చనిపోయింది. ఆదివారం ఉదయం అందరికి తెలిసి పరామర్శించడానికి వెళ్లిన వారికి అనారోగ్యంతో చనిపోయిందని, విరేచనాలు, జ్వరం వచ్చిందని, మంచి వైద్యుడికి చూపించడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదనే విషయాన్ని చెప్పింది. దీంతో చుట్టుపక్కల వారు, వివిధ సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొంత ఆర్థిక సాయం చేసి పెద్ద పాప మోకా ప్రశాంతి పేరు మీద డిపాజిట్ చేస్తామని నాంచారమ్మకు హామీ ఇచ్చారు. పాపను జాగ్రత్తగా చూసుకోవాలని కొంత నగదును కూడా చేతికి అందజేశారు. అయితే, సోమవారం ఉదయం పెద్ద పాప మోకా ప్రశాంతి (5) కూడా చనిపోవడంతో స్థానికులకు, బంధువులకు సైతం అనుమానాలు వెల్లువెత్తాయి. వారం నుంచి మేం చచ్చిపోతామంటున్న తల్లి నాంచారమ్మ కావాలనే ముందుగా పిల్లలను చంపేసిందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రశాంతికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల అంతకుముందే స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యుడికి కూడా చూపించారు. ఆయన కూడా పాప ఆరోగ్యంగానే ఉందని, ఫుడ్ పాయిజన్ ఏమైనా అయి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం. పోలీసుల రంగ ప్రవేశం.. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సీఐ బి రవికుమార్, ఎస్ఐ బి అభిమన్యుతో సిబ్బంది వచ్చి మార్కెట్లో అందరిని విచారించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నాంచారమ్మ ఉంటున్న ఇంటిని (దుకాణాన్ని) సైతం పరిశీలించారు. బియ్యం, బంగాళాదుంపలు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు తదితర ఆహార పదార్థాలు సైతం కుళ్లిపోయి ఉన్నట్లు గుర్తించారు. నాంచారమ్మను కూడా పోలీసులు విచారించారు. ప్రశాంతి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. పీఎం నివేదికను బట్టి పూడ్చిన మృతదేహానికి కూడా...? చిన్న పాప మోకా దివ్యను ఆదివారం శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. 48 గంటల్లోగా దివ్య అక్క ప్రశాంతి కూడా చనిపోవడంతో అనుమానంపై పోలీసులు ప్రశాంతికి పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఆ నివేదికలో విష ప్రయోగం ఏమైనా జరిగిందా లేక ఫుడ్ పాయిజన్ అయ్యిందా అనే విషయాలు వెల్లడి కానున్నాయి. విష ప్రయోగం జరిగినట్లు నిర్ధారణ అయితే చిన్నపాప మోకా దివ్య మృతదేహాన్ని కూడా వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుందనే వాదన వ్యక్తమవుతోంది. పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి పీఎం నిర్వహించాలంటే మండల మేజిస్ట్రేట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రశాంతి పోస్టుమార్టం నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సిబ్బంది పరుగులు... చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం.. ఫు డ్ పాయిజన్ అని అనుకోవడంతో వైద్య, ఆరో గ్య సిబ్బంది పరుగులు పెట్టారు. చేపల మార్కెట్ వద్ద పరిస్థితి గమనించి ఎలా జరిగిందో ఆరా తీ యడంతో పాటు ఏం తిన్నారు, ఎప్పుడు తిన్నా రు..తదితర విషయాలను నమోదు చేసుకున్నారు. -
పసిపిల్లలపై పైశాచికం
సంగారెడ్డి క్రైం: కళ్లాకపటం ఎరుగని పసిపిల్లలపై కొంతమంది మనుషుల రూపంలో ఉన్న మృగాలు దాడికి పాల్పడుతున్నాయి. అభంశుభం ఎరుగని అమాయకులైన పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడుతూ సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు కొందరు కామాంధులు. ఇటీవల పసిపిల్లలపై అఘాయిత్యాలపై దేశంలో తీవ్ర అలజడి, ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోనూ చిన్నారులపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. బడుల్లో కొందరు రాబందులు.. కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారి పవిత్రమైన వారి వృత్తికే మచ్చతెస్తున్న ఘటనలు అనేకం. పిల్లలను సొంత బిడ్డలుగా చూడాల్సిన టీచర్లు వారిపై పశువుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇటీవల విద్యార్థినులపై జరిగిన ఆకృత్యాలు ఆందోళనకు గురి చేశాయి. దురా‘గతా’లివీ.. ♦ పుల్కల్ మండలం కోర్పోల్ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థిలపై వేధింపులకు పాల్పడడంతో విషయం తెలసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. జిన్నారం మండలంలోని బొల్లారం ఉన్నత పాఠశాలలో ఇదే ఆరోపణలతో ఇద్దరు ఉపాధ్యాయులను, శివనగర్ పాఠశాలలో ఒక ఉపాధ్యాడు సస్పెండ్ చేశారు. ♦ తూప్రాన్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ కామాంధుడు ఆరు సంవత్సరాలు ఉన్న ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి పాఠశాల నుంచి మధ్యాహ్నం బయటకు తీసుకెళ్లాడు. రోడ్డుకు వేసే రింగు పైపుల్లో ఆ పాపను ఆత్యచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ♦ ఈ ఘటనలో జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతి కొద్ది వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఘటనలో నిందుతుడు జైలు పాలయ్యాడు. సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఆత్మరక్షణ కోసం .... అమ్మాయిలు వ్యక్తిగత రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో కనీస పరిజ్ఞానం, పరిసరాలపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను ఎదుర్కొవడమే కాకుండా తప్పించుకోవచ్చని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పక్కదారి పట్టిస్తున్న స్మార్ట్ ఫోన్లు.. యువతను ఆండ్రాయిడ్ ఫోన్లు పక్కదారి పట్టిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతు న్న వారిలో ఫోన్లలో అశ్లీల దృశ్యాలను చూస్తు న్న వారే అధికంగా ఉంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లలను స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచితే మంచిది. షీ టీమ్‌లతో కొంత వరకు తగ్గుముఖం... మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్‌లను ఏర్పాటు చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేష న్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు తదితర రద్దీ ప్రాం తా ల్లో మహిళలపై వేధింపులు షీ టీమ్స్ వల్ల తగా ్గయి. సివిల్ డ్రెస్‌లో ఉంటున్న మహిళా పోలీసు లు ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటనలు అనేకం. కఠిన చర్యలు తీసుకుంటున్నాం బాలికలపై అత్యచారాలు, వేధింపుల కేసులో ఫోక్స్ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో తల్లిదండ్రులు వెనుకంజ వేసినా సంబంధిత అధికారుల చేత ఫిర్యాదులు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్లో ఫోక్స్ యాక్టు కింద కేసు నమోదు అయినా ప్రత్యేక అధికారిని నియమించి కేసును ఛేదించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సంగారెడ్డిని నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు సహకరించాలి. – సిద్దిపేట సిపి జోయెల్ డేవిస్ బాలికల భద్రతకు భరోసా సెంటర్ ఏర్పాటు జిల్లాలో బాలికలపై అత్యాచారాలు, వేధింపులను నిరోధించడానికి భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. సమస్యాత్మక ప్రాంతాల్లో మఫ్టిలో మహిళా పోలీసులతో గస్తీ నిర్వహిస్తాం. మహిళలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ స్టేషన్లకు సంబంధం లేకుండానే ఫిర్యాదు చేయడానికి వింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మైనర్లపై జరిగే వేధింపుల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాం. అలాంటి ఘటనలను ఛేదించడానికి ప్రత్యేక పోలీసులను సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం – చందనాదీప్తి మెదక్ ఎస్పీ -
జీవితం జీవించడానికే
శ్రీ రజనీష్‌ను ఒకరు ఇలా ప్రశ్నించారు. ‘మీరంటున్నట్లు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ ‘సంభవించేవే’ అయినట్లయితే, నే చేసేదంటూ ఏమైనా ఉన్నదా? లేక జీవితం కేవలం యాదృచ్ఛికమా? జీవితానికేదైనా లక్ష్యం కానీ ప్రయోజనం కానీ ఉన్నదంటారా? రజనీష్: జీవితం ప్రయోజన రహితమైనదన్నప్పు డు పాశ్చాత్య మనస్సుకు, అది విపరీతంగా తోస్తుంది. ఏదైనా ప్రయోజనం ఉండాలి అని తీర్మానిస్తే, జీవితం వ్యాపార సరళి ధరిస్తుంది. అది ఆనందమయంగా రూపొందదు. ప్రాక్దేశాలు ఏమంటాయంటే, జీవితం వ్యాపారం కాదు, అది ‘ఖేల’. ఈ ఖేలకు దాని ప్రయో జనం దానికి ఉన్నది అనవచ్చు. ఆడితే చాలు, ఆటే పదివేలు. చేతులు చుట్టూ తిప్పు తూ గుండ్రంగా తిరిగే ఆడ పిల్లలు ఎందుకలా తిప్పుతారు, అనే ప్రశ్న ఎవరైనా చేస్తారా? జీవితం ఏ లక్ష్యాన్నీ అందుకో బూనలేదు, జీవితమే లక్ష్యం. తూర్పుదేశాలు భగవంతుణ్ణి సృష్టికర్తగా పేర్కొనవు. భగవంతుడు జీవితంగా రూపొందిన సృష్టే. ఎవరూ సృష్టించలేదు. అది అట్లా ఉంటూ వచ్చింది. ఇక ముందూ ఉంటుంది. కొన్ని సార్లు స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు అస్పష్టం గా ఉంటుంది. కాలం తిరుగుతూనే ఉంటుంది. ఉని కిని ఎవరూ సృష్టించలేదు. దానికి లక్ష్యం లేదు. లక్ష్యం ఉంటే ఇంతకాలంగా దాన్ని ఎందుకు సాధించలేదు? అనంతకాలం నుండి భూమి మీద ఈ ఉనికి ఉంటూ వచ్చిందికదా? మరి లక్ష్యాన్ని ఎందుకు సాధించలేదు? వాస్తవమేమిటంటే, ఉనికి ఇప్పటికే ప్రయోజన రహితం. ఉనికి కదులుతున్నది కానీ ఏమి సాధించా లనేది తెలియదు. ఉనికికి ఒక విలువున్నది. ఆ విలువ లక్ష్యం కాదు. ఆ విలువ జీవితానికి స్వాభావికం. ఎవరినో ప్రేమిస్తావు. అయితే ఈ ప్రేమ ఎందుకు ఉన్నది? అనే ప్రశ్న ఎక్కడైనా వేశావా? ఇంకో మనిషిని ఎందుకు ప్రేమించాలి? దీనికి సమాధానం నీ వద్ద ఉండి ఉంటే, నీలో ప్రేమ లేనట్టే. ప్రయోజనం చూపించావంటే నీలో ప్రేమ మృగ్యం. అది వ్యాపారమవు తుం ది, బేరసారాలతో కూడుకున్నది. ప్రేమికుల ప్రేమ కి నిజానికి లక్ష్యం లేదు. ప్రేమయే ప్రయోజనం, లక్ష్యం. అది ఇప్పటికే సిద్ధించి ఉంది. నీవు ఆనందం గా ఉన్న ప్పుడు, ఆనందంగా ఉండటంలో ప్రయోజన మేమిటి? అని అడిగావా? జీవితం ప్రేమలాంటిది; అదొక ఆనంద తాండవం. జీవితానికి, ఉనికికి లక్ష్యం లేదు. ఇది అర్థమైతే జీవించేతీరు పూర్తిగా మారిపోతుంది. మొత్తం జీవితానికే ప్రయోజనం లేనప్పుడు, నీ వ్యక్తిగత జీవితానికి మాత్రం ఏమి ప్రయోజనముంటుంది? జీవితంలో ఏదో సాధించాలనుకోవడం వల్ల టెన్షన్ పెరుగు తుంది. ఒకటి సాధిస్తే, మరి ఇప్పుడేమి సాధించాలి? అనే యావ ప్రారంభమవుతుంది. సాధించడం అనే లక్ష్యం నుండి విరమించిన మనసు శాంతపడుతుంది. ఉనికి మొత్తానికే లక్ష్యం లేనప్పుడు, నీకు ప్రయోజనమెందుకు? హాయిగా ఆడు కోవచ్చు (పోటీ పడకుండా), గానం చేయవచ్చు (బిరు దులు కోరకుండా), నృత్యం చేయవచ్చు (ఇతరులతో పోల్చుకోకుండా) ప్రేమించవచ్చు, ప్రేమను పంచవ చ్చు. లక్ష్యం అక్కరలేదు. ఇప్పుడు, ఈ క్షణానే, ఇక్కడే పరమమైనది హాజరీలో ఉన్నది. నువ్వు ఆ పరమానికి ఒక అవకాశమిస్తే, అది నీలోకి ప్రవేశిస్తుంది. కానీ నువ్వు సిద్ధంగా లేవు. నీ మనసు భవిష్యత్తులో విహరి స్తున్నది. నీకు తెలియని ఆ మహాశక్తికి నీ హృదయ కవాటాలు తెరుచుకోలేదు. - నీలం రాజలక్ష్మీప్రసాద్ -
ఆడపిల్లల్లో విద్యావ్యాప్తికి కృషి అవసరం
* వీవీ కన్యాశాల శతాబ్ది ఉత్సవాల్లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ * నిజాం పాలనలో ఈ స్కూలును నడిపించడం సాహసోపేతమే సాక్షి, హైదరాబాద్: ఆడపిల్లల విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. అమ్మాయిని విద్యావంతురాలిని చేస్తే ఆమె కుటుంబ సభ్యులందరినీ విద్యావంతులను చేసినట్లేనని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కన్యాశాల శతాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ ప్రసంగిస్తూ ఏదైనా సంస్థ వందేళ్లు పూర్తిచేసుకోవడం గొప్ప విషయమని, అందులోనూ అమ్మాయిలకు విద్యనందించే సంస్థ ఈ ఘనత సాధించడం మరెంతో గొప్ప విషయమన్నారు. నిజాం పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ విద్యార్థినుల కోసం మరాఠీలో వీవీ కన్యాశాలను నడిపించడం సాహసోపేతమైనదన్నారు. గతం నుంచి తెలంగాణ పోరాటం అన్యాయం, అక్రమాలపై జరిగిందని, సమ్మక్క, సారక్కలు ఆధిపత్యానికి, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడి అమరత్వం పొందారని గుర్తుచేసుకున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రెండేళ్లలో కోటి ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బతుకమ్మ, బోనాలతో చైతన్యం: కవిత తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ, బోనాల ద్వారా సంస్కృతిని చాటి మహిళలను చైతన్యవంతులను చేశామని ఎంపీ కవిత అన్నారు. మరాఠీ మాతృభాష అయినాకాళోజీ నారాయణరావు తెలుగులో రాసిన కవితలు తెలంగాణ ఉద్యమంలో నినాదాలుగా పనిచేశాయన్నారు. -
కంటే కొడుకునే కనాలి!
అప్పుడెప్పుడో.. ఉయ్యాల్లోనే బిడ్డల పెళ్లిళ్లు అవడం విన్నాం.. కొండొకచో కన్నాం కూడా! ఇప్పుడు ఉయ్యాల్లో బిడ్డల్ని విక్రయించడం సర్వసాధారణం!. ఎక్కడో నాగరికత (మనమనుకునే నాగరికత) లేని ప్రాంతాల్లో కాదు.. ఇక్కడే ఈ నగరం నడిబొడ్డునే!. - సరస్వతి రమ కొన్ని నెలల కిందట జరిగిన సంఘటన.. ఒక తల్లికి అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. కొడుకు కోసం నాలుగో కాన్పూ చూసింది అత్తింటి వాళ్లు వంశాంకురం కావాలన్నారని. ఆ వంశం గొప్పదనం నాలుగు కాలాలకు కాదుకదా.. కనీసం ఆ నాలుగు కాలనీలక్కూడా తెలియదు. కొడుకు లేక ఆస్తి దాయాదుల పాలవుతుందేమో అని అనుకోవడానికి ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపరులూ కారు. ఆ మాటకొస్తే ఈ తల్లి పురిటికీ పైసల్లేవ్. అయినా నాలుగో కాన్పుకీ సాహసం చేసింది. ఆడపిల్లే పుట్టింది. ఆ బిడ్డను చూసి కన్నతల్లి సహా భర్త, అత్తమామలంతా ముఖాలు ముడుచుకున్నారు. పాలు పట్టనివ్వలేదు మళ్లీ అమ్మాయే పుట్టేసరికి రెండు రోజులు బాధపడ్డా మూడోరోజు సర్దుకుంది తల్లి. పసిబిడ్డను అపురూపం చేయసాగింది. ఇది సహించలేకపోయారు అత్తింటి వాళ్లు. ఆకలితో ఏడుస్తుంటే పాలు పట్టబోతుంటే బిడ్డను లాక్కుపోయారు. ఊపిరి బిగబట్టి ఏడుస్తున్న పిల్ల సొమ్మసిల్లి పోయే వరకు చోద్యం చూశారు తప్ప తల్లికి ఇవ్వలేదు. కన్నపేగు కదులుతుంటే బిడ్డనివ్వమని అత్త కాళ్లు పట్టుకుంది, భర్తనూ బతిమాలింది. ఈడ్చి తన్నారు. ఆ దెబ్బకు స్పృహ కోల్పోయింది ఆమె. ఆ తర్వాత తేరుకొని చూస్తే ఇంట్లో చంటిపిల్ల లేదు. చిట్టిచెల్లెలు కోసం ఇల్లంతా వెతుకుతున్న తల్లిని చూసిన ముగ్గురు బిడ్డలు ‘అమ్మా.. చెల్లెల్ని నాన్న, నానమ్మ ఎవరికో ఇచ్చి పైసలు తీసుకున్నరు’అని చెప్పారు. తల్లి నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది. నిలదీద్దామంటే, ఇంట్లో ఆ ఇద్దరూ లేరు. వచ్చాక అడిగితే ‘ఐదువేలకు అమ్మేసినం. నీ డెలివరీ ఖర్చెక్కడి నుంచి తెస్తం’ అని ఎదురుప్రశ్న వేశారు. ఆ మాటలు విన్న తల్లి హతాశురాలైంది. ఇప్పుడు.. ఇది జరిగి తొమ్మిదినెలలైంది. ఇప్పటికీ ఆ బిడ్డ తలపుల్లో ఆ తల్లి పిచ్చిదైపోయింది. ‘చంటిది ఏడుస్తుంది పాలు పట్టాలే’ అంటూ తిరుగుతుంటుంది. తల్లి ఆలనాపాలనా లేక మిగిలిన ముగ్గురు ఆడపిల్లలూ బాధపడుతున్నారు. ఆ ముగ్గురులో ఆఖరు పిల్లను మాత్రమే స్కూల్‌కి పంపించి తతిమా ఇద్దర్ని ఇంట్లో పనికి నానమ్మకు సాయంగా ఉంచాడా తండ్రి. అయితే అటు బిడ్డను అమ్ముకున్నామన్న పశ్చాత్తాపం ఇటు ఆ భర్తలోకానీ, అత్తలో కానీ లేశమాత్రం లేవు. భార్య మతిస్థిమితం కోల్పోయిందని ఈమధ్యే రెండో పెళ్లికీ ప్రయత్నిస్తే కాలనీవాసులు దాన్ని తప్పించారట. రెండో పెళ్లి ద్వారా అయినా కొడుకుని కనాలని వాళ్ల ఆశ. సభ్యసమాజంలోని మనుషుల తీరు ఇది! -
ఎంత సిగ్గుచేటు?!
సంపాదకీయం: పెళ్లి పీటలు చిన్నారి పెళ్లి కూతుళ్ల పాలిట వధ్యశిలలవుతున్నాయి. పేదరికమో, సురక్షితంగా పెంచలేమన్న భయమో... కన్నవారే ఆడపిల్లలను నరకకూపంలోకి నెట్టేస్తున్నారు. బాల్యమనేది తెలియకుండానే, శారీరక మానసిక ఎదుగుదల లేకుండానే ఎందరెందరో బాలికలు బాధల్లో మగ్గిపోతున్నారు. ప్రపంచంలో జరుగుతున్న బాల్యవివాహాల్లో 47 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ అంటున్నది. ఈ గణాంకాల ప్రకారం ప్రపంచంలో మనది 14వ స్థానం. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు, దాన్ని అరికట్టడానికి సకలవిధ చర్యలూ తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఈ దురాచారంపై మన పాలకులు దండెత్తుతారని, తమ సంకల్పశుద్ధిని చాటిచెబుతారని ఎవరైనా ఆశిస్తారు. కానీ, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి సమావేశంలో మన దేశం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. బాల్య వివాహాలనూ, పెళ్లీడుకు ముందే జరిగే వివాహాలనూ, బలవంతపు వివాహాలనూ నిర్మూలించాలని పిలుపునిచ్చే తీర్మానాన్ని ప్రతిపాదించడంలో భాగస్వామ్యం స్వీకరించేందుకు నిరాకరించింది. తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తాంగానీ... ప్రతిపాదకులుగా ఉండదల్చుకోలేదని చెప్పింది. బాల్యవివాహాలకూ, బలవంతపు వివా హాలకూ వ్యతిరేకంగా భారత్‌లో చట్టాలున్నా యని, వాటి అమలు కూడా తగినంతగా ఉన్నదని చెప్పిన మన దేశ ప్రతినిధి... తీర్మానంలో ప్రస్తావించిన పెళ్లీడుకు ముందే జరిగే వివాహాల గురించి స్పష్టత లేదు గనుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. దేశం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తున్నదని, త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన అది నిలబడటం ఖాయమని మన పాలకులు చెబుతుంటారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని డిమాండ్ చేసే స్థాయికి, చాలా దేశాలు దాన్ని గుర్తించేస్థాయికి చేరుకున్నాం కూడా. కానీ, సామాజిక దురాచారా లను అరికట్టడంలో మాత్రం ఎప్పటిలాగే వెనకబడి ఉంటున్నాం. కుల, మత విభేదాలుగానీ...ప్రాంతీయ భేదాలుగానీ... స్త్రీ, పురుష వివక్షగానీ... బాల్య వివాహాలుగానీ ఎక్కడకూ పోలేదు. ప్రజాస్వామ్యమంటే అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల జాతరలో పాల్గొని ఓట్లేయడం తప్ప మరేమీ కాదని పదే పదే తెలియ జెబుతున్నచోట ఇంతకంటే మెరుగైన పరిస్థితులుండే అవకాశం లేదు. మన దేశంలో ఆడపిల్లలకు పద్దెనిమిదేళ్లు, మగపిల్లలకు 21ఏళ్లు నిండితే తప్ప వివాహాలు చేయరాదని చట్టాలు చెబుతున్నాయి. పాత చట్టానికి మెరుగులద్ది 2006లో బాల్యవివాహ నిషేధ చట్టం కూడా తీసుకొచ్చారు. అయినా, దేశంలో పెళ్లవుతున్న ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరు 18ఏళ్ల లోపు వయసువారేనని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యునిసెఫ్ నిరుడు రూపొందించిన నివేదిక తెలిపింది. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఆడపిల్లలకు చట్టవిరుద్ధంగా పెళ్లీడుకు చాలా ముందే వివాహాలు చేస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. 20-24ఏళ్ల వయసున్న యువతులకు సంబంధించిన గణాంకాలను పరిశీలించినప్పుడు దేశంలో అత్యధికంగా బీహార్‌లో ఈ తరహా వివాహాలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడైంది. అక్కడ 68.2శాతం పెళ్లిళ్లు ఇలాంటివే. మన రాష్ట్రంలో ఇలాంటి పెళ్లిళ్ల శాతం 51.8. గత దశాబ్దంతో పోలిస్తే బాల్యవివాహాలు తగ్గుముఖం పడుతున్న మాట వాస్తవమే అయినా, ఆ తగ్గుదల శాతం కేవలం 6.8 శాతం మాత్రమేనని యునిసెఫ్ చెబుతోంది. ఇవన్నీ భయంగొలిపే గణాంకాలు. ఇలాంటి దుస్థితినుంచి బాలికలను విముక్తం చేయాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించి రెండేళ్లక్రితం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చింది. బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని దేశాలూ గట్టి ప్రతిన బూనాలని అప్పటినుంచీ కోరుతూనే ఉంది. కానీ, ఆచరణలో మాత్రం అవి యధావిధిగా సాగిపోతూనే ఉన్నాయి. ఆడపిల్లలకు చిన్నతనంలోనే వివాహం చేయడం తమ సంప్రదాయ మని, తమ మతాచారమని, తమ కులాచారమని వాదిస్తున్నవారున్నారు. ఆయా వర్గాల్లో తమపట్ల వ్యతిరేకత వస్తుందని, తమకు వచ్చే ఓట్లు పోతాయని భావిస్తున్న పాలకపక్షాలు ఇలాంటి వివాహాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నాయి. ఎప్పుడైనా బహిరంగమై మీడియా దృష్టిలో పడితే నామమాత్రంగా కేసులు పెట్టడం తప్ప కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇలాంటి దురాచారంవల్ల బాలికలు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారు ముఖ్యంగా చదువుకు దూరమవుతున్నారు. అమ్మా నాన్నల ఒడిలో పెరగాల్సిన వయసులోనే అమ్మలవుతున్నారు. గృహ హింసకు, లైంగిక హింసకు లోనవుతున్నారు. బండచాకిరీలో మగ్గిపోతున్నారు. తమలో జరిగే శారీరక, మానసిక, భావోద్వేగపరమైన మార్పుల గురించి అవగాహనే లేని పిల్లలు గర్భిణులవుతున్నారు. వారి శరీరాలు పిల్లలను కనడానికి అనువైన స్థితికి చేరుకోకపోవడంవల్ల కాన్పు సమయంలో తల్లీపిల్లల మరణాలు ఎక్కువుంటు న్నాయి. మృత్యువును ఎదిరించి నిలిచే చిట్టి తల్లులకు అటు తర్వాత అన్నీ కష్టాలే. వారికి పుట్టే పిల్లలు అల్పాయుష్కులుగా లేదా అత్యంత బలహీనులుగా మిగిలి పోతున్నారు. చిన్న వయసులోనే పిల్లలను సాకవలసి రావడంతో ఆరోగ్యంపై ఎలాంటి అవగాహనా లేక ఆ తల్లులు తమకూ, తమ పిల్లలకూ కూడా మెరుగైన పోషకాహారాన్ని పొందలేకపోతున్నారు. ఇన్నింటితో ముడిపడి ఉన్న సమస్యపై మన ప్రభుత్వం తగిన మోతాదులో ఆందోళన కనబరచడంలేదన్నది వాస్తవం. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో తీసుకొచ్చిన తీర్మానానికి ప్రతిపాదకులుగా ఉంటే ఇలాంటి సమస్యలన్నిటికీ అంతర్జాతీయ వేదికల్లో సమాధానం చెప్పుకోవలసి వస్తుంది గనుకనే మన దేశం సరిగా స్పందించలేదు. ఈ విషయంలో ఇతర ఆసియా దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ల సరసనే మన దేశమూ నిలబడటం అన్నిటికన్నా సిగ్గుచేటైన విషయం.