జీవితం జీవించడానికే
శ్రీ రజనీష్‌ను ఒకరు ఇలా ప్రశ్నించారు. ‘మీరంటున్నట్లు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ ‘సంభవించేవే’ అయినట్లయితే, నే చేసేదంటూ ఏమైనా ఉన్నదా? లేక జీవితం కేవలం యాదృచ్ఛికమా? జీవితానికేదైనా లక్ష్యం కానీ ప్రయోజనం కానీ ఉన్నదంటారా?
రజనీష్: జీవితం ప్రయోజన రహితమైనదన్నప్పు డు పాశ్చాత్య మనస్సుకు, అది విపరీతంగా తోస్తుంది. ఏదైనా ప్రయోజనం ఉండాలి అని తీర్మానిస్తే, జీవితం వ్యాపార సరళి ధరిస్తుంది. అది ఆనందమయంగా రూపొందదు. ప్రాక్దేశాలు ఏమంటాయంటే, జీవితం వ్యాపారం కాదు, అది ‘ఖేల’. ఈ ఖేలకు దాని ప్రయో జనం దానికి ఉన్నది అనవచ్చు. ఆడితే చాలు, ఆటే పదివేలు. చేతులు చుట్టూ తిప్పు తూ గుండ్రంగా తిరిగే ఆడ పిల్లలు ఎందుకలా తిప్పుతారు, అనే ప్రశ్న ఎవరైనా చేస్తారా? జీవితం ఏ లక్ష్యాన్నీ అందుకో బూనలేదు, జీవితమే లక్ష్యం. తూర్పుదేశాలు భగవంతుణ్ణి సృష్టికర్తగా పేర్కొనవు. భగవంతుడు జీవితంగా రూపొందిన సృష్టే. ఎవరూ సృష్టించలేదు. అది అట్లా ఉంటూ వచ్చింది. ఇక ముందూ ఉంటుంది. కొన్ని సార్లు స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు అస్పష్టం గా ఉంటుంది. కాలం తిరుగుతూనే ఉంటుంది. ఉని కిని ఎవరూ సృష్టించలేదు. దానికి లక్ష్యం లేదు. లక్ష్యం ఉంటే ఇంతకాలంగా దాన్ని ఎందుకు సాధించలేదు? అనంతకాలం నుండి భూమి మీద ఈ ఉనికి ఉంటూ వచ్చిందికదా? మరి లక్ష్యాన్ని ఎందుకు సాధించలేదు?
వాస్తవమేమిటంటే, ఉనికి ఇప్పటికే ప్రయోజన రహితం. ఉనికి కదులుతున్నది కానీ ఏమి సాధించా లనేది తెలియదు. ఉనికికి ఒక విలువున్నది. ఆ విలువ లక్ష్యం కాదు. ఆ విలువ జీవితానికి స్వాభావికం. ఎవరినో ప్రేమిస్తావు. అయితే ఈ ప్రేమ ఎందుకు ఉన్నది? అనే ప్రశ్న ఎక్కడైనా వేశావా? ఇంకో మనిషిని ఎందుకు ప్రేమించాలి? దీనికి సమాధానం నీ వద్ద ఉండి ఉంటే, నీలో ప్రేమ లేనట్టే. ప్రయోజనం చూపించావంటే నీలో ప్రేమ మృగ్యం. అది వ్యాపారమవు తుం ది, బేరసారాలతో కూడుకున్నది. ప్రేమికుల ప్రేమ కి నిజానికి లక్ష్యం లేదు. ప్రేమయే ప్రయోజనం, లక్ష్యం. అది ఇప్పటికే సిద్ధించి ఉంది. నీవు ఆనందం గా ఉన్న ప్పుడు, ఆనందంగా ఉండటంలో ప్రయోజన మేమిటి? అని అడిగావా?
జీవితం ప్రేమలాంటిది; అదొక ఆనంద తాండవం. జీవితానికి, ఉనికికి లక్ష్యం లేదు. ఇది అర్థమైతే జీవించేతీరు పూర్తిగా మారిపోతుంది. మొత్తం జీవితానికే ప్రయోజనం లేనప్పుడు, నీ వ్యక్తిగత జీవితానికి మాత్రం ఏమి ప్రయోజనముంటుంది? జీవితంలో ఏదో సాధించాలనుకోవడం వల్ల టెన్షన్ పెరుగు తుంది. ఒకటి సాధిస్తే, మరి ఇప్పుడేమి సాధించాలి? అనే యావ ప్రారంభమవుతుంది.
సాధించడం అనే లక్ష్యం నుండి విరమించిన మనసు శాంతపడుతుంది. ఉనికి మొత్తానికే లక్ష్యం లేనప్పుడు, నీకు ప్రయోజనమెందుకు? హాయిగా ఆడు కోవచ్చు (పోటీ పడకుండా), గానం చేయవచ్చు (బిరు దులు కోరకుండా), నృత్యం చేయవచ్చు (ఇతరులతో పోల్చుకోకుండా) ప్రేమించవచ్చు, ప్రేమను పంచవ చ్చు. లక్ష్యం అక్కరలేదు. ఇప్పుడు, ఈ క్షణానే, ఇక్కడే పరమమైనది హాజరీలో ఉన్నది. నువ్వు ఆ పరమానికి ఒక అవకాశమిస్తే, అది నీలోకి ప్రవేశిస్తుంది. కానీ నువ్వు సిద్ధంగా లేవు. నీ మనసు భవిష్యత్తులో విహరి స్తున్నది. నీకు తెలియని ఆ మహాశక్తికి నీ హృదయ కవాటాలు తెరుచుకోలేదు.
- నీలం రాజలక్ష్మీప్రసాద్