టబు వయసు 53. ఈమధ్యే, నవంబర్ 4న ఆమెకు అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు, బంధు మిత్రులనుంచి.. ‘ఎప్పుడూ వర్కేనా? కాస్త లైఫ్ గురించి కూడా ఆలోచించు..‘ అనే వివాహ ఆంక్షలూ అందాయి. టబుకు ఏటా ఉండేవే ఈ పుష్పగుచ్ఛాలు. ‘‘ఎప్పుడూ వర్కేనా? కాస్త లైఫ్ గురించి కూడా ఆలోచించు..’’ అంటే.. ‘పెళ్లి గురించి ఆలోచించు, వయసేం మించి΄ోలేదు..’ అని చెప్పటం.
పెళ్లి మాట అటుంచితే, ‘ఎప్పుడూ వర్కేనా? కాస్త లైఫ్ గురించి కూడా ఆలోచించు..’ అనే మాట టబును అమితంగా ఆశ్చర్యపరుస్తుందట. ‘ఒక వ్యక్తికి వర్కే లైఫ్ ఎందుకు కాకూడదు? లైఫ్‌ని పక్కన పెట్టి ఒక వ్యక్తి వర్క్‌ను మాత్రమే ఎందుకు కోరుకోకూడదు? అని ‘ది నాడ్ ’ అనే డిజిటల్ మ్యాగజీన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించారు టబు.
‘వర్క్, లైఫ్ నాకు వేర్వేరు కావు. అందుకే నాకు ‘వర్క్ – లైఫ్ బ్యాలెన్స్’ అనే మాట అర్థం కాదు. జీవితంలో ప్రతిదీ, ప్రతి సమస్యా, ప్రతి పోరాటం, ప్రతి యుద్ధం.. వ్యక్తిగత ప్రాధాన్యాలను బట్టే ఉంటుంది. నాకు వర్క్ తప్ప వేరే జీవితం గురించి తెలియదు. పోల్చి చూసుకోటానికి నాకు వేరే జీవితం కూడా లేదు. నా జీవితంలో వేరే ఎవరైనా ఉంటే ఇంతకన్నా బాగుండేదా లేక, ఇప్పుడున్న జీవితమే మెరుగ్గా ఉండేదా అనేది కూడా నాకు తెలీదు. ఎప్పటికీ తెలియదు.
నేనిప్పుడు నా జీవితంతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను 20 ఏళ్ల వయసులో లేను కనుక సంతోషానికి నా నిర్వచనం 50లలో ఉన్నట్లే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకే ప్రయత్నిస్తారు. అయితే సంతోషం కన్నా కూడా సంతృప్తి ముఖ్యం అనుకుంటాను నేను. అంతకన్నా కూడా మనల్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి’ అన్నారు టబు. ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన టబు తాజా రొమాంటిక్ థ్రిల్లర్.. ఔరోన్ మే కహా దమ్ థా. ఆ ధైర్యం ఇతరులకు ఎక్కడిది?’ అని ఆ టైటిల్‌కి అర్థం.
(చదవండి: ‘పెళ్లాం చెబితే వినాలి'.. ఇది ఫైర్‌లాంటి పుష్పగాడి మాట మాత్రమే కాదు..)
Comments
Please login to add a commentAdd a comment