అమృత బిందువులు
జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని ఖచ్చితమైన సూత్రాలను పాటించాలి. వివేకానందుడు చెప్పినట్టు సుఖదు:ఖాలు నాణేనికి రెండు పార్శాలు లాంటివి. కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే నడవదు. విశ్వంలో ప్రతి అంశం తార్కిక ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి తార్కిక ఆలోచనలతో ప్రపంచాన్ని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి. నిశితంగా పరిశీలించి అర్థం చేసుకొని, జీవితానికి అన్వయం చేసుకొని సాగిపోవాలి. ఉదాహరణకు అమృత బిందువుల్లాంటి ఈ విషయాలను గమనించండి!
కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అయినవారి ఎదుట అబద్ధం చెప్పకు.
అనుభవం ఎదిగిన అభిప్రాయాన్ని బట్టి రాదు. తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది.‘
తప్పు చేయడానికి ఎవరూ భయపడరు. కానీ చేసిన తప్పు బయట పడకుండా ఉండడం కోసం భయపడతారు.
జీవితంలో వయసు ఉన్నప్పుడే చదవండి. ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా ఆచరించేందుకు జీవితం ఉండదు.‘
ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది. కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం గురించి తెలుసుకునే తెలివి ఉండదు.
వేదం చదివితే ధర్మం తెలుస్తుంది. వైద్యం చదివితే రోగం ఏమిటో తెలుస్తుంది.
గణితం చదివితే లెక్క తెలుస్తుంది. లోకం చదివితే ఎలా బతకాలో తెలుస్తుంది.
కాలికున్న చెప్పులైనా మనతో ఉన్న మనుషులైనా నొప్పిని, బాధను కలిగిస్తున్నారంటే, సరిపోయేవి కావని అర్థం.
ఇదీ చదవండి: మానవ కళ్యాణార్థం మార్గళీ వ్రతం!
Comments
Please login to add a commentAdd a comment